వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తోన్న సినిమా 'పేకమేడలు'. ఈ చిత్రం ద్వారా వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు సినీ ప్రియుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మధ్య తరగతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏ పనిపాట లేకుండా భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఒక అమ్మాయి పరిచయంతో అతని లైఫ్ ఎలా మారింది? అనే కథాంశంతో రూపొందించినట్లు అర్థమవుతోంది.
'వెధవ పనులు చేసేటప్పుడు పదిమందికి తెలియకుండా చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదారా నీకు?' అన్న డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 19న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment