Pekamedalu Movie
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా
పేరున్న యాక్టర్స్ లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేకపోతాయి. అలాంటి వాటిలో కొన్నాళ్ల క్రితం తెలుగులో రిలీజైన 'పేకమేడలు' ఒకటి. 'బాహుబలి' ఫేమ్ నటుడు రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీలో తమిళ నటుడు వినోద్ కిషన్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.ఏ ఓటీటీలో?జూలై 19న 'పేకమేడలు' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే అదే రోజు మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో దీనికి బిగ్ స్క్రీన్‌పై సరైన ఆదరణ దక్కలేదు. లో బడ్జెట్ మూవీ కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేకపోయింది. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని చూసిన చాలామంది మెచ్చుకున్నాడు. అలానే రిలీజైన నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)కథేంటి?లక్ష్మణ్ (వినోద్ కిషన్) ఇంజినీరింగ్ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. డీల్ సెట్ లక్షల్లో డబ్బు వస్తుందని ఆశపడుతుంటాడు. కానీ ఒక్క డీల్ కూడా సక్సెస్ కాదు. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా భార్య సంపాదనపై జల్సాలు చేస్తుంటాడు. ఆమె పేరు చెప్పి అప్పులు చేస్తుంటాడు. భర్త ఎప్పటికైనా బాగుపడతాడని భార్య అప్పులన్నీ తీరుస్తుంటుంది.కట్ చేస్తే భర్తని వదిలేసి అమెరికా నుంచి ఇండియా వచ్చిన శ్వేత (రితికా శ్రీనివాస్) అనుకోకుండా లక్ష్మణ్ జీవితంలోకి వస్తుంది. డబ్బున్న యువకుడినని శ్వేతని లక్ష్మణ్ నమ్మిస్తాడు. ఆమెకు దగ్గరవుతాడు. భార్య, పిల్లల్ని దూరం పెడతాడు. చివరకు ఏమైంది? లక్ష్మణ్ ఏం తెలుసుకున్నాడనేదే మెయిన్ పాయింట్.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్) View this post on Instagram A post shared by Crazyants Productions (@crazyantsfilms) -
చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు: నిర్మాత రాకేశ్ వర్రే
మంచి కంటెంట్‌తో మూవీ తీస్తే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్ వస్తారని ‘పేక మేడలు’ మరోసారి నిరూపించిందని అన్నారు నిర్మాత రాకేశ్ వర్రే. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. జులై 19న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. ‘దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్‌కు వస్తారు’ అన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు ’అని అన్నారు దర్శకుడు నీలగిరి మామిళ్ల. -
‘పేకమేడలు’ మూవీ రివ్యూ
టైటిల్: పేక మేడలునటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ నిర్మాణ సంస్థలు: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్నిర్మాత: రాకేశ్ వర్రేదర్శకత్వం: నీలగిరి మామిళ్లసంగీతం: స్మరణ్ సాయిసినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.విడుదల తేది: జులై 19, 2024కథేంటి?లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు మూసీ నదికి ఒడ్డున బస్తీలో నివసిస్తుంటారు. అబ్బాయికి మెరుగైన జీవితం కోసం మంచి కాలనీకి మారాలని వరలక్ష్మి ఆశ పడుతుంది. ఆమె సంపాదన మీద పడి బతకడం తప్ప ఉద్యోగం సద్యోగం చెయ్యడు లక్ష్మణ్. ఇంజనీరింగ్ చదివినా..జాబ్ చేయకుండా. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడతాడు. రియల్ ఎస్టేట్ కోసం భర్త, పిల్లల్ని అమెరికాలో వదిలేసి వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్)ను ట్రాప్ చేస్తాడు. శ్వేత దృష్టిలో తాను రిచ్ అని చూపించుకునేందుకు భార్య పేరు వాడుకుని అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మి ఏం చేసింది? లక్ష్మణ్ ఏం చేశాడు? అతడిని కొట్టినది ఎవరు? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే?భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే..భార్య కష్టపడి ఫ్యామిలీని పోషించడం అనే పాయింట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. పేక మేడలు కథ కూడా అదే. అయితే ఇందులో క్లైమాక్స్ మాత్రం కొత్తగా ఉంటుంది. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది ఫిక్షనల్ స్టోరీ అయినా.. మూవీ చూస్తుంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారన్నట్టు ఉంది. బస్తీలో లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందనేది ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభ అయినా 30 నిమిషాల వరకు నెమ్మదిగా సాగుతుంది. ఎన్నారై లేడీ ఎంటరైన తర్వాత స్పీడ్ పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథ చాలా సరద సరదగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో మాత్రం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. మహిళా సాధికారికతను గొప్పగా చూపించారు. ప్రీ క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే గొడవ సీన్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సినిమాటిక్‌గా కాకుండా.. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.ఎవరెలా చేశారు?వినోద్ కిషన్ ఫస్ట్ తెలుగు మూవీ ఇది. అయితే, అతడు ఆల్రెడీ తమిళంలో ఫిల్మ్స్ చేశాడు. లక్ష్మణ్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ యాప్ట్. అతడి లీన్ పర్సనాలిటీ కూడా సూట్ అయ్యింది. మిడిల్ క్లాస్ వైఫ్ అంటే అనూష క్రిష్ణ అనుకోవాలి. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్, ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు సైతం చక్కగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా.. చాలా రిచ్‌గా నిర్మించారు. - రేటింగ్: 2.5/5 -
అందుకే టిక్కెట్ ధర తగ్గించాం
‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ ధర ఎంత పెట్టినా ప్రేక్షకులు వస్తారు. కానీ, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ‘పేక మేడలు’ టిక్కెట్ ధరని వంద రూ΄ాయలు చేశాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘పేక మేడలు’. రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘పేక మేడలు’లాంటి మంచి సిని మాని ప్రేక్షకులకు చేరువ చేయాలని విజయవాడ, వైజాగ్, హైదరాబాద్‌లలో యాభై రూ΄ాయలకే ప్రీమియర్స్ వేశాం. చూసినవారు సినిమా బాగుందన్నారు’’ అన్నారు. ‘‘ప్రీమియర్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్‌లాగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు నీలగిరి. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్న ధీరజ్, రానా, అడివి శేష్, విశ్వక్ సేన్ గార్లకి కృతజ్ఞతలు’’ అన్నారు రాకేశ్ వర్రే. -
మూవీ లవర్స్‌కి క్రేజీ ఆఫర్.. రూ.50కే కొత్త సినిమా ప్రీమియర్
ఇప్పట్లో కొత్త సినిమా చూడాలంటే రెండు మూడొందలైనా పెట్టాల్సిందే. అలాంటిది కొత్త సినిమా, అది కూడా రూ.50కే అంటే మంచి ఆఫర్ కదా! మీరు విన్నది నిజమే. 'నా పేరు శివ' సినిమాలో విలన్ తరహా పాత్ర చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ కిషన్. ఇతడు హీరోగా నటించిన తెలుగు సినిమా 'పేక మేడలు'. జూలై 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే టికెట్‌పై భారీ ఆఫర్ ప్రకటించారు.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)రాకేష్ వర్రే నిర్మించిన రెండో సినిమా 'పేక మేడలు'. మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కథతో ఈ మూవీ తీశారు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల రిలీజ్‌కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. వీటిలోనే ఒక్కో టికెట్ రూ.50గా నిర్ణయించారు. ఈ విషయాన్ని హీరోతోనే చెప్పిస్తూ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.ఈ కాలంలో అసలు థియేటర్లకే జనాలు రావడం లేదు. అలాంటిది రూ.50 టికెట్ అంటే సినిమా ఎలా ఉందని కాకపోయినా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయడానికైనా సరే ప్రేక్షకులు వచ్చే అవకాశముంది. 'పేకమేడలు'పై పెద్దగా అంచనాల్లేవు. దీనితో పాటు వస్తున్న ప్రియదర్శి 'డార్లింగ్'పై కాస్త అంచనాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
'మనం జాబ్ చేయండి ఏంటి?'.. ఆసక్తిగా పేకమేడలు ట్రైలర్!
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తోన్న సినిమా 'పేకమేడలు'. ఈ చిత్రం ద్వారా వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు సినీ ప్రియుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మధ్య తరగతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏ పనిపాట లేకుండా భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఒక అమ్మాయి పరిచయంతో అతని లైఫ్ ఎలా మారింది? అనే కథాంశంతో రూపొందించినట్లు అర్థమవుతోంది.'వెధవ పనులు చేసేటప్పుడు పదిమందికి తెలియకుండా చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదారా నీకు?' అన్న డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 19న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
లక్కు నీ వెంట...
‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న...’ అంటూ మొదలవుతుంది ‘పేకమేడలు’ సినిమాలోని ‘బూమ్ బూమ్ లచ్చన్న’ పాట. ‘నా పేరు శివ, అంధగారం’ సినిమాల ఫేమ్ వినోద్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ఇది. ఇందులో అనూషా కృష్ణ హీరోయిన్. రాకేష్ వర్రే నిర్మించిన ఈ చిత్రం జూలైలో విడుదలకు రెడీ అవుతోంది.ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బూమ్ బూమ్ లచ్చన్న...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రసంగీత దర్శకుడు స్మరణ్ సాయి నేతృత్వంలో భార్గవ్ కార్తీక్ సాహిత్యం అందించిన ఈ పాటను మనో పాడారు. రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. -
'పేకమేడలు' టీజర్‌ను విడుదల చేసిన విశ్వక్సేన్
‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేకమేడలు’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామి రెడ్డి ఎలా మరణించారో తెలుసా?) విశ్వక్సేన్ మాట్లాడుతూ 'రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్ ద బెస్ట్. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అని ఆయన అన్నారు. పేక మేడలు సినిమా నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ 'హీరోగా నేను చేసిన సినిమా.. 'ఎవరికి చెప్పొద్దు' ఇది రిలీజ్ అయ్యి మూడేళ్లు అయింది. తాజాగా పేక మేడలు సినిమాను నిర్మాతగా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తారనుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ శశికిరణ్ తిక్కా, రాహుల్ సంక్రిత్యన్, తరుణ్ భాస్కర్లతోపాటు సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకుల సపోర్ట్‌తో మొదటి సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో థియేటర్లలో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్ చేశాం. ‘ఎవరికీ చెప్పొద్దు’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో స్టాండర్డ్‌గా చేశాం.' అని రాకేశ్ వర్రే తెలిపారు. 📸 Clicks Of #PekaMedalu, Teaser Launch By Mass Ka Dass @VishwakSenActor #VishwakSen https://t.co/ue90BAb0Ba 🤏🏻@vinoth_kishan @anooshakrishna @NeelMamilla @rakesh_varre @ketankumar7 @vrmadhu9 pic.twitter.com/DZfH1eGu7Z — Crazy Ants Productions (@crazyantsfilms) July 27, 2023 -
ఆగస్టులో పేకమేడలు
వినోద్ కిషన్, అనూష క్రిష్ణ జంటగా నీలగిరి మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘పేకమేడలు’. క్రేజీ యాంట్స్పై రాకేష్ వర్రే నిర్మించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఒక యూనిక్ స్టోరీలైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పేకమేడలు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వరుణ్ బోర, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: కేతన్ కుమార్, లైన్ ప్రోడ్యూసర్: అనూష బోర, కెమెరా: హరిచరణ్ .కె, సంగీతం: స్మరణ్. -
నిర్మాతగా 'బాహుబలి' నటుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
'బాహుబలి' సినిమాలో సేతుపతి పాత్ర గుర్తుందా? అదేనండి గుడిలో అనుష్కపై చేయి వేయబోతే, ఆమె వేలు నరికేస్తుంది. ఆ తర్వాత 'తప్పు చేశావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తల’ అని బాహుబలి ప్రభాస్.. ఓ వ్యక్తి తలను నరికేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు నిర్మాతగా మరో సినిమాని ప్రకటించాడు. కొత్త హీరోహీరోయిన్లని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాడు. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) యువనటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ.. ఓటీటీల్లోనూ బాగానే ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే బ్యానర్‌పై రాకేష్ నిర్మాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'పేకమేడలు' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీతో వినోద్ కిషన్, అనూష కృష్ణ టాలీవుడ్‌కి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నీలగిరి మామిళ్ళ.. నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ బస్తీ, సిటీని 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసిన హీరో లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపించాడు. ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. Presenting the captivating #firstlook poster of our upcoming movie "#Pekamedalu"! Following the universally appreciated "#EvvarikeeCheppoddu," we are thrilled to bring you yet another exhilarating roller coaster of emotions. Check #Motionposter Here: https://t.co/8p8xnx3HhN pic.twitter.com/vNXC5zWspS — Crazy Ants Productions (@crazyantsfilms) July 19, 2023 (ఇదీ చదవండి: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంజ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు!)