– ధీరజ్ మొగిలినేని
‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ ధర ఎంత పెట్టినా ప్రేక్షకులు వస్తారు. కానీ, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ‘పేక మేడలు’ టిక్కెట్ ధరని వంద రూ΄ాయలు చేశాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘పేక మేడలు’. రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది.
ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘పేక మేడలు’లాంటి మంచి సిని మాని ప్రేక్షకులకు చేరువ చేయాలని విజయవాడ, వైజాగ్, హైదరాబాద్‌లలో యాభై రూ΄ాయలకే ప్రీమియర్స్ వేశాం. చూసినవారు సినిమా బాగుందన్నారు’’ అన్నారు. ‘‘ప్రీమియర్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్‌లాగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు నీలగిరి. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్న ధీరజ్, రానా, అడివి శేష్, విశ్వక్ సేన్ గార్లకి కృతజ్ఞతలు’’ అన్నారు రాకేశ్ వర్రే.
Comments
Please login to add a commentAdd a comment