Rakesh Varre
-
‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: జితేందర్ రెడ్డినటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంవిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్‌కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్‌లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్‌కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఎవరెలా చేశారంటే..జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - Rating: 2.75/5 -
ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది.. తప్పు చేశా: రాకేశ్
ఉయ్యాలా జంపాల, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే హీరోగా నటించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో రాకేశ్ వర్రే ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని మాట్లాడారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. 'నేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెట్ అవ్వడానికి చాలా రోజులు టైమ్ పట్టింది. కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని పేకమేడలు ప్రాజెక్ట్ చేశా. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఉండాల్సిందని. అదే నేను వేసిన రాంగ్ స్టెప్. నాకు ఒక సక్సెస్ వస్తే చాలనుకున్నా. కానీ ఇక్కడ మార్కెట్ అనేది ముఖ్యం. పేకమేడలు మాకు మూడేళ్లు పట్టింది. చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు బ్రాండ్ ఉండి ఉంటే ఏడాదిన్నరలోనే పూర్తి చేసేవాళ్లం. ఇక్కడ మనకు బ్రాండ్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. రాకేశ్ వర్రే ఒక బ్రాండ్ అయ్యాకే కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తా. తప్పకుండా చేస్తా. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. పేకమేడలు సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నారు. కాగా.. పేకమేడలు చిత్రానికి రాకేశ్ వర్రే నిర్మాతగా వ్యవహరించారు. కాగా.. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అంతే కాకుండా ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్లోనూ చూపించారు. కాగా.. ఈ చిత్రంలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. -
Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్ అంటారు.. పేరు జితేందర్ రెడ్డి!
‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు: నిర్మాత రాకేశ్ వర్రే
మంచి కంటెంట్‌తో మూవీ తీస్తే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్ వస్తారని ‘పేక మేడలు’ మరోసారి నిరూపించిందని అన్నారు నిర్మాత రాకేశ్ వర్రే. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. జులై 19న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. ‘దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్‌కు వస్తారు’ అన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు ’అని అన్నారు దర్శకుడు నీలగిరి మామిళ్ల. -
అందుకే టిక్కెట్ ధర తగ్గించాం
‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ ధర ఎంత పెట్టినా ప్రేక్షకులు వస్తారు. కానీ, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ‘పేక మేడలు’ టిక్కెట్ ధరని వంద రూ΄ాయలు చేశాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘పేక మేడలు’. రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘పేక మేడలు’లాంటి మంచి సిని మాని ప్రేక్షకులకు చేరువ చేయాలని విజయవాడ, వైజాగ్, హైదరాబాద్‌లలో యాభై రూ΄ాయలకే ప్రీమియర్స్ వేశాం. చూసినవారు సినిమా బాగుందన్నారు’’ అన్నారు. ‘‘ప్రీమియర్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్‌లాగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు నీలగిరి. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్న ధీరజ్, రానా, అడివి శేష్, విశ్వక్ సేన్ గార్లకి కృతజ్ఞతలు’’ అన్నారు రాకేశ్ వర్రే. -
రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న హిస్టారికల్ మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
మిర్చి, బాహుబలి, ఎవరికి చెప్పొద్దు లాంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..'చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి ఒక చరిత్రే జితేందర్ రెడ్డి జీవితం. రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం. అలాంటి ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ల చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ..'ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్‌గా చాలా సినిమాల్లో నటించా. కానీ ఇది కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..'నేను గతంలో చేసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్ మంచి హ్యూమర్ ఉన్న సినిమాలు. అది మాత్రమే కాదు మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న డ్రామా అంటే చాలా ఇష్టం. అదేవిధంగా జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్‌కు వెళ్లి ఆయన స్నేహితులతో, ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చా. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. -
జితేందర్ రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!
బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాకేశ్ వర్రే. ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ పేరులో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ మేకర్స్ తెరదించారు. హీరో పేరును రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేశ్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్‌గా కనిపించారు.ఈ పోస్టర్లో అతను యంగ్ పోలీస్‌లా కనిపించాడు. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న రాకేశ్ చాలా గ్యాప్ తర్వాత జితేందర్ రెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే అసలు జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని విషయాలు కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ నటుడు ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు సమయం పట్టిందట. చాలా మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రేను ఎంచుకున్నారు. ఈ మూవీని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. -
'పేకమేడలు' టీజర్‌ను విడుదల చేసిన విశ్వక్సేన్
‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేకమేడలు’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామి రెడ్డి ఎలా మరణించారో తెలుసా?) విశ్వక్సేన్ మాట్లాడుతూ 'రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్ ద బెస్ట్. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అని ఆయన అన్నారు. పేక మేడలు సినిమా నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ 'హీరోగా నేను చేసిన సినిమా.. 'ఎవరికి చెప్పొద్దు' ఇది రిలీజ్ అయ్యి మూడేళ్లు అయింది. తాజాగా పేక మేడలు సినిమాను నిర్మాతగా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తారనుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ శశికిరణ్ తిక్కా, రాహుల్ సంక్రిత్యన్, తరుణ్ భాస్కర్లతోపాటు సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకుల సపోర్ట్‌తో మొదటి సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో థియేటర్లలో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్ చేశాం. ‘ఎవరికీ చెప్పొద్దు’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో స్టాండర్డ్‌గా చేశాం.' అని రాకేశ్ వర్రే తెలిపారు. 📸 Clicks Of #PekaMedalu, Teaser Launch By Mass Ka Dass @VishwakSenActor #VishwakSen https://t.co/ue90BAb0Ba 🤏🏻@vinoth_kishan @anooshakrishna @NeelMamilla @rakesh_varre @ketankumar7 @vrmadhu9 pic.twitter.com/DZfH1eGu7Z — Crazy Ants Productions (@crazyantsfilms) July 27, 2023 -
నిర్మాతగా 'బాహుబలి' నటుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
'బాహుబలి' సినిమాలో సేతుపతి పాత్ర గుర్తుందా? అదేనండి గుడిలో అనుష్కపై చేయి వేయబోతే, ఆమె వేలు నరికేస్తుంది. ఆ తర్వాత 'తప్పు చేశావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తల’ అని బాహుబలి ప్రభాస్.. ఓ వ్యక్తి తలను నరికేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు నిర్మాతగా మరో సినిమాని ప్రకటించాడు. కొత్త హీరోహీరోయిన్లని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాడు. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) యువనటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ.. ఓటీటీల్లోనూ బాగానే ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే బ్యానర్‌పై రాకేష్ నిర్మాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'పేకమేడలు' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీతో వినోద్ కిషన్, అనూష కృష్ణ టాలీవుడ్‌కి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నీలగిరి మామిళ్ళ.. నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ బస్తీ, సిటీని 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసిన హీరో లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపించాడు. ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. Presenting the captivating #firstlook poster of our upcoming movie "#Pekamedalu"! Following the universally appreciated "#EvvarikeeCheppoddu," we are thrilled to bring you yet another exhilarating roller coaster of emotions. Check #Motionposter Here: https://t.co/8p8xnx3HhN pic.twitter.com/vNXC5zWspS — Crazy Ants Productions (@crazyantsfilms) July 19, 2023 (ఇదీ చదవండి: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంజ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు!)