
‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేకమేడలు’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు.
(ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామి రెడ్డి ఎలా మరణించారో తెలుసా?)
విశ్వక్సేన్ మాట్లాడుతూ 'రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్ ద బెస్ట్. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అని ఆయన అన్నారు.
పేక మేడలు సినిమా నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ 'హీరోగా నేను చేసిన సినిమా.. 'ఎవరికి చెప్పొద్దు' ఇది రిలీజ్ అయ్యి మూడేళ్లు అయింది. తాజాగా పేక మేడలు సినిమాను నిర్మాతగా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తారనుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ శశికిరణ్ తిక్కా, రాహుల్ సంక్రిత్యన్, తరుణ్ భాస్కర్‌లతోపాటు సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకుల సపోర్ట్‌తో మొదటి సినిమా విడుదల చేయగలిగా.
మూడు రోజుల్లో థియేటర్లలో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్ చేశాం. ‘ఎవరికీ చెప్పొద్దు’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో స్టాండర్డ్‌గా చేశాం.' అని రాకేశ్ వర్రే తెలిపారు.
📸 Clicks Of #PekaMedalu, Teaser Launch By Mass Ka Dass @VishwakSenActor
— Crazy Ants Productions (@crazyantsfilms) July 27, 2023
#VishwakSen https://t.co/ue90BAb0Ba 🤏🏻@vinoth_kishan @anooshakrishna @NeelMamilla @rakesh_varre @ketankumar7 @vrmadhu9 pic.twitter.com/DZfH1eGu7Z
Comments
Please login to add a commentAdd a comment