Bahubali Movie
-
'పేకమేడలు' టీజర్‌ను విడుదల చేసిన విశ్వక్సేన్
‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేకమేడలు’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామి రెడ్డి ఎలా మరణించారో తెలుసా?) విశ్వక్సేన్ మాట్లాడుతూ 'రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్ ద బెస్ట్. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అని ఆయన అన్నారు. పేక మేడలు సినిమా నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ 'హీరోగా నేను చేసిన సినిమా.. 'ఎవరికి చెప్పొద్దు' ఇది రిలీజ్ అయ్యి మూడేళ్లు అయింది. తాజాగా పేక మేడలు సినిమాను నిర్మాతగా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తారనుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ శశికిరణ్ తిక్కా, రాహుల్ సంక్రిత్యన్, తరుణ్ భాస్కర్లతోపాటు సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకుల సపోర్ట్‌తో మొదటి సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో థియేటర్లలో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్ చేశాం. ‘ఎవరికీ చెప్పొద్దు’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో స్టాండర్డ్‌గా చేశాం.' అని రాకేశ్ వర్రే తెలిపారు. 📸 Clicks Of #PekaMedalu, Teaser Launch By Mass Ka Dass @VishwakSenActor #VishwakSen https://t.co/ue90BAb0Ba 🤏🏻@vinoth_kishan @anooshakrishna @NeelMamilla @rakesh_varre @ketankumar7 @vrmadhu9 pic.twitter.com/DZfH1eGu7Z — Crazy Ants Productions (@crazyantsfilms) July 27, 2023 -
నిర్మాతగా 'బాహుబలి' నటుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
'బాహుబలి' సినిమాలో సేతుపతి పాత్ర గుర్తుందా? అదేనండి గుడిలో అనుష్కపై చేయి వేయబోతే, ఆమె వేలు నరికేస్తుంది. ఆ తర్వాత 'తప్పు చేశావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తల’ అని బాహుబలి ప్రభాస్.. ఓ వ్యక్తి తలను నరికేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు నిర్మాతగా మరో సినిమాని ప్రకటించాడు. కొత్త హీరోహీరోయిన్లని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాడు. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) యువనటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ.. ఓటీటీల్లోనూ బాగానే ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే బ్యానర్‌పై రాకేష్ నిర్మాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'పేకమేడలు' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీతో వినోద్ కిషన్, అనూష కృష్ణ టాలీవుడ్‌కి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నీలగిరి మామిళ్ళ.. నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ బస్తీ, సిటీని 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసిన హీరో లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపించాడు. ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. Presenting the captivating #firstlook poster of our upcoming movie "#Pekamedalu"! Following the universally appreciated "#EvvarikeeCheppoddu," we are thrilled to bring you yet another exhilarating roller coaster of emotions. Check #Motionposter Here: https://t.co/8p8xnx3HhN pic.twitter.com/vNXC5zWspS — Crazy Ants Productions (@crazyantsfilms) July 19, 2023 (ఇదీ చదవండి: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంజ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు!) -
బాహుబలి-3 బీ రెడీ
-
బాహుబలి-3 ఉంటుంది, వర్క్ చేస్తున్నాం : రాజమౌళి
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి సినిమాపై తాజాగా ఓక్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. త్వరలోనే బాహుబలి పార్ట్-3 రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ వార్తలపై స్పందిస్తూ.. పార్ట్-3 గురించి నాకు కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు అని హింట్ ఇచ్చేశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి-3 రానుందని భావించవచ్చా అని అడగ్గా.. తప్పకుండా భావించవచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనల్ని చూపించనున్నాం. దానిపై వర్క్ చేస్తున్నాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు..కానీ బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికర వార్త రానుంది' అని వివరించారు. దీంతో త్వరలోనే బాహుబలి-3పై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. -
‘బాహుబలి’తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు
వెండితెరపై సినిమాలు ఎన్నో వస్తుంటాయ్ పోతుంటాయ్. అందులో పరాజయాలు, హిట్లు, బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉంటాయ్ కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో అలా మిగిలిపోతాయి. అలాంటి చిత్రమే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’. ఈ చిత్రం తెలుగు సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పుకునే స్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ చిత్రంలో ఎందరో నటీనటులు భాగస్వామ్యం అయ్యారు. కానీ ఇందులో కొన్ని పాత్రలకే గుర్తింపు దక్కింది. చదవండి: ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ.. అలాగే ‘ఈ నటుడు బాహుబలిలో ఉన్నాడా?’ అనుకునే గుర్తుపట్టలేని పాత్రలు కూడా చాలా ఉన్నాయి. అందులో జాన్ కొక్కెన్ పాత్ర కూడా ఒకటి. మ్యాన్లీ హీరో ఆర్య తాజా చిత్రం ‘సార్పట్ట’తో ఒక్కసారిగా అందరిని దృష్టి ఆకర్షించాడు జాన్ కొక్కెన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేపథ్యంలో బాహుబలిలోని తన పాత్ర గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికర విషయం పంచుకున్నాడు. అయితే బాహుబలి సినిమా అంటే ప్రభాస్, రానా, రమ్యకృష్ణల తర్వాత గుర్తొచ్చే మరో పాత్ర కాళకేయ. కాళకేయుడిగా ప్రభాకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: అందువల్లే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి పోయింది: కృష్ణ అయితే ఇదే గ్యాంగ్‌లో జాన్ కొక్కెన్ కూడా ఉన్నాడు. కాళకేయ సైనికుల్లో తను ఓ సైనికుడి పాత్ర పోషించిన జాన్ కొక్కెన్ ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘బాహుబలిలో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయానికి నా పేరు ఎవరికీ తెలియదు. అయితే ఏదో ఒక రోజు నా పేరు అందరికి తెలుస్తుందని చెప్పాను. ఆ సమయం ఇప్పటికి వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ ఫొటోను గర్వంగా షేర్ చేస్తున్నాను. ఏదో ఒకరోజు నన్ను అందరూ గుర్తించే స్థాయికి ఎదుగుతానని అజిత్ సార్ చెప్పారు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్ కాగా దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన ‘సార్పట్టా’ చిత్రంలో వెంబులి(వేటపులి) పాత్రలో జాన్ కొక్కెన్ నటించాడు. ఈ పాత్రకు గాను అతడికి మంచి గుర్తింపు వచ్చింది. శివ దర్శకత్వంలో అజిత్ నటించిన వీరం చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్ కొక్కెన్.. ఆ తర్వాత తెలుగులో ‘ఎవడు, వన్ నేనొక్కడినే, వీరుడొక్కడుతో పాటు కేజీఎఫ్ చాప్టర్ వన్ తదితర సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
‘బాహుబలి’ మొదలై 7 ఏళ్లు..
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన కళాఖండం ‘బాహుబలి’. తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమా. భారతీయ చిత్ర పరిశ్రమలోనే బాహుబలి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. భారీ బడ్జెత్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేగాక ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకొని బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ఉత్తమ సినిమాగా నిలిచింది. అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఈ రోజుతో ప్రత్యేక అనుబంధం ఉంది. (‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’) బాహుబలి షూటింగ్ ప్రారంభమయ్యి నేటికి ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ విషయాన్ని బాహుబలి టీమ్ తన ట్విటర్లో ఖాతాలో పేర్కొంది. బాహుబలి షూటింగ్ 2013 జూలై 6న ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌ను కర్నూలులోని రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్, అభిమానులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..) July 6, 2013. The moment when it all began! We started the shoot of #Baahubali on this day 7 years ago... ✊🏻 pic.twitter.com/JQmbRuplki — Baahubali (@BaahubaliMovie) July 6, 2020 -
మరో టాలెంట్‌ను పరిచయం చేసిన ఫేస్బుక్
-
‘ఎవ్వడంట... ఎవ్వడంట’ మాటల్లేవ్ బాస్
సోషల్ మీడియా వల్ల లోకల్ టాలెంట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే బేబీ, రాణు మరియా ముండల్ అనే యాచకురాలి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన సోషల్‌మీడియా ప్రస్తుతం మరో నూతన గాత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ గానం మనసుల్ని రంజింపచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. హేము గమేతి భిల్ అనే ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువకుడు భారతీయ సినీ రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని ఎవ్వడంట.. ఎవ్వడంట హిందీ వెర్షన్(కౌన్ హై ఓ)ను పాటను అద్భుతంగా పాడాడు. అయితే ఈ పాట పాడిన వ్యక్తి వివరాలేం తెలియవు. బాహుబలి చిత్రంలో ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ పాటను సదరు వ్యక్తి అంతే హృద్యంగా పాడి నెటిజనుల మనసు గెలుచుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా మాటలు లేవు అంటూ ప్రశంసిస్తున్నారు. -
బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
-
వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చేసిన రచ్చ అంత తేలిగ్గా ఎవరు మరిచిపోరు. బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి : ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా బారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్ దాదాపు 2వేల కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారనేగా మీ సందేహం.. ఏం లేదండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24న) భారతగడ్డ మీద అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. (ట్రంప్ విందు.. పసందు..!) ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటనకు ఒక్కరోజు ముందు బాహుబలి టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రబాస్ ముఖానికి ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో 'జియోరే బాహుబలి' సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇక చివర్లో సినిమాకు శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా 'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అని చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్ స్పందిస్తూ.. 'భారత్‌లో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ' రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. (హౌడీ X నమస్తే) కాగా రెండు రోజుల పాటు ఇండియాలో గడపనున్న ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు.తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. Look so forward to being with my great friends in INDIA! https://t.co/1jdk3AW6fG — Donald J. Trump (@realDonaldTrump) February 22, 2020 -
'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి
మధురై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. తమిళ పులి సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఈ సంభాషణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'బాహుబలి' భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాసింది. బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ అంతకుముందు డిమాండ్ చేసింది. యూట్యూబ్‌లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్‌ను పోలీసులకు అందచేసి ఫిర్యాదు చేసింది. -
వర్మానందం
-
'దర్శక బాహుబలికి సెల్యూట్'
హైదరాబాద్: నెక్ట్స్ సెన్సేషన్ కోసం 2016 వరకు ఆగక తప్పదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యనించింది. 'బాహుబలి' సినిమా రెండో భాగం కోసం ఆమె ఈ కామెంట్ చేసింది. తాజాగా విడుదలైన 'బాహుబలి' సినిమా శనివారం చూశానని, సూపర్బ్ గా ఉందని తన ఫేస్ బుక్ పేజీలో సుమ పోస్ట్ చేసింది. ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన 'దర్శక బాహుబలి'కి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడులైన 'బాహుబలి' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ రాజమౌళి గొప్పగా తీశాడని సోషల్ మీడియాలో ప్రశంసించారు. -
రూ. 100 కోట్లు దాటిన 'బాహుబలి' కలెక్షన్స్
హైదరాబాద్: బాక్సాఫీస్ ను 'బాహుబలి' షేక్ చేస్తున్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 23 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది. -
ఇక్కడ నిల్లు... అక్కడ ఫుల్లు!
బాహుబలి చిత్రం రిలీజ్ ఎఫెక్ట్ కళాశాలలపై పడింది. శుక్రవారం ఆ సినిమాను జోగిపేట థియేటర్లో కూడా రిలీజ్ చేయడంతో స్థానిక, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు విద్యార్థులు లేక బోసిపోయాయి. తరగతి గదుల్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే కనిపించారు. శుక్రవారం ఉదయం నుంచి రోడ్లపై విద్యార్థులు ఎవరూ కనిపించలేదు. ఉదయం 6 గంటలకే షో ప్రారంభించడంతో వారంతా ఉదయం నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. -
'రివ్యూలు చదవొద్దు.. ఎవరి మాటలు వినొద్దు'
హైదరాబాబాద్: 'బాహుబలి' సినిమా అత్యద్భుతంగా ఉందని హీరో అల్లు శిరీష్ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు తనను తాను మైమరచిపోయానని ట్విటర్ లో పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ రాలేదన్నారు. తెలుగు చిత్రసీమ నుంచి ఇలాంటి గొప్ప సినిమా వచ్చినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. 'బాహుబలి' సినిమా గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదన్నారు. ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో చెప్పాల్సి వస్తే తనకు 10 నుంచి 15 ట్వీట్లు అవసరమవుతాయన్నారు. ఎటువంటి రివ్యూలు చదవొద్దు, ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. నేరుగా ధియేటర్ కు వెళ్లి సినిమా చూడండి' అని ప్రేక్షకులకు సూచించారు. -
'రానా... నిన్ను మించిన విలన్ లేడు'
ముంబై: 'బాహుబలి' సినిమాపై బాలీవుడ్ నటులు ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్రసీమ గర్వపడే సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమా అద్భుతంగా ఉందని నటుడు జాకీ భగ్నానీ ట్వీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' మైలురాయి అని సిద్ధార్థ్ మల్హోత్రా పేర్కొన్నారు. రాజమౌళి బాగా తీశారని కితాబిచ్చారు. ప్రతినాయక పాత్రలో తన స్నేహితుడు దగ్గుబాటి రానా ఇరగదీశాడని మెచ్చుకున్నారు. 'నిన్ను మించిన విలన్ లేడని' ప్రశంసించారు. సినిమా యూనిట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనబడుతోందన్నారు. 'ఈరోజు బహుబలి రోజు' అంటూ నటుడు ఆశిష్ శర్మ ట్వీట్ చేశారు. డినో మోరియా, సంజయ్ కపూర్, గౌరీ ఖాన్, తుషార్ కపూర్, విక్రమాదిత్య మెత్వానీ, సిద్ధార్థరాయ్ కపూర్ తదితరులు రిలీజ్ రోజునే 'బాహుబలి' వీక్షించారు. @RanaDaggubati there can't be a hotter villain than u ever. Kudos to u my friend. Each department pure genius actors,technicians #Bahubali — siddharth malhotra (@sidpmalhotra) July 9, 2015 -
'బాహుబలి' చూసిన 'బాద్ షా' భార్య
ముంబై: భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'బాహుబలి' సినిమాకు తెలుగులోఏ కాదు తమిళం, హిందీ భాషాల్లోనూ క్రీజ్ ఏర్పడింది. బాలీవుడ్ లో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. 'టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ' గా మారిన బాహుబలి సినిమా చూసేందుకు సెలబిట్రీలు అమితాసక్తి చూపించారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ విడుదల రోజే ఈ సినిమా చూశారు. గౌరీ ఖాన్ తన కారులో సినిమాకు వెళుతున్న ఫోటోలు ట్విటర్ లో పోస్ట్ చేశారు. సినిమా చూసిన పలువురు ప్రముఖులు 'బాహుబలి' యూనిట్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్, తమన్నా, కీరవాణి, నిర్మాలకు తమిళ దర్శకుడు లింగుస్వామి మనస్ఫూర్తిగా అభినందలు తెలిపారు. మంచు మనోజ్, మంచు విష్ణు, అల్లరి నరేశ్, తరుణ్ తేజ్, రాధిక, రిచా గంగోపాధ్యాయ, స్నేహ ఉల్లాల్, సోనాల్ చౌహాన్, రకుల్ ప్రీత్ తదితరులు 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. -
'రాజమౌళి మరో హిట్ కొట్టాడు'
హైదరాబాద్: 'బాహుబలి' సినిమాతో తన సోదరుడు రాజమౌళి మరో హిట్ కొట్టారని నటుడు, రచయిత ఎస్ ఎస్ కాంచి అన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే సినిమా తీశారని కితాబిచ్చారు. ఇండియన్ సినిమా విలువను ప్రపంచానికి చాటి చెప్పారని మెచ్చుకున్నారు. 'బాహుబలి' చిత్రానికి పనిచేసిన వారందరికీ ట్విటర్ లో అభినందనలు తెలిపారు. వారికి అందించడానికి మరిన్ని మెమొంటోలు అవసరమవుతాయని పేర్కొన్నారు. తన అన్నయ్య, అమ్మ(శ్రీవల్లి) పడిన కష్టం సఫలమయినందుకు సంతోషంగా ఉందన్నారు. మూడేళ్లు కష్టపడి విజయవంతంగా గొప్ప సినిమాను నిర్మించిన శోభు, చిన్నాలకు ఆయన అభినందనలు తెలిపారు. -
'బాహుబలి' గాయాలు
-
బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి
హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలను తొలగించకపోతే తెలంగాణలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. యూట్యూబ్‌లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్‌ను ఇప్పటికే పోలీసులకు అందచేస్తూ ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు బాహుబలి చిత్రం జూలై 10 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.