
'రానా... నిన్ను మించిన విలన్ లేడు'
ముంబై: 'బాహుబలి' సినిమాపై బాలీవుడ్ నటులు ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్రసీమ గర్వపడే సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమా అద్భుతంగా ఉందని నటుడు జాకీ భగ్నానీ ట్వీట్ చేశారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' మైలురాయి అని సిద్ధార్థ్ మల్హోత్రా పేర్కొన్నారు. రాజమౌళి బాగా తీశారని కితాబిచ్చారు. ప్రతినాయక పాత్రలో తన స్నేహితుడు దగ్గుబాటి రానా ఇరగదీశాడని మెచ్చుకున్నారు. 'నిన్ను మించిన విలన్ లేడని' ప్రశంసించారు. సినిమా యూనిట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనబడుతోందన్నారు. 'ఈరోజు బహుబలి రోజు' అంటూ నటుడు ఆశిష్ శర్మ ట్వీట్ చేశారు.
డినో మోరియా, సంజయ్ కపూర్, గౌరీ ఖాన్, తుషార్ కపూర్, విక్రమాదిత్య మెత్వానీ, సిద్ధార్థరాయ్ కపూర్ తదితరులు రిలీజ్ రోజునే 'బాహుబలి' వీక్షించారు.
@RanaDaggubati there can't be a hotter villain than u ever. Kudos to u my friend. Each department pure genius actors,technicians #Bahubali
— siddharth malhotra (@sidpmalhotra) July 9, 2015