Siddharth Malhotra
-
శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ అంటూ సామ్ రియాక్షన్
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది" అని వెల్లడించింది. ఈ పోస్ట్ కింద రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత.. ఓ మైగాడ్, కంగ్రాచ్యులేషన్స్ అని కామెంట్ చేసింది.ప్రేమ.. పెళ్లికియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. లస్ట్ స్టోరీస్ (2018) సినిమా ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా షేర్షా సినిమాలో నటించారు. రోమ్ నగరంలో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని కియారా.. కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది. సినిమాకియారా అద్వానీ ఫగ్లీ సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. ఎమ్మెస్ ధోని, మెషిన్, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూస్, కబీర్ సింగ్, ఇందూ కి జవానీ, భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ మేరా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాల్లో నటించింది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీతో పాటు హిందీ వార్ 2లో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్, ఎ జెంటిల్మెన్, మర్జావాన్, షేర్షా, థాంక్ గాడ్, మిషన్ మజ్ను, యోధ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) చదవండి: రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే? -
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ జంటగా రొమాంటిక్ కామెడీ మూవీ!
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ హీరో హీరోయిన్లుగా హిందీలో ఓ కొత్త సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘దస్వి’ ఫేమ్ తుషార్ జలోట దర్శకత్వం వహిస్తారట. దినేష్ విజన్ నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, ఈ ఏడాదిలో చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారని భోగట్టా. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట దినేష్ విజన్. మరి... ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సిద్ధార్థ్, కృతీ సనన్ జోడీగా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకోవాల్సింది!
రాశీ ఖన్నా.. తన కెరీర్ మొదలైందే హిందీ సినిమాతో! మద్రాస్ కేఫ్ (2013) మూవీతో హీరోయిన్గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మనం మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. ఊహలు గుసగుసలాడె సినిమాతో హీరోయిన్గా అలరించింది. ఇక్కడ వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్లోనే సెటిలైపోయింది. మధ్యలో మధ్యలో తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ మధ్య తెలుగులో సరైన హిట్లు లేకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. సిద్దార్థ్- రాశీ జోడీ బాగుంది దీంతో 11 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్లో అడుగుపెట్టింది. యోధ సినిమాలో నటించింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రానికి సాగర్ ఆంబ్రే–పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ రాశీ- సిద్దార్థ్ జంటకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ముచ్చటపడిన అభిమానులు సిద్దార్థ్.. కియారాకు బదులుగా రాశీని పెళ్లి చేసుకుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. అది వారి అభిప్రాయం అంతే! దీనిపై తాజా ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా స్పందిస్తూ.. 'అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే! అభిమానులు సినిమా చూసి మాగురించి ఏవేవో ఊహించుకుంటారు. నిజంగా మేము ఎలా ఉంటామనేది వారికి తెలీదు. కానీ మేము కలిసుంటే బాగుండని కలలు కంటారు. స్క్రీన్‌పై జంటగా చూడటానికి బాగున్నంత మాత్రాన నిజ జీవితంలో కూడా అలానే ఉంటారని గ్యారెంటీ ఏముంది? నిజానికి ఇంకా వరస్ట్‌గా కూడా ఉండొచ్చు కదా!' అని చెప్పుకొచ్చింది. పిల్లాడిలా ప్రవర్తించకూడదు ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు.. 'ఎవరైతే చిన్నపిల్లాడిలా, పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తారో అలాంటివాళ్లు అస్సలు నచ్చరు. అబ్బాయిలు పిల్లవేషాలు వేస్తే చూడటానికి దరిద్రంగా ఉంటుంది. బాధ్యతగా వ్యవహరిస్తూ, మెచ్యూర్‌గా నడుచుకునే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నా' అని రాశీ తెలిపింది. చదవండి: ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. 22 ఏళ్లయినా తగ్గేదేలే! -
ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కియారా అద్వానీ బీ టౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. మరోసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో జతకట్టింది. ఇప్పటికే భూల్ భూలయ్యా-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జంట మరోసారి 'సత్యప్రేమ్ కి కథ' చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే.. ) తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కియారా, కార్తీక్. ప్రమోషన్లలో భాగంగా రాజస్థాన్‌లో జైపూర్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించి కియారాతో ఉన్న ఫోటోలను కార్తీక్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కియారా అద్వానీ మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఆమె ఆ ఫోటోల్లో బేబీ బంప్‌తో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభవార్త ఉందా? కియారా జీ.. అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో అనిల్ అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ సహా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ 'షెర్షా' మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే జపాన్ వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఈ బాలీవుడ్ జంట సినిమాలతో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
కియారా- సిద్ధార్థ్ పెళ్లి.. బిగ్ న్యూస్ చెబుతానన్న నటి..!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న సిద్-కియారాలు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా కియారా పోస్ట్ చేసిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లి తర్వాత వచ్చే బిగ్ న్యూస్ ప్రెగ్నెన్సీ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కియారా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. మీకు త్వరలోనే బిగ్ న్యూస్ చెబుతానంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆమె తన రూమ్‌లో కూర్చుని, ప్లేట్ నిండా మామిడికాయ ముక్కలు తింటూ ఫోటోలో కనిపించింది. అయితే కియారా అభిమానులు ఆ బిగ్ న్యూస్ ఏంటా అని ఎదురు చూస్తున్నారు. కాగా.. ప్రస్తుతం కియారా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ15 పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కోసం సుమారు 20రోజులు బ్రేక్ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇ -
కొత్త పెళ్లి కూతురు కియారాకు అత్తింటి వారి ఘనస్వాగతం, వీడియో వైరల్
కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు పిబ్రవరి 7తో ముగిశాయి. చదవండి: ‘యశోద’ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! పెళ్లి అనంతరం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కియారా-సిద్దార్థ్‌లు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం బుధవారం(ఫిబ్రవరి 8న) దంపతులుగా ఢిల్లీ చేరుకున్నారు. మొదటి సారి కోడలిగా అత్తింట్లోకి అడుగుపెడుతున్న కియారాకు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పంజాబీ సాంప్రదాయ ప్రకారం డోలు, సన్నాయిలతో ఈ కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించారు. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! ఈ సందర్భంగా సిద్ధార్థ్-కియారాలు పంజాబీ డోలుకు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం మీడియాకు ఫోజులు ఇచ్చిన ఈ కొత్త జంట పాపరాజిలకు స్వీట్స్ పంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఫిబ్రవరి 9) రాత్రి ఢిల్లీలో ఫ్యామిలీ రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 10న ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ల కోసం మరో రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by @varindertchawla View this post on Instagram A post shared by @varindertchawla View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
ఒక్కటైన కియారా- సిద్ధార్థ్ జంట.. ఫోటోలు వైరల్
-
సీక్రెట్ డేటింగ్.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ ఇంకా బయటకు రాలేదు. అయితే వీరి పెళ్లి తంతుకు హాజరయ్యేందుకు వెళ్లిన పలువురు బాలీవుడ్ సినీ నటీనటులు కియార-సిద్ధార్థ్ వెడ్డింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నటి ప్రీతి జింటా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ వైబ్స్ అంటూ సోమవారం తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కాగా కొంతకాలంగా వీరిద్దరు ప్రేమ ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీర్దిదరూ ఎప్పుడూ తమ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. తామిద్దరం స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్న ఈజంట పెళ్లి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచింది. వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చదవండి: పెళ్లి చేసుకున్న ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! సుమంత్‌తో విడాకుల తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? -
నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న రష్మిక మూవీ! అప్పటి నుంచి స్ట్రీమింగ్?
గుడ్‌బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. గత నెలలో థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. ఆమె హిందీలో నటించిన మరో చిత్రం మిషన్ మజ్ను. ఈ మూవీతో సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మీక జతకట్టింది. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత బాక్సాఫీసు వద్ద పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నడంతో మూవీ టీం విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! అయితే అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అంతేకాదు ప్రమోషన్స్ అని కూడా చిత్ర బృందం హడావుడి కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చిది. ఈ తాజా బజ్ ప్రకారం మిషన్ మజ్ను చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు జనవరి నుంచి ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. కాగా బాలీవుడ్లో రష్మిక అంగీకరించిన తొలి సినిమా ఇది. కానీ ఆమె రెండవ చిత్రం గుడ్‌బై మొదట విడుదలై ప్లాప్టాక్ తెచ్చుకుంది. కాగా స్పె యాక్షన్ థ్రిల్లర్‌గా శాంతను బాగ్చీ మిషన్ మజ్ను చిత్రాన్ని రూపొందించాడు. భారత సైన్యం తలపెట్టిన గొప్ప కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. ఇటీవల షోకు వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా కియారాతో డేటింగ్‌పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్ ఫొటో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్‌ను కరణ్ ప్రశ్నించగా.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. తాజాగా హీరో షాహిద్ కపూర్‌తో కలిసి కియారా ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్ ఎవరని అడగ్గా షాహిద్ పేరు చెప్పింది కియారా. అనంతరం సిద్ధార్థ్‌తో ఉన్న బంధం ఏంటని అడగ్గా. అతడు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది ఆమె. చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు ఇంతలో షాహిద్ కల్పించుకుని ‘ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్ అనౌన్స్మెంట్ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు!’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిద్ధార్థ్, కియారాలు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎట్టకేలక తమ లవ్వీ లవ్‌బర్డ్స్ పెళ్లి ఒక్కటికాబోతున్నారా? వీరిద్దరు క్యూట్ కపుల్, ఎట్టకేలకు కియార-సిద్ధార్థ్ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారన్నమాట’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కియారా, సిద్ధార్థ్‌లు ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్ల తెలుస్తోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే..
ప్రస్తుతం బాలీవుడ్ ప్రేమజంటలో కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల ప్రేమయాణం తరచూ హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట నేరుగా ఎప్పుడు స్పందించలేదు. ఒకవేళ మాట్లాడిన తాము స్నేహితులమే అంటూ రూమార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా వీరి ప్రేమ, పెళ్లిపై రూమర్లు ఆగడం లేదు. ఇటీవల కియార బర్త్‌డే వేడుకలో భాగంగా ఈ జంట దుబాయ్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీరి లవ్ ఎఫైర్ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ షోలో తమ రిలేషన్‌పై నోరువిప్పాడు సిద్ధార్థ్. కాఫీ విత్ కరణ్ షోకు వచ్చిన సిద్ధార్థ్, కియారాతో ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. హీరో విక్కీ కౌశల్‌తో కలిసి సిద్ధార్థ్ ఈ టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేత కియారాతో రిలేషన్‌ను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు కరణ్. ఈ క్రమంలో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్‌ను ప్రశ్నించాడు.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. చదవండి: ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ ఈ సందర్భంగా కాఫీ విత్ కరణ్ గత సీజన్లో కియారాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సిద్ధార్థ్ కోసం ప్లే చేశాడు కరణ్. అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం స్నేహితుల కంటే ఎక్కువ అని కియారా చెప్పడం.. సిద్ధార్థ్ ముసిముసి నవ్వడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోతున్నారు. అంతేకాదు తన ప్రశ్నలతో కరణ్, కియారాను ఇబ్బంది పెట్టడం చూసి తనని ఎందుకు అన్ని ప్రశ్నలు అడిగారు? అని అన్నాడు. దీంతో ఒకే మీ పెళ్లేప్పుడు అని సిద్ధార్థ్‌ను అడగ్గా.. మీరు సెటిల్ అయ్యారు.. మేము అవ్వోద్దా? అని సమాధానం ఇచ్చాడు. ఇక చివకరగా ఒకవేళ తనని పిలవకుండానే పెళ్లి చేసుకుంటే కొడతానంటూ సిద్ధార్థ్‌ను హెచ్చరించాడు కరణ్. -
బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే సెలబ్రేషన్!.. అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్
Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai: హిందీ చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్లు, చెట్టాపట్టాలు వేసుకోని షికార్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ విషయాలపై కొందరు సూటిగా సుత్తిలేకుండా వారి రిలేషన్షిప్ గురించి బయటపెడితే, మరికొందరు గుట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాణీ తన బాయ్‌ఫ్రెండ్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈరోజు (జులై 31) కియారా అద్వానీ పుట్టినరోజు. తన బర్త్‌డేను బాయ్‌ఫ్రెండ్‌తో ఫారిన్లో జరుపుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన 30వ పుట్టినరోజును దుబాయ్‌లో ప్రియుడు సిద్ధార్థ్‌తో కలిసి జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలోని పలు పోస్ట్‌లను చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తాజాగా ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: చివరిగా మమతా మోహన్ దాస్‌ను ఎంపిక చేశాం: డైరెక్టర్ అయితే వీరిద్దరూ అభిమానులతో విడివిడిగా ఫొజులివ్వడం మనం చూడొచ్చు. ఈ ఫొటోల్లో సిద్ధార్థ్, కియారా విడిగా ఫోజులిచ్చిన.. వారితో దిగిన ఫ్యాన్స్ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు. దీంతో కియారా తన బర్త్‌డేను సిద్ధార్థ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమని తెలుస్తోంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ View this post on Instagram A post shared by SidKiara (@siara_vogue) కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇటీవల కరణ్ జోహర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఎపిసోడ్లో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు అనన్య పాండే హింట్ కూడా ఇచ్చింది. కాగా మహేశ్ బాబు 'భరత్ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెప్పించిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. -
పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన కియారా, ఏమన్నదంటే..
Kiara Advani Intresting Comments On Marraige: భరత్ అనే నేను మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటూ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె చేతి పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె నటించిన భూల్ భులయ్యా-2’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే తన తదుపరి మూవీ జగ్ జగ్ జియో చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా వరుణ్ ధావన్ సరసన నటించింది. చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్ ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కియారాకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్అవుతారని ఓ విలేఖరి ప్రశ్నించగా దీనిపై కియారా ఆసక్తిగా స్పందించింది. ‘పెళ్లి చేసుకోకపోయిన నేను బాగానే సెటిల్ అయ్యాను. సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పని చేస్తున్నా. బాగా సంపాదిస్తున్నా. హ్యాపీగా ఉన్నాను. సెటిల్ అవ్వడమంటే ఇదే కదా’ అంటూ కియారా సమాధానం ఇచ్చింది. కాగా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా కొంతకాలంగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్న క్రమంలో కియారా పెళ్లిపై ఇలా స్పందించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా కియార ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్సీ15లో నటిస్తోంది. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి -
సిద్దార్థ్‌తో బ్రేకప్ రూమర్స్, తొలిసారి స్పందించిన కియారా
Kiara Advani Respond On Break Up With Siddharth Malhotra: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్‌టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. వీరి బ్రేకప్‌పై బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. కానీ, గొడవల వల్ల కాదని, షూటింగ్లో బిజీ ఉండటం వల్ల అంటూ అందరిని ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్ ఫ్రెండ్స్. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ ఇదిలా ఉంటే తాజాగా వీరి బ్రేకప్ వార్తలపై స్పందించి కియారా అద్వాని. కియారా తాజాగా నటించిన ‘భూల్ భులయ్యా-2’ ట్రైలర్ ఈవెంట్లో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె ‘నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరిని మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇది విని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య ఏం జరగలేదని, వీరి బ్రేకప్ వార్తల్లో నిజం లేదంటూ అభిప్రాయ పడుతున్నారు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత ఇదిలా ఉంటే సిద్ధార్థ్, కియారాలు వారి రిలేషన్‌పై ఇంతవరకు స్పందించలేదు. కానీ ముంబై రోడ్లలో జంటగా చక్కర్లు కొడుతూ విందులు, వినోదాలకు కలిసి వెళుతుంటారు. అంతేకాదు కియారా పలుమార్లు సిద్ధార్థ్ ఇంటికి వెళుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో విరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ పుకార్లు గుప్పుమన్నాయి. 2021లో వీరిద్దరు జంటగా నటించిన ‘షేర్షా’ చిత్రంలో కియారా, సిద్ధార్థ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా పండటంతో ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి. కాగా భూల్ భూలయ్యా 2 చిత్రంలో కియారా, కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా నటిస్తోంది. ఇందులో సీనియర్ నటి టబు కీ రోల్ పోషిస్తోంది. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్ లవ్‌బర్డ్స్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి రిలేషన్‌ను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్య బాలీవుడ్ ప్రేమ జంటలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంగా సిద్ధార్థ్-కియారాలు కూడా ఏడడుగులు వేయాలని అనుకుంటున్నారట. చదవండి: ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్ ప్రేమయాణం.. అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌పై నోరు విప్పని ఈజంట విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్ వేడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి. ఇదిలా ఉంటే కియారా-సిద్ధార్థ్‌లు కలిసి చేసింది ఒక్క సినిమానే. దీంతో తెరపై వీరి కెమిస్ట్రీ చూసి చూడ చక్కని జంటని అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలుస్తోంది. దీంతో 2022 మధ్యలో లేదా, ఏడాది చివరిలో పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్నారట ఈ లవ్‌బర్డ్స్. మరి ఈ వార్తలపై కియారా-సిద్ధార్థ్‌లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. కాగా గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన కత్రినా-విక్కీలు చివరి వరకు వారి రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన సంగతి తెలిసిందే. చదవండి: పుష్ప పార్ట్ 2 షూటింగ్‌ను నార్త్‌లో ప్లాన్ చేస్తున్న సుక్కు? బాలీవుడ్ హీరోకు కీ రోల్! -
నా స్థానంలో హీరో ఉంటే అలాంటి కామెంట్స్ చేయరేమో: కియారా
Kiara Advani Resonds On Being Trolled After Elderly Man Saluted Her: కబీర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. గత కొన్నాళ్లుగా సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో మునిగితేలుతున్న ఆమె ఆ మధ్య ఓసారి ప్రియుడి ఇంటికి వెళ్లి ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. సిద్దార్థ్ అపార్ట్మెంట్కి కియారా ఎంటర్ కాగానే అక్కడున్న సెక్యురిటీ సిబ్బందైన వృద్ధుడు కారు డోర్ తెరిచి ఆమెకు సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కియారా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు. కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా? ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటంటూ కియారాపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా దీనిపై స్పందించింది. 'నా స్థానంలో ఒక హీరో ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లు కాదేమో. అయినా ఎవరూ సెల్యూట్ చేయమని అడగరు. ఆయన సెక్యూరిటీ గార్డ్ కాబట్టి స్వతహాగా అలా చేశారు. కారులోంచి దిగుతుండగా ఫోటోగ్రాపర్స్ వీడియో తీసి తెగ వైరల్ చేశారు. నిజానికి ఇది అవనరమైన ట్రోలింగ్' అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది: సమంత భావోద్వేగం
When Asks Samantha About 2021 Years She Replied.. విడాకుల అనంతరం టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. వరుస సినిమా ఆఫర్లు ఆమెకు క్యూ కడుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో జాతీయ స్థాయికి ఎదిగిన సామ్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగింది. అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాతో ఆమె హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్ స్వయంగా ప్రకటించింది. అంతేగాక ఇందులో తను బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తుండంతో ఇది తనకు చాలెంజింగ్ రోల్ అని చెప్పుకొచ్చింది. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. అలాగే సమంత తాప్సీ పన్ను నిర్మాణంలో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆ ప్రాజెక్ట్ టీం తాప్సీ పన్ను, సిద్దార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో ఓ ఈవెంట్లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే సమంత తాజాగా బాలీవుడ్, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రతో పాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొంది. చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా? డిసెంబర్ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ స్పెషల్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారలను కోరగా.. సమంత మాట్లాడుతూ.. ‘నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’ అని చెప్పుకొచ్చింది. కాగా సమంత తమిళలో కాతువాకుల రెండు కాదల్‌లో నటిస్తోంది. దీనితో పాటు డ్రీమ్ వారియర్ బ్యానర్లో ఓ ద్విభాసా చిత్రంతో పాటు శ్రీదేవి మూవీస్ బ్యానర్లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో సమంత మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
తన అభిమానులను మూడు మొక్కలు నాటుమంటున్న హీరో
Siddharth Malhotra Accept Green India Challenge: తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సామాన్యులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర కూడా పర్యావరణాన్ని కాపాడే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించాడు సిద్ధార్థ్. మూడు మొక్కలు నాటి, తన అభిమానులందరికి 'గ్రీన్ ఇండియా సవాల్' విసిరాడు. తన అభిమానులందరూ అతడిలా మూడు మొక్కలు నాటుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరాడు. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ట్విటర్లో తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సిద్ధార్థ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన 10 మిలియన్ ఫాలోవర్స్ అందరూ ఈ ఛాలెంజ్‌ను కొనసాగించాలని కోరారు. సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'యోధ' మంచి సక్సెస్ సాధించాలని 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. Thank you @SidMalhotra ji for accepting #GreenIndiaChallenge and planting sapling. Hoping that your 10M followers across the world on @Twitter would replicate what you have done today, in the interest of the better future. Wish you all the best for #Yodha Movie.#Appreciate🌱. pic.twitter.com/HYsKQQZXxG — Santosh Kumar J (@MPsantoshtrs) November 27, 2021 'రాధేశ్యామ్' హీరోయిన్ పూజా హెగ్డే ఈ ఛాలెంజ్‌ను శుక్రవారం స్వీకరించి మొక్కలు నాటింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను యువ హీరో సుశాంత్ నుంచి స్వీకరించి, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు సవాల్ విసిరింది. ఇంతకుముందు అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వతహాగా సవాల్ స్వీకరించిన నటి నందితా శ్వేత మొక్కలు నాటారు. అనంతరం ఆమె ఐశ్వర్య రాజేశ్, హీరో నిఖిల్, డైరెక్టర్ ప్రశాంత్‌కు ఛాలెంజ్ విసిరారు. ఇదీ చదవండి: 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్వీకరించిన రాధేశ్యామ్ బ్యూటీ -
థియేటర్లలో 'థ్యాంక్ గాడ్' సందడి చేయనుంది ఆ రోజే..
Thank God Movie Theater Release Date Out: బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ గాడ్'. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కొంచెం బ్రేక్ ఇచ్చేలా సినిమా విడుదల తేదిని ప్రకటించారు. ఈ చిత్రం జూలై 19, 2022న థియేటర్లలో సందడి చేయనున్నట్లు సినిమా తారాగణం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'ఎంతగానో ఎదురుచూస్తున్న 'థ్యాంక్ గాడ్' చిత్రం వచ్చే సంవత్సరం మీకు సంతోషాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 'సంతోషకరమైన జీవితం' అనే సందేశంతో కూడిన ఈ సినిమా 29 జూలై 2022న విడుదల కానుంది.' అని రకుల్ పోస్ట్ చేసింది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం 'థ్యాంక్ గాడ్'. ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అశోక్ థాకేరియా, సునీర్ ఖేటర్‌పాల్, దీపక్ ముకుత్, ఆనంద్ పండిట్, మార్కంద్ అధికారి నిర్మించారు. సహ నిర్మాతగా యష్ షా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ ఇంద్ర కుమార్ గతంలో తీసిన బ్లాక్‌బస్టర్ చిత్రాలకంటే 'థ్యాంక్ గాడ్' భిన్నంగా ఉంటుందట. ఇంద్ర కుమార్ ఈ సినిమాను కొత్త తరహాలో నవ్వులు పూయిస్తూ, చివరిలో సందేశంతో రూపొందించారు. నేటి ప్రపంచానికి తగినట్లుగా, కుటుంబాలకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) ఇంద్ర కుమార్ మస్తీ, ధమాల్ వంటి హాస్య ఫ్రాంచైజీలకు దర్శకత్వం వహించారు. ఇది ఒక సుందరమైన సందేశంతో ఉంటుందని సిద్ధార్థ్ మల్హోత్ర గతంలోని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఈ సినిమా ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని నేను హామీ ఇస్తున్నాను. కృతజ్ఞత భావం గురించి, గతంలో కంటే ఇప్పుడు ఏది ముఖ్యమో చెప్పే చిత్రం థ్యాంక్ గాడ్.' అని షేర్షా హీరో సిద్ధార్థ్ పేర్కొన్నారు. చదవండి: వర్షం ఎప్పుడైన కురుస్తుంది.. గొడుగును సిద్ధంగా ఉంచుకోండి: రకుల్ -
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..!
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్‌లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్‌కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్‌లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఆపరేషన్‌కి డేట్ ఫిక్స్
‘‘ఆపరేషన్ని చూడ్డానికి రెడీగా ఉండండి’’ అంటున్నారు రష్మికా మందన్నా. ఏం ఆపరేషన్ అంటే.. భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్ ఆపరేషన్ అన్నమాట. నాటి ఘటనను ఆధారంగా చేసుకుని సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మికా మందన్నా జంటగా రూపొందిన చిత్రం ‘మిషన్ మజ్ను’. పాకిస్తాన్లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో శాంతను బగ్చీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. ‘‘వచ్చే ఏడాది మే 13న సినిమాని విడుదల చేస్తున్నాం. వాస్తవ ఘటనల స్ఫూర్తిగా తీసిన సినిమా ఇది’’ అని విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తున్నారు రష్మిక. ‘మిషన్ మజ్ను’తో హిందీ తెరపై రష్మిక తొలి అడుగు వేయనున్నారు. -
ఇబ్బందుల్లో ‘షేర్షా’ మూవీ.. బ్రాడ్ క్యాస్టింగ్ ఆపాలంటూ కేసు
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన 'షేర్షా' చిత్రం ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సినిమా బ్రాడి కాస్టింగ్‌ని ఆపేయాలంటూ ఓ కాశ్మీరీ జర్నలిస్ట్ ఫరాజ్ అష్రఫ్ కేసు వేయనున్నాడు. ‘షెర్షా’ మూవీలో మిలిటెంట్స్ వాడినట్లు ఓ కారు నంబర్‌ను చూపించారు. అది తన కారు నంబరు అని, తన పర్మిషన్ లేకుండా మూవీలో మేకర్స్ వాడేశారని ఫరాజ్ అష్రఫ్ తెలిపాడు. ఆ కారులో ప్రయాణించాలంటే భయపడుతున్నట్లు, తన ఫ్యామిలీకి ముప్పు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సినిమా బ్రాడ్కాస్టింగ్ని ఆపేయాలని మూవీ మేకర్ ధర్మ మూవీస్, ధర్మ టు పాయింట్ ఓపై కేసు ఫైల్ చేయనున్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్ #SidharthMalhotra and #KiaraAdvani starrer ‘#Shershaah’ landed in trouble after a Kashmiri Journalist alleged that the makers used his registered car number plate in the film. @faraazashraf_https://t.co/8QGNMngDKf — Ridhi suri (@SuriRidhi) October 2, 2021 Kashmiri Journalist to Sue Dharma Productions For 'Endangering Life' https://t.co/h1MsKJFULp — Faraz Ashraf (@faraazashraf_) October 2, 2021 -
బాలీవుడ్ కుర్ర హీరో కోలీవుడ్‌లో సినిమా చేయనున్నాడా?
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు జంటగా నటించిన షేర్షా మూవీ ఇటీవల అమెజాన్ ప్రైంలో విడుదలైన సంగతి తెలిసిందే. కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా పాత్రలో నటించిన సిద్ధార్థ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. అజిత్ ‘బిల్లా’ దర్శకుడు విష్ణువర్ధన్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సిద్దార్థ్ నేరుగా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఫిలిం దూనియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఒక భాషకు చెందిన హీరో డబ్బింగ్‌తో ఇతర భాష ప్రేక్షకులను పలకరిస్తుంటారు. కానీ ఈ యంగ్ హీరో డైరెక్ట్‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు బీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ్ ట్విట్టర్లో ఆస్క్‌మీ ఎనిథింగ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు అతడు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ నెటిజన్ ‘హలో బ్రదర్. నేను తమిళుడిని. మీ అభిమానిని. ఇక్కడ మీ నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమిళ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?’ అని అడగ్గా.. దానికి సిద్దర్థ్ ‘అయితే సరే’ అని సమాధానం ఇచ్చాడు. అనంతరం దీనికి హీరోయిన్ రష్మిక మందన్నా ‘మేము చూస్తాం’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జంత చేసింది. దీంతో ఈ కుర్ర హీరో సౌత్‌లో నేరుగా అడుగుపెట్టాబోతున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ మజ్ను’. ఈ మూవీతో ఆమె బాలీవుడ్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఒకవేళ సిద్దార్థ్ తమిళంలో సినిమా చేస్తే అందులో ఖచ్చితంగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. We’ll see 🤣😎 — Rashmika Mandanna (@iamRashmika) September 16, 2021 -
ఆ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!: రష్మిక
Mission Majnu: బాలీవుడ్లో తన తొలి మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఆనందంలో ఉన్నారు రష్మికా మందన్నా. ‘మిషన్ మజ్ను’ చిత్రంతో హిందీ పరిశ్రమకు ఆమె హీరోయిన్గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శాంతను బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు రష్మిక. ‘‘మిషన్ మజ్ను’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాను. చిత్రీకరణ చాలా సరదగా గడిచింది. శాంతను బాగ్చిగారు ‘మిషన్ మజ్ను’ కథ చెప్పినప్పుడే ఇలాంటి మంచి చిత్రంలో భాగం కావాలనుకున్నాను. హిందీలో నేను నటిస్తున్న తొలి సినిమాలో నా షూటింగ్ అప్పుడే పూర్తయిందనే విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను’’ అని పేర్కొన్నారు రష్మిక. అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు. సిద్ధార్థ్, రష్మిక -
‘ప్రియుడి’ ఇంటికి కియారా: అది కూడా చేతకాదా అంటున్న నెటిజన్లు!
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసింది కియారా అద్వానీ. కానీ కబీర్ సింగ్, భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది. ఈ మధ్యే ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజిచ్చి షాకిచ్చిన ఈ భామ తాజాగా తన వైఖరితో మరోసారి వార్తల్లోకెక్కింది. కియారా, బాలీవుడ్ నటుడు సిద్దార్థ మల్హోత్రా ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరిచి ఆమెకు సెల్యూట్ చేశాడు. అప్పుడు ఆమె తాపీగా కారు నుంచి దిగి భవంతి లోపలికి వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు కియారా మీద మండిపడుతున్నారు. కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా? అని ప్రశ్నిస్తున్నారు. అయినా తామేదో గొప్పవాళ్లమని ఊహించునే సెలబ్రిటీలు ఇలా వయసు మీద పడ్డ ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. చూస్తుంటే అతడు తండ్రి కన్నా పెద్ద వయసులో ఉన్నట్లున్నాడని, అతడితో ఇలా చేయించడం నిజంగా బాధేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కియారా, సిద్దార్థ మల్హోత్రా ప్రేమించుకుంటున్నట్లు గత ఏడాది నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ పార్టీలు, ఫంక్షన్లు, విహారాలు అంటూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంటపడ్డ విషయం తెలిసిందే. ఇక ఈ లవ్‌బర్డ్స్ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
కొత్త ప్రయాణం
కథానాయికగా రష్మికా మందన్నా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇలా వరుస హిట్లతో దూసుకెళుతున్న రష్మికా ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టడం ఏంటీ? అనుకోవచ్చు. అయితే ఈ జర్నీ హిందీ సినిమాకి సంబంధించినది. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో కథానాయికగా నటించనున్నారు రష్మికా. ‘‘మీ అందరికీ ఓ న్యూస్ చెప్పబోతున్నాను. కొత్త ప్రయాణం ఆరంభమైంది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అని హిందీలో తొలి సినిమా అంగీకరించిన సందర్భంగా రష్మిక పేర్కొన్నారు. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో శాంతను బాగ్చి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ‘‘దేశ పౌరులను రక్షించడానికి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గూఢచారులను స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. ఇండియా–పాకిస్తాన్ మధ్య ఓ మిషన్‌ను విజయవంతం చేసే ‘రా ఏజెంట్’ పాత్రను చేస్తున్నాను’’ అన్నారు సిద్ధార్థ్. సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇక రష్మికా బాలీవుడ్ ఎంట్రీపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎంట్రీయే దేశభక్తి సినిమాతో అంటే ఈ బ్యూటీకి బాలీవుడ్లో మంచి లాంచింగ్ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’, ‘పొగరు’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు రష్మికా మందన్నా. -
రష్మిక దూకుడు : ఫ్యాన్స్‌కు పండగే!
సాక్షి, ముంబై: టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోయిన్గా దూసుకుపోతున్నరష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన ఈ చార్మింగ్ బ్యూటీ తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్ రోల్ పోషించనుంది. ఆర్ఎస్వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. శాంతను బాగ్చి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు బాలీవుడ్ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్ చేశారు. (మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!) ఈ మూవీ వచ్చే యేడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అమర్ బుటాలా, గరిమా మెహతా నిర్మాతలు. చిత్రానికి పర్వీజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్‌లు కథను అందిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ సినిమాపై స్పందిస్తూ..‘‘మిషన్ మజ్ను’మనదేశానికి చెందిన పౌరులను రక్షించడానికి వెళ్లిన గూఢచార్ల నిజమైన సాహసవీరులనుంచి ప్రేరణ పొందిన దేశభక్తి కథ అని వివరించారు. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఓ మిషన్ విజయవంతం చేసే రా ఏజెంట్‌గా నటిస్తున్నానని తెలిపారు. బాలీవుడ్ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ అన్నీ భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నాననీ ‘మిస్టర్ మజ్ను’లో నటిస్తుండంటం చాలా సంతోషమంటూ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. (రజనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్) కాగా ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక ఇటీవల కాలంలో వరుసగా హిట్లతో వరుస అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram 💥 https://t.co/y4yQGs9224 — Rashmika Mandanna (@iamRashmika) December 23, 2020 A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
సూపర్‌హీరో అవుతా
కెరీర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్లే తారలు కొందరైతే ఏ ప్లానింగ్ లేకుండా ముందుకు సాగిపోయే తారలు కొందరు ఉంటారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మొదటి రకం. ‘రాబోయే ఐదేళ్లలో మీ కెరీర్ ప్లాన్స్ ఏంటీ? అన్న ప్రశ్నను ఈ కుర్ర హీరో ముందు ఉంచితే... ‘‘రాబోయే రోజుల్లో నేను ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకుంటున్నాను. హాలీవుడ్ మార్వెల్ సిరీస్ చిత్రాలకు నేను అభిమానిని. నా ప్రొడక్షన్ హౌస్‌లో ఓ సూపర్‌హీరో మూవీ చేసే ఆలోచన ఉంది. అందులో నేనూ నటిస్తాను. మన పురాణగాథల ఆధారంగా చాలా గొప్ప చిత్రాలు తీయొచ్చు. ఈ విషయంపై కూడా సినిమాలు చేసే ప్లాన్స్ ఉన్నాయి’’ అని అన్నారు. ఇంకా చెబుతూ– ‘‘నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేస్తున్నాను. అందుకే ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటించాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్. -
పగ ఎత్తు ఎంతో చూపిస్తా
‘‘ఏ వస్తువుని కొలవడానికి అయినా ఎత్తును ప్రమాణంగా చూస్తారు. ఇప్పుడు నా పగ ఎత్తెంతో చూపిస్తాను’’ అంటున్నారు రితేష్ దేశ్‌ముఖ్. ‘మర్జావాన్’ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు రితేష్. ‘నా ఎత్తు సంగతి తర్వాత.. నేను వేసే ఎత్తుల గురించి చూడండి’ అన్నట్టు ఆయన పాత్ర ఉంటుందట. మిలాప్ జావేరి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మర్జావాన్’. రకుల్‌ప్రీత్ సింగ్, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రితేష్ మూడు అడుగుల ఎత్తు ఉండే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. గతంలో ఈ కాంబినేషన్లో (మిలాప్– సిద్ధార్థ్ – రితేష్) ‘ఏక్ విలన్’ సినిమా వచ్చింది. -
ప్రేమ ప్రయాణం
చండీఘడ్ వీధుల్లో హ్యాపీగా చక్కర్లు కొడుతున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. కానీ ఒంటరిగా కాదులెండి. కార్గిల్‌వార్ (1999) సమయంలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా ఉన్న విక్రమ్ బాత్రా బయోపిక్ ‘షేర్షా’గా బాలీవుడ్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చంఢీఘర్‌లో జరుగుతోంది. సిద్ధార్థ్, కియారాలపై బైక్ రైడ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఫైట్ సీన్లను కూడా ప్లాన్ చేశారు. ఇంకో పదిరోజుల పాటు ఈ సినిమా షెడ్యూల్ చండీఘడ్లోనే జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
కెప్టెన్ షేర్షా
దేశ సరిహద్దులో శత్రువుల అంతు చూస్తానంటున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. ఇందుకోసం గన్ ఫైరింగ్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కనున్న నెక్ట్స్ చిత్రానికి ‘షేర్షా’ అనే టైటిల్ ఖరారైంది. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. విక్రమ్‌ను పాకిస్తాన్ ఆర్మీ ‘షేర్షా’ అని పిలిచేవారట. అందుకే ఈ బయోపిక్కు ఆ టైటిల్ పెట్టారని ఊహించవచ్చు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తారు. కియారా అద్వానీ ఇందులో కథానాయికగా నటిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రియల్ లైఫ్ హీరో విక్రమ్ బత్రా పాత్రలో నటించబోతున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉన్నాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అన్నారు సిద్ధార్థ్. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వా మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బోల్డ్ రకుల్
బోలెడు మాటలు చెప్పింది... అన్నీ బోల్డే.ఎవరైనా నాతో తిక్క పని చేస్తే రక్కుతానంది.చికుముకు రవ్వే.. రాంగ్ సైడ్‌లో రబ్బు చేస్తే ఫైరే.ఎవరో డామ్ డిషుకు ఫెల్లో.. డామ్ డిషుకు కామెంట్ పెడితే.. రక్కేసింది.అది మీడియా అంతా పొక్కేసింది.మరి ‘వాట్ డు యు థింక్’ అని మేమడిగితే.. బోలెడు విషయాలు బోల్డుగా చెప్పింది. తెలుగు సినిమా షూటింగ్స్‌లో లేరు కానీ ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారు? రకుల్: అవును. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మర్జావాన్’ అనే సినిమా చేస్తున్నాను. అజయ్ దేవగన్‌తో ‘దే దే ప్యార్ దే’ పూర్తి చేశాను. ఈ సినిమాకి 80 రోజులు వర్కింగ్ డేస్ ఇచ్చాను. తమిళంలో కార్తీతో చేసిన ‘దేవ్’ వేలంటైన్స్ డేకు రిలీజ్ అవుతుంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతుంది. అలాగే సూర్యగారితో ‘ఎన్జీకే’ పూర్తి చేశా. సమ్మర్లో ఈ సినిమా వస్తుంది. తెలుగులో కమిట్ అయిన ‘వెంకీమామ’ íసినిమా షూటింగ్ త్వరలో ఆరంభం అవుతుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో కూడా ఓ సినిమా ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి. హిందీ, తమిళ సినిమాలు చేయడంవల్ల తెలుగు సినిమాలు ఒప్పుకునే వీల్లేకుండా పోయింది. అయితే ఈ ఇయర్ తెలుగు రిలీజ్లుంటాయి. తెలుగు ప్రేక్షకులకు లాస్ట్ ఇయర్ మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉంది. మీక్కూడా ఉందా? కెరీర్ ఆరంభించిన ఈ ఐదారేళ్లలో వరుసగా నాలుగేళ్లు నావి 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్లు లేవు. ప్రతి ఏడాదీ నన్ను ఎక్కువ సినిమాల్లో చూసి ఒక్క ఏడాది లేకపోవడంతో మిస్సయిన ఫీలింగ్ కలగడం సహజం. తెలుగు సినిమాలు చేయకపోయినా నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఎంత ప్రేముంటే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నానో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్గా నాకో గుర్తింపు, గౌరవం అన్నీ తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చాయి. తెలుగుని మాత్రం వదలను. ప్రేక్షకులు చూసినన్ని రోజులు చేస్తూనే ఉంటా. ‘బాహుబలి’ లాంటి సినిమాలను వదిలేస్తే జనరల్‌గా ఒక రెగ్యులర్ సినిమాకి హీరోయిన్ ఇచ్చే డేట్స్ 40, 50 రోజుల్లోపే ఉంటాయి. ‘దే దే ప్యార్..’కి 80 రోజులిచ్చారంటే ఆ సినిమా స్పెషాల్టీ ఏంటి? నా కెరీర్లో ఎక్కువ వర్కింగ్ డేస్ ఈ సినిమాకే ఇచ్చాను. ఆల్రెడీ పెళ్లయిన కథానాయకుడు తనకంటే చాలా చిన్న అమ్మాయిని ప్రేమించే లవ్‌స్టోరీ ఇది. డిఫరెంట్‌గా ఉంటుంది. పైగా ముంబైలో స్టైల్ వేరే ఉంటుంది. స్క్రిప్ట్ చదవడం, రిహార్సల్స్ చేయడం వంటి వాటికి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అందుకోసం వర్కింగ్ డేస్ పెరుగుతాయి. ప్లస్ ఇదొక డిఫరెంట్ మూవీ కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది. బాలీవుడ్లో కొంచెం ఇన్‌సెక్యూర్‌గా అనిపిస్తుందని ఇక్కడ సినిమాలు చేసి అక్కడికెళ్లిన ఓ హీరోయిన్ అన్నారు. మీకేమైనా అభద్రతాభావం? కచ్చితంగా ప్రెషర్ అయితే ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైనా మన మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడి సినిమాలకు ఎంత కష్టపడతానో హిందీ సినిమాలకూ అంతే కష్టపడతాను. బాలీవుడ్ కదా.. ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అనుకోను. ఎక్కడికెళ్లినా కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకది ఎక్కువ. నా పని మీద నాకు నమ్మకం ఎక్కువ. అందుకే హిందీకి వెళ్లినప్పుడు ఏమీ అనిపించలేదు. ఆత్మవిశ్వాసం లేకపోతే సౌత్‌లోనూ అభద్రతాభావం అనిపించొచ్చు. బాలీవుడ్లో ముఖ్యంగా ‘ఫిజిక్’కి ప్రాధాన్యం ఇస్తారు. మీ ఫిజిక్ అటు నార్త్‌కు కూడా సూట్ అయ్యేలా ఉంటుంది కాబట్టి మీ కాన్ఫిడెన్స్‌కి అదొక కారణమా? ఫిజిక్‌తో ఏం సంబంధం లేదు. నేను సన్నగా ఉన్నాను.. అందుకే కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతున్నాను అనుకుంటే తప్పు. మన పని మనం సక్రమంగా చేయాలి. వర్క్‌లో బెస్ట్ అయితే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మన ఫిజిక్ ఎలా ఉండాలనేది మన చాయిస్. ఈ మధ్య వెయిట్ తగ్గాను. ‘దే దే ప్యార్ దే’ కోసం కొంచెం పెరిగాను. స్క్రిప్ట్ బావుండి వెయిట్ పెరగాలంటే పెరుగుతాను. తగ్గాలంటే తగ్గుతా. అదే కదా యాక్టర్ జాబ్. ఓ 20–30 కేజీలు పెరగమంటే పెరుగుతారా? 30 అయితే వద్దు (నవ్వుతూ) అది ఆరోగ్యకరం కూడా కాదు. 20 కూడా సేఫ్ కాదు. అంత పెరిగి మళ్లీ నార్మల్‌కి రావాలంటే ఈజీగా సంవత్సరం పడుతుంది. 10 కేజీల వరకూ ఓకే. అంతకన్నా బరువు పెరగాలంటే ఎలాగూ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ ఉండనే ఉంది. దాంతో లావుగా కనిపించేలా చేయొచ్చు. లేదా బట్టల ద్వారా కూడా మేనేజ్ చేయొచ్చు. అంతేకానీ 20, 30 కేజీలు బరువు పెరిగితే వేరే సినిమాల కోసం వెంటనే బరువు తగ్గాల్సి వస్తుంది. అప్పుడు ఏదేదో చేసేసి అర్జంటుగా తగ్గితే ఆరోగ్యానికి నష్టం. మీరిలా సన్నగా ఉండటంతో ‘ఇది హెల్దీ కాదు.. కడుపు మాడ్చుకోవద్దు’ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దానికేమంటారు? నేనవి చదవను. సోషల్ మీడియాలో పాజిటివ్, నెగటివ్ రెండూ ఉంటాయి. నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. లేకపోతే ఫాలో అవ్వకండి అనుకుంటాను. నేను మీరేం తింటున్నారు? ఏం చేస్తున్నారు అని ఎవరినీ అడగడంలేదు. ఉచిత సలహాలు ఇవ్వడంలేదు. నా లైఫ్ నా ఇష్టం. నేనేం తినాలి? ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలి? బరువు ఎంత ఉండాలి? అనేది నా ఇష్టం. అయితే నా వర్క్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. నా సినిమాల ఎంపిక విషయంలో సలహాలు ఇవ్వండి. తీసుకుని ఇంకా బెటర్‌గా వర్క్ చేస్తాను. మంచి పాత్రలు చేయడం లేదని, చేస్తుందని చెప్పండి. అవి చదువుతాను, పాటిస్తాను. కానీ ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏం తినాలి? ఎలాంటి వర్కవుట్స్ చేయాలని సలహాలు ఇవ్వొద్దు. అవి చదవను. పొరపాటున చదివినా పాటించను. ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో నా ఇష్టం అన్నారు. ఈ మధ్య మీరు కారులోంచి దిగుతున్న ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టి, ‘రకుల్ ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది’ అని కామెంట్ చేశారు. ఏమంటారు? ఇప్పటివరకూ వచ్చిన నెగటివ్ ట్వీట్స్‌ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈసారి పట్టించుకున్నాను. ఈ ప్యాంట్ కామెంట్ వచ్చిన ముందు రోజు నేనో ఈవెంట్‌కి వెళ్లాను. స్త్రీ సమానత్వం గురించిన కార్యక్రమం అది. ఆడవాళ్లు ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుంటుంది? అనేదాని గురించి అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ మర్నాడు కారులోంచి దిగినప్పుడు ఎవరో ఫొటో తీశారు. యాక్చువల్‌గా నేను వేసుకున్న జాకెట్ నా షార్ట్స్‌ని కవర్ చేసింది. అందుకని ఆ జాకెట్ మాత్రమే వేసుకున్నానని అనుకున్నారు. షార్ట్ కనిపించేలా ఉన్న ఫొటోలన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఫొటోలను వదిలేసి వేరేవి పెట్టి, చెత్త కామెంట్ రాశారు. ఒళ్లు మండిపోయింది. మీ డ్రెస్ గురించి మాత్రమే కాకుండా ‘కారులో ఎవరితో.... (రాయకూడని పదం), సిగ్గు లేదా? ప్యాంటు కూడా లేకుండా బయటకు వచ్చావు? అని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేస్తే, అతని తల్లిని ప్రస్తావిస్తూ మీరు స్పందించడాన్ని కొందరు విమర్శించడం గురించి? ‘మీ తల్లి కార్లో అలాంటి పనులు ఎక్కువ చేస్తారనుకుంటా. అందుకే నువ్వు ఎక్స్పర్ట్ అయ్యావు. ఆ తల్లి నీకు కొంచెం బుద్ధి ఇచ్చుంటే బావుండేది. నీలాంటి వాళ్లు ఉన్నంత వరకూ మహిళలకు రక్షణ లేదు. ఊరికే సమానత్వం గురించి, రక్షణ గురించి డిబేట్లు పెట్టడం వల్ల ఏ మంచీ జరగదు’ అనే విధంగా సమాధానం ఇచ్చాను. అతగాడి కామెంట్‌కి నేను ఓ నటిగా సమాధానం ఇవ్వలేదు.. ఓ అమ్మాయిలా స్పందించాను. యాక్టర్ రకుల్‌గా రిప్లై ఇచ్చి ఉంటే పొలిటికల్‌గా కరెక్ట్‌గా మాట్లాడాలి అనుకునేదాన్ని. కానీ అక్కడ ఓ అమ్మాయిలా నా కోపాన్ని వ్యక్తపరిచాను. తమ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ల గురించి ఎవరైనా ఎలా పడితే అలా కామెంట్ చేస్తే వాళ్లకు ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్లు కూల్‌గా రియాక్ట్ అవుతారా? లేకపోతే వాళ్ల భాషలోనే చెబుతారా? అప్పటికప్పుడు ఏమనిపించిందో అది అనేస్తారు కదా. నేను కూడా అంతే. అయితే కొంచెం బెటర్‌గా చెప్పి ఉండొచ్చు కానీ అప్పుడు బాగా అప్సెట్ అయ్యాను. ఆ మూమెంట్లో అలా అనిపించింది. వాళ్లింటి ఆడవాళ్లను కామెంట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో వేరే ఆడవాళ్లకూ అంత బాధ ఉంటుందని తెలియాలి కదా. వాళ్లకూ ఓ ఫ్యామిలీ ఉంటుందని గుర్తు చేయడానికే అలా అన్నాను. నా కామెంట్‌ని విమర్శించేవాళ్లు నా గురించి ఘోరంగా కామెంట్ చేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? బట్టలను బట్టి ‘ఈ అమ్మాయి ఈ టైప్’ అని జడ్జ్ చేయడం కరెక్టేనంటారా? అస్సలు కాదు. ఎవరికి ఎలా సౌకర్యంగా అనిపిస్తే అలా బట్టలు వేసుకుంటారు. చిన్న బట్టలు వేసుకున్నవాళ్లు అదో టైప్ అనలేం. అయినా మన సమాజంలో చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిలను మాత్రమే కామెంట్ చేస్తున్నారా? చీర కట్టుకున్నవాళ్లనూ వదిలి పెట్టడంలేదు కదా. మారుమూల గ్రామాల్లో ఒంటి నిండా చీర కట్టుకుంటారు. అక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. సమస్య బట్టలది కాదు. ఆలోచనలది. ఆలోచనలో మార్పు రావాలి. నేను స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యేసరికి అతను అకౌంట్‌ని డిలీట్ చేశాడు. ఇలాంటి ఆకతాయిలను శిక్షించాలి. రేపు వీళ్లే రేపిస్టులు అవుతారు. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి అనేది ఇంట్లో నేర్పించాలి. అమ్మాయి, అబ్బాయి ఒకటే అని నేర్పించాలి. అప్పుడే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయి. హీరోయిన్స్ అంటే కొందరు చిన్న చూపు చూస్తుంటారు. అదేమైనా బాధగా ఉంటుందా? ఎందుకు చూడాలి? మాది కూడా జాబే కదా. మా పర్శనల్ లైఫ్ అనేది పర్శనల్‌గా ఉండదు. మా జీవితంలో ఏం జరుగుతుందో పబ్లిక్‌కి కావాలి. జరుగుతున్నవాటి గురించి మాట్లాడుకుంటారు. జరగనివాటి గురించి చెప్పుకుంటారు. మేం ఏమీ చేయలేం. రోజుకి 18, 20 గంటలు వర్క్ చేస్తాం. నిద్ర ఉండదు. అయినా కూడా సినిమాని ఇష్టపడి వచ్చాం కాబట్టి ఏమీ అనిపించదు. ఇప్పుడు నాక్కూడా చాలామంది యాక్టర్స్ నచ్చరు. కొందరు బాగా నచ్చుతారు. అలాగే నేను అందరికీ నచ్చాలని లేదు. ‘నువ్వు నచ్చలేదు’ అనండి. ఓకే. బాగా నటించలేదు అంటే ఓకే. కానీ వల్గర్‌గా కామెంట్ చేయకూడదు కదా. ఇండస్ట్రీలో మీకెలాంటి అనుభవాలెదురయ్యాయి? అది ఇండస్ట్రీ గురించి కాదు. ప్రపంచం గురించి. ఒక ఇండస్ట్రీని తప్పుబట్టడం కరెక్ట్ కాదు. అన్ని రంగాల్లో ఉంటుంది. 5–10 పర్సెంట్ మగాళ్ల ఆలోచనలు తప్పుగా ఉంటే మన కెరీర్ చాయిస్ తప్పు ఎందుకు అవుతుంది? ఇండస్ట్రీలో చాలామందికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఫేస్ చేయలేదు. అయితే వాళ్లు ధైర్యంగా బయటికి వచ్చి చెప్పినప్పుడు మనం వినాలి. వాళ్లకు ధైర్యం ఇవ్వాలి. అంతేకానీ తప్పు పట్టకూడదు. (కొంచెం ఆవేశంగా). ఓకే కూల్ రకుల్.. లవ్ లైఫ్‌కి వద్దాం. ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? ఫ్యాన్స్వి చాలా వస్తుంటాయి. నేను ప్రేమలో పడకూడదని అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే ప్రేమలో పడలేదు. మా అమ్మ కూడా జోక్ చేస్తుంది. ‘సరే ఇప్పుడంటే బిజీగా ఉన్నావు. కానీ నీకోసం కూడా ఆలోచించుకో. మంచి లైఫ్ పార్టనర్ అవుతాడనిపించే అబ్బాయి ఉంటే చెప్పు. ఇంకో మూడు నాలుగేళ్లల్లో పెళ్లి చేయాలంటే నువ్వు ఎవరో ఒకర్ని ప్రేమించాలి’ అంటుంది. చిన్నప్పుడేమో ప్రేమించొద్దు అంటారు, కానీ ఇప్పుడు ప్రేమించమంటున్నారు? అని సరదాగా అంటుంటాను. సరైన మనిషి దొరకాలి. మీనింగ్‌ఫుల్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నాను. 80 లలో పుట్టి ఉండాలి అనిపిçస్తుంది. అంటే ప్రస్తుతం ప్రేమలో నిజాయితీ ఉండటం లేదంటారా? అలా అని కాదు. నిజాయితీగా ప్రేమించేవాళ్లూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్క సెకన్లో ‘ఐ లవ్ యు’ ఎలా చెబుతున్నారో ‘ఐ హేట్ యు’ అని అలాగే ఒక్క సెకన్లో చెబుతున్నారు. ప్రేమని కొందరు జోక్ చేసేశారు. బ్రేకప్‌కి చాలామంది చెప్పే కారణం ఎవరి ‘స్పేస్’ వారికి దక్కడం లేదు అని. కలిసి బతకాలనుకున్న తర్వాత ఎవరి స్పేస్ వారికి అంటే? ఇద్దరూ కరెక్ట్ అయితే ఎవరి ప్రైవసీని వాళ్లు గౌరవించుకుంటారు. ఎవరి స్పేస్ వారు కోరుకోవడంలో తప్పులేదు. ఒకవేళ నేను రిలేషన్షిప్లో ఉంటే వంద ప్రశ్నలు వేయను. ప్రేమించడమంటే వేరే వ్యక్తిని కంట్రోల్ చేయడం కాదు. మనకు నచ్చిన వ్యక్తిని తనకు నచ్చినట్టు ఉండనివ్వటం. దాన్నే ‘స్పేస్’ ఇవ్వడం అంటారు. అంతవరకూ ఓకే. కానీ జీవిత భాగస్వామికి చెప్పుకోలేనన్ని రహస్యాలు ఉంటేనే ప్రాబ్లమ్. ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోకుండా ఉండి కూడా కంఫర్ట్‌బుల్‌గా ఉండటమే లవ్. మంచి అనుబంధం అంటే ఎవరి డ్రీమ్‌ను వాళ్లు ఫాలో అవుతూ, వాళ్ల జీవితాలని అందంగా తయారు చేసుకోవడమే. ఫైనల్లీ మీకు డ్రీమ్ ఏదైనా? ప్రస్తుతం నా డ్రీమ్‌లోనే ఉన్నాను. యాక్టర్ అవ్వాలన్నది నా కల. అదే కంటిన్యూ చేస్తున్నాను. ఐదారేళ్ల క్రితం మీరు మామూలు అమ్మాయి. ఇప్పుడు సెలబ్రిటీ. మీలో వచ్చిన మార్పు గురించి? అప్పటి రకుల్ ఇప్పటి రకుల్ ఒకటే. పెద్దగా ఏం మారలేదు. సెలబ్రిటీ అంటే ఇలా ఉండాలని కొత్తగా అలవాటు చేసుకున్నది ఏదీ లేదు. కాకపోతే స్క్రీన్ మీద బాగా కనపడాలి కాబట్టి అందం విషయంలో ఆరోగ్యం విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటాం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మారాయి. మైండ్ సెట్ మాత్రం సేమ్. అందరూ 9–5 జాబ్ చేస్తారు. మాకు అలా టైమింగ్స్ ఉండవు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక నేను నార్మలే. నా ఫ్యామిలీ నన్ను నార్మల్‌గా ఉంచుతుంది. నా ఫ్రెండ్స్ కూడా. ఇంకా చెప్పాలంటే ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు పొగరు పెరగకూడదు. దేవుడికి థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. రుణపడి ఉండాలి. దేవుడు మనకు ఇంత ఇస్తుంటే గర్వం చూపించడం దేనికి? అందుకే అందరితో బాగుంటాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాను అనుకోవాలి. అదే మంచిది. డల్ మూమెంట్‌ని ఎవరితో షేర్ చేసుకుంటారు? నాతోనే. డల్‌గా అనిపిస్తే నాకు నేనే ఎనర్జీ ఇచ్చుకుంటాను. నా సొంత ప్రాబ్లమ్స్‌ను వేరే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లను. ఫ్యామిలీని టెన్షన్ పెట్టను. నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటా. సమస్యలు అందరికీ వస్తాయి. అయితే పరిష్కారం లేని సమస్య ఉండదు. డల్ మూమెంట్స్ లేకపోతే గ్రోత్ ఉండదు. కింద పడితేనే పైకి వెళ్లొచ్చు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఒక్క రోజు మాత్రమే. జరిగింది జరిగిపోయింది. ఒకటి బాధపడటం. రెండోది నెక్ట్స్ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనుకుని వెళ్లిపోవడం. అంతే. -
మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసిన రకుల్
ఇటీవల సౌత్ లో కాస్త జోరు తగ్గించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ ఇటీవల అయ్యారితో మరోసారి ఆకట్టుకుంది. తాజాగా మరో బాలీవుడ్ మూవీకి రకుల్ సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మర్జావాన్ సినిమాతో రకుల్ హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ మల్హాత్రాతో రెండో సారి జత కడుతోంది రకుల్. అయ్యారి సినిమాలోనూ వీరిద్దరు జంటగా నటించిన విషయం తెలిసిందే. మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్జావాన్ సినిమాను టీ సిరీస్‌తో కలిసి నిఖిల్ అద్వాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
మెట్రోలో ఎవరుంటారు?
‘బర్ఫీ, జగ్గా జాసుస్’ సినిమాల తర్వాత దర్శకుడు అనురాగ్ బసు రూపొందించబోయే నెక్ట్స్ సినిమా బాలీవుడ్లో ఓ హాట్ టాపిక్. దానికి కారణం అందులో నటించబోయే నటీనటులే. 2007లో అనురాగ్ రూపొందించిన ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’కి సీక్వెల్‌గా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారాయన. ఇందులో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. అలాగే రాజ్ కుమార్ రావ్, నవాజుద్ధిన్ సిద్ధిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. ‘‘భారీ తారాగణం ఉన్నప్పుడు అందరి డేట్స్ సెట్ చేయడం శ్రమతో కూడుకున్న పని. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాం. అందరి క్యాలెండర్ సంవత్సరం పాటు ఖాళీ లేదు. ఫైనలైజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను’’ అన్నారు దర్శకుడు అనురాగ్ బసు. మరి సెకండ్ మెట్రోలో ఎవరెవరు భాగం అవుతారో వేచి చూడాలి. -
ఒక్కటే సమాధానం
ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం చెబుతారు ‘అదుర్స్‌లో ఎన్టీఆర్’. ‘తెలీదు.. గుర్తు లేదు.. మర్చిపోయా’ అన్నదే ఆ సమాధానం. ఇప్పుడు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ కూడా అదే స్టైల్లో తమ రిలేషన్షిప్ గురించి ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం చెబుతున్నారు. సిద్ధు, కియారా రిలేషన్షిప్లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్. మీరు రిలేషన్లో ఉన్నారంట కదా? అనే ప్రశ్నను ఈ ఇద్దరి ముందు ఉంచితే – ‘‘నేను మాత్రం ప్రస్తుతం నా వర్క్‌తో రిలేషన్షిప్లో ఉన్నాను. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే మీకే చెబుతాను’’ అంటున్నారు కియారా అద్వానీ. విచిత్రంగా సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. ‘‘ప్రస్తుతం నేను నా వర్క్‌తోనే రిలేషన్లో ఉన్నాను. మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టేంత ఖాళీ కూడా లేదు’’ అంటున్నారు. ఏమీ లేదన్న విషయాన్ని కూడా ఒకేలా అనడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. మరి వీళ్ల సమాధానాలు కాకతాళీయమా? అన్నదానికి సమాధానం కాలమే డిసైడ్ చేస్తుంది. -
ఆ సినిమాను మిస్ కాకండి: ఆమిర్‌ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్‌కు ఏదైనా నచ్చితే వెంటనే స్పందిస్తాడు. తాజాగా రాణిముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్కి’ చిత్రంపై ట్వీట్ చేశాడు. సినిమాను మిస్ కాకండి ఇలాంటి చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి అని పోస్ట్ చేశాడు. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిగా, యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను వీక్షించిన ఆమిర్ ట్విటర్లో స్పందిస్తూ..‘చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూశాను. గొప్ప కథ, అద్భుత నటన, సూపర్ సినిమా, ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఉంది. అదే హిచ్కి సినిమా. దయచేసి ఈ సినిమాను మిస్ కాకండి. రాణీ, సిద్దార్థ్, నీరజ్ కబి, చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు. pic.twitter.com/2oBbHjg2cS — Aamir Khan (@aamir_khan) March 22, 2018 -
పార్టీకి తయార్
కాలేజీ స్టూడెంట్‌గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థ్ మల్హోత్రా. అదేనండీ.. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా సిద్ధార్థ్ సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం అయ్యారని చెబుతున్నాం. ఆల్మోస్ట్ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ స్టూడెంట్‌గా క్లాస్‌రూమ్‌కి వెళ్లేందుకు సిద్ధార్థ్ చర్చలు జరుపుతున్నాడని బీటౌన్ టాక్. అంతేకాదు సిద్ధార్థ్‌తో పాటు సినిమాలో ఉండబోయే గ్యాంగ్ మెంబర్స్ అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ ఆడిషన్స్‌ను కూడా స్టార్ట్ చేశారట. మరి.. కాలేజీలో గ్యాంగ్‌ని మెయిన్టైన్ చేస్తారు కదా. కన్నడ సూపర్ హిట్ ‘కిర్రిక్ పార్టీ’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు నటించబోయే స్టూడెంట్స్ కోసం అడ్మిషన్స్.. అదేనండీ.. సెలెక్షన్స్ ఓపెన్ అన్నమాట. ‘కిర్రిక్ పారీ’్ట హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న అజయ్‌కపూర్ ఆల్రెడీ సిద్ధార్థ్‌తో మాట్లాడారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ‘కిర్రిక్ పార్టీ’ తెలుగులో నిఖిల్ హీరోగా ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ అయింది. ఇందులో సిమ్రన్, సంయుక్తా హెగ్డే కీలక పాత్రలు చేశారు. -
అతనితో బ్రేకప్?
గాసిప్ బాలీవుడ్లో ప్రేమజంటలకు ఏమైంది? ఇప్పుడు గాసిప్ రాయుళ్లకు క్రేజీ టాపిక్. రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కేస్తామంటూ ఊరించిన రణ్‌బీర్-కత్రినాకైఫ్‌లు బ్రేకప్ చెప్పేసుకుని విడిపోతే, ఆ తర్వాత అనుష్కా శర్మ-విరాట్ కొహ్లీలు కూడా వారి బాటనే అనుసరించారు. ఇప్పుడీ లిస్ట్‌లో ఆలియా భట్-సిద్ధార్థ మల్హోత్రాలు చేరనున్నారనే వార్త బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంతో ఒకేసారి తెరంగేట్రం చేసిన ఆలియా భట్, సిద్ధార్థ మల్హోత్రాల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఇప్పటికే హిందీ పరిశ్రమ వర్గాలు కోడైకూస్తున్నాయి. అయితే, తాజా ఖబర్ ఏంటంటే, ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా మాటల్లేవట. ఎందుకంటే, ఇటీవల జరిగిన ఓ పార్టీలో ఆలియా మాజీ ప్రేమికుడు ఆమెతో క్లోజ్‌గా మూవ్ కావడం సిద్ధార్థకు నచ్చలేదనీ, ఆ కారణంతో అతనితో గొడవ కూడా పెట్టుకున్నాడట. ఆ కోపంతోనే సిద్ధార్థతో ఆలియా మునుపటిలా మాట్లాడటం లేదనీ, ఇటీవల సిద్ధార్థ ఇచ్చిన పార్టీకి కూడా ఆమె హాజరుకాలేదని భోగట్టా. మరి ఫ్యూచర్లో ఏమవుతుందో ఏంటో మరి! -
'అవును.. అతడిని లవ్ చేస్తున్నా'
ముంబై: సహనటుడు సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమిస్తున్నట్టు బాలీవుడ్ యువనటి అలియా భట్ వెల్లడించింది. తామిందరం ప్రేమించుకుంటున్నామని స్పష్టం చేసింది. 'మా గురించి బయట చాలా రకాల కథలు విన్పిస్తున్నాయి. అవును నిజమే. అతడిని ప్రేమిస్తున్నాను. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదు. అతడితో కలిసి షూటింగ్ లో పాల్గొనడం మంచి అనుభూతి' అని అలియా భట్ కుండబద్దలు కొట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు గతంలో పరోక్షంగా వెల్లడించించింది. 'కపూర్ అండ్ సన్స్' ప్రచారం భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తన మనసులోని మాటను వెల్లడించింది. తనకు కుడిపైపున వ్యక్తిని ప్రేమిస్తున్నానని తెలిపింది. ఆమెకు కుడివైపున సిద్ధార్థ్ కూర్చుని ఉన్నాడు. ఆమెకు ఎడమ వైపున ఫవద్ ఖాన్ కూర్చొన్నాడు. అలియా భట్ పై ట్విటర్ లో కమల్ ఆర్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సిద్దార్థ్ తీవ్రంగా స్పందించాడు. మహిళలపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించబోనని స్పష్టం చేశాడు. సిద్దార్థ్, అలియా భట్ నటించిన 'కపూర్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. -
విన్నారా...?
సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్ లవ్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తుంటాయి. ఊతం ఇస్తూ ఇద్దరూ జాయింట్‌గా పార్టీల్లో కనిపిస్తారు. దీపావళికి హీరో అక్షయ్‌కుమార్ ఇచ్చిన పార్టీకి కూడా ఇద్దరూ జాయింట్‌గానే వెళ్లాలనుకున్నారట. కట్ చేస్తే.. ఒక డ్రెస్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని టాక్.సిద్ధార్థ్ ఒంటరిగానే పార్టీకి వెళ్లారట. ఆలియా వెళ్లలేదట! -
'రానా... నిన్ను మించిన విలన్ లేడు'
ముంబై: 'బాహుబలి' సినిమాపై బాలీవుడ్ నటులు ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్రసీమ గర్వపడే సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమా అద్భుతంగా ఉందని నటుడు జాకీ భగ్నానీ ట్వీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' మైలురాయి అని సిద్ధార్థ్ మల్హోత్రా పేర్కొన్నారు. రాజమౌళి బాగా తీశారని కితాబిచ్చారు. ప్రతినాయక పాత్రలో తన స్నేహితుడు దగ్గుబాటి రానా ఇరగదీశాడని మెచ్చుకున్నారు. 'నిన్ను మించిన విలన్ లేడని' ప్రశంసించారు. సినిమా యూనిట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనబడుతోందన్నారు. 'ఈరోజు బహుబలి రోజు' అంటూ నటుడు ఆశిష్ శర్మ ట్వీట్ చేశారు. డినో మోరియా, సంజయ్ కపూర్, గౌరీ ఖాన్, తుషార్ కపూర్, విక్రమాదిత్య మెత్వానీ, సిద్ధార్థరాయ్ కపూర్ తదితరులు రిలీజ్ రోజునే 'బాహుబలి' వీక్షించారు. @RanaDaggubati there can't be a hotter villain than u ever. Kudos to u my friend. Each department pure genius actors,technicians #Bahubali — siddharth malhotra (@sidpmalhotra) July 9, 2015 -
ఆలియాకి పెళ్లైపోయిందా!
గాసిప్ అయితే సినిమాలతో... లేదంటే పాటలతో న్యూస్‌లో ఉండే ఆలియాభట్... తాజాగా ఓ ఊహించని విషయానికి వార్తల్లోకొచ్చింది. ఉన్నట్టుండి పలు వెబ్సైట్లలో ఆమె పెళ్లి ఫొటో ప్రత్యక్షమవడంతో వార్తల్లోని వ్యక్తి అయిపోయింది. పెళ్లిదుస్తులు ధరించి, సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో పాటు కారులో వెళ్తోన్న ఆ ఫొటోని చూసి ఆమె అభిమానులంతా అవాక్కయ్యారు. అసలే ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని రూమర్ కూడా ఉందేమో, వాళ్లు పెళ్లిగానీ చేసేసుకున్నారా అని సందేహపడ్డారు. అయితే అది నిజమైన పెళ్లి కాదని, కోకో కోలా యాడ్‌లోని షాట్ అని తెలిసి ఆనక ఊపిరి పీల్చుకున్నారు. -
నువ్వెక్కడుంటే నేనక్కడ!
బాలీవుడ్లో హాట్ పెయిర్ అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా. ఎక్కడ చూసినా ఇద్దరూ జంటగా కనిపిస్తున్నా... అది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమేనంటూ దాటవేస్తున్నారు. లేట్‌నైట్ పార్టీలు, బర్త్‌డే బ్యాష్లు... ఇలా ఒకటేమిటి... నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అంటూ ఒకర్ని వదిలి ఒకరు ఉండలేనంతగా కెమిస్ట్రీ నడుస్తోంది వీరిద్దరి మధ్య! రీసెంట్గా ఓ టీవీ చానల్ నిర్వహించిన పార్టీలో ఈ తారలిద్దరూ దర్శనమిచ్చారట. అయితే ఒకర్ని ఒకరు కలవకుండానే వెళ్లిపోయారట! ముందుగా దర్శకుడు కరణ్ జోహార్‌తో అలియా వచ్చింది. మరో పావుగంటలో సిద్ధార్థ్ వస్తాడనేది అప్పటికున్న సమాచారం. అయితే గంటలు గడిచినా జతగాడు రాకపోయే సరికి చికాగ్గా వెళ్లిపోయిందట ముద్దుగుమ్మ. సరిగ్గా అమ్మడు ఎగ్జిట్ అయిన పదిహేను నిమిషాల తరువాత సిద్ధార్థ్ ఎంట్రీ ఇచ్చాడట! -
జనం ఓటేసిన జంట
బాలీవుడ్లో క్యూటెస్ట్ కపుల్‌గా సిద్ధార్ధ మల్హోత్రా, ఆలియాభట్ జంట ఎంపికయ్యారు. ఓ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది నెటిజన్లు ఈ జంటకే ఓటేశారు. తరువాతి స్థానాల్లో ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్, విరాట్ కోహ్లి-అనుష్కశర్మల జోడీ ఉన్నారు. -
కిస్.. టేస్ట్‌లెస్
...ఎక్కడో అక్కడ ఆ అవకాశం వస్తే చాలు... అదే పదివేలని ఎదురుచూసే రసికులెందర్నో చూశాం కానీ... ఇదేంటి... ఈ కుర్రోడు.. సిద్ధార్థ్ మల్హోత్రా..! ‘ఆన్‌స్క్రీన్ కిస్‌లో కిక్కే లేదు... ఆల్జీబ్రా లెక్కలు తప్ప’ అంటున్నాడు..! మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్‌కు మరో పేరు కూడా ఉంది... ‘చాక్లెట్ బాయ్’, ఇంకా ఆ స్థాయి నుంచి ఈ ‘బొద్దు’బాయ్ ఎదిగినట్టు లేడంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. -
ఇంతలో అంత ప్రమాదం!
గులాబీ రేకంత సున్నితంగా కనిపిస్తారు శ్రద్ధాకపూర్. ఈ సుకుమారికి ఇటీవల ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఏక్ విలన్’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా ద్విచక్ర వాహనం నడిపే ఓ సన్నివేశం ఉంది. సినిమాకి ఆ సీన్ కీలకం కాబట్టి, బైక్ నడపడం నేర్చుకుని, షూటింగ్‌కి సిద్ధపడ్డారామె. సన్నివేశంలో భాగంగా చిత్రకథానాయకుడు సిద్ధార్ధ్ మల్హోత్రా వాహనాన్ని శ్రద్ధా వెంబడించాలి. సిద్ధార్ధ్ తన బుల్లెట్ మీద కూర్చుని షాట్‌కి రెడీ అయ్యారు. శ్రద్ధా కూడా తన వాహనం మీద కూర్చున్నారు. దర్శకుడు మోహిత్ సూరి ‘స్టార్ట్ కెమెరా...’ అనగానే శ్రద్ధా బైక్ స్టార్ట్ చేశారు. సిద్ధార్ధ్ వాహనాన్ని వెంబడించాలి కాబట్టి, యాక్సిలరేటర్‌ని బలంగా నొక్కారు. ఆ వేగానికి బైక్‌ని నియంత్రించలేకపోయారు శ్రద్ధా. దాంతో వాహనం స్కిడ్ అవ్వడం, శ్రద్ధా కిందపడటం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈ బ్యూటీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, శరీరం మీద అక్కడక్కడా చిన్నపాటి గాయాలయ్యాయి. చిత్రబృందం వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అనుకోని ఈ సంఘటన వల్ల దాదాపు గంట సేపు షూటింగ్ ఆపేశారు. ఆ గంటలోపు శ్రద్ధా తేరుకున్నారు. ‘అమ్మో భయం..’ అనకుండా ఈ చిత్రీకరణలో పాల్గొని, విజయవంతంగా పూర్తి చేశారు. -
సిద్ధార్థ్ ప్రేమపాఠాలు
కొత్త నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కరీనా కపూర్‌ఖాన్, దీపికా పదుకొణే అంటే చాలా ఇష్టమట. తెరపై వాళ్లతో నటించడానికి ముందే ఇద్దరినీ ఆకర్షిస్తానని చెబుతున్నాడు. ‘దీపిక చాలా ఆసక్తికర యువతి. చాలా అందంగా ఉంటుంది కూడా. మోడల్‌గా పనిచేసినప్పటి నుంచే ఆమెతో పరిచయం. అయితే ఆమెతో మాట్లాడి చాలా కాలమయింది. దీపికను కలుసుకొని ఆకర్షించేందుకు ప్రయత్నించడం చాలా సరదాగా ఉంటుంది. ఇందుకు ముందే కాస్త సాధన చేయాలేమో! కరీనాకు కూడా నేను వీరాభిమానిని. తెరపైనా, బయటా ఎంతో సరదాగా ఉంటుంది. ఆమె ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమెతో రొమాన్స్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది’ అని సిద్ధార్థ్ వివరించాడు. కరణ్ జోహార్ తీసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తెరపైకి వచ్చిన ఈ యువహీరో తాజా సినిమా హసీ తో ఫసీ. పరిణీతి చోప్రా ఇందులో హీరోయిన్. ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ ఏ రంగంలోని అమ్మాయిని అయినా ఆకర్షించాలంటే (ఇంప్రెస్) చాలా కష్టపడాల్సి ఉంటుందని, ఆమె నవ్వితేనే ‘పడిపోయినట్టు’ కాదంటూ చమత్కరించాడు. ఆడవాళ్ల ఇష్టాయిష్టాల గురించి పూర్తిగా తెలిసుంటేనే ఆకర్షించడం సాధ్యపడుతుందంటూ యువతకు సలహా ఇచ్చాడు. ‘ఈ విషయంలో కొందరు చాలా హుషారుగా ఉంటారు. కొందరేమో ముద్దుపప్పులా ప్రవర్తిస్తారు. ఒక్కో యువతి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి వాళ్లను ఆకర్షించడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఏదీ ఉండదు’ అంటూ ప్రేమపాఠాలు చెప్పాడు. హసీ తో ఫసీ తరువాత సిద్ధార్థ్‌కు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా ముంబై మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుందని కాబట్టి సరదాగా ఉంటుందని, గ్లామర్ పాళ్లు తక్కువగాఉంటాయని సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పాడు. హసీ తో ఫసీ ఈ శుక్రవారం విడుదలవుతోంది.