ఇబ్బందుల్లో ‘షేర్షా’ మూవీ.. బ్రాడ్‌ క్యాస్టింగ్‌ ఆపాలంటూ కేసు | Shershaah lands in trouble as Kashmiri journalist alleges legal action against makers | Sakshi
Sakshi News home page

Shershaah Movie: ఇబ్బందుల్లో ‘షేర్షా’ మూవీ.. బ్రాడ్‌ క్యాస్టింగ్‌ ఆపాలంటూ కేసు

Published Sun, Oct 3 2021 2:34 PM | Last Updated on Sun, Oct 3 2021 2:35 PM

Shershaah lands in trouble as Kashmiri journalist alleges legal action against makers - Sakshi

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన 'షేర్షా' చిత్రం ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సినిమా బ్రాడి కాస్టింగ్‌ని ఆపేయాలంటూ ఓ కాశ్మీరీ జర్నలిస్ట్‌ ఫరాజ్ అష్రఫ్ కేసు వేయనున్నాడు. 

‘షెర్షా’ మూవీలో మిలిటెంట్స్‌ వాడినట్లు ఓ కారు నంబర్‌ను చూపించారు. అది తన కారు నంబరు అని, తన పర్మిషన్‌ లేకుండా మూవీలో మేకర్స్‌ వాడేశారని ఫరాజ్ అష్రఫ్ తెలిపాడు. ఆ కారులో ప్రయాణించాలంటే భయపడుతున్నట్లు, తన ఫ్యామిలీకి ముప్పు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సినిమా బ్రాడ్‌కాస్టింగ్‌ని ఆపేయాలని మూవీ మేకర్‌ ధర్మ మూవీస్‌, ధర్మ టు పాయింట్‌ ఓపై కేసు ఫైల్‌ చేయనున్నట్లు పేర్కొన్నాడు.

చదవండి: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్‌.. జయహో అంటున్న ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement