పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన కియారా, ఏమన్నదంటే.. | Kiara Advani Intresting Comments On Marraige At Jug Juh Jiyo Trailer Event | Sakshi
Sakshi News home page

Kiara Adavani: నేను బాగానే సెటిల్‌ అయ్యాను, పెళ్లి అవసరమా?

Published Tue, May 24 2022 6:51 PM | Last Updated on Tue, May 24 2022 10:01 PM

Kiara Advani Intresting Comments On Marraige At Jug Juh Jiyo Trailer Event - Sakshi

Kiara Advani Intresting Comments On Marraige: భరత్‌ అనే నేను మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ. అటూ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె చేతి పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు పాన్‌ ఇండియా మూవీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె నటించిన భూల్ భులయ్యా-2’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే తన తదుపరి మూవీ జగ్‌ జగ్‌ జియో చిత్రం కూడా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల  సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా వరుణ్‌ ధావన్‌ సరసన నటించింది.

చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్‌

ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో కియారాకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్‌అవుతారని ఓ విలేఖరి ప్రశ్నించగా దీనిపై కియారా ఆసక్తిగా స్పందించింది. ‘పెళ్లి చేసుకోకపోయిన నేను బాగానే సెటిల్‌ అయ్యాను. సెటిల్‌ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పని చేస్తున్నా. బాగా సంపాదిస్తున్నా. హ్యాపీగా ఉన్నాను. సెటిల్‌ అవ్వడమంటే ఇదే కదా’ అంటూ కియారా సమాధానం ఇచ్చింది. కాగా బాలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా కొంతకాలంగా  రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్న క్రమంలో కియారా పెళ్లిపై ఇలా స్పందించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా కియార ప్రస్తుతం తెలుగులో రామ్‌ చరణ్‌ సరసన ఆర్‌సీ15లో నటిస్తోంది. 

చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement