Kiara Advani-Sidharth Malhotra Wedding Date and Venue Revealed - Sakshi
Sakshi News home page

Kiara Advani -Sidharth Malhotra : సిద్‌-కియారాల పెళ్లి వేడుక ఫిక్స్‌..  గెస్టులు ఎవరో తెలుసా?

Published Thu, Feb 2 2023 11:09 AM | Last Updated on Thu, Feb 2 2023 4:28 PM

Kiara Advani And Sidharth Malhotra Wedding Date And Venue Revealed - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 6న సిద్‌-కియారాల వివాహం జరగనుందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది.

పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ, రాజస్థాన్‌లోని జైస‌ల్మేర్ ఫోర్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని, ఓ ప్రైవేట్‌ జెట్‌లో వీరు రాజస్థాన్‌ చేరుకుంటారని సమాచారం.

కరణ్‌ జోహార్‌, షాహిద్‌  కపూర్‌, మనీష్‌ మల్హొత్రా సహా సిద్‌-కియారాల పెళ్లికి వచ్చే బాలీవుడ్‌ సెలబ్రిటీల లిస్ట్‌ ఇప్పటికే బయటకు వచ్చేసింది. కాగా షేర్షా మూవీలో తొలిసారి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement