Jaisalmer
-
భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ
దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్‌కుమార్‌గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బీఎస్ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్‌ను రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్‌గఢ్ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్‌గఢ్ నుండి జోధ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్‌గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్
జైపూర్: రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్‌లోని ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. జెట్ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు. One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been constituted to find out the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 12, 2024 -
ఐపీఎస్‌ను పెళ్లాడిన టీనా దాబి సోదరి.. ఐఏఎస్ భార్య కోసం కేడర్ మార్పు..
ఐఏఎస్ అధికారి, యూపీఎస్సీ టాపర్ టీనా దాబి సోదరి ఐఏఎస్ రియా దాబి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్‌తో ఏడడుగులు వేశారు. కాగా మనిష్ కుమార్, రియా దాబిలు కుటుంబ సభ్యుల అనుమతితో ఏప్రిల్ నెలలోనే కోర్టు వివాహం చేసుకున్నారు. అంటే వీరి పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుంది. అయితే మనీష్ కుమార్ కేడర్‌ను మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మారుస్తూ హోం మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక రియా దాబి ఆమె భర్త ఐపీఎస్ మనీష్ కుమార్ ఇద్దరూ 2020 యూపీఎస్సీ బ్యాచ్‌కు చెందిన వారే. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె 15వ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని అల్వార్‌కు కలెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరికి ముస్సోరీలోని శిక్షణా అకాడమీలో పరిచయం ఏర్పడగా.. అనంతరం స్నేహం ప్రేమగా మారింది. అయితే రియా రాజస్థాన్ కేడర్ కాగా మనీష్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్. వివాహామనంతరం మనీష్ తన కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకొని..మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మార్చుకున్నారు. చదవండి: బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే! కాగా మనీష్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. బీటెక్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2020 పరీక్షలో 581 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని ఒసామాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు రాజస్థాన్‌కు బదిలీ కానున్నారు. త్వరలోనే వీరు జైపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నారు. కాగా రియా సోదరి టీనా దాబి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దళితురాలిగా రికార్డు సృష్టించింది. సెకండ్ ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రెండేళ్లకే 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది ఐఏఎస్ ప్రదీప్ గావండేను రెండో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
యువతిని ఎత్తుకెళ్లి.. ఎడారిలో రాక్షస వివాహం
యువతితో తన నిశ్చితార్థాన్ని ఆమె కుటుంబ సభ్యులే రద్దు చేశారన్న కోపంతో ఆమెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఈ ఘటన జరిగింది. బాధిత యువతితో నిందితుడు పుష్పందర్ సింగ్‌కు నిశ్చితార్థం కుదిరింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు దాన్ని రద్దు చేశారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు తన స్నేహితులతో కలిసి జూన్ 1న యువతిని ఎడారిలోకి ఎత్తుకెళ్లాడు. ఆమె ఏడుస్తున్నా.. పెళ్లి చేసుకున్నాడు. (హిందు సంప్రదాయం ప్రకారం) ఆ మంట చుట్టూ ఏడుసార్లు తిరిగాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. యువతిని అదే రోజు రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముగ్గుర్ని అరెస్టు చేయగా.. ఒకరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy — Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023 ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్.. చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను షేర్ చేసి.. 'ఇది నిజంగా భయానక ఘటన. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం'అని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఒడిశాలో దారుణం.. ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు మృతి -
కియారా -సిద్ధార్థ్ పెళ్లి.. మూడు రోజుల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
కొత్త ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన బాలీవుడ్ ప్రేమజంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అతిథులతో పాటు దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అతిథులకు రాజస్థానీ వంటకాలను సిద్ధం చేయనున్నారు. సూర్యగఢ్ ప్యాలెస్ కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్‌కు నిలయం. అతిథులకు విలాసవంతమైన హోటల్ గదులు, బెడ్రూమ్లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో వెడ్డింగ్‌కు ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలల్లో మద్యం లేకుండా ఒక్కరోజు ఖరీదు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అక్టోబరు నుంచి మార్చి వరకైతే రోజుకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు. రూ.8 నుంచి 10 కోట్ల ఖర్చు సిద్ధార్థ్- కియారాల వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుక ఖర్చు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనుంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలుపితే పెళ్లి ఖర్చు దాదాపు రూ.8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. వీరి పెళ్లి బాలీవుడ్లో అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
ఆ హీరోతో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్!.. రాయల్ వెడ్డింగ్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 6న సిద్-కియారాల వివాహం జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ, రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఫోర్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని, ఓ ప్రైవేట్ జెట్‌లో వీరు రాజస్థాన్ చేరుకుంటారని సమాచారం. కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హొత్రా సహా సిద్-కియారాల పెళ్లికి వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. కాగా షేర్షా మూవీలో తొలిసారి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. -
స్వచ్ఛందం పేరిట వసూళ్ల దందా
ఉదయ్‌పూర్: కన్హయ్యాలాల్ హత్య కేసులో ప్రధాన నిందితులిద్దరికీ దావత్–ఇ–ఇస్లామ్ అనే సంస్థతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ సరిహద్దు జైసల్మేర్, బర్మేర్ ప్రాంతాల్లో ఉగ్రవాద ప్రచార కార్యక్రమాల కోసం స్థానికుల నుంచి విరాళాలను సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నెల క్రితం సుమారు రూ.20 లక్షలను ఇస్లాం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల కోసమంటూ విరాళాలను సేకరించిందని, ఒక రాజకీయ నేత కూడా రూ.2 లక్షలను అందించారని తేల్చాయి. వివరణ కోసం ప్రయత్నించగా ఆ నేత స్పందించడం లేదని తెలిపాయి. నిందితులు జ్యుడీషియల్ కస్టడీకి ఉదయ్‌పూర్‌లో దర్జీని పొట్టనబెట్టుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ప్రధాన నిందితులైన రియాజ్ అఖ్తారీ, గౌస్ మొహమ్మద్‌ల ను భారీ బందోబస్తు మధ్య ఉదయ్‌పూర్ కోర్టుకు తీసుకువచ్చారు. ఐడెంటిఫికేషన్ కోసం కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. కన్హయ్యాలాల్ హత్యను నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో భారీ ర్యాలీ జరిగింది.ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యాలాల్ ఇంటికి సీఎం సీఎం అశోక్ గహ్లోత్ వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.. -
రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్
సాక్షి, జైపూర్: రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో శుక్రవారం మిగ్-21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. అయితే ఇండో-పాక్ బార్డర్ వద్ద ఈ యుద్ధ విమానం కూలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పరిస్థితిని సమీక్షించడానికి రంగంలోకి దిగింది. మిగ్-21 జెట్ సాంకేతిక సమస్యల కారణంగా కూలిందా లేక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. -
జైపూర్ టు జైసల్మేర్
జైపూర్/జైసల్మేర్: ఆగస్ట్ 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలు వైరి పక్షం చేరకుండా, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా, శుక్రవారం తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి ఐదు ప్రత్యేక విమానాల్లో జైసల్మేర్‌కు తరలించారు. వారితో పాటు సీఎం గెహ్లోత్ కూడా ఉన్నారు. దాదాపు 100 మంది వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. జైసల్మేర్‌లోని హోటల్ సూర్య గఢ్‌లో వారికి విడిది కల్పించారు. సచిన్ పైలట్ నేతృత్వంలో 19 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతూ తిరుగుబాటు చేసినప్పటి నుంచి.. గహ్లోత్ తరఫు ఎమ్మెల్యేలంతా జైపూర్ శివార్లలోని ఫెయిర్మాంట్ హోటల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పోలీసులకు నో ఎంట్రీ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన హరియాణాలోని గురుగ్రామ్, మానేసర్‌ల్లోని రిసార్ట్‌ల్లోకి వెళ్లేందుకు శుక్రవారం రాజస్తాన్ అవినీతి నిరోధక విభాగం పోలీసులకు అనుమతి లభించలేదు. ఒక అవినీతి కేసుకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లకు నోటీసులు అందజేయడం కోసం ఏసీబీ ఆ రిసార్ట్‌ల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. సుప్రీంకోర్టులో చీఫ్ విప్ పిటిషన్ సచిన్ పైలట్ నాయకత్వంలోని 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్తాన్ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడంపై బీజేపీ విమర్శ లు చేయడాన్ని సీఎం గహ్లోత్ తప్పుబట్టారు. నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాషాయ పార్టీవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ‘మీరు నలుగురు టీడీపీ ఎంపీలను చేర్చుకోవడం సరైన చర్యే కానీ.. మేం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పా?’అని ట్వీట్ చేశారు. ‘మీకేమైంది? రాత్రింబవళ్లు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వాలను కూల్చే ఆలోచనలే ఎందుకు చేస్తున్నారు?’అని హోం మంత్రి అమిత్‌షాను గహ్లోత్ ప్రశ్నించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైసల్మీర్‌లో సోమవారం అర్థరాత్రి సమయంలో ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ట్రాక్టర్ రెండు ముక్కలుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలుపుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పట్టాలు తప్పిన రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్
రాజస్థాన్ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 బోగీలు పక్కకు ఒరిగాయి. జైసల్మేర్ నుంచి ఖత్గోడం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పాక్ సరిహద్దుల్లో ‘హెలిబోర్న్ ఆపరేషన్’
జైసల్మేర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో, అంతకు రెట్టింపు స్థాయిలో శత్రువును దెబ్బకొట్టేందుకు చేపట్టే కీలక విన్యాసాలను ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లు సంయుక్తంగా చేపట్టాయి. ‘హెలిబోర్న్ ఆపరేషన్’ పేరుతో పాక్ సరిహద్దుకు సమీపంలోని జైసల్మేర్ (రాజస్థాన్) ఎడారి ప్రాంతంలో రెండు రోజులు(ఆది, సోమవారాల్లో) సైనిక పాటవాన్ని పరీక్షించుకుంటున్నారు. యుద్ధ సమయంలో, అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చినప్పుడు సైనిక, వైమానిక బలగాలు ఎలాంటి సమన్వయాన్ని కలిగి ఉండాలి? ఇటువైపు తక్కువ నష్టంతో శత్రువును ఎలా మట్టుపెట్టాలి? లాంటి విన్యాసాలను కృత్రిమ యుద్ధ వాతావరణంలో చేపట్టడంతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థ వినియోగంపై విన్యాసాలు ప్రదర్శించారు. యుద్ధ హెలికాప్టర్లు, సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను కూడా వినియోగించారు. పలువురు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సాగుతోన్న హెలీబోర్న్ ఆపరేషన్ కు సంబంధించిన ఫొటోలు మీకోసం.. -
పాక్ నుంచి ఈసారి ఏమొచ్చిందో తెలుసా?
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో గాలి బుడగులు దుమారం, పావురాల లేఖల కలకలం సద్దుమణగక ముందే మరోసారి కలకలం రేగింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన గద్ద(డేగ) ఈసారి కలవరపాటుకు గురిచేసింది. శిక్షణ పొందిన ఈ గద్దను రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీఎస్ ఎఫ్ అధికారులు దీన్ని పట్టుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో అనూప్ గఢ్ వద్ద దీన్ని బంధించారు. అయితే దీని వద్ద ఎటువంటి ట్రాన్స్ మీటర్, యాంటెనాలు లభ్యం కాలేదని బీఎస్ ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ పక్షిని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ గద్ద సౌదీ షేక్ లకు సంబంధించినదై ఉండొచ్చని బీఎస్ ఎఫ్ వర్గాలు తెలిపాయి. వీటిని పాకిస్థాన్ నుంచి సౌదీ షేక్ లు తెచ్చుకుంటారని వెల్లడించారు. ఇదేవిధంగా అక్టోబర్ 2న పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన పావురాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరిస్తూ ఉర్దూలో రాసిన లేఖను పావురం కాళ్లకు కట్టివుండడాన్ని గమనించారు. గాలి బుడగలకు కట్టిన లేఖలు కూడా పాక్ నుంచి మనదేశంలోకి వచ్చిపడిన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
రహస్య సమాచారం ఉన్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు జైపూర్: భారత్-పాక్ సరిహద్దులో ఉన్న రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హోటల్లో శుక్రవారం ఐఎస్ఐ గూఢచారి అన్న అనుమానంతో పాకిస్తాన్ జాతీయుడు నంద్ లాల్ మేఘ్వాల్ను నిఘావర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. అతణ్ని పాక్‌లోని సంగద్ జిల్లావాసిగా గుర్తించారు. ఈ నెల మొదట్లో వీసా మీద భారత్‌కు వచ్చాడని, అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మెమరీ కార్డులో రక్షణ శాఖకు సంబంధించిన స్థావరాలు, వాహనాల ఫొటోల సమాచారం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రాజస్తాన్ సరిహద్దు నుంచి వివిధ వస్తువులను అక్రమంగా దేశంలోకి తెచ్చి రక్షణ శాఖ సమాచారం సేకరించడానికి వాటిని తక్కువ ధరకు అమ్మేవాడని ఏడీజీ యూఆర్ సాహు పేర్కొన్నారు. నిందితుడు సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసేవాడన్నారు. జోధోపూర్‌కు మాత్రమే వీసా అనుమతి ఉండగా జైసల్మేర్‌లోకి ప్రవేశించి వీసా నిబంధనలను ఉల్లంఘించాడని అడిషనల్ సీఐడీ రాజీవ్ దత్తా చెప్పారు. రాజస్తాన్ హోం మంత్రి గులబ్చంద్ కటారియా మాట్లాడుతూ..నిందితుడు వీసా మీద పలు సార్లు భారత్‌కు వచ్చాడని తెలిపారు. విచారణ చేపట్టడానికి నిందితుడిని జైపూర్ తరలించారు. -
జాబ్ మానేశాడు.. కోటీశ్వరుడయ్యాడు!
జైసల్మేర్: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే కావాలంటూ లక్షల మంది పరుగులు పెడతారు. కానీ, ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఉద్యోగంలో తనకు సంతృప్తి లేదని భావించిన రాజస్థాన్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఏడాదికి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... హరీష్ ధండేవ్ రాజస్థాన్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తండ్రి వ్యవసాయదారుడు. రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కావడంతో ఉద్యోగంతో సంతృప్తి చెందక జాబ్ మానేశాడు. ఓసారి ఢిల్లీకి వెళ్లిన అతడు అక్కడ ఎన్నో విషయాలు చూశానని, అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటున్నాడు. ప్రస్తుతం అతడు తన 120 ఎకరాల పొలంలో అలోవెరా పండిస్తున్నాడు. అలాగని కాస్తా కూస్తో సంపాదిస్తున్నాడనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే హరీష్ వార్షిక ఆదాయం రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్లు. నాటురెలో అగ్రో అనే కంపెనీని స్థాపించాడు. అలోవేరా పండించి పతంజలి ఫుడ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థకు సరఫరా చేస్తున్నాడు. ఆ కంపెనీ వారు అలోవేరా జ్యూస్ తయారీ కోసం హరీష్ నుంచి సరుకు కొనుగోలు చేస్తుంది. తన పంటకుగానూ కోట్ల రూపాయలు ఆర్జించడంతో పాటు మరెందరికో ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. థార్ ఎడారి ప్రాంతంలో వీటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. తన స్వస్థలం, వ్యవసాయక్షేత్రం ఆ సమీప ప్రాంతాల్లోనే ఉండటం కూడా హరీష్ కు కలిసొచ్చింది. అలోవెరాకు దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీగా డిమాండ్ ఉంటుంది. -
ఆవు లెటర్ రాయడం చూశారా!
ఐపూర్/జైసల్మీర్: విద్యాసంస్థలకు రాజకీయ రంగు తప్పడం లేదు. బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో.. మరేదైనా కారణమో.. మొత్తానికి రాజస్థాన్ లో తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి అలాంటి పాఠం పెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావజాలాన్ని వసుంధరా రాజేతో జొప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫొటోలను ముద్రించి.. గోవును తమ తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇందులో ఆ గోవు సంభాషణ విద్యార్థులతో ఎలా ఉందంటే.. 'నా కుమారుల్లారా.. కూతుర్లార.. నేను ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను. తెలివిని ఇస్తాను. సుదీర్ఘ ఆయుష్షును ఇస్తాను. నా గొప్పతనాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. ఎవరు నన్ను తల్లిలాగా భావిస్తారో నేను వారిని నా బిడ్డలుగా భావిస్తాను. నేను పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా మలమూత్రములతో మెడిసిన్, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి. నా సంతానమైన ఎద్దులు మీకు వ్యవసాయంలో సాయం చేస్తాయి. నా వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా మారిపోతుంది' అంటూ లేఖ సాగింది. అయితే, గోవునుంచి పొందే లాభాలపై అవగాహన కల్పించేందుకే ఈ పాఠం పెట్టినట్లు మంత్రి ఓతారామ్ దేవాసి చెప్పారు. -
రుతవి మెహతా... డేంజరస్ రేస్..!
సాహస క్రీడల్లో పాల్గొవాలంటే ఓ దమ్ముండాలి... దానికితోడు ధైర్యం కూడ కావాలి. అంతేకాదు తగిన ప్రోత్సాహం లేకపోయినా వెనక్కు తగ్గాల్సిందే... అదీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పోటీగా గుర్తింపుపొందిన రిక్షా రన్ కు పోటీ పడ్డంలో సహజంగా ఇతర దేశాలవారే ముందుంటుంటారు. అటువంటిది ఇండియానుంచీ ఏకైక మహిళ పాల్గోవడమేకాదు... ముంబైకి చెందిన రుతవి మెహతా... ఏకంగా ఏభై దేశాలు పాల్గొన్న పోటీలో గెలిచి సత్తా చాటింది. పదిహేడు నగరాలు.. మూడువేల కిలోమీటర్లు.. గతుకుల రోడ్లలో ప్రయాణం.. కేవలం రెండువారాల్లో లక్ష్యాన్ని సాధించాలి. తీవ్రమైన పట్టుదల, సాహసం చేసే ధైర్యం, క్రీడా ప్రేమికులు అయిఉంటే తప్పించి సాధ్యం కాదు. అయితే 29 ఏళ్ళ రుతవి మెహతా ఈ పోటీని ఛాలెంజింగ్ గా తీసుకుంది. తన వృత్తిజీవితంలో ఒక్కసారి వెనక్కు వెళ్ళి ఆలోచించింది. తాను ట్రావెల్ కన్సల్టెంట్ గా ఉన్న రోజుల్లో తరచుగా తమ హోటల్ వద్దకు వచ్చే ఆటోలద్వారా ఆటో రన్ గురించి తెలుసుకోవడం జ్ఞప్తికి తెచ్చుకొంది. అప్పట్లో తాను కన్న కలను నిజం చేసుకునేందుకు రేసులో పాల్గొని కేవలం పన్నెండు రోజుల్లోనే లక్ష్యాన్నిసాధించింది. రుతవి టీమ్ రేస్ కొనసాగుతుండగా రెండుసార్లు యాక్పిండెంట్లు కూడ జరిగాయి. చివరి లక్ష్యాన్ని సాధించేందుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించింది. కానీ గాయాలను సైతం లెక్క చేయకుండా రుతవి లక్ష్యాన్ని చేరింది. కనీసం ఆటో ఎలా నడపాలో తెలియదు. అటువంటిది స్నేహితుల ప్రోత్సాహం, ఏదో సాధించాలన్న తపన రుతవిని రేస్ లో పాల్గొనేలా చేసింది. అద్దెకు రిక్షా తెచ్చుకొని ఎలా నడపాలో నేర్చుకొంది. రన్ లోని ఒక్కో టీమ్ లో మొత్తం ముగ్గురు సభ్యులుంటారు. రుతవి టీమ్ లో తన స్నేహితులైన అమెరికాకు చెందిన ట్రావెల్ బ్లాగర్స్ లోని డెరేక్ ఫ్రెల్, ర్యాన్ బ్రౌన్ లు పాల్గొన్నారు. తమ టీమ్ కు తీన్ రొమాంచక్ యార్ అన్న పేరు పెట్టుకొని రన్ లో పాల్తొన్నారు. ఒక్కోటీమ్.. రోజుకు మూడు వందల కిలోమీటర్లు కవర్ చేయాలి. టీమ్ లోని ఒక్కొక్కరు వంద కిలోమీటర్ల చొప్పున డ్రైవ్ చేయాలి. అయితే ఆటోరిక్షాను మూడువందల కిలోమీటర్లు డ్రైవ్ చేయడం అంటే కారులో ఆరువందల కిలోమీటర్లు వెళ్ళినట్లు లెక్క ఎందుకంటే 55 కిలోమీటర్లకు మించి స్పీడ్ వెళ్ళే అవకాశం ఉండదంటుంది రుతవి. 'ది ఎడ్వంచరిస్ట్స్' పేరున 2006 లో మొదట లండన్ కు చెందిన సంస్థ.. రిక్షా రన్ ను నిర్వహించింది. అప్పట్లో ఒక్కరు కూడ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఈ కాంపిటేషన్ లో సాధారణ వ్యక్తులు పాల్గొనడం కూడ కష్టమే. ఎందుకంటే ఇందులో చేరాలంటే ఒక్క లక్ష్యమే సరిపోదు. ఆర్థిక పరిపుష్టి కూడ కలిగి ఉండాలి. 1550 డాలర్లు అంటే సుమారుగా లక్షా రెండువేల రూపాయలు ఆర్గనైజైషన్ కు విరాళంగా చెల్లించాలి. వివిధ రకాలుగా వాతావరణాన్ని కాపాడేందుకు సంస్థ ఆ డబ్బును వినియోగిస్తుంది. అంతేకాదు.. రిజిస్టేషన్ ఫీజు కూడ రెండువేల ఐదువందల యూరోలు. అంటే సుమారు లక్షా ఎనభై ఐదువేల రూపాయలు. ఈ ఫీజును కూడ సంస్థ పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. ఇండియాలో నిర్వహించిన ఆటోరిక్షా రేస్ లో మొత్తం ఏభై దేశాలనుంచి 250 మంది పాల్గొన్నారు. రాజస్థాన్ లోని జైసల్మర్ నుంచి మేఘాలయాలోని షిల్లాంగ్ వరకూ ఏడు రాష్ట్రాలు, పదిహేడు నగరాల్లో మూడువేల కిలోమీటర్లు ఆటోరిక్షా పోటీ. ఎటువంటి సపోర్టు, హెల్ప్ లేకుండా... అనేక వాహనాలు ప్రయాణించే సాధారణ రోడ్లపైనే నిర్వహించే డేంజరస్ రేస్ అది. రుతవికి టూరిజం పట్ల ఉన్న అవగాహన తన రేస్ కు ఉపయోగించింది. ఒకప్పుడు రుతవి మెహతా తన వృత్తి పరంగా యూరోప్ మొత్తం తిరిగింది. తన ట్రావెల్ అనుభవంతో ప్రస్తుతం స్వయంగా ఫొటోకథ పేరుతో ఓ సంస్థను నడుపుతోంది. దేశాలను చుట్టే టూరిస్టుల అనుభవాలను అందులో ఉంచుతుంది. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లోని టూరిజం బోర్డులకు కన్సల్టెంట్ గానూ వ్యవహరిస్తుంది. ఈ మధ్యకాలంలో కేరళ బ్లాగ్ ఎక్స్ ప్రెస్ పేరున నిర్వహించిన క్యాంపెయిన్ లో కేరళలోని వివిధ సంస్కృతులను సందర్శించిన 27మంది ఇంటర్నేషనల్ బ్లాగర్స్ అనుభవాలను డిజైన్ చేసే అరుదైన అవకాశం కూడ రుతవికి వచ్చింది. అటు వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ తనదైన మార్కును కనబరుస్తున్న రుతవి...మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదు అన్నదానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇండియాలో మహిళా సాధికారతను చాటిన మహిళగా రుతవి మెహతా ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకమైంది. -
రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలసలు ఎక్కువగా ఉన్నాయి. మరికొందరికి పెళ్లిళ్ల తర్వాత వారి కుటుంబాలకు దూరం కావాల్సిన దుస్థితి తలెత్తింది. భారత్-పాక్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికి విదితమే. వివరాల్లోకి వెళితే.. లాచో దేవి అనే మహిళ జైసల్మేర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఐదేళ్లయింది. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా తన సోదరులకు ఆమె రాఖీ కట్టలేకపోయింది. కారణం.. ఆమె సోదరులు, వారి కుటుంబాలు పాక్ లో ఉంటున్నాయి. వీసాలేని కారణంగా ఆమె అక్కడికి వెళ్లలేకపోతోంది. వీసా పొందడం చాలా కష్టంగా ఉన్నందువల్లే తన సోదరులను కలుసుకోలేక పోతున్నానంటూ రక్షా బంధన్ పండుగ నాడు కన్నీరుమున్నీరయింది. తమకు రక్షా బంధన్ రోజైనా సోదరులను, సోదరిలను కలుసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని గీనా రామ్ ప్రాధేయపడ్డారు. ఇరు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, ఇందులో చాలా మార్పులు రావాలని బిల్ వర్గం నాయకుడు నాథూరామ్ అన్నారు.వీసా లేకపోవడంతో సరిహద్దులే.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధాల మధ్య హద్దులను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. మా వర్గానికి చెందిన చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉందని ఆయన వాపోయారు. రాఖీ పండుగ వచ్చిందంటే వారి బాధలు, కష్టాలు రెట్టింపవుతాయి. -
జస్వంత్ కోసం మృత్యుంజయ యాగం
జైసల్మేర్: కోమాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ కోలువాలని ప్రార్థిస్తూ రాజస్థాన్ లోని జైసల్మేలో మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు. స్థానిక ముక్తేశ్వర్ మహదేవ్ ఆలయంలో ఈ యాగం చేశారు. జస్వంత్ సింగ్ దీర్ఘష్షు కోసం ఆయన మద్దతుదారులు, సన్నిహితులు ఈ యాగం చేశారని జైసల్మేర్ అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు పూరన్ సింగ్ బట్టి తెలిపారు. బైసాకి గ్రామంలో జస్వంత్ అభిమానులు శనివారం ఇలాంటి యాగం చేశారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న జస్వంత్ కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. -
ఎడారి గ్రామాల్లో ఇంటి వద్దనే ఓటు
రాజస్థాన్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణం గల జిల్లాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు రికార్డు. ఈ నియోజకవర్గంలో అక్కడక్కడ విసిరేసినట్లుగా.. 100 నుంచి 500 మంది ఓటర్లు కూడా ఉండని గ్రామాలున్నాయి. జై సల్మేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా ఈ చిన్న గ్రామాలను పట్టించుకోరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఓటు వేయని గ్రామాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఈ గ్రామాలకు 5 మొబైల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జైసల్మేర్ జిల్లా సరిహద్ధు గ్రామాలైన రాబ్లో ఫకీర్ ఏ వాల్(340 ఓటర్లు), హమీర్ నాడా(555 ఓటర్లు), 113 ఆర్డీ(275), తోబా(242), కయామ్కి ధాని(370) గ్రామా ల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ బూత్‌లతో పాటు ఒక సాధారణ బూత్ కూడా ఉంటుంది. ఇసుకలో కూడా ప్రయాణానికి వీలుగా ఉండే 8 టైర్ల వాహనాన్ని మొబైల్ పోలింగ్ బూత్‌గా వినియోగిస్తారు. -
మళయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్‌కు 22 ఏళ్లు
పుట్టినరోజున కూడా సినిమాలను ఏమాత్రం వదిలిపెట్టని మళయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్. శనివారం ఆమె తన 22వ పుట్టినరోజు జరుపుకొంటోంది. అయితే, ప్రత్యేకంగా వేడుకలు, పార్టీలలో మునిగి తేలిపోకుండా.. ''ఒరు ఇండియన్ ప్రణయకథ'' (ఓఐపీ) అనే మళయాళీ చిత్రం షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ''జైసల్మీర్‌కు నేను మొదటిసారి వెళ్లాను! ఇక్కడ నేనో భయంకరమైన ప్రదేశంలో ఉన్నాను. ఎక్కడ చూసినా పెద్దపెద్ద రాజుల చిత్రాలే కనిపిస్తున్నాయి. ఈ గదిలో ఒకప్పుడు రాజులు ఉండేవారని ఎవరో చెబుతున్నారు. ఎప్పుడూ ఊహించలేని విషయాలు జరిగితే నాకు ఎంతో ఇష్టం'' అని అమలాపాల్ తన ట్విట్టర్ పేజీలో రాసింది. ఫదా ఫాసిల్‌తో కలిసి ఆమె నటిస్తున్న ఓఐపీ చిత్రానికి సీనియర్ దర్శకుడు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాయక్, తలైవా, మైనా లాంటి చిత్రాలతో అమలాపాల్ దక్షిణాదిలో ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన 'వెలైయిల్ల పట్టతారి' అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.