రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైసల్మీర్‌లో సోమవారం అర్థరాత్రి సమయంలో ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ట్రాక్టర్ రెండు ముక్కలుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలుపుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.