రాజస్థాన్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణం గల జిల్లాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు రికార్డు. ఈ నియోజకవర్గంలో అక్కడక్కడ విసిరేసినట్లుగా.. 100 నుంచి 500 మంది ఓటర్లు కూడా ఉండని గ్రామాలున్నాయి. జై సల్మేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా ఈ చిన్న గ్రామాలను పట్టించుకోరు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఓటు వేయని గ్రామాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఈ గ్రామాలకు 5 మొబైల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జైసల్మేర్ జిల్లా సరిహద్ధు గ్రామాలైన రాబ్లో ఫకీర్ ఏ వాల్(340 ఓటర్లు), హమీర్ నాడా(555 ఓటర్లు), 113 ఆర్‌డీ(275), తోబా(242), కయామ్‌కి ధాని(370) గ్రామా ల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ బూత్‌లతో పాటు ఒక సాధారణ బూత్ కూడా ఉంటుంది. ఇసుకలో కూడా ప్రయాణానికి వీలుగా ఉండే 8 టైర్ల వాహనాన్ని మొబైల్ పోలింగ్ బూత్‌గా వినియోగిస్తారు.
ఎడారి గ్రామాల్లో ఇంటి వద్దనే ఓటు
Published Sat, Nov 23 2013 5:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement