ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) నిర్ణయించుకుంది. రాజధాని ముంబయి నగరంలోని మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ సోమవారం(ఆగస్టు5) మీడియాకు తెలిపారు.
‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. అయితే జాతీయస్థాయిలో ఇండియా కూటమితో స్నేహం కొనసాగుతుంది. ముంబైలోని మొత్తం 36 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ పాలన మోడల్‌ను చూపించే ఎన్నికలకు వెళతాం. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంపై అసలు పట్టింపే లేదు.
మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్లకు లేదు. సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు గుజరాత్ కోసమే పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు’అని మీనన్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment