
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న సిద్-కియారాలు భార్యభర్తలుగా ఒక్కటయ్యారు.
ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కియారా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పెళ్లి నేపథ్యంలో సుమారు 20రోజులు బ్రేక్ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక సిద్ కూడా తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. తాజాగా ఇద్దరూ కలిసి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో సందడి చేశారు. చదవండి: కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
Comments
Please login to add a commentAdd a comment