Kiara Advani Sidharth Malhotra Shares First Video From Their Dreamy Wedding - Sakshi
Sakshi News home page

Kiara Advani- Sidharth Malhotra : 'షేర్షా' సాంగ్‌కి డ్యాన్స్‌ చేసిన కియారా.. వెడ్డింగ్‌ వీడియో వైరల్‌

Feb 10 2023 1:35 PM | Updated on Feb 10 2023 2:40 PM

Kiara Advani Sidharth Malhotra Shares First Video From Thier Dreamy Wedding - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హొత్రలు ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ప్యాలెస్‌లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా తమ పెళ్లి వీడియోను షేర్‌ చేసుకున్నారు. వేదికపైకి 'షేర్షా' సాంగ్‌కి డ్యాన్స్‌ చేస్తూ వచ్చిన కియారా సిద్దార్థ్‌ను చూస్తూ మురిసిపోయింది. పెళ్లి కాస్ట్యూమ్‌లో అద్భుతంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ పూలదండలు మార్చుకొని ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. 

ఇక కియారా లేత గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోగా, సిద్దార్థ్‌ క్రీమ్‌ షేర్వాణీలో కనిపించాడు. కాగా షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్‌-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement