
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది" అని వెల్లడించింది. ఈ పోస్ట్ కింద రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత.. ఓ మైగాడ్, కంగ్రాచ్యులేషన్స్ అని కామెంట్ చేసింది.
ప్రేమ.. పెళ్లి
కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. లస్ట్ స్టోరీస్ (2018) సినిమా ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా షేర్షా సినిమాలో నటించారు. రోమ్ నగరంలో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని కియారా.. కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది.

సినిమా
కియారా అద్వానీ ఫగ్లీ సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. ఎమ్మెస్ ధోని, మెషిన్, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూస్, కబీర్ సింగ్, ఇందూ కి జవానీ, భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ మేరా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాల్లో నటించింది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీతో పాటు హిందీ వార్ 2లో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్, ఎ జెంటిల్‌మెన్, మర్జావాన్, షేర్షా, థాంక్ గాడ్, మిషన్ మజ్ను, యోధ సినిమాలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment