Kiara Advani and Sidharth Malhotra Return to Home in Delhi After Married - Sakshi
Sakshi News home page

Kiara Advani-Sidharth Malhotra: దంపతులుగా కియారా-సిద్ధార్థ్‌, ఘనస్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

Published Thu, Feb 9 2023 7:51 PM | Last Updated on Thu, Feb 9 2023 8:37 PM

Kiara Advani and Sidharth Malhotra Return to Home in Delhi After Married - Sakshi

కొంతకాలంగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్​ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ, సిద్ధార్థ్​ మల్హోత్రా మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు పిబ్రవరి 7తో ముగిశాయి.

చదవండి: ‘యశోద’ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!

పెళ్లి అనంతరం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు కియారా-సిద్దార్థ్‌లు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం బుధవారం(ఫిబ్రవరి 8న) దంపతులుగా ఢిల్లీ చేరుకున్నారు. మొదటి సారి కోడలిగా అత్తింట్లోకి అడుగుపెడుతున్న కియారాకు సిద్ధార్థ్‌ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పంజాబీ సాంప్రదాయ ప్రకారం డోలు, సన్నాయిలతో ఈ కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించారు.

చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ శ్రీహాన్‌ ముందు సిరి కన్నీళ్లు!

ఈ సందర్భంగా సిద్ధార్థ్‌-కియారాలు పంజాబీ డోలుకు డాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అనంతరం మీడియాకు ఫోజులు ఇచ్చిన ఈ కొత్త జంట పాపరాజిలకు స్వీట్స్‌ పంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఫిబ్రవరి 9) రాత్రి ఢిల్లీలో ఫ్యామిలీ రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 10న ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ల కోసం మరో రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement