సిద్ధార్థ్‌ మల్హోత్రా, కృతీ సనన్‌ జంటగా రొమాంటిక్‌ కామెడీ మూవీ! | Kriti Sanon, Siddharth Malhotra To Star In A Romantic Film | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్‌ మల్హోత్రా, కృతీ సనన్‌ జంటగా రొమాంటిక్‌ కామెడీ మూవీ!

Published Sun, May 19 2024 9:02 AM | Last Updated on Sun, May 19 2024 9:12 AM

Kriti Sanon, Siddharth Malhotra To Star In A Romantic Film

సిద్ధార్థ్‌ మల్హోత్రా, కృతీ సనన్‌ హీరో హీరోయిన్లుగా హిందీలో ఓ కొత్త సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘దస్వి’ ఫేమ్‌ తుషార్‌ జలోట దర్శకత్వం వహిస్తారట. దినేష్‌ విజన్‌ నిర్మించనున్నారని టాక్‌. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, ఈ ఏడాదిలో చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారని భోగట్టా. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనే ఆలోచన చేస్తున్నారట దినేష్‌ విజన్‌. మరి... ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీలో సిద్ధార్థ్, కృతీ సనన్‌ జోడీగా నటిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement