సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ
ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం చెబుతారు ‘అదుర్స్‌లో ఎన్టీఆర్’. ‘తెలీదు.. గుర్తు లేదు.. మర్చిపోయా’ అన్నదే ఆ సమాధానం. ఇప్పుడు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ కూడా అదే స్టైల్‌లో తమ రిలేషన్‌షిప్ గురించి ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం చెబుతున్నారు. సిద్ధు, కియారా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్. మీరు రిలేషన్‌లో ఉన్నారంట కదా? అనే ప్రశ్నను ఈ ఇద్దరి ముందు ఉంచితే – ‘‘నేను మాత్రం ప్రస్తుతం నా వర్క్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.
దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ రిలేషన్‌షిప్‌లో ఉంటే మీకే చెబుతాను’’ అంటున్నారు కియారా అద్వానీ. విచిత్రంగా సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. ‘‘ప్రస్తుతం నేను నా వర్క్‌తోనే రిలేషన్‌లో ఉన్నాను. మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టేంత ఖాళీ కూడా లేదు’’ అంటున్నారు. ఏమీ లేదన్న విషయాన్ని కూడా ఒకేలా అనడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. మరి వీళ్ల సమాధానాలు కాకతాళీయమా? అన్నదానికి సమాధానం కాలమే డిసైడ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment