
సిద్ధార్థ్ మల్హోత్రా
చండీఘడ్ వీధుల్లో హ్యాపీగా చక్కర్లు కొడుతున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. కానీ ఒంటరిగా కాదులెండి. కార్గిల్‌వార్ (1999) సమయంలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా ఉన్న విక్రమ్ బాత్రా బయోపిక్ ‘షేర్షా’గా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చంఢీఘర్‌లో జరుగుతోంది. సిద్ధార్థ్, కియారాలపై బైక్ రైడ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఫైట్ సీన్లను కూడా ప్లాన్ చేశారు. ఇంకో పదిరోజుల పాటు ఈ సినిమా షెడ్యూల్ చండీఘడ్‌లోనే జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment