Vikram Batra
-
'మిస్ యూ భయ్యా'! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!
కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగానే ఈ 'కార్గిల్ విజయ్ దివాస్'ని ప్రతి ఏటా జూలై 26న జరుపుకుంటున్నాం. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. నాటి యుద్ధంలో ఎందరో యువ సైనికులు అశువులు బాశారు. ఈ సందర్భంగా వారందర్నీ స్మరించుకుంటూ గొంతెత్తి మరీ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అసామాన్య ధైర్య సాహాసాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ధీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా గురించి అతని కవల సోదరుడి మాటల్లో తెలుసుకుందాం. నిజానికి కెప్టెన్ విక్రమ్ బాత్రా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి అతని వయసు కేవలం 24 ఏళ్లు. అతని ధైర్య సాహాసాలు గురించి 'యే దిల్ మాంగ్ మోర్' అని అనకుండా ఉండలేం. అతడు సాధించిన విజయాలు, యుద్ధంలో అతడు చూపించిన తెగువ భరతమాత మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అతను ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్ నివాసి. అక్కడ అతడు తన తల్లిదండ్రులు, కవల సోదరడు విశాల్ బాత్రాతో కలిసి ఉండేవాడు. కెప్టెన్ విక్రమ్ బాత్రాలా అతని సోదరుడు విశాల బాత్రా కూడా సైన్యంలోకి చేరాలని కలలు కన్నాడు. కానీ అది జరగలేదు. బహుశా అతను ముందుగా చనిపోవడం అన్నది విధే ఏమో గానీ ఆ బాధ విక్రమ్ కుటుంబ సభ్యులకు ఓ పీడకలలా మిగిలింది. ఈ కార్గిల్ దివాస్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విశాల్ తన సోదరుడుని కోల్పోవడం గురించి ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, అతడిని చూసి యువకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నాడు విశాల్. అతను మన మధ్యే ఉన్నాడు.. విక్రమ్ భౌతికంగా లేకపోవచ్చు గానీ అతను మన మధ్యే ఇంకా ఉన్నాడు. ఎందుకంటే అతని ధైర్య సాహాసాలను చూసిన వారెవ్వరూ ఆ మాట ఒప్పుకోలేరు. భారతదేశానికి అతను కెప్టెన్ బాత్రా కావచ్చు కానీ నాకు మేము ఒకేలా ఉండే కవల సోదరుడు. మమ్మల్ని చిన్నప్పుడూ మా అమ్మ లవ్, కుష్ అని పిలిచేది. కాలం ఎలాంటి బాధకైన మంచి మందు అంటారు కానీ నా విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా. కేవలం 24 సంవత్సరాల వయసులో అతడు దేశం కోసం చేసింది దాని గురించి వింటే అపారమైన గర్వం, గౌరవం కలుగుతున్నాయి. అతడికి సోదరుడిగా ఒకేలా పుట్టినందుకు దేవుడికి ధన్యావాదాలు. అని భావోద్వేగం చెందాడు విశాల్ జూనియర్ అధికారుల వల్లే ఆ గెలుపు జూనియర్ అధికారుల నాయకత్వం వల్లే ఈ కార్గిల్ యుద్ధం గెలిచింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా(పీవీసీ), కెప్టెన్ మనోజ్ పాండే(పీవీసీ), కెప్టన్ అనూజ్ నయ్యర్(ఎంవీసీ) వంటి చాలామంది అధికారుల కేవలం 23, 24, 25 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. వారంతా భారతీయ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారిని చూసే ఆర్మీలో చేరామని చాలా మంది తనకు చెప్పారని విశాల్ చెబుతున్నాడు. "కేవలం ఇలాంటి ప్రత్యేక సందర్భాలలోనే వారిని గుర్తు తెచ్చుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసిన త్యాగానికి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి చదివాం. మరీ ఇలా దేశం కోసం అమరులైన ఈ దైర్యవంతులైన యువకుల గురించి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చకూడదు?. మనకు స్వాతంత్య్రం రావడానికి సహకరించిన స్వాతంత్య్ర సమరయోధులు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో 1999లో మన కీర్తీని పునరుద్ధరించి మన మాతృభూమికోసం పోరాడిన ఈ వ్యక్తుల గురించి విద్యార్థులు తెలుసుకోవడం అంతే ముఖ్యం" అన్నాడు విశాల్ నాయకుడిగా కూడా విక్రమ్ క్రెడిట్ తీసుకోలేదు విక్రమ్ నాయకుడిగా కూడా ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు. ఒకసారి అతను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శిస్తున్నప్పుడూ నువ్వు సాధించి గొప్ప విజయం ఏమిటంటే విజయ్ తాను ఆరుగురి వ్యక్తలతో కొండలపైకి వెళ్లాను అంతే దిగ్విజయంగా తిరిగి వచ్చానని, తన జట్టుకే క్రెడిట్ ఇచ్చేవాడు. నిజానికి అతన సహచరుల చెబుతుంటారు.. కథన రంగంలో తానే మొదట ఉండేవాడని, శత్రువు బుల్లెట్ తానే ముందు తీసుకునేవాడని. అతడే ముందుండి మమ్మల్ని నడిపించేవాడని చెబుతుంటే చాలా బాధగా ఉండేదని విశాల్ పేర్కొన్నాడు. ఇక్కడకు రావడం పుణ్యక్షేతం సందర్శించినట్లే.. ఇక చివరగా విశాల్ బాత్రా తనకు ఇక్కడకు రావడం పుణ్యక్షేత్రానికి రావడంతో సమానమని చెప్పాడు. సుమారు 1700ల నుంచి 17500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను ఎలా అధిరోహించారు, పైగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న ఇక్కడ ఎలా పోరాడారు అని అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా కఠినమైనది కూడా. నాకు అక్కడకు వెళ్లినప్పుడల్లా విక్రమ్ అక్కడ శిఖరాలను కాపలా కాస్తున్నాడని, మనోజ్ పాండే ఇప్పటికి పహారా కాస్తున్నాట్లు భావిస్తాను. అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే విక్రమ్ బాత్రా, అతని సహచర యువకులు ఒక్కొక్కరు అక్కడ కూర్చొన్నట్లు నాకు అనిపిస్తుందని అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు విశాల్. అంతేగాదు ఈ కార్గిల్ యుద్ధం గురించి బాలీవుడ్ మూవీ షెర్షా(2021) చిత్రం తీశారు. ఈ మూవీ కారణంగా విక్రమ్ బాత్రా గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది. అందులో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒదిగిపోయాడు. (చదవండి: పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!) -
రియల్ హీరో.. యే దిల్ మాంగే మోర్!
నాయకుడంటే.. ఏదో ముందుండి నడిపిస్తున్నాడనే పేరుంటే సరిపోదు. లక్ష్యసాధనలో తన వెనకున్న వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాలి. విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అవసరమైతే తెగువను ప్రదర్శించాలి.. త్యాగానికి సిద్ధపడాలి. ఇది మిగతా వాళ్ల గుండెల్లో ధైర్యం నింపుతుంది. గెలుపు కోసం చివరిదాకా పోరాడాలనే స్ఫూర్తిని కలగజేస్తుంది. కార్గిల్ వార్‌లో అసువులు బాసిన వీరులెందరో. అందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కారణం.. పైన చెప్పిన లక్షణాలన్నీ ఆయన ప్రతిబింబించారు కాబట్టి. అన్నట్లు ఇవాళ ఈ కార్గిల్ అమరవీరుడి జయంతి. ఈ సందర్భంగా ఆ రియల్ హీరోను స్మరించుకుంటూ... ►హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ జిల్లా ఘుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబర్ 9న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. ► చదవులోనే కాదు.. ఆటపాటల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు. ► విక్రమ్ బాత్రా చిన్నప్పటి నుంచే ధైర్యశాలి. కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్. టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవల్లో ఆడారు. ► నార్త్ ఇండియా ఎన్సీసీ కాడెట్(ఎయిర్ వింగ్) నుంచి ఉత్తమ ప్రదర్శన అవార్డు సైతం అందుకున్నారు ► డిగ్రీ అయిపోగానే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యారు. ► 1996లో ఆయన కల నెరవేరింది. ఇండియన్ మిలిటరీ ఆకాడమీలో చేరారు. ► విక్రమ్ బాత్రా.. మన్నెక్షా బెటాలియన్‌కి చెందిన జెస్సోర్ కంపెనీ(డెహ్రాడూన్)లో చేరి, ఆపై లెఫ్టినెంట్‌గా, అటుపై కెప్టెన్ హోదాలో కార్గిల్ హోదాలో అడుగుపెట్టారు. ► డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్ ఉన్న విక్రమ్‌ను తోటి సభ్యులుగా ముద్దుగా షేర్షా అని పిల్చుకునేవాళ్లు ► గాంభీర్యంగా పైకి కనిపించే బాత్రా చాలా సరదా మనిషి. ఆయన చిరునవ్వే ఆయనకు అందమని చుట్టుపక్కల వాళ్లు చెప్తుంటారు ► ఆయన నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ‘యే దిల్ మాంగే మోర్’ డైలాగ్.. తర్వాతి కాలంలో పెద్ద బ్రాండ్‌కి ప్రచార గేయం అయ్యిందని చెప్తుంటారు కొందరు. అందులో నిజమెంతో గానీ.. ఆయన నుంచి మాత్రం ఆ మాట వచ్చిన విషయం వాస్తవం. ► కార్గిల్ వార్‌లో వేల అడుగుల ఎత్తున శత్రువులు సైతం ఊహించని మెరుపుదాడికి సిద్ధమయ్యారు ► దాడిలో తీవ్రంగా గాయపడ్డా కూడా శత్రువులకు వెన్నుచూపెట్టలేదు ఆయన. ముగ్గురు శత్రువుల్ని మట్టుబెట్టిన మరీ 24 ఏళ్లకు దేశం కోసం వీరమరణం పొందారు. ఆ పోరాటం మిగతా వాళ్లలో స్ఫూర్తిని విజయ బావుటా ఎగరేయించింది. ► మరణాంతరం పరమ వీర చక్రతో పాటు రియల్ హీరోల జాబితాలో చోటుసంపాదించుకుని యావత్ దేశం నుంచి గౌరవం అందుకున్నారాయన. ► డిగ్రీ టైంలో డింపుల్ ఛీమాతో నడిచిన ప్రేమ కథ.. విక్రమ్ వీరమరణంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే విషాదంగా ముగిసింది. అంతా బలవంతం పెట్టినా విక్రమ్ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుని ఆమె వివాహం చేసుకోలేదు. ‘రక్త్ సింధూర్’ ప్రేమ కథగా విక్రమ్-డింపుల్ కథ చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్ పుట్టినరోజు, మరణించిన రోజు డింపుల్ తప్పకుండా విక్రమ్ ఇంటికి వెళ్లి.. ఆయన పేరెంట్స్‌తో కాసేపు గడుపుతుంటుంది కూడా. ► రీసెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన షేర్షా.. ఈయన జీవిత కథ ఆధారంగానే తీసింది. ఇందులో డింపుల్ పాత్రను కియారా అద్వానీ పోషించింది. Heartfelt Tributes to great patriot Param Vir Chakra Captain #VikramBatra on his birth anniversary. He’s an epitome of courage, sacrifice and bravery. His exemplary bravery and valour would always inspire the Nation. #AmritMahotsav pic.twitter.com/2QDQWoYI1n — Ministry of Culture (@MinOfCultureGoI) September 9, 2021 - సాక్షి, స్పెషల్ డెస్క్ -
‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’
‘ఆయన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు’ అందుకే ఈ సినిమాని, క్యారెక్టర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని బాలీవుడ్ హీరో సిద్దార్థ మల్హోత్రా అన్నాడు. నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కెప్టన్ విక్రమ్ బత్రా త్యాగాన్ని గుర్తు చేస్తూ అతడు ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ప్రస్తుతం.. కెప్టెన్ ‘విక్రమ్ బాత్రా ’ బయోపిక్ ‘షేర్షా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. షేర్షాలో కెప్టెన్ పాత్రకు పూర్తి న్యాయం చేసి అమరవీరుల కుటుంబాలను సంతోష పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కెప్టెన విక్రమ్ బాత్రా పాకిస్తాన్ చొరబాటు దారుల నుంచి భారత భూభాగాలను రక్షించి.. దేశ సేవలో ఆయన ప్రాణాలు అర్పించారు. యుద్ధంలో ఆయన ధైర్యాన్ని చూసిన పాకిస్తాన్ ఆర్మీ ఆయనను షేర్షా (లయన్ కింగ్ ) అని పిలిచేదట. ఈ నేపథ్యంలో సిద్ధార్థ మాట్లాడుతూ ‘ఆయన కీర్తిని తెరపై చూపించాల్సిన భాధ్యత ఎంతో ఉంది. షేర్షా మూవీని కమర్షియల్ సినిమాలా కాకుండా బాత్రా కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్మించాలి అనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. తాను విక్రమ్ బాత్రా తల్లిదండ్రులను, సోదరుడిని కలిసినప్పుడు.. వాళ్లు కెప్టెన్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ‘షేర్షా పాత్రలో నటించడం అంత సులభమైన విషయం కాదని, దేశ రక్షణ బాధ్యత తన భుజాలపై ఉందని కెప్టెన్ భావించేవారని సిద్ధార్థ్ అన్నాడు. కాగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహించనున్నాడు. Beginning the journey of #Shershaah soon!@SidMalhotra @Advani_Kiara @vishnu_dir #HirooJohar @apoorvamehta18 @b_shabbir #AjayShah #HimanshuGandhi @dharmamovies pic.twitter.com/QBoxMeBDcv — Karan Johar (@karanjohar) May 2, 2019 -
ప్రేమ ప్రయాణం
చండీఘడ్ వీధుల్లో హ్యాపీగా చక్కర్లు కొడుతున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. కానీ ఒంటరిగా కాదులెండి. కార్గిల్‌వార్ (1999) సమయంలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా ఉన్న విక్రమ్ బాత్రా బయోపిక్ ‘షేర్షా’గా బాలీవుడ్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చంఢీఘర్‌లో జరుగుతోంది. సిద్ధార్థ్, కియారాలపై బైక్ రైడ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఫైట్ సీన్లను కూడా ప్లాన్ చేశారు. ఇంకో పదిరోజుల పాటు ఈ సినిమా షెడ్యూల్ చండీఘడ్లోనే జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
కెప్టెన్ షేర్షా
దేశ సరిహద్దులో శత్రువుల అంతు చూస్తానంటున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. ఇందుకోసం గన్ ఫైరింగ్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కనున్న నెక్ట్స్ చిత్రానికి ‘షేర్షా’ అనే టైటిల్ ఖరారైంది. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. విక్రమ్‌ను పాకిస్తాన్ ఆర్మీ ‘షేర్షా’ అని పిలిచేవారట. అందుకే ఈ బయోపిక్కు ఆ టైటిల్ పెట్టారని ఊహించవచ్చు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తారు. కియారా అద్వానీ ఇందులో కథానాయికగా నటిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రియల్ లైఫ్ హీరో విక్రమ్ బత్రా పాత్రలో నటించబోతున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉన్నాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అన్నారు సిద్ధార్థ్. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వా మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
మరో బయోపిక్‌లో భరత్ హీరోయిన్
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కియారా మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు కియారా. ధోని బయోపిక్‌తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న కియారా ఇటీవల లస్ట్‌స్టోరిస్ తో సెన్సేషన్ సృష్టించారు. తాజా మరో బయోపిక్ లో నటించేందుకు ఓకె చెప్పారు. పరమవీర చక్ర సాధించిన అమర జవాన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కియారా కీలక పాత్రలో నటించనున్నారు. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. -
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సౌత్ డైరెక్టర్
అజిత్ హీరోగా బిల్లా, ఆరంభం లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విష్ణువర్ధన్. తెలుగు పవన్ కల్యాణ్ హీరోగా పంజా సినిమాను రూపొందించిన ఈ స్టైలిష్ డైరెక్టర్ 20బ్తురువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు విష్ణు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాతో విష్ణువర్ధన్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
యే దిల్ మాంగే మోర్..!
కార్గిల్ అమరుడు బాత్రా నినాదాన్ని ప్రచారంలో వాడిన మోడీ చెలరేగిన రాజకీయ దుమారం పాలంపూర్ (హిమాచల్‌ప్రదేశ్)/న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కార్గిల్ యుద్ధ అమరవీరుడు విక్రమ్ బాత్రా ఇచ్చిన నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంపై రాజకీయ దుమారం రేగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బాత్రా స్వస్థలం పాలంపూర్‌లో మంగళవారం మోడీ ప్రచారం చేశారు. ‘ఈ నేలపై పుట్టిన కెప్టెన్ విక్రమ్ బాత్రా దేశం కోసం ప్రాణాలర్పించారు. అతను యే దిల్ మాంగే మోర్(నా హృదయం ఇంకా కోరుకుంటోంది) అని చెప్పాడు. నేనూ అదే చెపుతున్నా యే దిల్ మాంగే మోర్. మాకు హిమాచల్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలు కావాలి. దేశంలో 300 కమలాలు కావాలి. యే దిల్ మాంగే మోర్..’ అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశా రు. బాత్రా యుద్ధంలో మరణించే ముందు ‘యే దిల్ మాంగే మోర్’ అని అన్నారు. మోడీ ఈ నినాదాన్ని వాడడంపై బాత్రా తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు పార్టీలూ మండిపడ్డాయి. ‘ఎన్నికల్లో వాడుకోవద్దు’: దేశం కోసం ప్రాణాల్పించిన తన కుమారుని పేరును ఎన్నికల్లో వాడడం తగదని బాత్రా తండ్రి జీఎల్ బాత్రా అన్నారు. ప్రసు ్తతం తన కుమారుని గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. హమీర్పూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న తన భార్య కమల్ కాంత్‌పై వారి అభ్యర్థి అనురాగ్ ఠాకూర్‌ను ఎందుకు ఉపసంహరించలేదని ప్రశ్నించారు. మోడీకి విక్రమ్, ఇతర అమరులపై గౌరవముంటే ఠాకూర్‌ను పోటీ నుంచి ఉపసంహరించాలన్నారు. కాంగ్రెస్, ఆప్‌లు కూడా మోడీని తప్పుబట్టాయి. కార్గిల్ యుద్ధ సమయంలో బీజేపీ హిమాచల్ ఇన్చార్జిగా ఉన్న మోడీ విక్రమ్ కుటుంబాన్ని పరామర్శించలేదని, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆయన పేరును వాడారని ఆప్ విమర్శిం చింది. కాగా, దిల్ మాంగేమోర్ నినాదం.. కుటుంబ ఆస్తి కాదని, దానిని ఓ శీతల పానీయాల కంపెనీ కూడా వాడుకుంటోందని బీజేపీ పేర్కొంది. రాజకీయాల నుంచి తప్పుకుంటా: మోడీ వివాదంపై మోడీ స్పందించారు. ‘విక్రమ్ బాత్రా, అతని తల్లిదండ్రులంటే నాకెంతో గౌరవం. అలాంటి పౌరులను అగౌరవించాలన్న ఆలోచన వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా’నన్నారు. ‘అమరులను కూడా స్మరించుకోవద్దా? ఇవేం రాజకీయాలు?’ అని త్రీడీ టెలికాస్ట్ ద్వారా చేసిన ప్రసంగంలో మండిపడ్డారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ తనపై అన్ని రకాలుగా బురద జల్లుతోందన్నారు. తాను కోల్‌కతా వెళ్లినప్పుడు సుభాష్‌చంద్ర బోస్‌ను, ఝాన్సీ వె ళ్లినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరించుకున్నానని, హిమాచల్‌లో భరతమాత ముద్దుబిడ్డ విక్రమ్ బాత్రాను తలచుకున్నానన్నారు. అంతకుముందు... హిమాచల్, ఉత్తరాఖండ్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ దగాకోరు పార్టీ అని విమర్శించారు.