మరో బయోపిక్‌లో భరత్‌ హీరోయిన్‌ | Kiara Advani In Vikram Batra Biopic | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 18 2018 12:59 PM | Last Updated on Tue, May 28 2019 10:04 AM

Kiara Advani In Vikram Batra Biopic - Sakshi

భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కియారా మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు కియారా.

ధోని బయోపిక్‌తో బాలీవుడ్‌ లో గుర్తింపు తెచ్చుకున్న కియారా ఇటీవల లస్ట్‌స్టోరిస్‌ తో సెన్సేషన్‌ సృష్టించారు. తాజా మరో బయోపిక్‌ లో నటించేందుకు ఓకె చెప్పారు. పరమవీర చక్ర సాధించిన అమర జవాన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కియారా కీలక పాత్రలో నటించనున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహర్‌ నిర్మిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement