
... అంటున్నారు కియారా అద్వానీ. ఎందుకు? అంటే.. ప్రస్తుతం తన కెరీర్ మోస్ట్ ఎగై్జటింగ్‌గా ఉందట. ‘ఎమ్‌ఎస్ ధోని’ చిత్రంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఫేమ్ సంపాదించి, ‘భరత్ అనే నేను’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన విషయం తెలిసిందే. ఈ ఎగై్జటింగ్ జర్నీ గురించి కియారా మాట్లాడుతూ –‘‘2018 నా కెరీర్‌లో మోస్ట్ ఎగై్జటింగ్ ఇయర్ అనుకుంటున్నాను. ఎక్కువ మంది ఆడియన్స్‌కు దగ్గర కావడమే దానికి కారణం. నాకు తెలియని భాషలో (తెలుగు) సినిమా చేశాను.
అందులో కూడా నా మార్క్ చూపించడానికి హార్డ్‌వర్క్ చేశాను. ఇక మీదట కూడా చేస్తాను. కరణ్ జోహార్ దర్శకత్వంలో నటించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ద్వారా ప్రపంచ ఆడియన్స్‌కు దగ్గరవుతున్నాను. ఇలా అన్ని ప్రాంతాల ఆడియన్స్‌ను చేరుకోవడంతో 2018 నాకు చాలా స్పెషల్‌గా భావిస్తున్నాను. రానున్న రోజులు మరింత స్పెషల్‌గా ఉంటాయని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారామె. కియారా ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment