ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సంచలన ఆరోపణలు చక్కర్లు కొట్టాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన కొందరు టెక్నీషియన్ల(కొరటాల, కైరా పేర్లను ప్రముఖంగా ప్రచురించాయి) పేమెంట్లను ఎగ్గొట్టారంటూ నిర్మాత దానయ్యపై ఆరోపణలు చేస్తూ కొన్నికథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రకటనలో స్పందించారు.
‘ప్రొడక్షన్ హౌజ్ మీద వచ్చిన పుకార్లు చాలా బాధించాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి ఎవరికీ, ఎలాంటి పెమెంట్లు ఎగ్గొట్టలేదు. ఈ విషయంలో ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే. హైదరాబాద్‌లోని మా కార్యాలయానికి నేరుగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. ఇకపై ఇలాంటి చెత్త కథనాలు ఇకపై ప్రచురించకండని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్‌హిట్ గా నిలిచింది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మరోవైపు రామ్‌చరణ్-బోయపాటి చిత్రానికి దానయ్యే నిర్మాత కాగా.. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కబోయే భారీ మల్టీస్టారర్‌కు కూడా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పైనే రూపొందబోతోంది.
A statement from our Producer Sri Danayya DVV garu. pic.twitter.com/QHjLL6jro5
— DVV Entertainment (@DVVEnts) 15 July 2018
Comments
Please login to add a commentAdd a comment