‘ఆయన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు’ అందుకే ఈ సినిమాని, క్యారెక్టర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని బాలీవుడ్ హీరో సిద్దార్థ మల్హోత్రా అన్నాడు. నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కెప్టన్ విక్రమ్ బత్రా త్యాగాన్ని గుర్తు చేస్తూ అతడు ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ప్రస్తుతం.. కెప్టెన్ ‘విక్రమ్ బాత్రా ’ బయోపిక్ ‘షేర్షా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. షేర్షాలో కెప్టెన్ పాత్రకు పూర్తి న్యాయం చేసి అమరవీరుల కుటుంబాలను సంతోష పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కెప్టెన విక్రమ్ బాత్రా పాకిస్తాన్ చొరబాటు దారుల నుంచి భారత భూభాగాలను రక్షించి.. దేశ సేవలో ఆయన ప్రాణాలు అర్పించారు. యుద్ధంలో ఆయన ధైర్యాన్ని చూసిన పాకిస్తాన్ ఆర్మీ ఆయనను షేర్షా (లయన్ కింగ్ ) అని పిలిచేదట.
ఈ నేపథ్యంలో సిద్ధార్థ మాట్లాడుతూ ‘ఆయన కీర్తిని తెరపై చూపించాల్సిన భాధ్యత ఎంతో ఉంది. షేర్షా మూవీని కమర్షియల్ సినిమాలా కాకుండా బాత్రా కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్మించాలి అనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. తాను విక్రమ్ బాత్రా తల్లిదండ్రులను, సోదరుడిని కలిసినప్పుడు.. వాళ్లు కెప్టెన్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ‘షేర్షా పాత్రలో నటించడం అంత సులభమైన విషయం కాదని, దేశ రక్షణ బాధ్యత తన భుజాలపై ఉందని కెప్టెన్ భావించేవారని సిద్ధార్థ్ అన్నాడు. కాగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహించనున్నాడు.
Beginning the journey of #Shershaah soon!@SidMalhotra @Advani_Kiara @vishnu_dir #HirooJohar @apoorvamehta18 @b_shabbir #AjayShah #HimanshuGandhi @dharmamovies pic.twitter.com/QBoxMeBDcv
— Karan Johar (@karanjohar) May 2, 2019
Comments
Please login to add a commentAdd a comment