kargil divas
-
పాక్‌పై విజయానికి పాతికేళ్లు.. కార్గిల్ విజయ్ దివస్న అమరజవాన్లకు ప్రధాని నివాళులు (ఫొటోలు)
-
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్‌నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్‌కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ బీచ్ రోడ్ లో 22వ కార్గిల్ విజయ్ దినోత్సవం
-
‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’
‘ఆయన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు’ అందుకే ఈ సినిమాని, క్యారెక్టర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని బాలీవుడ్ హీరో సిద్దార్థ మల్హోత్రా అన్నాడు. నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కెప్టన్ విక్రమ్ బత్రా త్యాగాన్ని గుర్తు చేస్తూ అతడు ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ప్రస్తుతం.. కెప్టెన్ ‘విక్రమ్ బాత్రా ’ బయోపిక్ ‘షేర్షా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. షేర్షాలో కెప్టెన్ పాత్రకు పూర్తి న్యాయం చేసి అమరవీరుల కుటుంబాలను సంతోష పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కెప్టెన విక్రమ్ బాత్రా పాకిస్తాన్ చొరబాటు దారుల నుంచి భారత భూభాగాలను రక్షించి.. దేశ సేవలో ఆయన ప్రాణాలు అర్పించారు. యుద్ధంలో ఆయన ధైర్యాన్ని చూసిన పాకిస్తాన్ ఆర్మీ ఆయనను షేర్షా (లయన్ కింగ్ ) అని పిలిచేదట. ఈ నేపథ్యంలో సిద్ధార్థ మాట్లాడుతూ ‘ఆయన కీర్తిని తెరపై చూపించాల్సిన భాధ్యత ఎంతో ఉంది. షేర్షా మూవీని కమర్షియల్ సినిమాలా కాకుండా బాత్రా కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్మించాలి అనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. తాను విక్రమ్ బాత్రా తల్లిదండ్రులను, సోదరుడిని కలిసినప్పుడు.. వాళ్లు కెప్టెన్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ‘షేర్షా పాత్రలో నటించడం అంత సులభమైన విషయం కాదని, దేశ రక్షణ బాధ్యత తన భుజాలపై ఉందని కెప్టెన్ భావించేవారని సిద్ధార్థ్ అన్నాడు. కాగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహించనున్నాడు. Beginning the journey of #Shershaah soon!@SidMalhotra @Advani_Kiara @vishnu_dir #HirooJohar @apoorvamehta18 @b_shabbir #AjayShah #HimanshuGandhi @dharmamovies pic.twitter.com/QBoxMeBDcv — Karan Johar (@karanjohar) May 2, 2019 -
దేశ సేవకు పునరంకితం కావాలి
అనంతపురం సెంట్రల్ : కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల పోరాటం, వారి ప్రాణత్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు పునరంకితం కావాలని మాజీ సైనికులు పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలో మంగళవారం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్‌క్లాక్, సుభాష్‌రోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ చేరుకుని అక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్ షేకన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాలను ఎదురొడ్డి దేశరక్షణకు అహర్నిశలు పోరాడుతున్న భారత సైనికులు, అమరుల జీవితాలు అందిరికీ స్ఫూర్తిదాయం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్చెల్సీ కాలనీలో మాజీ సైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, డాక్టర్ రామసుబ్బయ్య, డిప్యూటీ మేయర్ గంపన్న, టౌన్ బ్యాంకు అధ్యక్షులు మురళీ, తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల నివాళి.. కార్గిల్ అమర వీరులకు బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. మంగళవారం టవర్‌క్లాక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి వారి సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత యువత కార్గిల్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు లలిత్‌కుమార్, శ్రీనివాసులు, గోవిందరాజులు, చంద్రశేఖర్, సోమయ్య, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.