బాలీవుడ్‌లో పలు పోలీస్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ఈసారి తెలుగుతో సహా పలు భాషల్లో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన తర్వాత ఎలాంటి అప్‌డేట్‌లు ఇవ్వని మేకర్స్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ వెబ్ సిరీస్‌పై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. సిద్దార్త్ మల్హోత్రా, శిల్పాశెట్టిలతో పాటు వివేక్ ఒబెరాయ్, శ్వేతా తివారీ, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్‌లు పోలీసు అధికారులుగా ఈ సిరీస్‌లో కనిపించనున్నారు.
భారత పోలీసుల నిబద్ధతను, పరాక్రమాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. 7భాగాలుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను ముందుగా దీపావళి 8న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరికి పోస్ట్ పోన్ చేశారు.
Lights, Siren, Action!🚨
— prime video IN (@PrimeVideoIN) October 21, 2023
Amazon Original Indian Police Force, a larger than life series to release Worldwide on Jan 19, 2024! Thrilled to be bringing this high-octane action entertainer from the incredible Rohit Shetty to audiences. Paying an ode to our Indian Police on… pic.twitter.com/vIbFKqQzL4
Comments
Please login to add a commentAdd a comment