సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా వరలక్ష్మీ శరత్ కుమార్‌కు గుర్తింపు ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల అయింది. సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. దసర సందర్భంగా ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ మూవీని నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు.
శబరి చిత్రంలో కూతురుని కాపాడుకునే తల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు సన్‍నెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు బేబి కృతిక, గణేశ్ వెంకటరామన్, మైమ్ గోపి కీలకపాత్రలు పోషించారు.
కథేంటంటే...
సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్‌లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది.
అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment