Sun NXT
-
ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం కేవలం తమిళ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్‌లోకి రాగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు కూడా ఉంది. ఇంతకీ ఇదే సినిమా? తెలుగు వెర్షన్ ఎందులో ఉంది?'జైలర్' దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ సినిమా 'బ్లడీ బెగ్గర్'. కవిన్ హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ.. తెలుగులో నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. తొలుత దీని తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)ప్రస్తుతానికి మన దగ్గర తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లోనూ 'బ్లడీ బెగ్గర్' మూవీ తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి.'బ్లడీ బెగ్గర్' విషయానికొస్తే.. కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). ఓ రోజు దినం భోజనాల కోసమని ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. తిరిగి ఇంటికి వెళ్లకుండా దొంగచాటుగా బంగ్లాలోకి దూరుతాడు. కాసేపు బాగానే ఎంజాయ్ చేస్తాడు కానీ ఊహించని విధంగా లోపల ఇరుక్కుపోతాడు. తర్వాత ఏమైంది? బంగ్లా ఓనర్స్ ఇతడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
మరో ఓటీటీలోకి వచ్చేసిన రెండు థ్రిల్లర్ సినిమాలు
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే రెండు మూవీస్ వచ్చేశాయి. కాకపోతే ఇవి ఇప్పటికే ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా వేరే వాటిలోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి తెలుగు స్ట్రెయిట్ మూవీ కాగా, మరొకటి డబ్బింగ్ బొమ్మ. ఇంతకీ ఇవేంటి? ఏ ఓటీటీల్లో ఉన్నాయి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!)తెలుగమ్మాయి చాందిని చౌదరి పోలీస్‌గా నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'యేవమ్'. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. ఇదివరకే ఆహా ఓటీటీలో ఉండగా.. ఇప్పుడు సన్ నెక్స్ట్‌లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఇందులో హాట్ బ్యూటీ అషూరెడ్డి కూడా కీలక పాత్రలో నటించింది.మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శబరి'. కూతురిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి పడే తపన చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా తీశారు. సస్పెన్స్‌తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. కొన్నిరోజుల క్రితం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఐదు భాషల్లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. ఈ వీకెండ్ ఏమైనా థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే వీటిని ట్రై చేసి చూడండి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఓటీటీలో 'వరలక్ష్మి శరత్ కుమార్' పాన్ ఇండియా సినిమా
సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా వరలక్ష్మీ శరత్ కుమార్‌కు గుర్తింపు ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల అయింది. సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. దసర సందర్భంగా ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ మూవీని నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు.శబరి చిత్రంలో కూతురుని కాపాడుకునే తల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు సన్‌నెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు బేబి కృతిక, గణేశ్ వెంకటరామన్, మైమ్ గోపి కీలకపాత్రలు పోషించారు.కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది.అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్పార్క్. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి విక్రాంత్ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. దాదాపు విడుదలైన పది నెలల తర్వాత సన్ నెక్ట్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు.స్కార్క్ కథేంటంటే?లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు.పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
మరో ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ 'రాయన్' మూవీ
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'రాయన్'. యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో తీయగా.. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కాళీదాస్ జయరం, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ అవగా.. తెలుగులో ఓకే ఓకే అనేలా ఆడింది.(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాయన్'ని మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఉంది. ఇందులోకే ఇప్పుడు రాయన్ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే విదేశీ ఓటీటీ ప్రియులకు మాత్రమే ఈ యాప్‌లో 'రాయన్' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని స్వయంగా సన్ నెక్స్ట్ పోస్ట్ చేసింది.'రాయన్' విషయానికొస్తే.. రాయన్ (ధనుష్) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. ఇతడికి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి ఉంటుంది. గుట్టుగా బతుకున్న వీళ్ల జీవితం.. రాయన్ తమ్ముడు వల్ల ఊహించని చిక్కులు ఎదుర్కొంటుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు. అసలు దీనికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 సన్ నెక్ట్స్ అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 -
స్టార్ హీరో సంక్రాంతి సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తోంది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అయలాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తమిళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. మొదట ఈ మూవీని జనవరి 26న టాలీవుడ్ ప్రేక్షకులను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కానీ కానీ ఊహించని విధంగా తెలుగు బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) అయితే ఈ చిత్రం ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లుగానే తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈనెల 9 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ అభిమాన హీరో మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Thamizh and Tattoo are all set to meet you on February 9th 👽🔥#Ayalaan streaming worldwide exclusively on #SunNXT@Siva_Kartikeyan @rakulpreet @ravikumar_dir @arrahman#SivaKarthikeyan #ARRahman #AyalaanOnSunNXTFromFeb9 #AyalaanOnSunNXT #SunNXTExclusiveAyalaan pic.twitter.com/m3QgKBosa8 — SUN NXT (@sunnxt) February 6, 2024 -
సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించన రొమాంటిక్ కామెడీ మూవీ 'తిరుచిత్రం బలం'( తెలుగులో తిరు). 2022లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ కూడా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, భారతీరాజా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా.. గతేడాది ఆగస్ట్ 18న థియేటర్లలో విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో ఏలియన్.. టీజర్ అదిరిపోయింది!) సన్ నెక్ట్స్తో నిర్మాతలకు విభేదాలు తిరుచిత్రంబలం మూవీ స్ట్రీమింగ్ హక్కులపై నిర్మాతలు, సన్ నెక్ట్స్ యాజమాన్యానికి అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మార్చారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. అయితే ఈ నిర్ణయంపై ధనుశ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. Well it’s been a while isn’t ? Thiruchitrambalam from august 18th. See you all in theatres. pic.twitter.com/foFZmqronV — Dhanush (@dhanushkraja) June 15, 2022 -
'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. దీంతో చాలామంది ఆయన పని అయిపోయిందనుకున్నారు. కానీ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్ని బ్రేక్ చేశారు. తలైవా ఈజ్ బ్యాక్ అని అందరూ అనుకునేలా చేశారు. థియేటర్లలో ఇప్పటికీ ఎంటర్ టైన్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 'జైలర్'కి అది ప్లస్ 'జైలర్' సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే రజనీ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. గత మూవీ 'బీస్ట్' సరిగా ఆడలేదు. అలా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియెన్స్ సినిమాకు వెళ్లారు. కానీ 'జైలర్' చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ వల్లే భోళా శంకర్ ఫ్లాప్.. ఆయనకు తెలుసు!: బేబి నిర్మాత) ఆరోజు నుంచే? రజనీకాంత్ చరిష్మా, అనిరుధ్ మ్యూజిక్ వల్ల 'జైలర్' బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి చెందిన సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. అయితే సెప్టెంబరు 7 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. హిందీ డబ్బింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదే రోజు రిలీజ్ కానుందని సమాచారం. దాదాపు ఇది కన్ఫర్మ్, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎంత? థియేటర్లలోకి వచ్చి 13 రోజులు పూర్తి చేసుకున్న 'జైలర్'.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలానే లాంగ్ రన్లో ఇది రూ.600 కోట్ల మార్క్ ని దాటేయొచ్చని అనిపిస్తుంది. ఫైనల్ గా ఎన్ని కోట్లు వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) -
'జైలర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తలైవా మేనియాతో అంతా సందడి సందడిగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఓ మాదిరిగా సక్సెస్ అయింది. దీంతో ఈ వీకెండ్ బాగానే వసూళ్లు రాబట్టే అవకాశముంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీ పార్ట్నర్ని ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం ఆ విషయాలు బయటకొచ్చేశాయి. ఇంతకీ 'జైలర్' ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) 'జైలర్' కథేంటి? టైగర్ ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీ అధికారి. విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. దీంతో కొడుకు ఆచూకీ కోసం ముత్తు చాలా తిరుగుతాడు. మరి ముత్తు, కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? అనేదే 'జైలర్' స్టోరీ. ఆ ఓటీటీలేనే? రజినీకాంత్ 'జైలర్' సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతమందించగా, నెల్సన్ దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడినప్పటికీ.. సన్ పిక్చర్స్ సొంత సంస్థ సన్ నెక్స్ట్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెలన్నర తర్వాత అంటే సెప్టెంబరు చివర్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!) -
ఓటీటీలో ఒకేరోజు 15కు పైగా రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు
వినోదం కావాలంటే సినిమా ఉండాల్సిందే! వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళ్లేవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఏ మూవీకెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. థియేటర్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందనేదాని కన్నా కూడా ఏ మూవీ ఓటీటీలో వచ్చింది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? కొత్తగా వెబ్ సిరీస్‌లు ఏమొచ్చాయి? ఏవి ట్రెండ్ అవుతున్నాయి? ఏయే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమేం బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయని ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. అలా అని థియేటర్‌కు వెళ్లడం మానేస్తున్నారని కాదు. ఓపక్క మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్‌కు వెళ్లి దాన్ని ఆదరిస్తూనే మరోపక్క ఓటీటీలో నిరంతరం ఏదో ఒక సినిమా/సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలో రేపు ఒక్కరోజే దాదాపు బోలెడన్ని సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం.. నెట్‌ఫ్లిక్స్ ► సార్/వాతి ► కాట్ అవుట్ ► కుత్తే ► ది మెజీషియన్స్ ఎలిఫెంట్ ► నాయిస్ ► స్కై హై: ది సిరీస్ ► ఇన్హిస్ షాడో ► మ్యాస్ట్రో ఇన్ బ్లూ ► డ్యాన్స్ 100 ► ఏజెంట్ ఏల్విస్ జీ5 ► రచయిత ► ఐయామ్ ఐ నెక్స్ట్ ఆహా ► సత్తిగాడి రెండు ఎకరాలు ► లాక్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ► గంధదగుడి సన్ నెక్స్ట్ ► వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలిగూడ సోనీలివ్ ► రాకెట్ బాయ్స్ - రెండో సిరీస్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) ► ది వేల్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) హాట్‌స్టార్ ► పాప్ కౌన్ -
ఓటీటీలో లాఠీ, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ విశాల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లాఠీ. సునయన కథానాయిక. ఎ.వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నంద నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించాడు. గత నెల 22న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది. కథ విషయానికి వస్తే.. సిన్సియర్ కానిస్టేబుల్ అయిన మురళీకృష్ణ(విశాల్) తన కుటుంబమే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతడిని అధికారులు సస్పెండ్ చేస్తారు. ఎలాగోలా తిరిగి ఉద్యోగంలో చేరతాడు కానీ ఎవరినీ లాఠీతో శిక్షించొద్దని నిర్ణయించుకుంటాడు. ఓసారి డీఐజీ ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని ఆదేశిస్తాడు. తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడిని వీరబాదుడు బాదుతాడు. ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ కొడుకు. తనను కొట్టిన మురళిపై పగపడతాడు. అతడి నుంచి మురళి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నదే మిగతా కథ. Laththi streaming from 14th Jan only on Sun NXT#SunNXT #Laththi #LaththiCharge #Vishal #Sunaina #Prabhu #Munishkanth #MeeshaGhoshal #ThalaivasalVijay #AVinothKumar @VishalKOfficial @TheSunainaa pic.twitter.com/wbNiF642u9 — SUN NXT (@sunnxt) January 12, 2023 చదవండి: వారీసు వర్సెస్ తునివు.. ఓపెనింగ్స్ ఎంత వచ్చాయంటే? -
‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ, డిజిటల్ రైట్స్ అన్ని కోట్లా?!
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈమూవీ ఓటీటీ, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ రేట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. కాగా పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలను ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ రూ. 120 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్, శాటిలైట్‌ను రైట్స్‌ను అమెజాన్‌తో పాటు సన్‌టీవీ కూడా విక్రయించారట. అయితే ఎంతమొత్తానికి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. -
రెండు ఓటీటీల్లోకి బీస్ట్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే?
దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. బీస్ట్ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా వచ్చే బుధవారం(మే 11) నుంచి ఎప్పుడైనా ఓటీటీలో చూసేయొచ్చు. Can you feel the POWER💥TERROR💥FIRE💥BECAUSE BEAST ARRIVES ON NETFLIX ON MAY 11 💪 in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi. pic.twitter.com/7M5uuvlnsA — Netflix India (@NetflixIndia) May 4, 2022 Watch the latest blockbuster #Beast starring #ThalapathyVijay on Sun NXT from May 11 onwards#BeastOnSunNXT #BeastModeON #PoojaHegde @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @KiranDrk @anbariv @valentino_suren pic.twitter.com/Z3jZGsIIiC — SUN NXT (@sunnxt) May 3, 2022 చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. ఆ జానర్లో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరో శ్రీ విష్ణు – రాజమౌళి -
'బీస్ట్' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు ?.. వచ్చేది ఆరోజే !
Vijay Beast Movie OTT Release Date Confirmed: కరోనా కాలం, లాక్డౌన్ తర్వాత సినిమాలు థియేటర్లలో పాటు ఓటీటీల్లో కూడా ఎప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిన్న, పెద్ద హీరోలు, సినిమాలు అంటూ ఎలాంటి బేధం లేకుండా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం బీస్ట్. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. కళానిధి మారన్ నిర్మాతగ వ్యవహించిన 'బీస్ట్' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్డేట్ వచ్చింది. మే రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఓటీటీలో 'బీస్ట్' తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది. ఇక బీస్ట్ హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ప్రస్తుత సమాచారం ప్రకారం 'బీస్ట్' మే 13న అన్ని భాషల్లో ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'బీస్ట్'పై ప్రేక్షకుల రివ్యూ చదవండి: విజయ్ ‘బీస్ట్’ మూవీ ఎలా ఉందంటే.. -
ఓటీటీలోకి రానా '1945' మూవీ, ఎప్పటినుంచంటే?
స్టార్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 1945. సత్య శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. బ్రిటీష్ పాలన నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో రెజీనా కసాండ్రా హీరోయిన్గా, నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో నిర్మాత సి. కల్యాన్, దర్శకుడు సత్య శివ, రానాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రానా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో 90 శాతం పూర్తయిన షూటింగ్ ఆగిపోయింది. కానీ క్లైమాక్స్ చిత్రీకరణ జరపకుండానే జనవరి 7న థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్స్ట్లో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. Get ready for some goosebumps as Aadi battles for this motherland! 1945 premiering on February 7 only on #SUNNXT#1945Movie #RanaDaggubati #ReginaCassandra #Nassar #Sathyaraj #Sathyasiva #YuvanShankarRaja @RanaDaggubati @ReginaCassandra @thisisysr @Sathyasivadir pic.twitter.com/cEBpKUISLD — SUN NXT (@sunnxt) February 3, 2022 -
Its Official: చెక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
గతేడాది భీష్మతో హిట్టు కొట్టిన యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్‌తో అభిమానుల ముందుకొచ్చాడు. కానీ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి అందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ జనాలకు కొత్తదనాన్ని పంచింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు కురిపించనప్పటికీ మంచి ప్రశంసలైతే దక్కాయి. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 14 నుంచి సన్ నెక్స్ట్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది కథ. కాగా ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో ప్రేయసిగా, రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాదిగా నటించారు. సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. ఏదేమైనా కోవిడ్ భయంతో థియేటర్లో చూడలేని వాళ్లు, లేదా ఇంకోసారి చూడాలనుకునేవాళ్లు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే సన్ నెక్స్ట్ యాప్‌లో చూసేయొచ్చు. Youth Star @actor_nithiin 's #Check ♟️ will be Streaming on @sunnxt from May 14th. A @yeletics' s Film.#CheckOnSunnxt @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @ShakthisreeG @HaricharanMusic @ShreeLyricist @BhavyaCreations @adityamusic pic.twitter.com/k2Ok60xjll — BARaju (@baraju_SuperHit) May 12, 2021 చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ