Thalapathy Vijay Beast Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Beast In OTT: ఓటీటీల్లోకి బీస్ట్‌, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Published Wed, May 4 2022 2:51 PM | Last Updated on Wed, May 4 2022 3:52 PM

Sun NXT And Netflix Confirms Vijay Movie Beast OTT Release Date - Sakshi

దళపతి విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్‌ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్‌ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 రిలీజ్‌ కావడంతో బీస్ట్‌ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది.

అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. సన్‌ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్‌ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. బీస్ట్‌ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా వచ్చే బుధవారం(మే 11) నుంచి ఎప్పుడైనా ఓటీటీలో చూసేయొచ్చు.

చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా..

ఆ జానర్‌లో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరో శ్రీ విష్ణు – రాజమౌళి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement