
Vijay Beast Movie OTT Release Date Confirmed: కరోనా కాలం, లాక్‌డౌన్ తర్వాత సినిమాలు థియేటర్లలో పాటు ఓటీటీల్లో కూడా ఎప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిన్న, పెద్ద హీరోలు, సినిమాలు అంటూ ఎలాంటి బేధం లేకుండా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం బీస్ట్. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. కళానిధి మారన్ నిర్మాతగ వ్యవహించిన 'బీస్ట్' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్‌డేట్ వచ్చింది. మే రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఓటీటీలో 'బీస్ట్' తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది. ఇక బీస్ట్ హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ప్రస్తుత సమాచారం ప్రకారం 'బీస్ట్' మే 13న అన్ని భాషల్లో ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది.
చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'బీస్ట్'పై ప్రేక్షకుల రివ్యూ
చదవండి: విజయ్ ‘బీస్ట్’ మూవీ ఎలా ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment