ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్ధ అయిన నెట్‌ఫ్లిక్స్ కోలీవుడ్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. 2024లో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనుంది. దీని గురించి ఆ సంస్థ నిర్వాహకురాలు మోనికా పెర్కన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ మంచి కంటెంట్ తక్కువ అయినా జనరంజిత చిత్రాలను అందిస్తూ అలరించే విషయంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు.
గత ఏడాది విజయ్ కథానాయకుడిగా నటించిన లియో, అజిత్ హీరోగా నటించిన తుణివు, ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను స్ట్రీమింగ్ చేసినట్లు తెలిపారు. అలాగే 2024లో 9 తమిళ భారీ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయని చెప్పారు. వీటిలో కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్–2, అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న విడాముయర్చి, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన కంజూరింగ్ కన్నప్పన్, కీర్తి సురేష్ ప్రధానపాత్రలో డ్రీమ్ వారియర్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న కన్నివెడి, విజయ్‌సేతుపతి కథానాయకుడిగా ఫ్యాషన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న మహరాజా చిత్రం ఉంది.
సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ శివకార్తికేయన్ 21వ చిత్రం ఫ్యాషన్ ఫిలిం ఫ్యాక్టరీ, దిరూట్ సంస్థలు నిర్మిస్తున్న రివాల్వర్ రీటా, ఎస్‌ఎన్‌ఎస్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ నిర్మిస్తున్న స్వర్గ వాసల్, స్టూడియో గ్రీన్ పతాకంపై విక్రమ్ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న తంగలాన్ చిత్రం ఉంటాయన్నారు. ఇక ఈ తొమ్మిది చిత్రాలను తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment