విజయ్‌ సినిమా చూసి థియేటర్‌లో నిద్రపోయా: హీరోయిన్‌ | Aditi Balan: I Fell Asleep in Theater After Watching Vijay Movie | Sakshi
Sakshi News home page

Aditi Balan: ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో విజయ్‌ సినిమాకు.. 15 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నా..

Published Wed, Oct 16 2024 8:38 PM | Last Updated on Thu, Oct 17 2024 9:15 AM

Aditi Balan: I Fell Asleep in Theater After Watching Vijay Movie

తమిళ నటి అదితి బాలన్‌ శాకుంతలం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానికి సోదరిగా నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్‌ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

15 నిమిషాల్లో నిద్రలోకి..
విజయ్‌కు నేను పెద్ద అభిమానిని. వింటేజ్‌ విజయ్‌ అంటే చాలా ఇష్టం. అతడి అన్ని సినిమాలు చూస్తాను. అన్నింటిలోకెల్లా కిల్లీ నా ఫేవరెట్‌ మూవీ. ఒకసారేమైందంటే పాండిచ్చేరిలో దాదాపు 20 మంది ఫ్రెండ్స్‌ కలిసి బీస్ట్‌ సినిమా చూసేందుకు వెళ్లాం. 15 నిమిషాల వరకు బాగానే చూశాం. నానా హంగామా చేశాం. తర్వాత ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయాం. నేనైతే ఏకంగా నిద్రపోయాను. నా ఫ్రెండ్స్‌ అది కూడా వీడియో తీశారు. 

విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం
నిజంగానే బీస్ట్‌ మూవీ చూస్తుంటే తెలియకుండానే నిద్ర ఆవహించింది అని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటివి అయ్యుండి హీరో గురించి ఇలాగే మాట్లాడతావా? అని మండిపడుతున్నారు. కాగా అదితి బాలన్‌.. అరువి సినిమాతో‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ యాక్ట్‌ చేస్తోంది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement