Thalapathy Vijay Father SA Chandrasekhar Slams Beast Director Nelson Dilipkumar - Sakshi
Sakshi News home page

Beast: బీస్ట్‌ సినిమాలో స్క్రీన్‌ప్లే ఏది? ముందుగా అవి తెలుసుకోవాలి కదా: డైరెక్టర్‌పై విజయ్‌ తండ్రి ఆగ్రహం

Published Wed, Apr 20 2022 1:06 PM | Last Updated on Wed, Apr 20 2022 1:42 PM

Thalapathy Vijay Father SA Chandrasekhar Slams Beast Director Nelson Dilipkumar - Sakshi

అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్‌ సబ్జెక్ట్‌ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ ఉండాలి. కానీ సినిమాలో అదెక్కడా కనిపించనే లేదు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది.

తమిళ స్టార్‌ విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బీస్ట్‌.  ఏప్రిల్‌13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పర్వాలేదనిపించింది. ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్‌ రివ్యూలు వచ్చాయి. తాజాగా దీనిపై విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్పందించారు. బీస్ట్‌ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ మీద అసహనం వ్యక్తం చేశాడు.  బీస్ట్‌ మంచి కలెక్షన్లు రాబడుతుందేమో కానీ స్క్రీన్‌ప్లేలో అసలు మ్యాజిక్‌ మిస్సయిందని చెప్పుకొచ్చాడు.

ఓ టీవీ చానల్‌తో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. 'అరబిక్‌ కుతు సాంగ్‌ను డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఎలా అయితే ఎంజాయ్‌ చేశారో నేనూ అలాగే ఎంజాయ్‌ చేశాను. కానీ బీస్ట్‌ కేవలం విజయ్‌ స్టార్‌డమ్‌ మీదే నమ్మకం పెట్టుకుని నడిచినట్లు ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్‌ సబ్జెక్ట్‌ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ ఉండాలి. కానీ సినిమాలో అదెక్కడా కనిపించనే లేదు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్‌ ఏం చేస్తారు? వారు ఎలా ప్రవర్తిస్తారు? అనేది లోతుగా తెలుసుకుని సినిమాను తెరకెక్కించాల్సింది. బీస్ట్‌ సినిమా సక్సెస్‌పై అనుమానించాల్సిన అవసరమే లేదు. సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్‌, ఫైట్‌ మాస్టర్‌, ఎడిటర్‌, హీరో.. వీళ్ల వల్లే బీస్ట్‌ సక్సెస్‌ అయింది అని తెలిపాడు. కానీ విజయానికి కారణమైనవారి జాబితాలో డైరెక్టర్‌ నెల్సన్‌ పేరును ప్రస్తావించలేదు. కాగా సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన బీస్ట్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది.

చదవండి: స్టార్‌ హీరోలతో స్టెప్పులేయించిన బాబా భాస్కర్‌

'తెలుగు వారి హిందీ దర్శకుడు' తాతినేని చివరి సినిమా ఏదంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement