SA Chandrasekar
-
అదంతా నాటకం.. అతన్ని విజయ్ గుడ్డిగా నమ్ముతున్నాడు: దళపతి
తమిళసినిమా: అభిమానులు దళపతిగా నెత్తిన మోస్తున్న నటుడు విజయ్. ఈయన్ని ప్రారంభ కాలంలో నటుడిగా నిలబెట్టింది ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. నాళైయతీర్పు చిత్రంతో విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేసింది ఆయనే. ఆ తరువాత వరుసగా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. అదే విధంగా విజయ్ను రాయకీయ రంగ ప్రవేశానికి శ్రీకారం చుట్టిందీ ఆయన తండ్రే. మొన్న మొన్నటి వరకూ విజయ్ గురించి, ఆయన చిత్రాల కాల్షీట్స్ గురించి అంతా చూసుకుంది దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌నే. విజయ్ పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ, విజయ్ తన తండ్రిని దూరంగా పెట్టారు. ఆయనతో మాట్లాడటమే పాపంగా భావిస్తున్నారు. కాగా కొంత కాలం క్రితం పుదుచ్చేరి శాసన సభ్యుడు బుషీఆనంద్ నటుడు విజయ్ సరసన చేరి ఇప్పుడు అంతా ఆయనేగా మారారు. విజయ్ రాజకీయ రంగాన్ని ఆయనే రచిస్తున్నారు. ఈ వ్యవహారంపై మౌనం వహించిన విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తాజాగా బరస్ట్ అయ్యారు. తన కొడుకు విజయ్‌తో అంటకాగుతున్న బుషీ ఆనంద్ గురించి తన ఎక్స్ మీడియాలో స్పందిస్తూ అంతా నాటకం అని పేర్కొన్నారు. ఆయన ఎలాంటి వారో చెబుతూ తాను బుషీ ఆనంద్‌పై కావాలని ఆరోపణలు చేయడం లేదని, నిజం ఏమిటన్నది మీరందరికీ తెలుసన్నారు. ఆయన ఆన్లైన్ గ్రూప్ ద్వారా తనకు మద్దతు కూడకట్టుకుంటున్నారన్నారు. అందుకంటూ ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఆ గ్రూప్‌లో విజయ్ కూడా ఉన్నారని చెప్పారు. అంతా నాటకం అని, ఏ రాజకీయ నాయకుడూ చేయనిది బుషీ ఆనంద్ చేస్తున్నారని అన్నారు. అభిమాన సంఘానికి వచ్చే బుషీ ఆనంద్ అలసిపోయి అక్కడ ఉన్న టేబుల్‌పై పడుకుంటారని, దాన్ని ఒక వ్యక్తి పొటో తీసి ఆన్లైన్ గ్రూప్‌లో పొందుపరుస్తాడని చెప్పారు. దాన్ని మరో 50 మంది షేర్ చేస్తారన్నారని, మరో 100 మందితో లైక్ చేయిస్తారని ఇదంతా నాటకం అని అన్నారు. ఇదంతా చూసిన విజయ్, బుషీ ఆనంద్ తన కోసం రంగంలోకి దిగి ఇలా కింద కూడా కూర్చొంటున్నారని, ఆయన గురించి చాలా గొప్పగా భావించి అన్నా.. రేపటి నుంచి మీరు తనతో ఉండండి అని చెప్పారన్నారు. ఇదే జరిగిందని, ఇలాంటి వారు పక్కన ఉంటే విజయ్ భవిష్యత్ ఏమైపోతుందోనన్న భయం కలుగుతోందని దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆ గ్రామానికి ఓ వింత శాపం.. ఆసక్తికర కథాంశంతో వస్తోన్న చిత్రం !
తమిళ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మోహినీపట్టి. ఈ సినిమాకు ఆయన శిష్యుడు జయవీరన్ కామరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ మూన్ స్టూడియోస్ పతాకంపై జయభారతీ కామరాజ్ నిర్మించారు. ఇంజినీర్ అయిన ఈయన సినిమాపై ఆసక్తితో ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. తరువాత దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా మోహినీపట్టి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ మోహినీపట్టి ఫాంటసీ, థ్రిల్లర్ కథా చిత్రమని తెలిపారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) మోహినీపట్టి అనే ఒక కల్పిత గ్రామంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలే ఈ చిత్రమన్నారు. ఆ గ్రామానికి ఒక శాపం ఉంటుందన్నారు. అది ఆ ఊరు ప్రజలకు మాత్రమే తెలుసని.. అక్కడ ఎవరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేరన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక యువ జంట ప్రేమించుకోవడంతో ఆ గ్రామ కట్టుబాటును, సంప్రదాయాన్ని ఎలా ఎదిరించారు? గ్రామ శాపానికి బలి అయ్యారా? దాని నుంచి బయట పడగలిగారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రమని తెలిపారు. ఈ కాలంలో ఇలాంటి కథా అనే సందేహం రావచ్చు. కానీ ఒక్కో ఇంటికీ.. ఒక్కో ఊరుకు తెలియని రహస్యాలు ఉంటాయని, అలాంటి ఇక రహస్యంతో ఈ చిత్ర కథను రాసుకున్నట్లు చెప్పారు. ఇందులో సంగీత్, నిరంజన్ శివశంకర్, తౌవుపికా, జయశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీకి మనోజ్ కుమార్‌బాబు సంగీతాన్ని అందించారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు) #Mohinipatti #Webstories இயக்குநர் எஸ்.ஏ.சந்திரசேகரன் முக்கிய வேடத்தில் நடிக்கும் 'மோகினிப்பட்டி' பேண்டஸி திரில்லர் வெப் மூவி!https://t.co/4YCQR2rFy6இயக்குநர்-எஸ்-ஏ-சந்திரசே/@PROSakthiSaran pic.twitter.com/SbyjUy608r — KALAIPOONGA (@kalaipoongavij1) October 18, 2023 இயக்குனர் எஸ்.ஏ.சந்திரசேகர் நடிப்பில் உருவாகும் 'மோகினிப்பட்டி' மேலும் படிக்க :https://t.co/g3ETtqftZ1#mohinipatti #sachandrasekar #jeyaveerankamaraj #MMcinema #MMNews #Maalaimalar pic.twitter.com/nPXcO5R7ha — Maalai Malar தமிழ் (@maalaimalar) October 18, 2023 -
బీస్ట్ సినిమాలో స్క్రీన్‌ప్లే ఏమైనా బాగుందా?: విజయ్ తండ్రి అసహనం
తమిళ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఏప్రిల్13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా దీనిపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మీద అసహనం వ్యక్తం చేశాడు. బీస్ట్ మంచి కలెక్షన్లు రాబడుతుందేమో కానీ స్క్రీన్‌ప్లేలో అసలు మ్యాజిక్ మిస్సయిందని చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్‌తో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'అరబిక్ కుతు సాంగ్‌ను డైహార్డ్ ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో నేనూ అలాగే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్ కేవలం విజయ్ స్టార్డమ్ మీదే నమ్మకం పెట్టుకుని నడిచినట్లు ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్ ఉండాలి. కానీ సినిమాలో అదెక్కడా కనిపించనే లేదు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్ ఏం చేస్తారు? వారు ఎలా ప్రవర్తిస్తారు? అనేది లోతుగా తెలుసుకుని సినిమాను తెరకెక్కించాల్సింది. బీస్ట్ సినిమా సక్సెస్‌పై అనుమానించాల్సిన అవసరమే లేదు. సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్, ఎడిటర్, హీరో.. వీళ్ల వల్లే బీస్ట్ సక్సెస్ అయింది అని తెలిపాడు. కానీ విజయానికి కారణమైనవారి జాబితాలో డైరెక్టర్ నెల్సన్ పేరును ప్రస్తావించలేదు. కాగా సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. చదవండి: స్టార్ హీరోలతో స్టెప్పులేయించిన బాబా భాస్కర్ 'తెలుగు వారి హిందీ దర్శకుడు' తాతినేని చివరి సినిమా ఏదంటే? -
నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై హైడ్రామా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు, గురువారం ఎన్నికల సంఘం వద్ద తన రాజకీయపార్టీని రిజిస్టర్ చేయించాడంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన విజయ్ టీం అవన్నీ వట్టి వందతులేనని, అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మాత్రం.. ‘‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయాక్కం’’పేరిట పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించినట్లు వెల్లడించడంతో మరోసారి సస్పెన్స్ నెలకొంది. విజయ్‌తో ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపర్చలు చేశారు. ఈ క్రమంలో విజయ్ పేరిట ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ స్పందన కోరుకుంటున్న వాళ్ల కోసం ఈ అధికారిక ప్రకటన అంటూ పీఆర్ఓ రియాజ్ అహ్మద్ షేర్ చేసిన లేఖలో.. ‘‘మా నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ ఈరోజు రాజకీయ పార్టీ ప్రారంభించారని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీని వల్ల నా అభిమానులకు, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా. మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. కేవలం మా నాన్న స్థాపించారన్న కారణంగా, ఈ పార్టీలో చేరమని గానీ, పార్టీ కోసం పనిచేయమని గానీ నేను చెప్పదలచుకోలేదు. మనం మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల ఉద్యమానికి, పార్టీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే విజయ్ మక్కల్ ఇయాక్కం పేరిట స్థాపించిన పార్టీ కార్యకలాపాల్లో నా పేరుగానీ, ఫొటోగానీ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయబోను’ ’అని విజయ్ పేర్కొన్నట్లు ఉంది. తండ్రి తాపత్రయం తమిళనాట సినీ నటుడు దళపతి విజయ్‌కు ఉన్న అశేష అభిమాన లోకం గురించి తెలిసిందే. దీంతో తనయుడి చేత రాజకీయ ప్రవేశం చేయించాలని గత కొన్నేళ్లుగా విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తన పేరిట ఉన్న ∙మక్కల్ ఇయక్కం ద్వారా సేవ కార్యక్రమాలతో విజయ్ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఇటీవల కాలంగా తెర కెక్కుతున్న విజయ్ చిత్రాలన్నీ రాజకీయాల చుట్టు సాగుతుండటంతో ఆయన అభిమానుల్లో రాజకీయ ఎదురు చూపులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో విజయ్ మక్కల్ ఇయక్కంను అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ పార్టీగా మారుస్తూ ఈసీకి ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దరఖాస్తు పెట్టుకోవడం తమిళనాట చర్చకు దారి తీసింది. ఈ పార్టీకి ప్రధానకార్యదర్శిగా ఎస్ఏ చంద్రశేఖర్, కోశాధికారిగా ఆయన భార్య, విజయ్ తల్లి శోభ పేర్లను పొందు పరచి ఉండటంతో రాజకీయ చర్చ మరింతగా వేడెక్కింది. ఇది వ్యక్తిగతం..... ఎస్ఏ చంద్రశేఖర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ పార్టీకి విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని వ్యాఖ్యానించారు. విజయ్ మక్కల్ ఇయక్కం అన్నది నిన్నో, మొన్నో ఏర్పాటు చేసింది కాదని, ఇందులో ఉన్న వారికి గుర్తింపు అన్నది దక్కాలన్న కాంక్షతో రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు తెలిపారు. ఈ పార్టీలోకి విజయ్ చేరుతారా.? అని ప్రశ్నించగా, ఇది ఆయన్నే అడగండి అంటూ దాట వేశారు. ఈ చర్చ నేపథ్యంలో విజయ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. అలాగే, అనధికారికంగా తన పేరును వాడుకునే హక్కు ఎవరికి లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా,తమిళనాట 2021 ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు విశ్వనటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీదిమయ్యం వ్యూహాలకు పదును పెట్టి ఉన్నది. ఇక, రాజకీయాల్లోకి వచ్చేశామన్న ప్రకటన చేసిన దక్షిణ భారత చలన చిత్రసూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ ఏర్పాటులో ఉగిసలాటలో ఉన్న నేపథ్యంలో విజయ్ పార్టీ తెర మీదకు రావడం గమనార్హం. For those wanting the statement in the letterhead format, here's the official one! https://t.co/Q2ChPI3c8H pic.twitter.com/JiAWAZOfzy — RIAZ K AHMED (@RIAZtheboss) November 5, 2020 -
హీరో విజయ్ అభిమానుల అత్యుత్సాహం!
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఆయన తన పార్టీని కూడా నేడు రిజిస్టర్ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైందంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. విజయ్ రాకతో తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం అభిమానుల అత్యుత్సాహమే అని తేలింది. (చదవండి: మిస్ ఇండియా మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై అతడి పీఆర్ఓ టీం తాజాగా ట్విటర్ వేదికగా స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేసింది. ఈ మేరకు... ‘‘ బ్రేకింగ్: దళపతి విజయ్ ఎలక్షన్ కమిషన్ వద్ద తన రాజకీయపార్టీని రిజిస్టర్ చేయించారంటూ ప్రచారమవుతున్న వార్తలు నిజం కాదు’’ అంటూ విజయ్ పీఆర్ఓ రియాజ్ అహ్మద్ ట్వీట్ చేశాడు. కాగా విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయాక్కం’’పేరిట పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించేందుకు దరఖాస్తు చేశాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఇది విజయ్ పొలిటికల్ పార్టీ కానేకాదు. తను రాజకీయాల్లోకి వస్తాడో రాడో అన్న విషయం గురించి నేనేం చెప్పలేను’’ అని వ్యాఖ్యానించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మేరకు వార్తలు వెలువడినట్లు తెలుస్తోంది. #BREAKING: அரசியல் கட்சி தொடங்குகிறார் நடிகர் விஜய் * கட்சியின் பெயரை, தலைமை தேர்தல் ஆணையத்தில் பதிவு செய்தார் விஜய் என்ற செய்தி தவறானது The news spreading about " #ThalapathyVijay political party registered today " is untrue pic.twitter.com/sLrxqBNmiz — RIAZ K AHMED (@RIAZtheboss) November 5, 2020 I have applied for registration of political party in the name of ‘All India Thalapathy Vijay Makkal Iyakkam’. It’s my initiative. This is not Vijay’s political party. I can’t comment whether he will enter electoral politics - #SAChandrasekaran — Sathish Kumar M (@sathishmsk) November 5, 2020 -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ జోకవుతుంది: తండ్రి
సాక్షి, చెన్నై : అగ్రనటులు కమల్ హాసన్, రజనీకాంత్‌లు పార్టీలు ప్రారంభించిన తర్వాత తమిళనాడులో రాజకీయ వేడి కొద్దిగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపైనా వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో విజయ్‌కి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. తాజాగా విజయ్ కావేరి బోర్డు ఏర్పాటుపై జరిగిన ఆందోళనల్లో పాల్గొనడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ వార్తలపై విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక, నిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తండ్రిగా నేను విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచిదే అనుకుంటున్నాను. ఇటీవలే అతని ముందు తరం నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అదో జోక్ అవుతుందని నా అభిప్రాయం. విజయ్ ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అయితే ప్రస్తుతం రాజకీయ రంగ ప్రవేశంపై ఏ నిర్ణయం తీసుకుంటాడో మాత్రం తెలియదు’ అని తెలిపారు. విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. -
నటుడు విజయ్ తండ్రిపై కేసు నమోదు
సాక్షి, చెన్నై : నటుడు విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్‌పై స్థానికి విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. వివరాల్లోకెళ్లితే.. దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చిక్యుల్లో ఇరుక్కోవడం పరిపాటిగా మారింది. ఆ మధ్య విజయ్ నటించిన మెర్శల్ చిత్రం వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరుపతి దేవాలయం హుండీలో వేసే కానుకలు దేవుడికి లంచం మాదిరి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిష్టియన్ అయిన ఎస్ఏ. చంద్రశేఖర్ తిరుపతి ఆలయ హుండీ కానుకల గురించి కామెంట్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. బీజేపీ పార్టీ నేత హెచ్.రాజా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాగా హిందు మక్కల్ కట్చికి చెందిన నారాయణన్ అనే వ్యక్తి ఎస్ఏ. చంద్ర శేఖర్ వ్యాఖ్యల హిందువుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయనీ, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆధారాలుంటే దర్శకుడు ఎస్.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా పోలీసులకు ఆదోశాలు జారీ చేసింది. దీంతో స్థానికి విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఏ.చంద్రశేఖర్‌పై ఐపీసీ 395 సెక్షన్ క్రింది కేసును నమోదు చేశారు. విచారణలో ఆరోపణలు నిజమైతే దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. -
రాజకీయాల్లోకి రా.. హీరోకు తండ్రి సూచన
సాక్షి ప్రతినిధి, చెన్నై: సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టాలని తమిళ నటుడు విజయ్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సూచించారు. చంద్రశేఖర్ మంగళవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో... ప్రజల గురించి ఆలోచించే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందన్నారు. ఈరోజు బెదిరింపులకు గురవుతున్న నటుడు(విజయ్) రేపు అధికారంలోకి రావచ్చన్నారు. ‘విజయ్ ఒక గాంధేయవాది. రాజకీయాలపై కొన్నేళ్లుగా అతను ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. విజయ్ రాజకీయాల్లోకి రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని చెప్పారు. విజయ్ నటించిన ‘మెర్సల్’లోని పలు సన్నివేశాలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. -
ఆస్పత్రిపాలైన ప్రముఖ హీరో తండ్రి!
కొట్టాయం(కేరళ): ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తీవ్ర అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 71 ఏళ్ల వయస్సున్న ఆయన ఒక్కసారిగా పడిపోవడంతో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కుమారకుమ్లోని ఓ రిసార్ట్‌లో ఆయన పడిపోయారని, దీంతో ఆయన తలకు, వెన్నెముకకు గాయాలయ్యాయని ఆ వర్గాలు వివరించాయి. దీంతో ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపాయి. ఎస్ఏ చంద్రశేఖర్ తమిళంలో పేరొందిన దర్శకుడు- నిర్మాత. ఆయన ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన వారసుడిగా తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించిన విజయ్ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. విజయ్ తాజా సినిమా తెలుగులో 'పోలీసోడు'గా డబ్ అయిన సంగతి తెలిసిందే. -
గుర్రం ఎక్కించి సముద్రంలో పడేశా
చెన్నై : గుర్రం ఎక్కించి, సముద్రంలో పడేసి విజయ్‌కు శిక్షణ ఇచ్చి నటుడిగా తయారు చేశానని ఆయన తండ్రి సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా నయాపుడై అనే చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. చాయాగ్రహకుడు, దర్శకుడు జీవన్ 19 ఏళ్ల కొడుకు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో పా.విజయ్, చాందిని యువ జంటగా నటించగా ఎంఎస్.భాస్కర్. జీవీ చంద్రశేఖర్, నాన్ కడవుల్ రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను వెల్లడించడానికి చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తన కొడుకు హీరోగా నటిస్తానని అన్నప్పుడు రోజూ వేకువజామున 4.30 గంటలకు స్టంట్‌మాస్టర్ జాగ్వర్‌తంగంతో పాటు జాగింగ్‌కు తీసుకెళ్లి గుర్రం ఎక్కించి, సముద్రంలో పడేసి శిక్షణ ఇచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. అలా నటన, డ్యాన్స్‌ల్లో ట్రైనింగ్ ఇచ్చి విజయ్ ని హీరోగా తయారు చేశానన్నారు. అలాంటిది ఇక చిత్ర నిర్మాణం,దర్శకత్వం వద్దు అని తన భార్యతో చర్చించి విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకుంటున్న తరుణంలో నిర్మాత కలైపులి థాను ఒక సారి ఫోన్ చేసి ఎక్కడున్నారని అడగ్గా ఇంట్లో ఉన్నానని చెప్పానన్నారు. తరువాత ఇంటికొచ్చి కొంత మొత్తం అడ్వాన్స్ చేతిలో పెట్టి తన చిత్రంలో నటిస్తున్నారు మీరు... ఒక కుర్రాడు వచ్చి కథ చెబుతారు అని వెళ్లి పోయారన్నారు. ఆ తరువాత విజయ్‌కిరణ్ అనే కుర్రాడు వచ్చాడన్నారు. తనతో కథ ఎంత సేపట్లో చెప్పగలవని అడిగానన్నారు. అందుకతను తన ట్యాబ్ తీసి తను తీయబోయే కథను అందులో చూపించాడని చెప్పారు. సినిమా కూడా ల్యాప్‌టాప్‌తోనే తీస్తావా? అని అడగ్గా అవునని తలూపాడని తెలిపారు. ఇందులో తనతో దర్శకుడు నటింపజేయడంతో పాటు పిల్లలతో కలిపి కామెడీ చేయించారని చెప్పారు. ఒక రోజు విజయ్‌కిరణ్ తన వద్దకు వచ్చి కథ చెప్పారన్నారు. వెంటనే కథానాయకుడిగా ఎవరనుకుంటున్నావని అడగ్గా దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ అని టక్కున చెప్పారన్నారు. ఆశ్చర్యపోవడం తన వంతు అయ్యిందన్నారు. కారణం తన మదిలో మెదిలింది ఎస్ఏ.చంద్రశేఖర్‌నే కావడం అన్నారు. అనంతరం ఎస్ఏ.చంద్రశేఖర్‌ను కలిసి మీరి చిత్రంలో నటించండి ఆ తరువాత ఇదే చిత్రాన్ని హిందీలో అమితాబ్, అభిషేక్‌తో తీస్తానని చెప్పానన్నారు.నయాప్పుడై చిత్రాన్ని దర్శకుడు చెప్పిన దానికంటే బాగా తెరకెక్కించారని, తాజ్‌నూర్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని ఎస్.థాను తెలిపారు.