ఆ గ్రామానికి ఓ వింత శాపం.. ఆసక్తికర కథాంశంతో వస్తోన్న చిత్రం ! | Kollywood Fantasy Thriller Movie Mohinipatti On Sets | Sakshi
Sakshi News home page

Mohinipatti Movie: థ్రిల్లర్‌ కథా చిత్రంగా వస్తోన్న మోహినీపట్టి!

Oct 19 2023 11:27 AM | Updated on Oct 19 2023 11:50 AM

Kollywood Film Fantacy Thriller Movie Mohinipatti On Sets  - Sakshi

తమిళ సీనియర్‌ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మోహినీపట్టి. ఈ సినిమాకు ఆయన శిష్యుడు జయవీరన్‌ కామరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ మూన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయభారతీ కామరాజ్‌ నిర్మించారు. ఇంజినీర్‌ అయిన ఈయన సినిమాపై ఆసక్తితో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. తరువాత దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా మోహినీపట్టి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ మోహినీపట్టి ఫాంటసీ, థ్రిల్లర్‌ కథా చిత్రమని తెలిపారు. 

(ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్‌.. ధర ఎన్ని కోట్లంటే?)

మోహినీపట్టి అనే ఒక కల్పిత గ్రామంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలే ఈ చిత్రమన్నారు. ఆ గ్రామానికి ఒక శాపం ఉంటుందన్నారు. అది ఆ ఊరు ప్రజలకు మాత్రమే తెలుసని.. అక్కడ ఎవరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేరన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక యువ జంట ప్రేమించుకోవడంతో ఆ గ్రామ కట్టుబాటును, సంప్రదాయాన్ని ఎలా ఎదిరించారు? గ్రామ శాపానికి బలి అయ్యారా? దాని నుంచి బయట పడగలిగారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రమని తెలిపారు. 

ఈ కాలంలో ఇలాంటి కథా అనే సందేహం రావచ్చు. కానీ ఒక్కో ఇంటికీ.. ఒక్కో ఊరుకు తెలియని రహస్యాలు ఉంటాయని, అలాంటి ఇక రహస్యంతో ఈ చిత్ర కథను రాసుకున్నట్లు చెప్పారు. ఇందులో సంగీత్‌, నిరంజన్‌ శివశంకర్‌, తౌవుపికా, జయశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్‌ కోసం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీకి  మనోజ్‌ కుమార్‌బాబు సంగీతాన్ని అందించారు. 

(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement