Mohini
-
Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో..
పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్ గిటారిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో మోహిని ఫ్రెండ్షిప్ మొదలైంది. జాజ్ ఫ్యూజన్ గిటారిస్ట్‌గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్ ఆ తరువాత జాజ్‌కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్కత్తా నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్ ఆర్టిస్ట్‌గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని. పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది, బ్యాగ్ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్‌కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్ హుస్సేన్‌ను, ఫిల్మ్స్టార్స్ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్ మెమోరీలోకి వెళుతుంది మోహిని. తండ్రి సుజయ్ బాస్ గిటారిస్ట్. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్ట్ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్‌కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్‌ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది. ‘రకరకాల స్టైల్స్నుప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని. ‘ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలనుకుంటున్నాను’ తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల.. తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్ గిటార్‌తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్ గిటార్‌పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది! -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?
ఈమె తెలుగు ఓ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తెలుగునాట కథానాయికగా భలే గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో అదిరిపోయే క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోహిని. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ట్రావెల్ మూవీ 'ఆదిత్య 369'. ఈ సినిమాలో నటించిన హీరోయినే ఈమె. తమిళనాడులోని తంజావుర్‌లో పుట్టి పెరిగిన ఈమె.. 1991లో 'ఈరమణ రోజావే' చిత్రంతో కథానాయికగా మారింది. అదే ఏడాది తెలుగులో వచ్చిన 'ఆదిత్య 369'లో హీరోయిన్గా చేసిన తర్వాత ఈమెకు బోలెడంత ఫేమ్ దక్కింది. 'ఆదిత్య 369' సినిమాతో పాటు 'డిటెక్టివ్ నారద', 'మామ బాగున్నావా', 'హిట్లర్' తదితర తెలుగు సినిమాల్లో మోహిని హీరోయిన్గా చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కలిపి 100కి పైగా సినిమాల్లో నటించింది. 2011లో చివరగా 'కలెక్టర్' అనే మలయాళ మూవీలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇక 1999లోనే భరత్ అనే వ్యక్తిని మోహిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నాడు. అయితే చాలారోజుల తర్వాత రీసెంట్గా ఓ ఈవెంట్లో కనిపించిన మోహినిని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తొచ్చి ఈమె ఆమే కదా అని మాట్లాడుకున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) -
ఆ గ్రామానికి ఓ వింత శాపం.. ఆసక్తికర కథాంశంతో వస్తోన్న చిత్రం !
తమిళ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మోహినీపట్టి. ఈ సినిమాకు ఆయన శిష్యుడు జయవీరన్ కామరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ మూన్ స్టూడియోస్ పతాకంపై జయభారతీ కామరాజ్ నిర్మించారు. ఇంజినీర్ అయిన ఈయన సినిమాపై ఆసక్తితో ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. తరువాత దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా మోహినీపట్టి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ మోహినీపట్టి ఫాంటసీ, థ్రిల్లర్ కథా చిత్రమని తెలిపారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) మోహినీపట్టి అనే ఒక కల్పిత గ్రామంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలే ఈ చిత్రమన్నారు. ఆ గ్రామానికి ఒక శాపం ఉంటుందన్నారు. అది ఆ ఊరు ప్రజలకు మాత్రమే తెలుసని.. అక్కడ ఎవరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేరన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక యువ జంట ప్రేమించుకోవడంతో ఆ గ్రామ కట్టుబాటును, సంప్రదాయాన్ని ఎలా ఎదిరించారు? గ్రామ శాపానికి బలి అయ్యారా? దాని నుంచి బయట పడగలిగారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రమని తెలిపారు. ఈ కాలంలో ఇలాంటి కథా అనే సందేహం రావచ్చు. కానీ ఒక్కో ఇంటికీ.. ఒక్కో ఊరుకు తెలియని రహస్యాలు ఉంటాయని, అలాంటి ఇక రహస్యంతో ఈ చిత్ర కథను రాసుకున్నట్లు చెప్పారు. ఇందులో సంగీత్, నిరంజన్ శివశంకర్, తౌవుపికా, జయశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీకి మనోజ్ కుమార్‌బాబు సంగీతాన్ని అందించారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు) #Mohinipatti #Webstories இயக்குநர் எஸ்.ஏ.சந்திரசேகரன் முக்கிய வேடத்தில் நடிக்கும் 'மோகினிப்பட்டி' பேண்டஸி திரில்லர் வெப் மூவி!https://t.co/4YCQR2rFy6இயக்குநர்-எஸ்-ஏ-சந்திரசே/@PROSakthiSaran pic.twitter.com/SbyjUy608r — KALAIPOONGA (@kalaipoongavij1) October 18, 2023 இயக்குனர் எஸ்.ஏ.சந்திரசேகர் நடிப்பில் உருவாகும் 'மோகினிப்பட்டி' மேலும் படிக்க :https://t.co/g3ETtqftZ1#mohinipatti #sachandrasekar #jeyaveerankamaraj #MMcinema #MMNews #Maalaimalar pic.twitter.com/nPXcO5R7ha — Maalai Malar தமிழ் (@maalaimalar) October 18, 2023 -
లవ్ ట్వంటీ ట్వంటీ
అరవింద్, మోహిని జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ 20–20’. జోశర్మ, మెక్విన్ గ్రూప్ సహకారంతో మోహన్ మీడియా క్రియోషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల, మహేంద్ర వడ్లపట్ల నిర్మిస్తున్నారు. వడ్లపట్ల సినిమాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఈ చిత్రం లోగో లాంచ్‌ను శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘నాలుగు నెలల క్రితం బెంగళూరులో చిత్రదర్శకుడు సెంథిల్ పరిచయమయ్యారు. ఆయన అరగంటలో నాకొక కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే ఓకే చేశాను. నటీనటులందరూ బాగా నటించారు. ఈ చిత్రకథానాయిక మోహిని 2011లో మిస్ టీన్ యూ.ఎస్‌కు పోటీ చేశారు. అలాగే 2012లో మిస్ టీన్ కెనడా, మిస్ టీన్ ఇండియా కాంటెస్ట్లలోనూ పాల్గొన్నారు. సంగీతం, కెమెరా వర్క్ బాగా కుదిరాయి’’ అన్నారు. సెంథిల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు నన్ను పరిచయం చేస్తున్నందుకు మోహన్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘హుషారు’ చిత్రంలో ‘ఉండిపోరాదే...’ లాంటి సూపర్‌హిట్ పాటను రాశాను. ఆ పాట రాయటానికి అవకాశం ఇచ్చిన బెక్కం వేణుగోపాల్‌ను నాకు పరిచయం చేసింది మోహన్ వడ్లపట్ల గారే. మళ్లీ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు లిరిక్ రైటర్ కిట్టు. ‘‘నేను మాట్లాడటం కంటే నా మ్యూజిక్ మాట్లాడితే బావుంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు సత్యన్. ‘‘ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్‌గారికి కృతజ్ఞతలు. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ చిత్రంలోని పాటలు బావుంటాయి’’ అన్నారు మోహిని. దర్శక, నిర్మాత సాగర్, మహేంద్ర వడ్లపట్ల, ఎమ్.ఆర్.సి వడ్లపట్ల, నటులు క్రాంత్ రిసా తదితరులు పాల్గొన్నారు. -
ట్వంటీ ట్వంటీ లవ్
అరవింద్, మోహిని జంటగా సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘లవ్ 20–20’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల, జో శర్మ నిర్మిస్తున్నారు. మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) సహనిర్మాత. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కొంత ప్యాచ్ వర్క్‌తో సహా, ఫైనల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 6 వరకు జరుగుతుంది. ‘‘మంచి కథ కుదిరింది. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు కొత్తగా ఉంటాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్యన్. -
గ్యాప్ ఎందుకు వచ్చిందంటే?
టీ.నగర్: ఏడాదిగా తన చిత్రం విడుదల కాలేదంటే నటించడం లేదని అర్థం కాదని నటి త్రిష అంటోంది. కమల్, విజయ్, అజిత్ అంటూ ప్రముఖ నటులందరితో ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాల్లోనైనా నటిస్తూ వచ్చిన త్రిషకు 2016 ‘కొడి’ చిత్రం తర్వాత ఏ చిత్రం విడుదల కాలేదు. దీనిగురించి ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏడాదిగా తన చిత్రం విడుదల కాలేదంటే చిత్రాల్లో నటించడం లేదని అర్థం కాదని, చదురంగ వేట్టై 2, మోహిని, 96 చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అనేక కారణాల వల్ల చిత్రాలు విడుదల కావడంలో ఆలస్యమయ్యాయని అన్నారు. 16 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇంతవరకు డబుల్ రోల్లో నటించలేదని తెలిపారు. తాను దేనికీ భయపడేదాన్ని కానని, దెయ్యమన్నా భయం లేదన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అమానుష కార్యకలాపాలు కలిగిన ఈ థ్రిల్లర్ చిత్రంలో అనేక స్టంట్ సీన్లలో నటించాల్సి వచ్చిందన్నారు. డూప్ లేకుండా తాను ఒరిజినల్‌గా స్టంట్ సీన్లలో నటించాల్సి వచ్చిందన్నారు. మొదట్లో ఈ చిత్ర కథను హీరో కోసం రూపొం దించారని, తర్వాత దాన్ని హీరోయిన్ ఓరియెంటెడ్‌కు దర్శకుడు మార్చినట్లు తెలిపారు. చిత్రం షూటింగ్ పూర్తిగా లండన్‌లో జరిగిందన్నారు. -
మోహిని వచ్చేస్తోంది
దాదాపు రెండేళ్లు పూర్తి కావొచ్చింది తెలుగు తెరపై చెన్నై సుందరి త్రిష కనిపించి. 2016లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘నాయకి’లో నటించారామె. ఇప్పుడు మళ్లీ ‘మోహిని’ సినిమాతో తెలుగు తెరపై కనిపించనున్నారు. త్రిష ప్రధాన పాత్రలో ఆర్. మాదేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోహిని’. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేయనుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస రావు పల్లెల, కరణం మధులత నిర్మాతలు. గుంటూరు కాశిబాబు, డీవీ మూర్తి సహ–నిర్మాతలు. జాకీ, యోగి బాబు, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘మోహిని’ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు చిత్రబృందం. -
మోహిని ట్రైలర్ రిలీజ్
-
‘మోహిని’ ట్రైలర్ విడుదల
చిత్రసీమలో హారర్ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సరైన కథా కథనం సరిగా లేకపోతే బెడిసికొడుతుంది. దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు ఇలా ఒకప్పటి కథలతో సినిమాలను తీసినా.. కథనం మాత్రం ఈతరానికి నచ్చేవిధంగా.. కాస్త కామెడీ టచ్ ఇస్తే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ప్రేమ కథా చిత్రమ్, ఆనందో బ్రహ్మ, రాజు గారి గది ఇలా ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. గతంలో త్రిష నాయకి అంటూ హారర్ మూవీ చేశారు. కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా త్రిష మరో హారర్ సినిమాలో నటిస్తున్నారు. మోహినిగా త్రిష నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఫారెన్ లొకేషన్లలో జరిగినట్టు కనిపిస్తోంది. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించగా, ఆర్ మధేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్, జాకీ, తమిళ హాస్య నటుడు యోగీ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది. -
ఖుషీ ఖుఫీగా..
తమిళసినిమా: సంచలన తారల్లో నటి త్రిష ఒకరన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమ, పెళ్లి దాకా వెళ్లి అంతటితోనే ఆగిపోయి నటనపైనే దృష్టిసారిస్తున్న ఈ బ్యూటీ. అదే విధంగా మూడు పదులు దాటినా కథానాయకిగా రాణిస్తున్న త్రిష కమర్శియల్ చిత్రాల నాయకిగానూ, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగానూ రాణిస్తోంది. అలా నయనతార, అనుష్కల బాటలో పయనిస్తున్న త్రిషను నాయకి చిత్రం నిరాశపరచింది. మరో విషయం ఏమిటంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అయిన నాయకి ఫ్లాప్ అయినా, మరిన్ని ఆ తరహా చిత్రాలు ఆమెను వరించడం విశేషమే. అలా మోహిని, గర్జన వంటి చిత్రాలతో యాక్షన్ సన్నివేశాల్లో దుమ్మురేపడానికి త్రిష సిద్ధమైంది. ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. కొడి చిత్రం తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అలాగని అవకాశాలు లేవని కాదు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు మోహిని, గర్జన, అరవిందస్వామికి జంటగా చతురంగవేట్టై 2, విజయ్‌సేతుపతి సరసన 96, 1818 అనే మరో విభిన్న కథా చిత్రం అంటూ బిజీబిజీగా నటించేస్తోంది. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం వంటి పలు కారణాల వల్ల త్రిష చిత్రాల విడుదలలో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ నటించిన మోహిని, గర్జన, 96 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నాయని సమాచారం. దీంతో త్రిష కూడా ఖుషీ అవుతోందట. ఈ విషయం ఆమె అభిమానులను మరింత ఖుషీ పరిచేదే అవుతుందిగా! -
‘మోహిని’ వర్కింగ్ స్టిల్స్
-
ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!
వయసు పెరుగుతున్న కొద్ది జోరు పెంచుతోంది చెన్నై చంద్రం త్రిష. ఇక కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటున్న టైంలో బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ధనుష్ సరసన హీరోయిన్ గా నటించిన కోడి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న త్రిష, ఈ ఏడాది మిగిలిన ఆరునెలల సమయంలో తను నటించిన ఆరు సినిమాలను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సినిమాలతో పాటు తాజా మరో సినిమాను స్టార్ట్ చేసింది. ఇప్పటికే మోహిని, గర్జనై, శతురంగ వేట్టై సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తమిళ సినిమా 1818తో పాటు మలయాళ సినిమా హేయ్ జూడ్ ల షూటింగ్లలో పాల్గొంటుంది త్రిష. వీటితో పాటు తాజా 96 అనే సినిమాకు కూడా డేట్స్ ఇచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12 నుంచి సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివరకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
కూతురు ఖుషీ.. అమ్మ బేజార్
కూతురు ఖుషీ అమ్మ బేజార్. అసలు అర్థం కాలేదు కదూ ‘అయితే రండి చూద్దాం. సంచలన నటీమణుల్లో త్రిష ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. నటిగా తెరంగేట్రం చేసి దాదాపు దశాబ్దన్నర అయ్యింది. అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.ఆమె జోరు కొరవడలేదు.ఇంకా చెప్పాలంటే మరింత మార్కెట్‌ను పెంచుకున్నారనే చెప్పాలి.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న వేళ్ల మీద లెక్కపెట్టే హీరోయిన్లలో ఈ చెన్నై చిన్నది ఒకరు. విశేషం ఏమిటంటే త్రిష ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేయడం. తాను నటిస్తున్న మోహిని, గర్జన, చతురంగవేట్టై 2 చిత్రాలను పూర్తి చేసినట్లు తనే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వీటిలో చదరంగవేట్టై 2 చిత్రంలో అరవిందస్వామికి దీటైన పాత్రలో నటించగా గర్జన, మోహిని తన పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రాలు కావడం విశేషం. ఇకపోతే గర్జన చిత్రంలో ఫైట్స్,యాక్షన్ సన్నివేశాలు అంటూ ఇరగదీశారట.ఇందులో చాలా రిస్కీ సన్నివేశాలను చిత్ర యూనిట్ డూప్‌ను పెట్టి చెద్దామని చెప్పినా వద్దని తానే నటించారట.అలాంటి సన్నివేశాల్లో నటించిన త్రిష ఖుషీగానే ఉన్నారట. ఆమె తల్లి ఉమాకృష్ణన్ మాత్రం కూతురి డేరింగ్ చూసి బేజార్ అయ్యారట. మొత్తం మీద ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేసిన త్రిష నటనకు చిన్న బ్రేక్ ఇచ్చి తల్లితో పాటు సమ్మర్ టూర్‌గా రోమ్ దేశాలు చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా నటించే షూటింగ్లో పాల్గొంటారట. అయితే ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. దీంతో అర్జెంట్‌గా విజయం చాలా అవసరం.పైన చెప్పిన చిత్రాలపై త్రిష చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. -
నేను చివరగా చెప్పిన అబద్ధం అదే!
ఒకటి కాదు.. రెండు కాదు.. త్రిష చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. మోహిని, సదురంగ వేటై్ట, గర్జనై, 96, 1818, హే జడ్జ్, స్వామి–2.. ఆ సినిమాలు ఇవే. వీటిలో మోహిని, గర్జనై.. లేడీ ఓరియంటెడ్ మూవీస్. ‘1818’లో తనే లీడ్ రోల్ చేస్తున్నారు. ఆరేడేళ్లుగా ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన త్రిష ఇప్పుడు 7 సినిమాలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరదా ప్రశ్నలకు త్రిష చెప్పిన జవాబులు తెలుసుకుందాం. 1 ఏంటండీ బాబూ.. ఒకేసారి ఏడు సినిమాలా? ఈ ఏడాది నా టార్గెట్ 9 సినిమాలు. ఇప్పటికి 7 కమిట్ అయ్యా. ఇంకో రెండు సినిమాల గురించి త్వరలో అనౌన్స్ చేస్తా. 2 ఇన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వగలుగుతారా? ఒకసారి డైరీ చెక్ చేశా. ఇచ్చే స్కోప్ ఉంది. పైగా ఒప్పుకున్న సినిమాలన్నీ ‘ది బెస్ట్’ అనొచ్చు. ఒకేసారి ఇన్ని సినిమాలంటే కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది. అయినా ఓకే. 3 పర్సనల్ విషయాలకొద్దాం.. మీ సొంతూరు చెన్నైలో మీకిష్టమైన ప్లేస్? ఇంకేముంటుంది? మా ఇల్లు. 4 మిమ్మల్ని ద్వేషించేవారికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా...? సందేశాలెందుకు? వారిని అలాగే కొనసాగనిద్దాం. 5 అపజయాల నుంచి మీరు ఎలా తేరుకుంటారు? గాఢంగా నిద్రపోతా. ఐస్‌క్రీమ్ లాగించేస్తా. 6 మీకు ప్రేరణ ఎవరు? నా అంతరాత్మే నాకు ఇన్స్పిరేషన్. 7 మీరు బాగా నిరుత్సాహపడ్డప్పుడు వెంటనే తీసుకునే స్టెప్ ఏది? బాగా ఫీలవుతాను. తర్వాత ఏడుస్తా. కాసేపటికి బాధ దానంతట అదే మాయమవుతుంది. 8 మీరు చివరిగా చెప్పిన అబద్ధం? షూటింగ్లో ఉన్నాను. తర్వాత కలుస్తాను. 9 మిమ్మల్ని భయపెట్టే విషయం ఏదైనా ఉందా? ఎవరైనా దిండుతో ఊపిరి ఆడకుండా చేస్తారని భయంగా ఉంటుంది. 10 టీనేజ్ గాళ్స్‌కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ధైర్యంగా ఉండండి. మీ కలలను సాధించుకునే దిశగా అడుగులు వెయ్యండి. 11 పెళ్లి తర్వాత మీరు సినిమాల్లో కొనసాగుతారా... లేక ఇంటికే పరిమితమవుతారా? ఈ రోజుల్లో మహిళలు ఇటు ఇల్లు, అటు ఉద్యోగం రెంటినీ చక్కగా చూసుకోగలుగుతున్నారు. 12 మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా.. అబద్ధం చెప్పకూడదు సుమా.. సరే అబద్ధం చెప్పను. అయితే ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ గురించి ఏం చెప్పలేను. 13 మీకు కోపం తెప్పించే విషయం? ఎదుటి వ్యక్తులకు కొంతమంది నీతులు చెబుతారు. కానీ, చెప్పేవాళ్లు పాటించరు. అలాంటివాళ్లంటే కోపం. 14 మీ గురించి వచ్చే పుకార్లకు ఎలా స్పందిస్తారు? ఇంట్లో పెద్దగా నవ్వుకుని వదిలేస్తాను. పట్టించుకోను. 15 మీ కుంటుంబం గురించి ఒక్క మాటలో? నా బలం..నా ఎంటర్టైన్మెంట్. 16 దేవుడు మీ ముందు ప్రత్యక్షమయితే ఏం అడుగుతారు? ఏమీ అడగను. నాకేం ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు. -
వామ్మో దెయ్యం!
పాపం.. త్రిష. ఓ దెయ్యం ఈ బ్యూటీని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ కాదు.. లండన్‌లో. షెఫ్‌గా చేయడానికి త్రిష లండన్ వెళుతుంది. అక్కడ ఓ దెయ్యం ఆమెను వెంటాడడం మొదలు పెడుతుంది. ఆ దెయ్యం పెట్టే టార్చర్ తట్టుకోలేక తెగ బాధపడుతుంది. త్రిషను వెంటాడి బాధపెట్టడంలో ఆ దెయ్యం ఆనందం పొందుతుంటుంది. చివరికి ఆ దెయ్యాన్ని త్రిష ఎలా వదిలించుకుందో తెలియాలంటేæతెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘మోహిని’ చూడాల్సిందే. ఇప్పటివరకూ చెప్పిందంతా ‘మోహిని’ కథా కమామీషు. ఇందులో మనిషిగా, దెయ్యంగా రెండు పాత్రలనూ త్రిష చేశారు. త్రిష వర్సెస్ త్రిష సీన్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయని దర్శకుడు మాదేశ్ పేర్కొన్నారు. -
రిస్క్‌లోనే కిక్!
సాగర గర్భంలో ఈత అంటే, స్విమ్మింగ్‌పూల్‌లో ఈదినంత సులువు కాదనే విషయం అందరికీ తెలిసిందే. తెలిసినప్పటికీ రిస్క్ చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. దాని కోసం పని గట్టుకుని స్క్యూబా డైవింగ్ నేర్చుకుంటారు. సాగరంలో జలచరాలను చూసి, ఆనందించేస్తారు. ఇలాంటి ఆనందాన్ని త్రిష చాలాసార్లు పొందారు. రిస్క్‌లో ఓ కిక్ ఉందంటారామె. స్నేహితులతో విదేశీ యాత్రలకు వెళ్లినప్పుడు స్క్యూబా డైవింగ్ చేయకుండా దాదాపు వెనక్కి రారు. అదంతా సరదా కోసం అయితే ఇప్పుడు సినిమా కోసం చేశారు. త్రిష టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మోహిని’. రమణ మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ మూవీ ఇది. ఈ చిత్రం కోసం నీటి లోపల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు చెప్పగానే, త్రిష ఓకే అనేశారు. ఆ సీన్స్‌ని ఇటీవల చిత్రీకరించారు. ఆ సమయంలో సాగరంలో దర్శకుడితో ఓ ఫొటో కూడా దిగారు. ‘‘నీటి లోపల మా డెరైక్టర్‌తో సరదాగా’’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. సినిమా కోసం ఎలాంటి రిస్కులైనా తీసుకోవడానికి ఇష్టపడే ఈ బ్యూటీ ఆ రిస్కులంటే తనకు బోల్డంత ఇష్టం అంటున్నారు. అంత ఇష్టంగా నటిస్తారు కాబట్టే, కథానాయిక అయ్యి పదమూడేళ్లయినా ‘నాట్ అవుట్’ అని చెప్పొచ్చు. -
నాన్నకు ప్రేమతో...
మన కలలను నెరవేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అయితే తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంలో కలిగే సంతృప్తే వేరు. అందానికి ప్రతిరూపం లాంటి నటి త్రిష ఇప్పుడు రెండో రకం సంతోషాన్ని అనుభవించ డానికి దగ్గరగా ఉన్నారు. తొలి నుంచి కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్‌తో నాయకిగా నెట్టుకొచ్చిన త్రిష ఇటీవల తన బాణిని మార్చారన్నది ఆమె చిత్రాల ఎంపిక చూస్తేనే అర్థం అవుతుంది. నాయకి చిత్రంతో హీరోయిన్ సెంటరిక్ పాత్రకు మారారు. ఆ చిత్రం నిరాశ పరచినా అదే బాణీలో మోహిని చిత్రంలో నటిస్తున్నారు.నాయకి చిత్రం అందించలేని ఆనందాన్ని మోహిని ఇస్తుందనే ఆశతో ఉన్నారు. మోహిని చిత్ర ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ధనుష్ జంటగా కొడి చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్ర దుమ్మురేపేలా నటించారనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 28న తెరపైకి రానుంది. ఈ చిత్ర విజయం నటి త్రిషతో పాటు, ధనుష్‌కు చాలా అవసరం. కాగా త్రిష ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్నారు. గర్జనై, చతురంగవేట్టై, సామి-2 చిత్రాల్లో నటించనున్నారు. ఇకపై వైవిధ్యభరిత కథా పాత్రల్లోనే నటించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నారట. కాగా ప్రముఖ హీరోయిన్లు ఇప్పుడు ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఇతర వ్యాపారాల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు. అదే విధంగా 14 ఏళ్ల సినీ వయసులోనూ నాయకిగా బిజీగా ఉన్న నటి త్రిష హోటల్ బిజినెస్‌లోకి దిగుతున్నారు. బెంగళూర్‌లో 60 గదులతో కూడిన ఆధునిక స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్రిష ఈ హోటల్ నిర్మించడానికి కారణం ఉందట. తన తండ్రి కృష్ణ ఒక నక్షత్ర హోటల్లో పని చేసేవారు. ఆయనకు తాను హోటల్ యజమానిని కావాలని కలల కనేవారట. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన తనువు చాలించారు. దీంతో తన తండ్రి కలను సాకారం చేయడానికే త్రిష స్టార్ హోటల్‌ను కట్టిస్తున్నారట. -
మోడర్న్ పిశాచి!
అవతారం చూస్తే అమ్మవారి మోడర్న్ లుక్ అన్నట్టుంది కదూ! మహిమలు గల మహిషాసుర మర్దిని కాదు.. ప్రతీకార జ్వాలతో రగులుతున్న పిశాచి అట. త్రిష కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇది. ఈ మోడర్న్ పిశాచి పగ ఎవరిపై అనేది త్రిష చెబితేనే తెలుస్తుంది. ఆర్.మాదేశ్ దర్శకత్వంలో త్రిష ముఖ్యతారగా నటిస్తున్న హారర్ సినిమా ‘మోహిని’. ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు.. పక్కనే కపాలాలు.. తలపై విచిత్రమైన కిరీటం.. ఈ సినిమాలో త్రిష ఫస్ట్ లుక్‌ను విభిన్నంగా విడుదల చేశారు. నవంబర్ మొదటి వారంలో పాటల్ని, క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మోడర్న్ హారర్ కామెడీ సినిమా ఇది. మహిళల దూకుడుకి చిహ్నంగా వివిధ ఆయుధాలతో త్రిష ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశాం. ఓ యాక్షన్ సీక్వెన్స్ మినహా 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. బ్యాంకాక్‌లో మిగిలిన యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తాం. ‘హ్యారీ పోటర్’ సినిమాకి పనిచేసిన వి.ఎఫ్.ఎక్స్. నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు’’ అన్నారు. -
మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..?
సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి పీటల దాకా వెళ్లి వెనక్కి వచ్చిన ఈ బ్యూటి రీ ఎంట్రీ మరింత జోరు చూపిస్తోంది. విజయాలు సాధించటంలో వెనకపడుతున్నా... అందాలతో ఆకట్టుకోవటంలో మాత్రం కుర్ర హీరోయిన్ లకు కూడా పోటీ వస్తోంది. ఇటీవల హార్రర్ జానర్ లో తెరకెక్కిన అరణ్మనై 2, నాయకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది త్రిష. ఈ రెండు సినిమాలు ఆశించిన స్ధాయి ఫలితాలు ఇవ్వకపోయినా మరోసారి అదే జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. మోహిని పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలు వేసే తరహా స్కిన్ టైట్ డ్రెస్ లో తలపై కిరీటం, ఎనిమిది చేతులలో ఆయుధాలు.. చూస్తుంటే.. ఈజిప్ట్ దేవతలా కనిపిస్తోంది. ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ఆర్ మాదేష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్రిష కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కిన కోడి సినిమాలోనూ నటిస్తోంది ఈ బ్యూటి. మరి ఈ సినిమాలైనా త్రిషకు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి. -
పాంచ్ పటాకాగా చెన్నై చిన్నది
చెన్నై చిన్నది త్రిష పాంచ్ పటాకాగా పేలనున్నారన్నది తాజా సమాచారం. కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ వంటి అగ్రనాయకులందరితోనూ నటించిన నటి త్రిష ఒక దశలో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్మాత, వ్యాపాత వేత్త వరుణ్మణియన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన త్రిషకు అది వివాహనిశ్చితార్థంతోనే ఆగిపోయిన విషయం విదితమే.వ్యక్తిగత జీవితంలో అలాంటి బ్రేక్ పడినా వృత్తిపరంగా మాత్రం బ్రేకులు లేని బండిలా యమా స్పీడ్ అందుకుంది.అప్పటి వరకూ అందచందాలతోనే సరిపెట్టుకున్న త్రిషకు ఆ తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వరించడం విశేషం. ఆ మధ్య నాయకి అనే హార ర్ కథా చిత్రంలో ద్విపాత్రాభినం చేసిన ఈ భామ తాజాగా ఆ తరహా కథతోనూ మోహిని అనే చిత్రం చేస్తున్నారు. ఇదే తరహాలో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన త్రిష తాజాగా మరో విభిన్న కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ ఒకటీ, రెండు పాత్రల్లోనే నటించిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో ఏకంగా ఐదు పాత్రల్లో నటించనున్నారట. ఇందులో రెండు పాత్రల కోసం తన బరువును మరింత తగ్గించుకుని నటించనున్నారట. ఇకపోతే ఈ చిత్రం కోసం త్రిష కోటి రూపాయలను పారితోషికంగా పుచ్చుకోనున్నారట. అంతేకాదు కాస్ట్యూ మ్స్ కోసం మరో 25 లక్షలు తీసుకుంటున్నారట. ఇందులో నాజర్, ఆనందరాజ్ ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఇంతకు ముందు శరత్‌కుమార్ హీరోగా రహస్య పోలీస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఇళవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం మోహినీ చిత్రం కోసం లండ న్లో ఉన్న త్రిష ఆ చిత్రాన్ని పూర్తి చేసి పంచ పాత్రల చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. -
మరో సారి భయపెడతా!
ఒక పక్క కమర్షియల్ చిత్రాలు, ప్రేమ, హాస్యభరిత చిత్రాలు వస్తున్నా, హారర్ చిత్రాల ట్రెండ్‌కు మాత్రం ఏమాత్రం ఢోకా లేదనిపిస్తోంది. ఇంతకు ముందు చిన్న తారలు, మార్కెట్‌లేని సీనియర్ నటీనటులు హారర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ప్రముఖ తారలే నటించడానికి రెడీ అంటున్నారు. ముఖ్యంగా టాప్ కథానాయికలతో హారర్ కథా చిత్రాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మాయ చిత్రంలో నటించిన నయనతార తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్ర నాయకిగా హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆ తరహా కథాంశంతో రూపొందుతున్న దోర అనే దెయ్యం ఇతివృత్తంతో సాగే నాయకి పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటించడానికి నయనతార రెడీ అవుతున్నారు. ఇక మరో సంచలన నటి త్రిష కూడా నయనతార బాణీనే అవలంభిస్తోందని చెప్పవచ్చు. నిన్నటి వరకూ కుటుంబకథా చిత్రాల నాయకిగా నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు హారర్ చిత్రాలపైకి దృష్టి మళ్లించారు. త్రిష ద్విపాత్రాభినయం చేసిన నాయకి చిత్రం తెలుగులో తెరపైకి వచ్చి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.త్వరలో తమిళంలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మోహిని అనే మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తున్నారు. అధిక భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఇదీ హారర్ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమే.తాజాగా మరో హారర్ చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అనీ, ఆ చిత్ర డీవీడీని ఓ ప్రముఖ నిర్మాత చూడమని త్రిషకు పంపినట్లు తెలిసింది. ఆ చిత్రం చూసిన త్రిష దాని రీమేక్‌లో నటించడానికి సమ్మతించినట్లు టాక్. ఇందులోనూ ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఎందుకమ్మా ఈ కష్టాలు!
ప్రతి సీన్లోనూ ఆర్టిస్టులే నటించాలనే రూల్ లేదిప్పుడు. టెక్నాలజీ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ ఉందిగా.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. యాక్షన్ సీన్లు కూడా డూప్లతో లాగించేస్తున్నారు. కొంతమంది మాత్రం స్వయంగా యాక్షన్ సీన్స్ చేస్తారు. వారిలో త్రిష ఒకరు. మాదేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘మోహిని’లో ఈ సుందరాంగి షెఫ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో థాయిల్యాండ్‌లో హీరోయిన్ తలకిందులుగా వేలాడే యాక్షన్ సీన్లు షూట్ చేయనున్నారు. డూప్‌తో ఆ సీన్లు తీద్దామంటే త్రిష ఒప్పుకోలేదట. స్వయంగా తానే నటిస్తానని చెప్పారట. ప్రస్తుతం చెన్నైలో రోజూ తలకిందులుగా వేలాడుతూ, రిస్కీ ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట. అది చూసి, ఆమె సన్నిహితులు ‘ఎందుకమ్మా.. ఈ కష్టాలు’ అనడిగితే.. ఫర్ఫెక్షన్ కోసమే అంటున్నారట. -
ఆమె... ఓ మోహం!
‘మోహిని’ అంటే మనసును మత్తులో ముంచేసే అందమని అర్థం. కథానాయిక త్రిష అందం కూడా అంతే. దాదాపు పధ్నాలుగేళ్లగా తన అందంతో, అభినయంతో వెండితెర మోహినిగా అభిమానులను మైమరిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘మోహిని’ అనే పాత్రతో మురిపించడమే కాదు.. భయపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారామె. పధ్నాలుగేళ్ల కెరీర్లో గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలకు కూడా ఓకే చెబుతూ వచ్చారు. ఈ మధ్య అయితే కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై మక్కువ చూపుతున్నట్లనిపిస్తోంది. అది కూడా హారర్ చిత్రాలు చేయడం విశేషం. ‘కళావతి’ తర్వాత ఓ హారర్ చిత్రాన్ని పూర్తి చేశారు త్రిష. ఇప్పుడు ‘మోహిని’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. మాధేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహిని పాత్ర కోసం త్రిష ప్రత్యేకంగా ప్రోస్థటిక్ మేకప్ కూడా వేసుకోనున్నారట. ఈ చిత్రం షూటింగ్ మొత్తం యూకే, మెక్సికోల్లో జరుగుతుంది. మోహిని అనే అమ్మాయికి ఎదురయ్యే భయానక అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారట. -
మరణంలోనూ వీడని బంధం
నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు సహా నలుగురు దుర్మరణం పెళ్లికి వస్తూ అనంతలోకాలకు.. మృతులంతా ఒడిశావాసులే మేనల్లుడి వివాహానికి బయలుదేరారు.. ఒడిశా రాష్ట్రం గుణుపూరు నుంచి విశాఖ చేరుకోవడానికి కారులో వస్తున్నారు.. మరో పావుగంటలో గమ్యానికి చేరుకుంటారనగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. శుక్రవారం తెల్లవారుజామున కొమ్మాది, మారికవలస మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. భార్యాభర్తలు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పీఎం పాలెం (విశాఖపట్నం): ఇసుకతోట ప్రాంతంలో నివసిస్తున్న మేనల్లుడి పెళ్లి.. ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు.. బంధుమిత్రులతో కలిసి కారులో వస్తున్నారు.. కాసేపట్లోనే గమ్యస్థానం చేరుకుంటారనగా పెను ప్రమాదం. ఈ దుర్ఘటనలో అసువులు బాసిన భార్యాభర్తలను చూసి కళ్లు చెమర్చనివారు లేరు. ఈ దంపతులతోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారు జామున కొమ్మాది - మారికవలసల మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం గుణుపూరు మండలం గుడారి గ్రామంలో సేనపూరి మాధవరావు (55) వ్యాపారిగా స్థిరపడ్డారు. విశాఖలో మేనల్లుడి పెళ్లికి భార్య మోహిని (45), సమీప బంధువులు ఆదిత్య త్రిపాఠి (30), సింహాద్రి దిలీప్ (20), సింహాద్రి నెహ్రూ (30)లతో కలిసి గురువారం రాత్రి కారులో బయలుదేరారు. గమ్యానికి మరో 15 కిలోమీటర్ల దూరంలో.. ఇక బంధువుల ఇంటికి చేరుకుంటామనగా ప్రమాదానికి లోనయ్యారు. ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు కొడుకులను ఒంటరి వారిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న త్రిపాఠి, మాధవరావు, ఆయన భార్య మోహిని కారులో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన దిలీప్, నెహ్రూలను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దిలీప్ మరణించాడు. నెహ్రూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకుని కారులో చిక్కుకున్న వారిని వారిని బయటకు తీశారు. ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న వాహనాలను తొలగించారు. మృతులను, క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. మృతుని బంధువులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణం అతి వేగమే !నలుగురి ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మధురవాడ ప్రాంతంలో రాత్రి వేళ జాతీయ రహదారికి ఒక వైపు అదనపు లేయర్ నిర్మాణపు పనులు చేపడుతున్న కారణంగా... కొమ్మాది- మారికవలసల మధ్య రెండు వైపుల వెళ్లే వాహనాలు ఒకే రోడ్డుపై వెళ్లే విధంగా ట్రాఫిక్ మళ్లించారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి నగరానికి వస్తున్న కారు, ఎదురుగా కలప లోడుతో వస్తున్న లారీ బలంగా ఢీ కొన్నాయి.ఈ ధాటికి కారు ముందు భాగం నుజ్జయింది. లారీ ముందు చక్రాలు రెండూ ఊడిపోయాయి. ఫ్రంట్ యాక్సిల్ విరిగిపోయింది. ఒకే రోడ్డులో వాహనాలు ఎదురెదుగా ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణమని భావిస్తున్నారు. -
జోరు షురూ..
గర్భా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్న గుజరాతీలు సరదాలు పంచే దసరాకు మూడు వారాలకు ముందే నగరంలో నవరాత్రుల సందడి మొదలైంది. గర్భా, దాండియా ఆటలతో శరన్నవరాత్రులకు పూజ కు సన్నద్ధం అవుతున్నారు సిటీవాసులు. మినీ ఇండియాగా బాసిల్లుతోన్న హైదరాబాద్‌లో దసరా విభిన్నంగా జరుగుతుంది. తమ తమ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా దుర్గాదేవి ఆరాధనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీవితం అంటే ఈ క్షణాన్ని పండుగలా పండించుకోవడమే అనే గుజరాతీలు నవరాత్రి సెలబ్రేషన్స్‌కు తెర తీశారు. దసరా సందర్భంగా గుజరాతీలు దాండియా, గర్భా నృత్యాలతో అమ్మవారిని కొలుస్తారు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. మట్టి కుండలో దీపాన్ని ఉంచి, దాన్ని దుర్గాదేవి పటం ఎదుట పెట్టి నవరాత్రులు మొదలుపెడతారు. అలా ప్రతిష్టించిన గర్భాదీప్ ఎదుట తొమ్మిది రోజులు ప్రత్యేకమైన శైలిలో నృత్యం చేస్తారు. దీనినే గర్భా నృత్యంగా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. మనిషి శరీరం కుండలాంటిదని.., అందులో జ్యోతి రూపంలో వెలుగుతున్న ఆత్మ దైవ స్వరూపమని చాటి చెప్పేదే గర్భా అని వారి నమ్మకం. కోలాటాల దాండియా.. గుజరాత్ పడుచులు ఆడే దాండియా ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోలాటాల తో సరదాగా, లయబద్ధంగా సాగిపోయే దాండియా నవరాత్రులకు మరింత వన్నెతెస్తాయి. దుర్గాదేవికి, మహిషాసురిడికి జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు గోపికలతో దాండియా రాస్ ఆడినట్టు చెప్తారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారి హారతికి ముందు దాండియా ఆట ఆడతారు. గర్భాతో పోలిస్తే దాండియా ఆడటానికి కాస్త క్లిష్టంగా అనిపించినా.. చూడటానికి మాత్రం చాలా ఇష్టంగా కనిపిస్తుంది. జతలు జతలుగా, దాండియా కర్రలతో వృత్తాకారంలో లయబద్ధంగా తిరుగుతూ ఆడతారు. డోల్, తప్పెట వాయిద్యాల సద్దులు.. అబ్బాయిలను గాల్లో ఎగిరేలా చేస్తే.. వారి ఆటలకు మరింత కిక్కునిచ్చేలా ఆడవాళ్లు దాండియాతో అలరిస్తారు. చిన్నాపెద్దా, ఆడా మగా తేడాలేకుండా అందరూ ఇందులో ఉల్లాసంగా పాల్గొంటారు. ఒక్కోసారి వీరి నాట్యం రాత్రంతా కొనసాగుతుంది. బతుకమ్మ లాంటిదే గర్భా.. తెలంగాణాలో తొమ్మిది రోజులు చేసుకునే బతుకమ్మకు, నవరాత్రి గర్భాకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఇక్కడ బతుకమ్మను పూజించినట్టే.. గుజరాతీలు గర్భాదీప్ ఉంచి దుర్గాదేవి పూజ చేస్తారు. అయితే, సంప్రదాయ వరంగా లభించిన ఈ నృత్యానికి సినిమా పాటలు నేపథ్యంగా ఉండటం సరికాదు. సినిమా పాటలకు బతుకమ్మ ఆడటం ఎక్కడైనా చూస్తామా..? దుర్గాదేవిని పూజించేప్పుడు ఇలాంటి పాటలు పెట్టడం కరెక్ట్ కాదు. ఈ నృత్యాలు చేసే సమయంలో గుజరాతీ సంప్రదాయ దుస్తులు వేసుకుని చేస్తారు. ఆడవాళ్లు చనియా-చోళి, మగవాళ్లు చోర్నో-కేడియా ధరిస్తారు. అద్దాలు, గవ్వలు, కచ్ వర్క్‌తో జిగేల్మనే వీరి దుస్తులు నృత్యానికి మరింత అందాన్ని జోడిస్తాయి. స్త్రీలు తలపై దామిని, నడుముకి కమర్పట్టా, జూడా, బాజుబన్, పురుషులు మెడలో హాసిడి, చేతికి కడా లాంటి సంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. కన్నుల పండువగా కనిపిస్తారు. - మోహిని, డిజైనర్ ఫీజు కట్టు.. ఆట పట్టు.. నవరాత్రి సంబురాలు సందడిగా సాగాలంటే గర్భా, దాండియా ఉండాల్సిందే. అందుకే పలు సంస్థల్లో ఫీజు చెల్లించి మరీ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు చాలామంది. కొన్ని సంస్థలు నవరాత్రి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. అవర్ సేక్రెడ్ స్పేస్‌లో మంగళ, గురువారాల్లో గర్భా, దాండియా నృత్య రీతులు నేర్పిస్తున్నారు. బేగంపేటలోని యశ్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, మాదాపూర్‌లోని రామ్స్ స్టెపప్ డ్యాన్స్ కంపెనీ కూడా గ ర్భా, దాండియా ఆటలు నేర్పిస్తున్నాయి. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు శిల్పి ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్స్‌లో నవరాత్రి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. పీపుల్స్ ప్లాజా, శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో కూడా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ట్రయిలర్ అదుర్స్ దశమి సెలబ్రేషన్స్‌కు గుజరాతీలు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. నవరాత్రుల్లో చేయబోయే సందడికి ట్రైలర్ చూపించారు. శిల్పీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించారు. యశ్ జోషి గ్రూప్ నృత్యంతో మొదలైన ఈవెంట్ కలర్ఫుల్గా సాగింది. ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిన యువతీయువకులు గర్భా, దాండియా డ్యాన్స్‌ల తో అదరగొట్టారు. ర్యాంప్ వాక్‌తో మస్తీ మజా చేశారు.