ఎందుకమ్మా ఈ కష్టాలు! | Chef Trisha gears up for an action sequence | Sakshi
Sakshi News home page

ఎందుకమ్మా ఈ కష్టాలు!

Published Tue, Aug 9 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఎందుకమ్మా ఈ కష్టాలు!

ఎందుకమ్మా ఈ కష్టాలు!

ప్రతి సీన్‌లోనూ ఆర్టిస్టులే నటించాలనే రూల్ లేదిప్పుడు. టెక్నాలజీ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ ఉందిగా.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. యాక్షన్ సీన్లు కూడా డూప్‌లతో లాగించేస్తున్నారు. కొంతమంది మాత్రం స్వయంగా యాక్షన్ సీన్స్ చేస్తారు. వారిలో త్రిష ఒకరు. మాదేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘మోహిని’లో ఈ సుందరాంగి షెఫ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
 ఇటీవల లండన్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో థాయిల్యాండ్‌లో హీరోయిన్ తలకిందులుగా వేలాడే యాక్షన్ సీన్లు షూట్ చేయనున్నారు. డూప్‌తో ఆ సీన్లు తీద్దామంటే త్రిష ఒప్పుకోలేదట. స్వయంగా తానే నటిస్తానని చెప్పారట. ప్రస్తుతం చెన్నైలో రోజూ తలకిందులుగా వేలాడుతూ, రిస్కీ ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట. అది చూసి, ఆమె సన్నిహితులు ‘ఎందుకమ్మా.. ఈ కష్టాలు’ అనడిగితే.. ఫర్ఫెక్షన్ కోసమే అంటున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement