ఆరు నెలల్లో అరడజను సినిమాలు..! | Trisha to kick start her 6th film of the year | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!

Published Sun, Jun 11 2017 2:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!

ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!

వయసు పెరుగుతున్న కొద్ది జోరు పెంచుతోంది చెన్నై చంద్రం త్రిష. ఇక కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటున్న టైంలో బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ధనుష్ సరసన హీరోయిన్ గా నటించిన కోడి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న త్రిష, ఈ ఏడాది మిగిలిన ఆరునెలల సమయంలో తను నటించిన ఆరు సినిమాలను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సినిమాలతో పాటు తాజా మరో సినిమాను స్టార్ట్ చేసింది.

ఇప్పటికే మోహిని, గర్జనై, శతురంగ వేట్టై సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తమిళ సినిమా 1818తో పాటు మలయాళ సినిమా హేయ్ జూడ్ ల షూటింగ్లలో పాల్గొంటుంది త్రిష. వీటితో పాటు తాజా 96 అనే సినిమాకు కూడా డేట్స్ ఇచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12 నుంచి సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివరకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement