Horror thriller
-
హారర్ సినిమాకు ఓకే
లవ్ స్టోరీ, యాక్షన్, ఫ్యామిలీ, కమర్షియల్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేశారు ఆలియా భట్. అయితే తొలిసారిగా ఆలియా భట్ ఓ పూర్తి స్థాయి హారర్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం. హిందీలో ‘స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్య’ వంటి హారర్ సినిమాల నిర్మాణంలో భాగమైన నిర్మాత దినేష్ విజన్‌తో ఆలియా భట్ ఇటీవల భేటీ అయ్యారట.వీరి సమావేశం ఓ హారర్ ఫిల్మ్ కోసం అని, ఈ విషయమై త్వరలో స్పష్టత రానుందని భోగట్టా. ఇటీవలే యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’ను పూర్తి చేసిన ఆలియా త్వరలోనే ‘లవ్ అండ్ వార్’ సినిమా చిత్రీకరణతో బిజీ కానున్నారు. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తర్వాతే ఆలియా హారర్ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు. -
టాలీవుడ్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ లాంటి సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి రానుంది.(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సిరీస్‌ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. 🫣It will see you on screens from 28th November 💥#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali 🪔#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024 -
తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్ సదాశివన్ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. -
నాగ చైతన్య హార్రర్ వెబ్ సిరీస్.. 'దూత'గా భయపెట్టనున్నాడా ?
Naga Chaitanya Horrer Web Series Tittled As Dhootha: అక్కినేని వారసుడు, టాలీవుడ్ గుడ్ బ్యాయ్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థాంక్యూ' చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఒక హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు 'దూత' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో చైతూ వెనుక ఉన్న స్క్రిప్ట్‌ను చూపిస్తూ 'దూత.. ఎపిసోడ్ 1' అని తెలిపారు. ఈ లుక్‌లో కూడా నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ హార్రర్ జోనర్లో చేయని చైతూ ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడతాడో చూడాలి. View this post on Instagram A post shared by Naga Chaitanya ™ (@akkineni.nagachaitanya) -
‘ద గర్ల్ ఆన్ ద ట్రైన్’ సినిమా రివ్యూ
‘ది ఇన్ విజబుల్ గెస్ట్’ (స్పానిష్) సినిమా ఆధారంగా హిందీలో వచ్చిన బద్లా (తెలుగులో కూడా వచ్చింది ‘ఎవరు?’) తర్వాత బాలీవుడ్లో ఈ తరహా సినిమాల జోరు పెరిగింది. ఓటీటీల్లో అయితే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్‌కి కొదవే లేదు. సెన్సార్షిప్ లేకపోవడంతో నేరాలు, హింస, లైంగిక హింసే ప్రధానాంశాలుగా ఈ సినిమాలు వస్తున్నాయి. అలాంటి జాబితాలోకే చేర్చవచ్చు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ హిందీ చిత్రం ‘ద గర్ల్ ఆన్ ద ట్రైన్’. సైకాలజికల్ థ్రిల్లర్‌గా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ‘ద గర్ల్ ఆన్ ద ట్రైన్’ పేరుతోనే పౌలా హాకిన్స్ రాసిన నవలే దీనికి ఆధారం. అయితే 2016లోనే ఈ ఇంగ్లిష్ నవల అదే పేరుతో హాలీవుడ్ తెరకూ పరిచయం అయింది. లేటెస్ట్ ‘ద గర్ల్ ఆఫ్ ద ట్రైన్’ గురించే నేటి వెబ్‌ఫ్లిక్స్. కథ.. మీరా (పరిణీతి చోప్రా).. లండన్‌లో సక్సెస్ఫుల్ లాయర్. ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు శేఖర్ కపూర్ (అవినాశ్ తివారీ) అనే కార్డియాలజిస్ట్. ఒక హత్య కేసులో జిమ్మి బగ్గా (క్రిషన్ టండన్) అనే డ్రగ్ డీలర్‌కు వ్యతిరేకంగా వాదిస్తుంది మీరా. ఆ కేస్ నుంచి తప్పుకోమని జిమ్మీ బగ్గా ఆమెను బెదిరిస్తాడు. లెక్క చేయదు. శిక్షపడేలా చేస్తుంది. ఆ డీలర్ జైల్లోని తన సెల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ విషయం మీరాకు తెలియదు. ఒకరోజు భర్తతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కారు ప్రమాదానికి గురవుతుంది. అప్పటికి మీరా గర్భవతి. భార్యాభర్తలిద్దరికీ గాయాలవుతాయి. మీరాకు అబార్షన్ అవుతుంది. ప్రమాదం తర్వాత.. మీరా జీవితమే మారిపోతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకరకమైన అమ్నేసియా బారిన పడుతుంది. తాగుడికి బానిసవుతుంది. లాయర్ వృత్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. భార్యాభర్తల మధ్యా సఖ్యత లోపిస్తుంది. విడాకులు తీసుకుని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు శేఖర్. ఇది మీరాను మరింత కుంగదీస్తుంది. కష్టకాలంలో తోడుండాల్సిన భర్త తన నుంచి విడిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది. ఇంటికి వెళ్లి తనతో కలిసుండమని పోరుతుంటూంది. శేఖర్, అతడి భార్య.. మీరాను విసుక్కుంటూంటారు. ఒకానొక దశలో శేఖర్ ఆమెను బెదిరిస్తాడు కూడా. అయినా భర్తను మరచిపోలేకపోతుంది. రెడ్ బ్రిడ్జ్ టు గ్రీన్విచ్ ప్రతి రోజూ రైల్లో రెడ్ బ్రిడ్జ్ నుంచి గ్రీన్విచ్కు ప్రయాణం చేస్తుంటుంది. శేఖర్, తను కలిసి ఉన్న ఇంటిని చూసుకోవడం కోసం. రైల్లో వెళ్తున్నప్పుడు ఆ ఇల్లు కనిపిస్తుంది. కాని ఆ ఇంట్లోకి ఓ కొత్త జంట దిగి ఉంటారు. ఆ అమ్మాయి పేరు నుస్రత్ జాన్ (అదితీరావ్ హైదరీ). ఆమే డాక్టరే. భర్త ఆనంద్ (షమాన్ అహ్మద్)తో కలిసి ఆ లోగిలిలో ఆమె సంతోషంగా కనపడ్డం, హాయిగా ఉండడం.. చూసి ఎంత పర్ఫెక్ట్ లైఫ్ అని అబ్బురపడుతుంది. నుస్రత్లో ఒకప్పటి తనను చూసుకొని ఇప్పుడా జీవితం లేనందుకు ఒకరకంగా అసూయ చెందుతుంది. ఆ ఇంటిని.. ఆమెను చూడ్డం ఆమె దినచర్యలో భాగం అవుతుంది. తను కోల్పోయిన జీవితాన్ని తలచుకొని తలచుకొని కుంగిపోతూంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి ఆ ఇంట్లో నుస్రత్ పక్కన ఆమె భర్త కాకుండా ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. తన భర్త తనను మోసం చేసినట్టు.. నుస్రత్ ఆమె భర్తను మోసం చేస్తోందని అభిప్రాయపడుతుంది. తన భర్త మీదున్న కోపమంతా నుస్రత్ మీదికి బదిలీ చేసుకొని తగిన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఆ ఆగ్రహావేశాలతోనే నుస్రత్ వాళ్లింటికి వెళ్తుంది. ఆ సమయంలో నుస్రత్ ఉండదు. తమ ఇంటి వెనక ఉన్న అడవిలోకి వెళ్తూ కనిపిస్తుంది మీరాకు. వెంటనే ఆమెను అనుసరిస్తుంది మీరా. ఒకదశలో నుస్రత్‌ను సమీపించి కొడుతుంది కూడా. అలా హఠాత్తుగా వెనక నుంచి తన మీద దాడి చేసేసరికి ఆత్మరక్షణలో భాగంగా అసంకల్పితంగా ప్రతి దాడి చేస్తుంది నుస్రత్. మిస్సింగ్.. డాక్టర్ నుస్రత్ మిస్సింగ్ అని ఆమె ఆసుపత్రి సహోద్యోగులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదును అందుకున్న ఇన్స్పెక్టర్ దల్బీర్ కౌర్ (కృతి కల్హారి) ముందుగా నుస్రత్ భర్తను అనుమానిస్తుంది. రెండురోజులుగా భార్య కనిపించకపోయినా అతను ఫిర్యాదు చేయలేదు ఎందుకు అని? స్టేషన్‌కు పిలిపించి, ఆరా తీసి అతని మీద నిఘా పెడుతుంది. చివరిసారిగా నుస్రత్ ఎక్కెడెక్క కనిపించిందో ఆయా ప్రదేశాల్లోని అందరినీ విచారించే భాగంలో నుస్రత్ మాజీ బాయ్ ఫ్రెండ్ మీదా అనుమానం వస్తుంది. నిఘా పెట్టినా విషయం తేలదు. ఈ క్రమంలోనే ఆమె దృష్టి మీరా మీదా పడుతుంది. ఆ రోజు నుస్రత్ ఇంటిముందున్న సీసీ కెమెరాలో మీరా వచ్చినట్టు రికార్డ్ అవుతుంది. ఈలోపు గ్రీన్విచ్ ఫారెస్ట్‌లో నుస్రత్ శవమై కనిపిస్తుంది. నుస్రత్ ఇంటిముందు సీసీ కెమెరా ఫుటేజ్‌తోపాటు అడవిలో దొరికిన ఆధారాలు, రైల్వేస్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ అన్నిటితో ఆ హత్య చేసింది మీరా అనే నిర్ధారణకు వస్తుంది దల్బీర్. ఆమెను స్టేషన్‌కు పిలిపిస్తుంది కూడా. ఆ ఫుటేజ్ చూపిస్తూ ఇంటరాగేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్స్పెక్టర్. కాని అవేవీ మీరాకు గుర్తుండవు. తనకున్న జబ్బు గురించి చెప్పి.. తన నిస్సహాయతను వెల్లడిస్తుంది మీరా. ఆమె మీదా నిఘా పెట్టి మీరాకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌ను కలిసి ఆమె చెప్పింది నిజమో కాదో నిర్ధారణకు వస్తుంది దల్బీర్. బ్లాక్మెయిల్.. ఈ లోపు మీరాకు ఫోన్లో ఆ అడవిలో నుస్రత్‌ను కలిసిన ఫోటోలతో బ్లాక్మెయిల్ మెసేజ్‌లు వస్తూంటాయి. ఏదో మతలబు ఉంది అనే అనుమానం కలుగుతుంది ఆమెకు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో నుస్రత్ ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అయితే ఆ హత్య చేసింది ఆ రోజు నుస్రత్ వాళ్లింట్లో చూసిన వ్యక్తే అని, తనకు బ్లాక్మెయిల్ మెసేజ్‌లు పంపుతుందీ అతనే అనుకొని అతని గురించి ఎంక్వయిరీ చేస్తుంది. అతను సైకియాట్రిస్ట్ డాక్టర్ హమీద్ అని, డిప్రెషన్లో ఉన్న నుస్రత్‌ను ట్రీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వెళ్లి కలుస్తుంది. కాని ఆ హత్యతో తనకేమీ సంబంధం లేదంటాడు. ఇంకోవైపు మీరా ఆచూకీ కోసం పోలీసులు వెదుకుతుంటారు. చివరకు తనకు బ్లాక్మెయిల్ మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి ఎవరో తెలుస్తుంది. కలవడానికి వెళ్లేసరికీ అతనూ హత్యకు గురవుతాడు. గందరగోళంగా అనిపిస్తుంది మీరాకు. ఎలాగోలా ఆ బ్లాక్‌మెయిలర్ అడ్రస్ పట్టుకొని అతని ఇంటికి వెళ్లిన మీరా షాక్ అవుతుంది. ఆ ఇంట్లో నుస్రత్, మీరా భర్త కలిసున్న ఫోటోలు కనపడ్తాయి. అంటే ఆ బ్లాక్‌మెయిలర్ ఆ రోజు ఫారెస్ట్‌లోకి నుస్రత్‌ను ఫాలో అవుతూ వచ్చాడన్నమాట. తను కనపడేసరికి తననూ బ్లాక్మెయిల్ చేశాడని అర్థమవుతుంది మీరాకు. ఇంతకీ తన భర్తతో నుస్రత్కేం పని? అనే ఆలోచనల్లో పడుతుంది. వాళ్లిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలవి. ఎక్కడో చిక్కుముడి వీడుతున్న భావన మీరాలో. ఆ దిశగా పరిశోధన చేస్తుంది మీరా. విలన్ తన మాజీ భర్త డాక్టర్ శేఖరే అని తేలుతుంది. శేఖర్, నుస్రత్ ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో డాక్టర్లు. ఆమెతో వివాహేతర సంబంధంలో ఉంటాడు శేఖర్. అతని వల్లే గర్భవతి అవుతుంది నుస్రత్. ఆ విషయం చెప్పడానికే ఆ రోజు తమ ఇంటి వెనక ఉన్న అడవిలోకి శేఖర్‌ను రమ్మంటుంది నుస్రత్. అప్పుడే మీరా ఆమెను వెంబడించడాన్ని శేఖర్‌కు చెప్తుంది. అతను మీరాను చూస్తాడు. ఇక్కడా తనను వదిలేట్టు లేదు కదా.. అని కోపం తో మీరాను కొడ్తాడు శేఖర్. స్పృహ తప్పి పడిపోతుంది మీరా. మళ్లీ నుస్రత్ దగ్గరకు చేరేసరికి ఆమె తాను తల్లిని కాబోతున్నాన్న మాట చెప్తుంది. అతని మొహం వివర్ణమవుతుంది. తనకు పిల్లలంటే ఇష్టం లేదు అని చెప్తాడు. విస్తుపోతుంది నుస్రత్. ఈ విషయం మీద ఇద్దరికీ వాగ్వాదం జరుగుతుంది. కోపంతో నుస్రత్ గొంతు నొక్కేస్తాడు శేఖర్. కుప్పకూలిపోతుంది నుస్రత్. చనిపోయిందనుకొని చేతులు దులిపేసుకొని అక్కడి నుంచి జారుకుంటాడు. ఇదంతా ఫోటోలుగా తీస్తాడు ఆ బ్లాక్ మెయిలర్. శేఖర్ విలన్ అని తేలుతుంది కాని హంతకుడా అతను కాదనే నిజమూ బయటపడుతుంది ఆ బ్లాక్‌మెయిలర్ కెమెరాలోని ఫోటోలోతోనే. మరి మర్డరర్ ఎవరు? ఇన్స్పెక్టర్ దల్బీర్ కౌర్ బగ్గా. ఎస్.. డ్రగ్ డీలర్ కూతురు. తన తండ్రి చావుకి కారణమైందన్న కోపంతో మీరా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఆమె కారుకి యాక్సిడెంట్ చేయించిందీ దల్బీరే. నుస్రత్‌ను చంపి.. ఆ హత్యానేరం మీరా మీదకు తోసి జైలు పాల్జేయాలనీ పథకం వేస్తుంది. కానీ మీరా ఇన్వెస్టిగేషన్తో చివరకు తానే హంతకురాలని నిర్ధారణ అవుతుంది. ముగింపు.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా కాకుండా.. క్లూలు మిస్ అయిన పజిల్లా అనిపిస్తుందీ సినిమా. తర్వాత జరగబోయే సీన్ ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమా కాదు. -
ఆర్పీ వినూత్న ప్రయోగం `అలిషా`!
సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తన వైవిధ్యమైన సంగీతంతో ఎన్నో సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక దర్శకుడిగా కూడా రెగ్యులర్ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్పీ తెరకెక్కించిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆర్పీ పట్నాయక్. ‘అలిషా’ పేరుతో హర్రర్ థ్రిల్లర్‌గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా ‘అలిషా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఐఎస్ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ సోనాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచనతో, దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా ఆర్పీనే చూస్తున్నాడు. అనుష్ గోరక్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య సాల్వి, వేదాంత్ సలూజా, రిచా కల్రా, అక్షయ్ బక్చు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది. ‘స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు డాల్డీ ఎట్మాస్ సౌండ్‌తో రిలీజ్ అయినా.. ఆ సాంకేతికత కోసం తయారు చేసిన కథలు మాత్రం ఇంతవరకు మన దేశంలో రాలేదు. ఆలోటు భర్తి చేస్తూ షూటింగ్ చేస్తున్నప్పుడే డాల్బీ ఎట్మాస్ సౌండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్పీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్‌కు అత్యున్నత ప్రమాణాలు కలిగిన సౌండ్ ఎఫెక్ట్స్ తోడైతే అవుట్‌పుట్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాతో చూపించనున్నారు’అని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. -
మిల్కీబ్యూటీ కొత్త అవతారం
నటి తమన్నా కొత్త అవతారం ఎత్తారు. నిజం చెప్పాలంటే బాహుబలి వంటి ఒకటి రెండు చిత్రాల్లో తనలోని నటనా ప్రతిభను చాటుకునే అవకాశం వచ్చినా, చిత్రాన్నంతా తనపై వేసుకుని మోసే సత్తా కలిగిన అవకాశం 10 ఏళ్లు దాటిన తన కెరీర్లో లభించలేదనే చెప్పాలి. అగ్రనటీమణులగా రాణిస్తున్న నయనతార, అనుష్క లాంటి వారు అలాంటి పాత్రల్లో తామేమిటో నిరూపించుకున్నారు. త్రిష కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించారు. అయితే వాటిలో తను సక్సెస్‌ను అందుకోలేకపోయారు. నటి అంజలి కూడా కథానాయకి ప్రధాన పాత్ర కలిగిన చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా నటి తమన్నా ఆ కోవలో చేరిపోయారు. ఇటీవల తెలుగు చిత్రం ఎఫ్2 హిట్ కావడంతో చాలా ఖుషీగా ఉన్న ఈ మిల్కీబ్యూటీకి మరింత జోష్‌ను అందించేలా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి ఫేమ్‌లో ఉన్నారు. తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన దేవి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం విశాల్‌తో ఒక చిత్ర షూటింగ్లో ఉన్నారు. తరువాత మరో చిత్రంలోనూ ఆయనతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలోనూ నటించే అవకాశం తమన్నాను వరించింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని అదే కన్గళ్ చిత్రం ఫేమ్ రోహిన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో అంటూ ఎవరూ ఉండరట. అయితేనేం హీరోలు లేని కొరతను తీర్చేస్తున్న కమెడియన్ యోగిబాబు ఉండనే ఉన్నాడు. ఇటీవల ఇతను లేని చిత్రమే లేదని చెప్పవచ్చు. ఇప్పుడు తమన్నా చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా మునీశ్కాంత్, సత్యన్, కాళీ వెంకట్, బుల్లితెర ఫేమ్ టీఎస్కే ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుందన్నారు. అలా నటి తమన్నాకు ఒక సమస్య ఎదురవుతుందని, దాన్ని ఆమె తన మిత్రబృందంతో కలిసి ఎలా ఛేదించి బయట పడిందన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. హర్రర్ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి వినోదాన్ని జోడించి తెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో కొంతభాగం షూటింగ్‌ను చేసి ప్రస్తుతం కోడైకెనాల్‌లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. -
'మాకు దెయ్యాలు ఎలాంటి హానీ చెయ్యలేదు'
రాధికా అప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘గూల్’ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పాట్రిక్ మీడియాతో పంచుకున్నారు. ప్రశ్న: గూల్ తీయాలని మీకు ఎలా అనిపించింది. తొలి ప్రాజెక్టుకే ఇలాంటి స్టోరి ఎందుకు తీసుకున్నారు ? జవాబు: నేను మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథను తెరకెక్కిద్దామని అనుకున్నాను. ఇలాంటి కథలు వచ్చి చాలా కాలం అయింది. అలాంటి థ్రిల్లర్‌ను చేయాలని నేను భావించాను. ఒక రచయితగా, దర్శకుడిగా ఇలాంటి ప్రాజెక్టును తెరకెక్కించాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ స్టోరిని తెరకెక్కించడానికి ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సహకరించాయి. ప్ర: ఈ వెబ్ సిరీస్‌లో పాత్రల, లోకేషన్ల ఎంపిక ఎలా జరిగింది? జ: ప్రశాంత్ సింగ్ నేతృత్వంలో అద్భుతమైన నటులు దొరికారు. ఇందులో ముఖ్యంగా కండలు గల సైనికుల పాత్రల ఎంపిక చాలా కీలకమైంది. కానీ మాకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. మహేశ్‌కు చాలాసార్లు స్క్రీన్ టెస్టు నిర్వహించిన తర్వాత అలీ సయీద్ పాత్రకు అతడే కరెక్ట్ అనే నిర్ధారణకు వచ్చాం. రాధిక, మానవ్‌లు ఇద్దరు గొప్పగా నటించారు. వారికి ఈ తరహా పాత్రల్లో నటించడానికి ఆసక్తి ఉండటం అదృష్టంగా భావిసున్నాను. ఈ సినిమా లోకేషన్(తులిప్ స్టార్ బేస్మెంట్) కూడా చాలా బాగా కుదిరింది. ప్ర: అలాంటి చీకటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి ఇబ్బంది కలుగలేదా ? జ: కలిగింది. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండేంది. గాలి కూడా సరిగా ఆడేది కాదు. కొన్ని సార్లు దుర్వాసన భరించలేనంతగా ఉండేది(ముఖ్యంగా భోజనం చేసే సమయంలో). ఈ చిత్రీకరణ సమయంలో ఏ దెయ్యాలు మాకు ఎటువంటి హానీ చెయ్యలేదు(నవ్వుతూ..) ప్ర: మీరు దీనిని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌ను ఎందుకు ఎంచుకున్నారు ? జ: ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు చేరాలంటే నెట్‌ఫ్లిక్స్ కన్నా బెటర్ ఆఫ్షన్ కనిపించలేదు. వారు ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్‌గా నిలిచారు. ప్ర: మీరు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఎందుకు డబ్ చేశారు ? జ: మేము గూల్ ఎంతవరకు సాధ్యమైతే అంత ఎక్కువ మందికి చేరాలని భావించాం. హిందీతోపాటు, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్‌లో డబ్ చేసిన వర్షన్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఎక్కువ మంది ఈ వెబ్ సిరీస్‌ను చూడటానికి ఉపయోగపడుతోంది. ఇండియాలో ఎవరికైతే సబ్ టైటిల్స్ చదువుతూ సినిమా చూడటం నచ్చదో వారికి కూడా డబ్ చేయడం వల్ల దీనిని చూడటానికి ఇష్టపడతారు. ప్ర: ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జ: ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. కొత్త రకమైన కథలు తెరకెక్కిద్దామనుకునే వారికి ఈ విజయం మంచి ఉత్సాహన్ని ఇస్తుందన్ని భావిస్తున్నాను. స్కేర్డ్ గేమ్స్‌కు ఇండియన్ అన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇంత మంచి ఆదరణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను నెగిటివ్ రివ్యూలను చదవను. -
‘ఈ గోడల మధ్య నుంచి.. మీరు తప్పించుకోలేరు’
వివాదాస్పద నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ గూల్. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం స్కేర్డ్ గేమ్స్‌కు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో గూల్ కూడా విజయం సాధిస్తున్న నమ్మకంతో ఉన్నారు నెట్‌ఫ్లిక్స్ టీం. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకుడు. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే కనిపిస్తున్నారు. -
‘మెర్క్యూరి’ మూవీ రివ్యూ
టైటిల్ : మెర్క్యూరి జానర్ : సైలెంట్ హర్రర్ థ్రిల్లర్ తారాగణం : ప్రభుదేవా, సనంత్‌రెడ్డి, దీపర్ పరమేష్, శశాంక్ పురుషోత్తం, అనీష్ పద్మనాభన్, ఇందుజా, గజరాజ్ సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : స్టోన్ బెంచ్ ఫిలింస్, పెన్ స్టూడియోస్ 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ పేరుతో ఓ మూకీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అదే ప్రయోగం చేశాడు. మూకీ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మెర్క్యూరి సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. మూడు దశాబ్దల తరువాత భారతీయ వెండితెర మీద సందడి చేసిన మూకీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించిన ప్రభుదేవ భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడా..? కార్తీక్ మరోసారి తన మార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అలరించాడా..? కథ : కార్పొరేట్ ఎర్త్ అనే కంపెనీలో జరిగిన మెర్య్కూరి పాయిజనింగ్ కారణంగా ఆ దగ్గరలోని ఓ గ్రామంలో 84 మంది చనిపోతారు. అంతేకాదు ప్రమాదం కారణంగా ఎంతోమంది చిన్నారులు మూగ చెవిటి వారిగా, అంధులుగా పుడతారు. మెర్య్యూరి పాయిజనింగ్ కారణంగానే బధిరులైన నలుగురు కుర్రాలు, ఓ అమ్మాయి కాలేజ్ లో జరిగిన అలూమ్ని పార్టీ లో పాల్గొని తరువాత కొద్దిరోజులు ఫ్రెండ్స్ తో ఆనందంగా గడపడానికి అక్కడే ఉండిపోతారు. అలా ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తూ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్ చేస్తారు. ఆ యాక్సిడెంట్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆ శవాన్ని మోర్య్కూరి పాయిజనింగ్ కు కారణమైన ఫ్యాక్టరిలో పడేస్తారు. తరువాత ఆ కుర్రాళ్లు అదే ఫ్యాక్టరికీ ఎందుకు వెళ్లారు..? వారు యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తి ఎవరు..? ఆ కుర్రాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవటానికి కారణం ఏంటి..? చివరకు ఎంత మంది మిగిలారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : దాదాపు 30 ఏళ్ల తరువాత ఇండియన్ స్క్రీన్ మీద మూకీ సినిమాను చూపించిన కార్తీక్ సుబ్బరాజ్ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. అది కూడా డ్యాన్సర్ గా, లవర్ భాయ్‌గా మంచి ఇమేజ్ ఉన్న ప్రభుదేవాను పూర్తిగా డిఫరెంట్ రోల్లో, డిఫరెంట్ గెటప్‌లో చూపించి మెప్పించాడు కార్తీక్. సందేశాత్మక అంశాన్ని హర్రర్ థ్రిల్లర్‌గా మలిచి ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలేవి లేకపోవటం, తొలి భాగంలో లీడ్ యాక్టర్స్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులకు అర్ధం కాకపోవటం లాంటివి కాస్త ఇబ్బంది పెడతాయి. దర్శకుడు సృష్టించిన పాత్రకు ప్రభుదేవా వందశాతం న్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకునే పాత్రలో ప్రభుదేవా నటన చాలా సందర్భాల్లో భయపెడుతుంది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం. ఒక్క డైలాగ్ కూడా లేని సినిమాను పూర్తిగా తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మార్చాడు సంతోష్. తిరు అందించిన సినిమాటోగ్రఫి సినిమాలోని ఫీల్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రభుదేవా లుక్, నటన కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : బధిరుల భాషలో చెప్పించిన సంభాషణలు అర్ధం కాకపోవటం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ట్రైలర్ చూసి కొత్తగా ఫీలయ్యా - సునీల్
‘‘థ్రిల్, లవ్, కామెడీ.. ఇలా అన్ని ఎమోషన్స్ ఈ ట్రైలర్లో కనిపించాయి. శివేంద్ర కెమేరా పనితనం చాలా బాగుంది. హార్రర్ కామెడీ, ప్రేమకథా చిత్రాలు చూసి ఎంత కొత్తగా ఫీలయ్యానో, ఈ ‘మాయామాల్’ ట్రైలర్లో హార్రర్ చూసి అంతే కొత్తగా ఫీలయ్యా. టీజర్లా సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని సునీల్ అన్నారు. దిలీప్, ఇషా, దీక్షాపంత్, సోనియా ముఖ్య పాత్రల్లో గోవింద్ లాలం దర్శకత్వంలో కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘మాయామాల్’. ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్, సునీల్ విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘ట్రైలర్ భయపెట్టేలా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు కనిపించడం లేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథతో మూడేళ్లు చాలా మంది చుట్టూ తిరిగా. చివరికి ఈ నిర్మాతలు మందుకొచ్చారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని దర్శకుడు అన్నారు. -
ఎందుకమ్మా ఈ కష్టాలు!
ప్రతి సీన్లోనూ ఆర్టిస్టులే నటించాలనే రూల్ లేదిప్పుడు. టెక్నాలజీ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ ఉందిగా.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. యాక్షన్ సీన్లు కూడా డూప్లతో లాగించేస్తున్నారు. కొంతమంది మాత్రం స్వయంగా యాక్షన్ సీన్స్ చేస్తారు. వారిలో త్రిష ఒకరు. మాదేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘మోహిని’లో ఈ సుందరాంగి షెఫ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో థాయిల్యాండ్‌లో హీరోయిన్ తలకిందులుగా వేలాడే యాక్షన్ సీన్లు షూట్ చేయనున్నారు. డూప్‌తో ఆ సీన్లు తీద్దామంటే త్రిష ఒప్పుకోలేదట. స్వయంగా తానే నటిస్తానని చెప్పారట. ప్రస్తుతం చెన్నైలో రోజూ తలకిందులుగా వేలాడుతూ, రిస్కీ ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట. అది చూసి, ఆమె సన్నిహితులు ‘ఎందుకమ్మా.. ఈ కష్టాలు’ అనడిగితే.. ఫర్ఫెక్షన్ కోసమే అంటున్నారట. -
ఇటు వంట... అటు ఉత్కంఠ!
ఎప్పుడూ షూటింగులేనా? ఖాళీ సమయాల్లో ఇంటి పనులేమైనా చేస్తారా? అసలు మీకు వంట చేయడం వచ్చా? అని త్రిషను అడిగితే.. ‘తినడం మాత్రం బాగా వచ్చు’ అని కూల్‌గా అంటారు. ‘‘మా ఇంట్లో కిచెన్ చూసి చాలా రోజులైంది. ఇక, గరిటె తిప్పే టైమ్ ఎక్కడుంది?’’ అని కూడా అంటున్నారు. కథానాయికగా దాదాపు పదమూడేళ్ల నుంచి వరుస సినిమాలతో త్రిష ఎప్పుడూ బిజీగానే గడిపారు. ఇప్పుడామెకు వంట చేసే అవకాశం లభించింది. అంటే.. అంత ఖాళీగా ఉన్నారా? అనుకోవద్దు. ఎందుకంటే.. వంట చేసేది ఇంట్లో కాదు, షూటింగులో. ప్రస్తుతం మాదేశ్ దర్శకత్వంలో త్రిష నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘మోహిని’. ఈ చిత్రంలో చెఫ్‌గా నటిస్తున్నారామె. కెరీర్లో ఫస్ట్ టైమ్ ఈ పాత్రలో కనిపించనున్నారామె. పాత్రలో పర్ఫెక్షన్ కోసం షూటింగ్ ప్రారంభించడానికి ముందు చెఫ్స్ నుంచి సలహాలు తీసుకున్నారట. వంటతో పాటు ప్రేక్షకులను ఆమె ఉత్కంఠకూ గురి చేయనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్‌లో దెయ్యంగానూ కనిపించనున్నారు. -
భయపెట్టే మంత్రం!
తెలుగులో హారర్ థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అదే తరహా కథాంశంతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపొందనుంది. మమతా రావత్, ప్రదీప్ ముఖ్యతారలుగా యం.ఎస్.బాబు స్వీయదర్శకత్వంలో నిర్మించనున్న చిత్రం ‘మంత్రం తంత్రం యంత్రం’. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వరంగల్ ఎంపి దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని దర్శక-నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరి దోసాడ, కథ: మహేశ్వర్, సహ నిర్మాతలు: అంబాల రవి, మోతే ప్రకాశ్‌రెడ్డి, ఎన్. అప్సర,యస్.కె.మఖ్బూల్. -
ఇదో.. హారర్.. థ్రిల్లర్!
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండటంతో ఈ తరహా చిత్రాలను క్యాష్ చేసుకునే పని మీద చాలామంది ఉన్నారు. ఈ ట్రెండ్‌ని అనుసరిస్తూ, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలాఠిట జంటగా ‘వీడికి దూకుడె క్కువ’ చిత్రంతో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బెల్లం రామకృష్ణారెడ్డి ఇప్పుడీ హార ర్ చిత్రంతో దర్శకునిగా మారారు. కార్తీక్, కశ్మీర జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల అయింది. కథ: ఓ పాప తన తండ్రి ప్రతి రోజు రాసుకుంటున్న డైరీ చదవడంతో ప్రస్తుతంలో ఉన్న కథ ఐదేళ్ల వెనక్కి వెళుతుంది. అఖిల్ (కార్తీక్), అభినయ (కశ్మీర) ఇద్దరూ బీటెక్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. జాబ్ వచ్చాక తల్లితండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే... అభినయ జీవితంలో పెను విషాదం. ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు. అందర్నీ కోల్పోయి అనాథగా మారిన అభినయ జీవితానికి అండగా నిలుస్తాడు అఖిల్. ఈలోగా బీటెక్ పూర్తి కావడం, ఇద్దరికీ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. అఖిల్, అభినయలకు మరో ఫ్రెండ్ పెళ్లిళ్ల బ్రోకర్ అయిన అన్వేష్ (మధు) అన్ని వేళలా తోడుగా నిలుస్తాడు. ఇలా కాలం వేగంగా పరుగులు తీస్తుంది. వీరిద్దరి ప్రతిరూపంగా పుట్టిన హనీతో అఖిల్, అభినయల జీవితం రంగులకలగా సాగిపోతూ ఉంటుంది. ఇంతలో ఉద్యోగార్థం యూరోప్ ట్రిప్‌కు వెళ్లడానికి అఖిల్ సిద్ధమవుతాడు. కానీ, అభినయ, హనీలకు అతను వెళ్లడం ఇష్టం ఉండదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత గానీ అఖిల్ ఇండియాకు రాడు. కూతురు హనీ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనుకుంటాడు అఖిల్. ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుండగా కారు ప్రమాదంలో అతను చనిపోయాడని టీ వీలో బ్రేకింగ్ న్యూస్. ఈ వార్త చూసిన అన్వేష్ ఈ విషయం అభినయకు చెప్పడానికి వెళతాడు. కానీ అక్కడ ఇద్దరూ అన్వేష్‌తో ఫోన్లో మాట్లాడటం చూసి షాక్ కు గురవుతాడు. అసలు అఖిల్ నిజంగా చనిపోయాడా? లేదా అని రూఢి చేసుకోవడానికి మార్చ్యురీకి వెళతాడు. నిజమే అక్కడ ఉన్నది అఖిల్ శవమే. అతని ఐడీ కార్డ్, చొక్కా అన్వేష్‌కి ఇస్తారు మార్చ్యురీ సిబ్బంది. ఈ విషయం చెబుదామని అఖిల్ ఇంటికి వెళ్లిన అన్వేష్‌కు ఆ ఇంటి నుంచి రకరకాల శబ్దాలు, ఓ పాప అరుపులు, వినిపించడంతో అక్కడి నుంచి పారిపోతాడు. గందరగోళానికి గురైన అన్వేష్ తర్వాత రోజు మార్చ్యురీకి వెళితే అఖిల్ శవం ఉండదు. అఖిల్ చనిపోయాడా? లేదా? అనేది మిగతా కథ. ‘ప్రాణం’, ‘వాన’ చిత్రాల ద్వారా సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ప్రాణం’ కమలా కర్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ‘ఏ కలలో...’ పాట బాగుంది. సంతోష్ కెమెరా పనిత నం కనిపిస్తుంది. -
మళ్లీ భయపెడతా!
మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నారు సంచలన క్రేజీ తార నయనతార.ఇంతకు ముందు హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన మాయ చిత్రంలో నటించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన నయనతార తాజాగా ఆ తరహా చిత్రంతో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.ఇంతకు ముందు నాన్ అవన్‌ఇల్లై,అంజాదే, పాండి, మిగామన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నెమిజంద్ జపక్ సంస్థ అధినేత వీ.హిందేష్ జపక్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దీన్ని దర్శకుడు సర్గుణం తన సర్గుణం సినిమాస్ పతాకంపై తొలి కాపీ కాంట్రాక్ట్ విధానంలో నిర్మించనున్నారు. ఆయన శిష్యుడు రామసామి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అని, హర్రర్,కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం పిల్లల నుంచి పెద్దల వరకూ చూసి ఆనందించే జనరంజక చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. తంబిరామయ్య, హరీష్ ఉత్తమ్ ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీత బాణీలు కడుతున్నట్లు తెలిపారు. -
అందరికీ నచ్చేలా... శివగంగ
రెండు ఆత్మలు పగ తీర్చుకునే కథాంశంతో తమిళంలో వీసీ వడి ఉదయన్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘శౌకార్పెట్టై’ . రాయ్‌లక్ష్మీ, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శివగంగ’ పేరుతో ఎస్. కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ పతాకంపై కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగులో అందిస్తున్నారు జాన్‌పీటర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి ఆవిష్కరించారు. శ్రీరామ్ మాట్లాడుతూ-‘‘ తెలుగు ప్రేక్షకులు కొత్త దనాన్ని ప్రోత్సహిస్తారనే విషయాన్ని నా ‘రోజాపూలు’ సినిమా హిట్ చేసి నిరూపించారు. నేను మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ ఎన్నో హారర్ మూవీస్ చేశాను. కానీ తొలిసారి దెయ్యం ఆవహించిన పాత్ర చేశాను. ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. సినిమా అందరికీ నచ్చేలా రూపొందించామనీ, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, విద్యుత్ శాఖా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ట్వంటీఫస్ట్‌న ఏంటి?
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్వంటీఫస్ట్’. వెంకట్, వింధ్య, నవీన్ ముఖ్య పాత్రల్లో జయశంకర్ దర్శకత్వంలో యాదగిరి నిర్మిస్తున్నారు. అభిషేక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాద్‌లో విడుదల చేసి దర్శకుడు రఫీకి అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుంది. అసలు ట్వంటీఫస్ట్ అనే టైటిల్ ఈ సినిమాకు బాగా సరిపోతుంది. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర
స్వాతి టైటిల్ రోల్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘త్రిపుర’. క్రేజీ మీడియా పతాకంపై ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. తమిళంలో ‘తిరుపుర సుందరి’గా వస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అనుకున్న కథను రాజకిరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్‌ప్లే ఓ హైలైట్. ‘స్వామి రారా, కార్తికేయ’ వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన మరో తెలుగు చిత్రమిది. ఆ కోవలోనే ఇదీ హిట్టవు తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు. ‘‘త్రిపుర ఏం చేస్తుంది? ఆమె కథేంటి అనేది సస్పెన్స్. స్వాతి అద్భుతంగా నటించింది. నవీన్‌చంద్ర చేసిన పాత్ర అదనపు ఆకర్షణ. సప్తగిరి కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. హార్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 29న పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజా, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సంగీతం: కమ్రాన్. -
భయపెట్టే కాకి!
కాకి అనే పక్షి చుట్టూ తిరిగే కథతో, హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కాకి’. కిరణ్ పత్తికొండ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అశోక్ కుమార్, మేఘశ్రీ ముఖ్యతారలు. మనోన్. యమ్ దర్శకుడు. ‘‘ ‘కాకి’ అనే టైటిల్ విని చాలా మంది పోలీస్ స్టోరీ అనుకున్నారు. కానీ ఇదొక డిఫరెంట్ స్టోరీ. అనుకున్న దాని కన్నా దర్శకుడు ఈ సినిమాను బాగా తీశారు’’ అని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘దర్శకునిగా తెలుగులో నాకిది తొలి చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఎగ్జిక్యుటివ్ నిర్మాత రొనాల్డ్ రాజ్ ఎస్ విలియమ్స్ కథ అందించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిత్, కెమెరా: సర్వణ నటరాజన్. -
ఎవరీ త్రిపుర?
‘కలర్స్’ స్వాతి తొలిసారిగా టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘త్రిపుర’. అసలు త్రిపుర ఎవరు..? ఏం చేస్తుంది? అనేది సస్పెన్స్ అంటున్నారు చిత్ర దర్శకుడు రాజకిరణ్. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఈ నెల 15 నుంచి క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభించాం. త్రిపుర పాత్రకు ఇంకెవరూ సరిపోరనేంత బాగా స్వాతి నటిస్తున్నారు. కథాకథనాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు. -
కాంచన-2లో ప్రమోట్ సాంగ్
ప్రస్తుతం ఏ,బీ,సీ అంటూ వ్యత్యాసం లేకుండా అన్ని ఏరియాల్లోనూ కాంచన-2 విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాంచన వంటి హిట్ చిత్రం తరువాత దానికి కొనసాగింపుగా లారెన్స్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం కాంచన-2. తాప్సీ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హార్రర్ థ్రిల్లర్ చిత్రం కోసం తాజాగా లారెన్స్ ఒక ప్రమోషన్ సాంగ్‌ను చిత్రీకరిస్తుండడం విశేషం. చిత్రంలో చోటు చేసుకున్న సిల్టా పిల్లాట్ట అనే తొలి పాటను లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్‌లపై చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాట ప్రచారానికే ఉపయోగించనున్నట్లు చిత్రంలో చోటు చేసుకోదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పాట చిత్రీకరణను మంగళవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.