
Naga Chaitanya Horrer Web Series Tittled As Dhootha: అక్కినేని వారసుడు, టాలీవుడ్ గుడ్ బ్యాయ్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థాంక్యూ' చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఒక హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు 'దూత' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో చైతూ వెనుక ఉన్న స్క్రిప్ట్‌ను చూపిస్తూ 'దూత.. ఎపిసోడ్ 1' అని తెలిపారు. ఈ లుక్‌లో కూడా నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ హార్రర్ జోనర్లో చేయని చైతూ ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడతాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment