Naga Chaitanya and Rashi Khanna Pics Viral From Thank You Sets - Sakshi
Sakshi News home page

Naga Chaitanya : హీరోయిన్‌తో నాగ చైతన్య.. సెట్స్‌ నుంచి ఫోటోలు రిలీజ్‌

Published Mon, Apr 25 2022 9:06 PM | Last Updated on Tue, Apr 26 2022 10:31 AM

Naga Chaitanya And Raashi Khanna From Thank You Sets Pics Viral - Sakshi

యువ సామ్రాట్‌ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. గతేడాది లవ్‌స్టోరీతో హిట్‌కొట్టిన నాగ చైతన్య ఈ ఏడాది బంగర్రాజుతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన థ్యాంక్యూ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. విక్రమ్‌ కే కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. తాజాగా ఈ చిత్రం బీటీఎస్‌(బి హైండ్స్‌ ది సీన్స్‌) నుంచి ఓ ఫోటోను మేకర్స్‌ విడుదల చేశారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్‌ ఫోటోలు.. నెట్టింట వైరల్‌

ఇందులో చై ఫోన్‌ చూస్తుండగా, రాశీఖన్నా దర్శకనిర్మాతలతో మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు.వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అవికాగోర్, మాళ‌వికా నాయ‌ర్‌లు కీల‌క‌పాత్ర‌లో కనిపించనున్నారు. చదవండి: సహనం నశిస్తుంది, మౌనం అంగీకరంగా తీసుకోకు.. సమంత వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement