Vikram K kumar
-
‘తికమక తాండ’ కాన్సెప్ట్ కొత్తగా ఉంది: విక్రమ్ కె. కుమార్
‘‘తికమక తాండ’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. వెంకట్ ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. తనకు పెద్ద విజయం చేకూరాలి. అలాగే ఆరిస్టులు హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషాలకు మంచి పేరు రావాలి’’ అని దర్శకుడు విక్రమ్ కె. కుమార్ అన్నారు. హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషా హీరో హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తికమక తాండ’. తిరుపతి సత్యం సమర్పణలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని విక్రమ్ కె. కుమార్ రిలీజ్ చేశారు. ‘‘ఇప్పటికే విడుదల చేసిన ΄ాటలు, టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఈ నెల 15న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: హరికృష్ణన్. -
కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వెబ్ సిరీస్‌లివే!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్డౌన్లో ప్రేక్షకులకు ఓటీటీలు మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు, షోలు చూస్తున్నారు. వెబ్ సిరీస్‌లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్ కాగా తాజాగా ఈ జాబితాలోకి కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తన మార్క్ చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్‌గా దాదాపు రూ. 300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్‌కు 10 ఎపిసోడ్స్ చొప్పున 5 సీజన్స్‌గా ఈ సిరీస్‌ని రూపొందించనున్నారట. ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్’ వంటి వెబ్ సిరీస్‌లకు షో రన్నర్‌గా వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేయనున్నారని టాక్. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్న క్రిష్ ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్ సిరీస్‌గా తీయాలనుకుంటున్నార ట క్రిష్. మరో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసిన విక్రమ్ కె. కుమార్ బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్‌స్టోరీస్ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్‌కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అలాగే ‘బెస్ట్ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్ కృష్ణ విజయ్ కూడా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్ సిరీస్‌ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య
Naga Chaitanya Comments On Thank You Movie: ‘‘ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్త విషయం ఉంటేనే థియేటర్స్‌కు వస్తున్నారు. ట్రైలర్ చూసి ఆ మూవీ చూడాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు చిత్రాల ఎంపికలో నా మైండ్ సెట్ కూడా మారింది. సినిమాలో హీరో, డైరెక్టర్ అనే విషయాలు పక్కన పెడితే కథే కింగ్ అని నమ్ముతాను’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య హీరోగా, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ‘దిల్’ రాజుగారితో 12 ఏళ్ల తర్వాత (2019లో ‘జోష్’ వచ్చింది) ‘థ్యాంక్యూ’ సినిమా చేశాను. ఈ గ్యాప్‌లో ఆయన కాంపౌండ్ నుంచి చాలా కథలు విన్నాను. అయితే ఎగ్జయిటెడ్‌గా అనిపించలేదు. కానీ ‘థ్యాంక్యూ’ గురించి రాజు, విక్రమ్, బీవీఎస్ రవి చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా తప్పక చేయాలనిపించి, చేశా. ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. ‘థ్యాంక్యూ’ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో మూడు షేడ్స్‌లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు రకరకాల దశలలో కనిపిస్తాను. ఇప్పుడంటే నన్ను టీనేజర్ పాత్రలో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను (నవ్వుతూ). విక్రమ్ కుమార్ సున్నితమైన విషయాలను బాగా డీల్ చేస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు? అనేది ‘థ్యాంక్యూ’లో మెయిన్ పాయింట్. ఈ సినిమాతో వ్యక్తిగా నేను చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాణ్ణి.. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో 16 ఏళ్ల కుర్రాడిలా కనపడటానికి ప్రొడక్షన్ వాళ్లు సపోర్ట్ చేసి, మూడు నెలలు సమయం ఇచ్చారు. ఆ టైమ్‌లో వర్కవుట్స్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ పరంగా వర్క్‌షాప్స్ కూడా చేశాను. ప్రతి స్క్రిప్ట్‌లోనూ అది దొరకదు. ఈ సినిమాలో దొరికింది. ఇప్పుడంటే నా శరీరం కూడా సపోర్ట్ చేస్తోంది. భవిష్యత్‌లో కుదురుతుందో? లేదో చూడాలి (నవ్వుతూ). అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్ బాగుంది. తన లుక్ మార్చుకోవటం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ‘ఏజెంట్’తో తనకు మాస్, కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ వస్తుందనుకుంటున్నాను. నా తర్వాతి సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. తరుణ్ భాస్కర్‌తో ఓ చిత్రం డిస్కషన్లో ఉంది. పరుశురామ్తోనూ ఓ పాయింట్ అనుకున్నాం. కోవిడ్ సమయంలోనే హిందీలో ‘లాల్‌సింగ్ చద్దా’ అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం 25కిలోలు బరువు తగ్గాను. నాన్న (నాగార్జున), చిరంజీవి, రాజమౌళి, సుకుమార్, ఆమిర్ ఖాన్ గార్లతో ‘లాల్‌సింగ్ చద్దా’ ప్రీమియర్ చూడటం మరచిపోలేని అనుభూతి. అందరికీ సినిమా బాగా నచ్చింది. చిరంజీవిగారు మా సినిమాని సమర్పించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. -
అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ను 'ఇట్స్ ఏ లాంగ్ జర్నీ మై ఫ్రెండ్' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్‌తో ముగించారు. లవ్ ఫీల్‌తో ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్. క్లాస్, మాస్ గెటప్‌లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్, తమన్ సంగీతం బాగుంది. లవ్, కెరీర్ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
నాగ చైతన్య 'థ్యాంక్యూ' నుంచి 'ఫేర్వెల్..'
Naga Chaitanya Thank You Movie Farewell Lyrical Song Released: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'ఫేర్ వెల్..' అంటూ సాగే పాటను హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సోమవారం (జూన్ 28) విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ- 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం.. ఆ తర్వాత స్కూల్‌మేట్స్‌తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజ్ లైఫ్‌ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ 'ఫేర్వెల్..' పాట ద్వారా చెప్పాం' అన్నారు. 'ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని విక్రమ్ కె. కుమార్ అభిప్రాయపడ్డారు. ''మూడేళ్లు 'థ్యాంక్యూ' కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం'' అని నాగచైతన్య పేర్కొన్నాడు. ''ఫేర్వెల్..' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు'' అని తమన్ తెలిపాడు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. -
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు
Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చైతన్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? #ThankYouTheMovie is now hitting the screens on July 22nd! It will be worth the wait...We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 #ThankYouTheMovie in Theatres on July 22nd😍https://t.co/ABhrv9Ndap#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/RlPP5acpJU — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 -
ఆసక్తిగా నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ టీజర్
Thank You Movie Teaser Out: అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్ నటిస్తుండగా.. అవిక గోర్ కీ రోల్ పోషిస్తోంది. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. చదవండి: ముంబై కరణ్ బర్త్‌డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం! ఈ టీజర్ చూస్తుంటే చై విభిన్న పాత్రల్లో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య క్లాస్, మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. కాగా లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ చై చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. టీజర్ చివరిలో ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్నా ప్రయాణమే..’ అని చై చెప్పిన డైలాగ్ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. మొత్తానికి లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేవాలను రూపొందిన థ్యాంక్యూ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, బీవీఎస్ రవి కథ, పీసీ శ్రీరామ్ ఫొటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి -
'థ్యాంక్ యూ' సినిమా అప్డేట్.. టీజర్ ఎప్పుడంటే ?
Naga Chaitanya Thank You Teaser Release Date Announced: అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ యూ'. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్ అలరించనున్నారు. అంతేకాకుండా అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జూలై 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. 'థ్యాంక్ యూ' సినిమా టీజర్‌ను మే 25న సాయంత్ర 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపింది. ఈ వీడియోలో 'ప్రియా నేను రెడీ.. ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి' అంటూ నాగ చైతన్య డబ్బింగ్ చెబుతూ ఉంటాడు. తర్వాత టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, బీవీఎస్ రవి కథ, పీసీ శ్రీరామ్ ఫొటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: 👇 సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ ! సమంత పర్సనల్ లైఫ్‌పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి..
యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. గతేడాది లవ్‌స్టోరీతో హిట్‌కొట్టిన నాగ చైతన్య ఈ ఏడాది బంగర్రాజుతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన థ్యాంక్యూ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. తాజాగా ఈ చిత్రం బీటీఎస్(బి హైండ్స్ ది సీన్స్) నుంచి ఓ ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ ఇందులో చై ఫోన్ చూస్తుండగా, రాశీఖన్నా దర్శకనిర్మాతలతో మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు.వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అవికాగోర్, మాళవికా నాయర్లు కీలకపాత్రలో కనిపించనున్నారు. చదవండి: సహనం నశిస్తుంది, మౌనం అంగీకరంగా తీసుకోకు.. సమంత వార్నింగ్ Yuva Samrat @chay_akkineni & @RaashiiKhanna_ from the sets of #ThankYouTheMovie #Nagachaitanya #RaashiKhanna pic.twitter.com/aHZ8Z2A7y0 — BA Raju's Team (@baraju_SuperHit) April 25, 2022 -
నాగ చైతన్య హార్రర్ వెబ్ సిరీస్.. 'దూత'గా భయపెట్టనున్నాడా ?
Naga Chaitanya Horrer Web Series Tittled As Dhootha: అక్కినేని వారసుడు, టాలీవుడ్ గుడ్ బ్యాయ్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థాంక్యూ' చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఒక హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు 'దూత' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో చైతూ వెనుక ఉన్న స్క్రిప్ట్‌ను చూపిస్తూ 'దూత.. ఎపిసోడ్ 1' అని తెలిపారు. ఈ లుక్‌లో కూడా నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ హార్రర్ జోనర్లో చేయని చైతూ ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడతాడో చూడాలి. View this post on Instagram A post shared by Naga Chaitanya ™ (@akkineni.nagachaitanya) -
ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది!
‘‘పిల్లలందరితో లొకేషన్ చాలా సందడిగా ఉంది’’ అంటున్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్. ఒక సీనియర్ కెమెరామేన్‌గా లొకేషన్లో ఉన్నవాళ్లందరూ ఆయనకు పిల్లల్లా కనిపించారు. ఇక్కడున్న ఫొటోను బట్టి నాగచైతన్యతో చేస్తున్న సినిమా గురించే పీసీ శ్రీరామ్ ఇలా అని ఉంటారని అర్థమై ఉంటుంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. చిత్రీకరణకు సంబంధించిన ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘‘ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది’’ అని నాగచైతన్యను ఉద్దేశించి అన్నారు పీసీ శ్రీరామ్. ఫొటోలో నాగచైతన్య మీసాలు లేకుండా యంగ్ లుక్‌లో కనబడుతున్నారు. ఇందులో చైతూ స్కూల్ స్టూడెంట్లానూ కనబడతారని ఓ వార్త వచ్చింది. ఆ వార్త నిజమేనని ఈ ఫొటో చెబుతోంది. On location with kids all around . pic.twitter.com/6KonlSGjxI — pcsreeramISC (@pcsreeram) March 6, 2021 -
ట్రిపుల్ ధమాకా
ఇప్పటివరకూ నాగచైతన్య హీరోగా నటించిన సినిమాలు ఇరవై. వీటిలో ఇద్దరు కథానాయికలున్న చిత్రాలు ఉన్నాయి. కానీ ముగ్గురు కథానాయికలతో ఇప్పటివరకూ చైతూ సినిమా చేయలేదు. ఇప్పుడు చేయనున్నారని తెలిసింది. అక్కినేని కుటుంబానికి ‘మనం’లాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చైతూ ‘థ్యాంక్యూ’ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దసరా సందర్భంగా లాంఛనంగా ఆరంభమైంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఇందులో చైతూ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంటే.. అక్కినేని అభిమానులకు చైతన్యను ముగ్గురు నాయికల సరసన చూడటం ట్రిపుల్ ధమాకా అన్నమాట. ప్రస్తుతం ముగ్గురు నాయికల ఎంపిక జరుగుతోంది. ఇందులో చైతన్య పల్లెటూరి కుర్రాడు, ఎన్నారైగా కనిపించనున్నారట. ‘మనం’ తర్వాత చైతూ–విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరో మల్టీస్టారర్?
‘మనం’ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం కలసి నటించింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ఇలా అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని కథానాయకులకు, వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. అయితే అక్కినేని హీరోలందరూ మరోసారి ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్‌న గర్ టాక్. కుమారులు చైతన్య, అఖిల్‌తో కలసి ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట నాగార్జున. ఈ మల్టీస్టారర్ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారట. గతంలో రాహుల్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రాన్ని చేశారు నాగార్జున. ఈ మల్టీస్టారర్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే?
ఆ హీరో, ఈ హీరోయిన్ జోడీ కడితే బాగుంటుందని కొందరు అనుకుంటారు. ఇక మరికొందరేమో ఇప్పటికే తెరపై కనిపించి కనువిందు చేసిన జంటనే మరిన్ని చిత్రాల్లో చూడాలనుకుంటారు. ఇలా టాలీవుడ్ అభిమానుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది రీల్ అండ్ రియల్ చక్కనైన జంట అక్కినేని నాగచైతన్య- సమంత. ‘ఏ మాయ చేసావే’ అంటూ తొలి చిత్రం చేసిన ఈ జోడీ ఆ తర్వాత అనేక చిత్రాల్లో జంటగా కనిపించి అభిమానులను మైమరిపింప చేశారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సర్కిళ్లలో తిరుగుతున్న వార్త ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి తెరపై కనిపించనున్నారు. (కోడలు కాదు.. మామ) నాగచైతన్య హీరోగా విక్రమ్‌కెకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘థ్యాంక్ యూ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం చిత్రం బృందం అన్వేషణ మొదలుపెట్టింది. అయితే ఈ చిత్రంలో చైతూ సరసన సామ్ నటిస్తేనే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం. విక్రమ్ చెప్పిన డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ కూడా నచ్చడంతో చై-సామ్‌లు పచ్చ జెండా ఊపినట్లు అనధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం) అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. విక్రమ్ దర్శకత్వంలో మనం, 24 చిత్రాల్లో సమంత నటించారు. పెళ్లి తర్వాత ఈ జంట ‘మజిలీ’లో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రంతో పాటు వీళ్లిద్దరు కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు టాక్. అయితే ఈ క్రేజీ జంట మరో సారి తెరపై కనిపిస్తున్నారనే వార్త రావడంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. -
అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం
సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఒకానొక సందర్భంలో చిత్ర సీమని ఏలిన లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అక్కినేని అభిమానులను అలరిస్తున్నారు నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ఇలా ఒకే వంశానికి చెందిన నలుగురు హీరోలతో ఓ సినిమా తీయాలని అనేమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్యం కాని మ్యాజిక్‌ను విక్రమ్ కుమార్ ‘మనం’తో సుసాధ్యం చేశాడు. ‘మనం’ టాలీవుడ్లోనే ఓ మధుర జ్ఞాపకం. మూడు తరాల హీరోలు కలిసి చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు ఎవర్గ్రీన్ మూవీ, ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’ విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయింది. కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసం మాత్రమే పుడతాయి. అలా ‘మనం’ కథ కూడా అక్కినేని కుటుంబం కోసం పుట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య పాత్రలు చాల కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. నలుగురు అక్కినేని హీరోలతో ఏదో ఓ సినిమా తీయాలని రోటీన్ స్టోరీతో కాకుండా విభిన్నంగా ప్రస్తుత జెనరేషనకు తగ్గుట్టు టిపకల్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విక్రమ్ కుమార్. అయితే ఎక్కడా తడబడకుండా, పక్కా స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేశాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రేక్షకులు లీనమయ్యేలా తీయడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇక అఖిల్ పాత్ర కూడా ఎదో ఇరికించినట్టు కాకుండా సందర్భానుసారంగా వస్తుంది. ఈ సినిమాకు మరో ఆయువుపట్టు మ్యూజిక్. అనూప్ రుబెన్స్ అందించిన సంగీతం మైండ్‌బ్లాక్ అనే చెప్పాలి. అక్కినేని మూడు తరాల హీరోలతో పాటు సమంత, శ్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తెరపై వీక్షించిన అభిమానులు మైమర్చిపోయారు. దీంతో ఏఎన్నార్ చివరి చిత్రం చిరస్థాయిలో నిల్చిపోయేలా అద్భుత విజయాన్ని అభిమానులు అందించారు. ఇక ఈ సినిమా విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా నాగార్జున, నాగచైతన్య, అనూప్ చిత్ర విశేషాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్లు చేశారు. చదవండి: రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హారర్ చిత్రంలో చైతూ.. డైరెక్టర్ అతడేనా?
వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం చేస్తున్నాడు. ‘లవ్‌స్టోరీ’ తర్వాత ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చైతూ ఓ మూవీ చేస్తారనేది సినీ వర్గాల్లో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్త. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రం హారర్ జానర్లో తెరకెక్కనుందని సమాచారం. అది కూడా గతంలో వచ్చిన హారర్ చిత్రానికి సీక్వెల్ అని తెలుస్తోంది. గతంలో విక్రమ్ కుమార్ మాధవన్‌తో తీసిన ‘13 బీ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందించనున్నారని అంటున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘13 బీ’ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం అందుకుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో చైతూ ఈ సీక్వెల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన అంటున్నారు. అయితే అటు దర్శకుడు నుంచి గాని ఇటు హీరో నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దిల్‌రాజ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అని టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రసుతం వరుస సినిమాలతో చైతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగార్జున టైటిల్ రోల్లో కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక పరుశురామ్ ‘నాగేశ్వర్రావు’ చిత్రం ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. అంతేకాకుండా తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చెప్పిన కథకు పచ్చ జెండా ఊపడంతో ఈ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. చదవండి: మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే? పెయింటింగ్... కుకింగ్.. డ్యాన్సింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_831249961.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రామ్ చరణ్‌తో కాదు.. నాగ చైతన్యతో!
వైవిధ్యమైన కథాంశాలతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రతిభ గల డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. ‘నాని గ్యాంగ్ లీడర్’ చిత్రంతో ఓ సెక్షన్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేశాడు ఈ క్రేజీ డైరెక్టర్. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పటివరకు మరో చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. అయితే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ఓ స్టోరీ లైన్ వినిపించాడని, చెర్రీకి నచ్చడంతో తన తదుపరి సినిమా అవకాశం విక్రమ్‌కు ఇచ్చాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిచ్చాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యేలోపు పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కాని విక్రమ్ కుమార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. తన తదుపరి సినిమా రామ్‌చరణ్‌తో కాకుండా నాగచైతన్యతో తీసేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఈ సినిమా తెరకెక్కించనుందని టాలీవుడ్ టాక్. ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన విక్రమ్ కుమార్‌తో మరో సినిమా చేసేందుకు నాగ చైతన్య సైతం ఆసక్తి కనబరుస్తానడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’తో చైతూ బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ తర్వాత చైతూకి మరో రెండు కమిట్మెంట్స్ ఉండటంతో.. ఆ రెండింటి తర్వాతనే విక్రమ్‌తో చైతూ సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఈ గ్యాప్‌లో చిన్న వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో కూడా విక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: చైతూకి 49, సమంతకు 51: సామ్ ట్వీట్! ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి : ఉపాసన -
ఇక మా సినిమా మాట్లాడుతుంది
‘‘నాని’స్ గ్యాంగ్‌లీడర్’ విడుదల రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్లింది. శనివారం షోకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా మేం మాట్లాడాం. ఇక నుంచి మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు నాని. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ‘నాని’స్ గ్యాంగ్‌లీడర్’ ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ బాగుందని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్లో మరో హిట్ పడిందనే మెసేజ్ చూసి హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను చేసిన దేవ్ పాత్రకు ఇంతటి స్పందన రావడం నాకు ఒక కలలా ఉంది. ఈ సినిమాతో నాని నాకు ఒక మెంటర్‌లా, ఫ్యామిలీ మెంబర్లా మారిపోయారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ప్రేక్షకుల అభిమానానికి థ్యాంక్స్’’ అన్నారు విక్రమ్. ‘‘మా బ్యానర్లో వచ్చిన మరో క్వాలిటీ ఫిల్మ్ ఇది. హ్యూజ్ బ్లాక్ బ్లస్టర్. మౌత్ పబ్లిసిటీ బాగుండడంతో థియేటర్స్ పెంచాం. నానీగారి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నాం’’ అన్నారు నవీన్. -
మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ : నాని
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నాని'స్ గ్యాంగ్ లీడర్’. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘నేను లోకల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఫీల్డర్స్‌లేని గ్రౌండ్లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు’ అని ఆ డైలాగ్ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ షోస్ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాము ఇకనుండి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్ సినిమాను ఇంతలా ఓన్ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్కి ఒక ఎమొర్టికన్ వాడుతున్నారు. ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నాం. ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్ కామెడీని అంతగా మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే ఒకటి నోటీస్ చేశాను ప్రియాంక అరుళ్ మోహన్ ఫ్యాన్ క్లబ్‌ను క్రియేట్ చేశారు. ఫస్ట్ డేనే ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేయడం మంచి విషయం. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్ పడింది అనే మెస్సేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. మల్లికార్జున థియేటర్లో ఫ్యామిలీస్ సినిమాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కజిన్ ఒక వీడియో క్లిప్ తీసి పంపింది. రిలీజ్ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. -
‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ
-
‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘నాని గ్యాంగ్ లీడర్’ జానర్ : కామెడీ రివేంజ్ డ్రామా నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ తెలుగులో ఇష్క్, మనం లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను గ్యాంగ్ లీడర్ అందుకున్నాడా.? ఇటీవల కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వచ్చాడా..? హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ విలన్‌గా మెప్పించాడా..? కథ : ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసే పెన్సిల్, ఈ రియల్ రివేంజ్ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ దేవ్ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు: నాని నటనకు వంక పెట్టడానికి లేదు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. విలన్‌గా కార్తికేయ మెప్పించాడు. సినిమా అంతా సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం కావటంతో నటనకు పెద్దగా అవకాశం లేదు. అయితే లుక్స్, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్మోహన్ ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్ రోల్‌గానే మిగిలిపోయింది. లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అనీష్ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : నాని లాంటి నటుడు విక్రమ్ లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తుండటంతో గ్యాంగ్ లీడర్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంతో విక్రమ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. విక్రమ్ సినిమా నుంచి ఆశించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ సినిమాలో లేకపోవటం నిరాశకలిగించే అంశమే. సినిమాను ఇంట్రస్టింగ్ సీన్‌తో ప్రాంభించిన దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో రాను రాను సినిమా బోరింగ్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సాగే కథనం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. దర్శకుడిగా తడబడినా రైటర్‌గా మాత్రం విక్రమ్ కె కుమార్ మెప్పించాడు. కామెడీ, డైలాగ్స్ బాగున్నాయి. అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు అనిరుధ్. మిరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : నాని నటన కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు సాగే కథనం విక్రమ్ కె కుమార్ మార్క్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
ఆ టెన్షన్లో కిక్ ఉంటుంది
‘‘సాధారణంగా పరీక్షలప్పుడు ఉండే టెన్షన్ సినిమా విడుదలప్పుడు ఉంటుంది. రిలీజ్‌కు ముందు ఉండే ఈ రెండు రోజులంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు రోజుల్లో ఉండే టెన్షన్లో మంచి కిక్ ఉంటుంది’’ అని నాని అన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘సినిమాలో నవ్వులే కాదు.. మనసుని హత్తుకునే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. అస్సలు ఒత్తిడికి గురి కాలేదు. ఏదో పెయిడ్ హాలిడేలా గడిచింది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ (‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్)ను చూస్తారు. ఈ సినిమా తర్వాత ప్రియాంకకు చాలా అవకాశాలు వస్తాయి. విక్రమ్ బాగా డైరెక్ట్ చేశారు. పోలాండ్ కెమెరామన్ మిరోస్లా కుబా మా సినిమాను కొత్త కోణంలో చూపించారు. అనిరుద్ మంచి సంగీతం అందించారు. విడుదల చేసిన ప్రతి పాటకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ‘‘కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఒకవేళ ఈ సినిమా చేయకపోతే ఏదో కోల్పోయేవాడినని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. విక్రమ్, నానీగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. బ్లాక్‌బ్లస్టర్ సినిమాలు ఎన్ని వచ్చినా రిఫరెన్స్ సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ జాబితాలో ఈ చిత్రం ఉంటుంది. ఆల్రెడీ నాని ఖాతాలో ‘జెర్సీ’ ఉంది. నాని ఇలాంటి విభిన్నమైన కథలు ఎంచుకుంటారు. అందుకే ఆయన నేచురల్‌స్టార్’’ అన్నారు కార్తికేయ. ‘‘ఎడిటర్ నవీన్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు విక్రమ్. ‘‘నానీగారితో మా బ్యానర్లో సినిమా చేయడానికి మూడేళ్లు పట్టింది. మరో సినిమా చేయడానికి ఇంత సమయం పట్టదనుకుంటున్నాను. సినిమా బ్లాక్‌బ్లస్టర్ అవుతుంది’’ అన్నారు నిర్మాత నవీన్. ‘‘ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేశాం. విక్రమ్‌గారి ప్రణాళిక వల్లే సాధ్యమైంది’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ. ‘‘మా గ్యాంగ్లీడర్ని చూసేందుకు మీ గ్యాంగ్స్‌తో థియేటర్స్‌కు రండి’’ అన్నారు కథానాయిక ప్రియాంక. -
‘గ్యాంగ్ లీడర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
నేను మా గల్లీ గ్యాంగ్లీడర్ని
‘‘సాధారణంగా రివెంజ్ డ్రామా సినిమాలు సీరియస్ మోడ్‌లో నడుస్తుంటాయి. ‘గ్యాంగ్‌లీడర్’ మాత్రం సరదా యాంగిల్లో సాగుతుంది. విక్రమ్ నాకు కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో థియేటర్లో ప్రేక్షకులు కూడా అలానే నవ్వితే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నాని. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ రిలీజ్ కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► విక్రమ్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటూ ఉన్నాం. ఒకరోజు ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ఐడియా చెప్పాడు. విన్న వెంటనే ఓకే అన్నాను. అప్పటికి ‘జెర్సీ’ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘జెర్సీ’ పూర్తయ్యేసరికి ‘గ్యాంగ్‌లీడర్’ ప్రీ–పొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. వెంటనే షూట్ స్టార్ చేశాం. విక్రమ్ గత సినిమాలు ‘మనం, 24’లాగా ఈ సినిమా క్లిష్టంగా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘జెర్సీ’ చాలా ఎమోషనల్ సినిమా. మానసికంగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. గ్యాంగ్‌లీడర్ చాలా సరదా సినిమా. నవ్వించడం, ఏడిపించడం, దేని కష్టం దానిదే. ఎంత నిజాయితీగా చేస్తాం అన్నదాని మీద ఉంటుంది. ► ఇందులో నేను ‘పెన్సిల్ పార్థసారథి’ అనే ప్రతీకార కథలు రాసే రచయితగా నటించాను. వాడో పెద్ద పాపులర్ రచయిత అని పార్థసారథిగాడి ఫీలింగ్. వాడు రాసిన పుస్తకాలని ఎవడూ కొనడని ఆ పుస్తకాల పబ్లిషర్‌కి కూడా తెలుసు. విలన్ మీద పగ తీర్చుకోవడానికి ఓ ఐదుగురు స్త్రీలు వీడి దగ్గరకు వస్తారు. వాళ్లతో కలసి పగ తీర్చుకుంటూ తన 29వ నవల రాస్తాడు పార్థసారథి. అదే వాడు రాసిన తొలి ఒరిజినల్ కథ. ► ఇందులో విలన్ పాత్రకు నలుగురైదుగురు హీరోల పేర్లు అనుకున్నాం. మొదట అడిగింది కార్తికేయానే. కథ వినగానే ఎగ్జయిట్ అయ్యాడు. దాంతో రెండో వాళ్లను అడగాల్సిన పని లేకుండా పోయింది. ► కృష్ణవంశీగారి సినిమాల్లో లక్ష్మీగారు భలే ఉంటారనుకున్నాను. ఆయన ఆవిడను భలే చూపించారనిపించేది. ఆవిడతో పని చేశాకే తెలిసింది.. ఆవిడ అలానే ఉంటారని. కృష్ణవంశీగారి క్రెడిట్ కాస్త తగ్గింది. (నవ్వుతూ). ► విక్రమ్ సినిమాల్లో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇదే. తొందర గా పూర్తి చేస్తే ఇంత కిక్ వస్తుందా? నా కళ్లు తెరిపించావు అన్నాడు విక్రమ్ (నవ్వుతూ). ‘జెర్సీ’ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఈ టైటిల్ చెప్పడానికి వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్’ అని చెప్ప గానే ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత ‘గ్యాం గ్లీడర్’ టైటిల్‌తో ఏర్పడ్డ చిన్న కన్ఫ్యూజన్ వల్ల ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ గా మార్చాం. ఒకవేళ మాస్ సినిమా చేస్తే భయపడుతూ, వణికిపోతూ ఉండాలి. కానీ ఈ ‘గ్యాంగ్‌లీడర్’ జానర్ వేరే. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పేరుని మా అబ్బాయికి పెట్టాను అనుకుందాం. అప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అని ఆలోచిస్తానా? లేదు కదా. ఇష్టంతో, ప్రేమతో పెట్టుకున్న టైటిల్ ఇది. టైటిల్ పెట్టాం కదా అని ఆ సినిమా గుర్తుగా ఓ షాట్ పెట్టాం. సినిమా ఫుల్ ఎనర్జీతో నడుస్తుంది. ఇది ఏ సినిమాకు రీమేక్, కాపీ కూడా కాదు. ► స్కూల్ రోజుల్లో రిజర్వ్›్డగా ఉండేవాణ్ణి. మార్కులు వస్తే ధైర్యంగా ఉంటుంది. అందుకే సైలెంట్‌గా ఉండేవాణ్ణేమో (నవ్వుతూ). అయితే మా గల్లీలో నేనే గ్యాంగ్‌లీడర్. అందరూ నాకంటే చిన్నోళ్లు ఉండేవారు. అక్కడ రెచ్చిపోయేవాణ్ణి. ► నేను కేవలం యాక్టర్‌ని. కమర్షియల్ సినిమాలో చూస్తే కమర్షియల్ యాక్టర్లా, ‘జెర్సీ’లాంటి సినిమాలో చూస్తే జస్ట్ యాక్టర్‌గానే కనిపిస్తాను. మీరు ఎలా చూస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.. అంతే. ‘సక్సెస్ రేట్’ అనే విషయాన్ని నేను నమ్మడం మానేశాను. పది హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా ‘నానీ కష్టాల్లో’ ఉన్నాడు అంటున్నారు. అలాంటప్పుడు ప్రతి సినిమా ముఖ్యమే. సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఈ సినిమా ఆడుతుందా? ఆడదా అని లెక్కలు వేసుకోవడం మానేశా. నచ్చింది చేస్తున్నాను. ► కథ కచ్చితంగా చెప్పాల్సింది అయితేనే ద్విభాషా చిత్రం చేస్తాను. గతంలో అలా చేసే చాలా సమయం వృ«థా అయింది. బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచనలు లేవు. వెళ్లినా నన్ను తరిమేస్తారు. అది నాకు తెలుసు (నవ్వుతూ). ► మా నిర్మాణంలో చేసిన ‘అ!’ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. త్వరలోనే కొత్త సినిమా ప్రకటిస్తాం. ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాను. ► ‘జెర్సీ’ సక్సెస్ నాకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడుపోతున్న అంశాలేవీ లేకుండా ఈ సినిమా చేశాం. అది 30 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతోంది. దాన్ని ‘సరిగ్గా ఆడలేదు’ అని ఎలా అంటాం? ‘ఎంసీఏ’ అప్పుడు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ‘డబ్బులు సరేగానీ మంచి సినిమాలు చేయడా?’ అన్నారు. ‘జెర్సీ’ అప్పుడు ‘మంచి సినిమాలు సరే, కలెక్షన్లలో ‘ఎంసీఏ’ని కొడుతుందా లేదా?’ అంటారు. ‘జెర్సీ’కి 400 శాతం డబ్బులు వచ్చినట్టు. ► నాకు సినిమా చూడటం బాగా ఇష్టం. కేవలం ప్రేక్షకుడిలానే చూస్తాను. నేను యాక్టర్ కానప్పుడు నాలో ఉన్న ప్రేక్షకుడికి ఆ కాలం సినిమాలు నచ్చాయి. యాక్టర్‌గా మారిన తర్వాత నాలో ఉన్న ప్రేక్షకుడికి ఇప్పటి సినిమాలు నచ్చుతున్నాయి. ప్రేక్షక్షకుడు మారితే నేను మారినట్టే. నా సినిమాలు తప్పితే అన్ని సినిమాలను ప్రేక్షకుడిలానే చూస్తాను. ► నటుడిగా 11 ఏళ్లు అంటే చాలా ఎక్కువ ప్రయణమే అనిపిస్తోంది. నాకు మాత్రం ఎలా గడిచిపోయిందో అర్థం కావడం లేదు. నాకు పని చేయడమే హాలిడే అన్నట్టు. బ్రేక్ తీసుకుంటే టార్చర్‌గా, ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ వస్తుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు రోజులు ఎలా గడుస్తుంటాయో తెలియదు. పూర్తయ్యాక ప్రమోషన్స్ అప్పుడు కొంచెం ఇబ్బందే (నవ్వుతూ). -
గ్యాంగ్‌లీడర్ ప్రమోషనల్ సాంగ్
-
దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్ సాంగ్
జెర్సీతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన నాని.. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం నాని మరో విభిన్న కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. గ్యాంగ్ లీడర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. నాని.. రచయితగా నటిస్తోన్న ఈ మూవీలో హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌తో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ నుంచి ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నానితో కలిసి సంగీత దర్శకుడు అనిరుధ్ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఐదుగురి పాత్రలను వివరిస్తూ సాగిన ఈ పాట.. మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం
మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే.. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’, ‘యుద్ధానికి సిద్ధం కండి... సమరశంఖం నేను ఊదుతా’, ‘రేయ్.. నేనింకా థ్రిల్లర్ జోనర్‌లోనే ఉన్నాను.. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్లేలోపు మొదలెట్టేద్దాం’ అంటూ నాని చెప్పే డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. నాని, ప్రియాంక జంటగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. పైన చెప్పిన డైలాగ్స్ అన్నీ ఈ ట్రైలర్‌లోనివే. ‘‘మా సినిమాలో రివెంజ్ రైటర్ పెన్సిల్‌గా నాని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన మా చిత్రం టీజర్‌కి, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్, కెమెరా: మిరోస్లా కుబా బ్రోజెక్, సీఈఓ: చిరంజీవి(చెర్రీ). -
‘మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే’
నేచురల్ స్టార్ నాని హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వరుస వాయిదాల తరువాత సెప్టెంబర్ 13న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని రివేంజ్ కథల రచయిత పెన్సిల్‌గా కనిపించనున్నాడు. రివేంజ్ రచయిత అయినా పెన్సిల్ ఐదుగురు ఆడవాళ్లు పగ తీర్చుకునేందుకు ఎలా సాయం చేశాడు అన్నదే గ్యాంగ్ లీడర్ కథ. నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మాది రివెంజ్ ఎంటర్టైనర్
‘‘రెండు ఐకానిక్ సినిమాల (సాహో, సైరా: నరసింహారెడ్డి చిత్రాలను ఉద్దేశించి) మధ్య వస్తున్నాం. ఆ రెండు సినిమాలకు మా చిత్రానికి రిలీజ్‌ల విషయంలో గ్యాప్ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్ లేదు. నేను కూడా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని నాని అన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘మంచి పాజిటివ్ ఎనర్జీతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. టీమ్ మెంబర్స్ నా బరువునంత పంచుకున్నారు. లక్ష్మి, శరణ్యగార్లతో నటించడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మాకు ఒక హ్యాపీ ప్రాజెక్ట్. వచ్చే బుధవారం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. సినిమాలో సర్ప్రైజ్లు, నవ్వులు ఉంటాయి. వచ్చే నెల మొదటి వారంలో నేను–అనిరు«ద్ చేసిన ఓ ప్రమోషనల్ సాంగ్ వీడియో రిలీజ్ ప్లాన్ ఉంది. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు ప్రియాంక. చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ మంచి ఐకానిక్ మూవీ. ఆ సినిమా జానర్ వేరు. మా సినిమా రివెంజ్ ఎంటర్టైనర్. ఇందులో దేవ్ అనే విలన్ పాత్రలో కార్తికేయ చాలా బాగా చేశాడు. మైత్రీ నిర్మాతలు సినిమాలను చాలా క్వాలిటీగా తీస్తారు’’ అన్నారు. ‘‘యాక్టర్‌గా నాకు తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఈ సినిమాలోని దేవ్ పాత్ర నాకు ఇచ్చిన నాని, విక్రమ్గార్లకు థ్యాంక్స్. హీరో అవ్వాలనుకునే మాలాంటి వారికి నానిగారు ఒక ప్రేరణ. నా రోల్ భయపెట్టేలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయ. ‘‘ఈ చిత్రం నాకు తెలుగులో తొలి సినిమా. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. మంచి డెబ్యూ మూవీ దొరికింది’’ అన్నారు ప్రియాంక. -
‘గ్యాంగ్ లీడర్’ మరోసారి వాయిదా?
నేచురల్ స్టార్ నాని హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రిలీజ్‌కు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉన్నా చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో ఇంకా స్పీడు పెంచలేదు. దీంతో సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అనే ప్రకటన రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల సందడి కనిపించకపొవటంతో సినిమా మరోసారి వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఈ బ్యానర్లో ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం నాని కూడా ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు కావాల్సిన బజ్ మాత్రం కనిపించటం లేదు. -
‘గ్యాంగ్ లీడర్’ నుంచి సెకండ్ సింగిల్
నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను చేస్తూ.. తనకంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్న నాని.. రీసెంట్గా జెర్సీ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మళ్లీ తాజాగా మరో విభిన్న చిత్రం చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో రాబోతోన్న గ్యాంగ్ లీడర్ చిత్రం టీజర్, పోస్టర్స్,పాటలతో మంచి అంచనాలను పెంచగా.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్న ‘గ్యాంగ్‌లీడర్' చిత్రంలోని 'వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..' అంటూ సాగే రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య నటిస్తున్నారు. ఈ ప్రముఖ పాత్రను ఆర్ఎక్స్ 100 హీరో కార్తీకేయ పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది. -
స్కెచ్ కంప్లీట్
తన గ్యాంగ్‌తో కలిసి పగ తీర్చుకున్నాడు పార్ధసారథి. ఇందుకోసం ఎలాంటి స్కెచ్‌లు వేశాడు? ప్రత్యర్థుల నుంచి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే దృశ్యాలను మాత్రం వెండితెరపై చూడాల్సిందే. నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. ఇందులో రివెంజ్ రైటర్ పార్థసారథి పాత్రలో నటించారు నాని. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లాలు నాని గ్యాంగ్ సభ్యులుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆగస్టు 30న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘పెన్సిల్.. ఫేమస్ రివేంజ్ రైటర్’
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. నానిని పెన్సిల్ పేరుతో పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నాని ఈ సినిమాలో రివేంజ్ స్టోరిల రచయితగా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటిస్తున్న కార్తికేయను రేసర్‌గా పరిచయం చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు అలరించనున్నారు. -
నాని ‘గ్యాంగ్ లీడర్’ వాయిదా?
నేచురల్ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో సినిమాను అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో గ్యాంగ్ లీడర్ టీం ఆలోచనలో పడ్డారు. సాహో లాంటి భారీ చిత్రంలో పోటి పడే కన్నా రిలీజ్ వాయిదా వేయటం బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 30న కాకుండా సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు. -
‘రారా.. జగతిని జయించుదాం..’
నేచురల్ స్టార్ నాని వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన 'రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..' అంటూ సాగే పాటను అనిరుధ్ రవిచందర్ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్ క్రియేట్ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్ రాసిన ఈ పాట అందర్నీ ఇన్స్పైర్ చేసేలా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేసేలా ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
ఏం వెతుకుతున్నారు?
బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను... అందరూ బైనాక్యులర్స్‌తో ఎవర్నో వెతుకుతున్నారు. ఇంతమంది పనికట్టుకుని వెతికేది ఎవర్నబ్బా? అసలు వీళ్ల స్టోరీ ఏంటి? తెలియాలంటే ఆగస్ట్ 30వరకూ వేచి చూడాల్సిందే. నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పోస్టర్లో కనిపిస్తున్న లేడీ గ్యాంగ్‌కు నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ చేశారు. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 30 విడుదల కానుంది. -
‘గ్యాంగ్ లీడర్’ సందడి మొదలవుతోంది!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ నెల 15 ఫస్ట్ లుక్, 18న ఫస్ట్ సాంగ్, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. We MET We are READY We are the GANG & I AM#GANGLEADER 🖐🏼👊🏼 @Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @priyankaamohan pic.twitter.com/l7ZO7C2Le7 — Nani (@NameisNani) 13 July 2019 -
భాగ్యనగరంలో గ్యాంగ్‌లీడర్
‘‘జీ ఏ యన్ జీ గ్యాంగ్, గ్యాంగ్, బచావో బ్యాంగ్ బ్యాంగ్’’ అంటూ అప్పట్లో చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో ఎంతో సందడి చేశారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పేరుతో హీరో నాని సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నాని హీరోగా విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో తాజా ‘గ్యాంగ్‌లీడర్’ రూపొందుతోంది. నాని సరసన ప్రియాంక అనే తమిళ భామ ఈ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరపై ఆరంగేట్రం చేయనుంది. నాని 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ‘గ్యాంగ్‌లీడర్’. తాజా షెడ్యూల్‌ను ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రారంభించి 20వ వరకు షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్లో సినిమాకి ఎంతో కీలకమైన కొంత టాకీతో పాటు, ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తారట. రొమాంటిక్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నాని నటించిన ‘జెర్సీ’కి స్వరాలందించిన అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి స్వరకర్త. -
మనం మళ్లీ కలుద్దామా?
‘మనం’తో అక్కినేని కుటుంబ సభ్యులకు ఒక స్పెషల్ చిత్రాన్ని ఇచ్చారు దర్శకుడు విక్రమ్ కె. కుమార్. ఆ తర్వాత అఖిల్‌తో ‘హలో’ తీశారు. తాజాగా విక్రమ్ కె. కుమార్, నాగార్జున కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతోందని టాక్. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమాతో బిజీగా ఉన్నారు నాగ్. ఆ తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రం లైన్లో ఉంది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కె.కుమార్ సినిమాను ట్రాక్ మీదకు తీసుకెళ్తారట నాగార్జున. ప్రస్తుతం నాని హీరోగా చేస్తోన్న ‘గ్యాంగ్‌లీడర్’తో బిజీగా ఉన్నారు విక్రమ్. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి నాగార్జున చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉంటారట విక్రమ్. -
నాన్‌స్టాప్ గ్యాంగ్
ఓ కొత్త ప్లాన్‌తో నాని అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగారు. ఆ ప్లాన్ డిౖటైల్స్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో వెండితెరపై లీక్ అవుతాయి. మనం, 24 వంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. కథానాయిక ప్రియాంకా మోహన్ నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. ఆ రోజు నుంచి సినిమా పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశారు. జూలై 5కల్లా గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ వేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు నాని. ఇందులో సుధీర్‌బాబు హీరో. -
డేట్ ఫిక్స్
గ్యాంగ్ లీడర్‌గా నాని తన గ్యాంగ్‌ను ఎలా లీడ్ చేశారు? తన గ్యాంగ్‌తో కలసి అతను చేసిన అల్లరేంటి? ఇవన్నీ మనకు చూపించే డేట్ ఫిక్స్ అయింది. ఆగస్ట్ 30న తన గ్యాంగ్‌తో కలసి థియేటర్స్‌లోకి దిగుతారట. నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘‘గ్యాంగ్‌లీడర్ ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటన్నది స్క్రీన్ మీద చూస్తేనే బావుంటుంది’’ అన్నారు. ‘‘మా బ్యానర్ నుంచి వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ స్టార్ట్ అయింది. జూన్ 30కి మొత్తం షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అనిరు«ద్, సీఈఓ: చిరంజీవి. -
ఆగస్టు 30న ‘నాని గ్యాంగ్ లీడర్’
నేచురల్ స్టార్ నాని హీరోగా వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాని గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం)లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ ‘మా బేనర్లో చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’. 14 నుండి శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశాం’ అన్నారు. చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇంతకముందెన్నడూ రాని ఒక డిఫరెంట్ లుక్ తో ఉండే ఫామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్ పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది’ అన్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
నాన్‌స్టాప్‌గా 45 రోజులు
‘జెర్సీ’ వంటి హిట్ సినిమా తర్వాత నాని గ్యాంగ్‌లీడర్‌గా మారిన సంగతి తెలిసిందే. తన గ్యాంగ్‌ను వెంటబెట్టుకుని హైదరాబాద్‌లో 45 రోజులు మకాం వేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మిస్తున్నారు. విభిన్న వయసుల్లో ఉన్న ఐదుగురు మహిళలు ఉండే గ్యాంగ్‌కు నాని లీడర్‌గా కనిపిస్తారన్నది చిత్ర కథ. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని తెలిసింది. 45 రోజులు ఏకధాటిగా ఈ షెడ్యూల్ జరగనుంది. శంషాబాద్‌లో వేసిన ప్రత్యేక ఇంటి సెట్లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుతారట. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«థ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించనున్నారు. ఇందులో సుధీర్‌బాబు హీరో. నివేదా థామస్, అదితీరావ్ హీరోయిన్లు. -
‘గ్యాంగ్ లీడర్’ మహేష్ చేయాల్సింది!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను మహేష్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలోనూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమాను కూడా మహేష్ పక్కన పెట్టేశాడు. ఇప్పటికే అదే కథను విక్రమ్.. నాని హీరోగా తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో తన ఇమేజ్‌కు ఆ కథ సూటవ్వదన్న ఉద్దేశం మహేష్ నో చెప్పాడట. అదే కథను నాని ఓకె చేయటంతో గ్యాంగ్ లీడర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. విలన్ పాత్రకు సెన్సేషనల్ హీరోగా ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయను తీసుకున్నారు. మరి మహేష్ కోసం తరువాత చేసిన కథకు నాని ఎంత వరకు సూట్ అవుతాడో చూడాలి. -
గ్యాంగ్ లీడర్ మాదే
‘‘నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ టైటిల్ తమకు కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అడిగారు. ఇవ్వనన్నాను. అమ్మనన్ని కూడా చెప్పాను’’ అన్నారు మోహన్‌కృష్ణ. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో తాను హీరోగా నటిస్తూ ఓ నిర్మించాలనుకున్నారు మోహన్‌కృష్ణ. అయితే నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో మైత్రి మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మోహన్‌కృష్ణ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ రిజిస్టర్ చేశాం. త్వరలో షూటింగ్ ఆరంభించి, చిరంజీవిగారి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. ఈలోపు నాని బర్త్‌డేకి మా టైటిల్‌తో టీజర్ రిలీజ్ చేశారు. మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్లో ఫిర్యాదు చేశాను. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి’’ అన్నారు. -
నానికి మెగా సెగ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమ్మాయి ఇది మీ కోసమే అంటూ విభిన్న ప్రమోషన్ ప్రారంబించిన నాని ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను తన సినిమా కోసం తీసుకున్నాడు. అయితే ఇటీవల ఎనౌన్స్ అయిన ఈ సినిమా టైటిల్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు నాని మెగా టైటిల్‌ను తీసుకోవటంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏకంగా ‘బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్ లీడర్’(#BoycottNanisGangLeader) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టైటిల్‌ను సాయి ధరమ్ తేజ్ సినిమాకు తీసుకోవాలని భావించినా అభిమానులు వ్యతిరేఖించటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. మరి ఈ ట్రోలింగ్‌పై నాని ఎలా స్పదింస్తాడో చూడాలి. పులి ని చూసి ... నక్క వాతలు పెట్టుకుంది అంట 😐 .... వాతలు పెట్టుకున్నా ... పులి పూలే .. నక్క నక్కే 😌#BoycottNanisGangLeader pic.twitter.com/DZTUaT1IkG — Megastar Follower (@ChiruFollower) 24 February 2019 #BoycottNanisGangLeader There's only one Gang leader and Indra in TFI. The Mass hysteria he has created wit this movie is never before and never again with due respect towards the legend. The movie team should drop this title. @guptanagu8 @ChiruFollower @vthchiru4ever — Anies.Md (@Mega_Kannadiga) 24 February 2019 #BoycottNanisGangLeader Pls change the title — Suresh kumar (@Sureshk12400884) 25 February 2019 -
నాని గ్యాంగ్ లీడరా..?
ఇటీవల కాలంలో పాత సినిమాల టైటిల్స్‌ను ఈ జనరేషన్ హీరోల సినిమాలకు వాడటం కామనైపోయింది. ఇప్పటికే చాలా టైటిల్స్ అలా రిపీట్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్లాక్ బస్టర్ టైటిల్ వచ్చి చేరనుందట. నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రోజు (ఆదివారం) నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ రోజు నాని, విక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ సంబంధించిన పోస్టింగ్‌లు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్‌హిట్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్‌ను నాని సినిమా కోసం తీసుకున్నారట. గతంలో ఈ టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా రూపొందనుందన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో గ్యాంగ్ లీడర్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు. మరి ఈ సమయంలో నాని అదే టైటిల్‌ను తన సినిమాకు ఫిక్స్ చేయటంపై అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
నానితో రకుల్ స్పెషల్ సాంగ్!
ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని.. తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. మనం, ఇష్క్, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండగా రకుల్ ప్రీత్ స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. -
నాని విలన్‌గానా!
నేచురల్ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో నాని ఓ క్రైమ్ నవలా రచయితగా కనిపించనున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో నాని, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రం పూజాకార్యక్రమాలు సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్ ఇవ్వగా, నిర్మాత సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందించారు. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘తొలిసారి ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా సినిమాలో ఉంటుంది. అదేంటో స్క్రీన్‌పైన చూస్తేనే బావుంటుంది’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. ఈరోజు నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్, కెమెరా: మిరోస్లా కుబా బ్రోజెక్, రచనా సహకారం: ముకుంద్, మాటలు: Ðð ంకీ, ‘డార్లింగ్’ స్వామి. -
నాని కొత్త చిత్రం ప్రారంభం
-
నాని-విక్రమ్ కుమార్ మూవీ ప్రారంభం
తన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకునే నాచురల్ స్టార్ నాని.. గత రెండు సినిమాలతో ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం నాని క్రికెటర్‌గా చేస్తున్న జెర్సీ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. మనం, 24, హలో లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత యువ సంచలనం అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి జరుగనున్నట్లు తెలిపారు. -
ఫ్లాప్ హీరోయిన్‌తో నాని..!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా కూడా విక్రమ్ స్టైల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నానితో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒక హీరోయిన్గా మేఘా ఆకాష్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మేఘా తొలి సినిమాతో నిరాశపరిచింది. తరువాత మరోసారి నితిన్‌కు జోడిగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో తెలుగులో మేఘా కెరీర్ ముగిసినట్టే అని భావించారు. అయితే తాజాగా నాని సినిమాలో ఛాన్స్ రావటంతో మేఘా కెరీర్ ఊపందుకుంటుదన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా పేట సినిమాలో కనిపించిన మేఘా ఆకాష్‌కు మంచి పేరొచ్చింది. -
అమ్మాయిలకు ప్రత్యేకం
హీరో నాని, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ సినిమాలో ఇంకా ముఖ్యమైన ఐదుగురు ఉంటారు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు? అంటే వచ్చే ఏడాది చెబుతాం అంటున్నారు చిత్రబృందం. ‘ఇష్క్, మనం, 24’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ విషయంపై ఆదివారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘నేను, విక్రమ్.. ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరంలో..! అమ్మాయిలూ... ఇది మీ కోసమే’ అని నాని పేర్కొన్నారు. ‘నాని, నేను ఓ విభిన్నమైన కథాంశంతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ చిత్రం అమ్మాయిలకు ప్రత్యేకమైనదిగా ఉంటుంది’ అన్నారు దర్శకుడు విక్రమ్. ‘నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మా సంస్థలో సినిమా నిర్మించనుండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పీసీ శ్రీరామ్‌గారు ఛాయాగ్రాహకులుగా పనిచేస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఫిబ్రవరి 19 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘నా డ్రీమ్ టీమ్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు పీసీ శ్రీరామ్. -
స్నేహితులే విరోధులయ్యారు!
‘ఇష్క్, మనం, 24..’ ఇలా లిస్ట్ చూస్తేనే వినూత్నమైన సినిమాలు కనిపిస్తుంటాయి విక్రమ్ కె.కుమార్ ఫిల్మోగ్రఫీలో. కొత్త కాన్సెప్ట్‌లతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుంటారాయన. ‘హలో’ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తున్నా ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. లేటెస్ట్గా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నాని హీరోగా విక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే... ఇందులో విలన్ పాత్రలో హీరో సిద్ధార్థ్ కనిపిస్తారని సమాచారం. ఆఫ్ స్క్రీన్ నాని, సిద్ధార్థ్ మంచి ఫ్రెండ్స్. మరి ఆన్‌స్క్రీన్‌లో ఇద్దరూ ఎలా విరోధుల్లా మారతారో చూడాలి. అలాగే లవర్‌బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ విలన్‌గా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథాంశం ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమాలో నాని లుక్ టెస్ట్ కూడా చేశారట. మరి ఈ చిత్రం సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి. -
విక్రమ్.. నానికే ఫిక్స్..!
ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ , త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్చూపిస్తుండటంతో విక్రమ్ మరో హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేచురల్ స్టార్ నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
వెయిట్ ఈజ్ ఓవర్!
అవును.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హీరోగా నటించబోయే సినిమా దాదాపు ఖరారైపోయింది. ‘మనం, 24’ రీసెంట్గా ‘హలో’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కు ఓ సూపర్ ఎగై్జటింగ్ కథను చెప్పారట విక్రమ్. ఆ కథ విని అల్లు అర్జున్ ఇంప్రెస్ అయ్యారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. బన్నీకి జోడీగా టాప్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట. మల్లు అర్జున్ సాయం టాలీవుడ్లో అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో దాదాపు అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ మాలీవుడ్‌లోనూ ఉంది. అందుకే ఆయన్ను కేరళ ఫ్యాన్స్ మల్లు అర్జున్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం భారీ వర్ష ప్రభావంతో కేరళ ప్రజల జీవనం ఇబ్బందిగా మారింది. ఈ విపత్తుపై అల్లు అర్జున్ స్పందించి 25 లక్షల రూపాయల అర్థిక సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంతాలైన ఎర్నాకులం, పాలక్కాడ్, మలప్పురం, కాలికట్ పాంత్రంలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనవలసిందిగా ఆయన తన అభిమానులకు పిలుపునిచ్చారు. ‘‘కేరళ ప్రజలకు నా హృదయంలో స్పెషల్ ప్లేస్ ఉంది. వారు చూపించే ప్రేమ, ఆప్యాయతలు ప్రత్యేకమైనవి. నా వంతుగా ఈ సాయం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. -
‘హలో’కు బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డు..?
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా చేసిన చిత్రం హలో. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా... కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా రాలేదు. సినిమా టేకింగ్, కథను నడిపిన విధానంలో డైరెక్టర్ విక్రమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ‘హలో’ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హలో సినిమా బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డుకు నామినేట్ అయిందని విక్రమ్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. వరల్డ్ స్టంట్స్ అవార్డు సంస్థ ఇచ్చే పురస్కారాలకు హలో మూవీ నామినేట్ అవ్వడం ఆనందంగా ఉందంటూ... ‘ఫైట్ మాస్టర్ బాబ్ బ్రౌన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, కెమెరామెన్ పి.ఎస్.వినోద్, అనూప్ రూబెన్స్, నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీరంతా కలిసి ఈ పోరాట సన్నివేశాల్ని ఇంత బాగా వచ్చేలా చేశారు. అఖిల్ అంకితభావం, హార్డ్ వర్క్ వల్లే ఇదంతా సాధ్యమైంది, నీ యాటిట్యూడ్ నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. నువ్వు అలాగే ఉండాలి’ అంటూ పోస్ట్ చేశారు. #worldstuntawards #akhilsayshello pic.twitter.com/NBTNUBCTBp — Vikram K Kumar (@Vikram_K_Kumar) 14 May 2018 -
నాని థ్రిల్
ఇప్పటి వరకూ పలు వైవిధ్యమైన చిత్రాల్లో కనిపించిన నాని హారర్, థ్రిల్లర్ జోనర్ సినిమాల్లో నటించలేదు. అయితే.. తాజాగా నాని ఓ పూర్తి స్థాయి థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. అది కూడా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అట. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు నాని. ఈ సినిమా తర్వాత నాని ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘నాలుగైదు కథలు విన్నా.. ఏ దర్శకుడి చిత్రం ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో ఇప్పుడే చెప్పలేను’ అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు నాని. తాజా సమాచారం ఏంటంటే.. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని తర్వాతి సినిమా చేయనున్నారట. విక్రమ్ చెప్పిన ఓ థ్రిల్లర్ స్టోరీ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారని టాక్. -
నాని.. ప్రయోగానికి రెడీ!
వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన నాని జోరుకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ సినిమాలో నాని మార్క్ కొత్తదనం కనిపించకపోవటంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త పడాలని భావిస్తున్నాడు నేచురల్ స్టార్. అందుకే నెక్ట్స్ ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం నాని, సీనియర్ హీరోగా నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అవసరాల శ్రీనివాస్, విక్రమ్ కె కుమార్, హను రాఘవపూడి లాంటి దర్శకులు నానితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. నాని మాత్రం విక్రమ్ కె కుమార్‌తో సినిమా చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ దర్శకత్వంలో నటిస్తే తన ఇమేజ్ ను కాపాడుకోవచ్చని భావిస్తున్నాడట. అయితే ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న మల్టీ స్టారర్ పూర్తయితే గాని నాని నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
దూసుకెళుతున్న ’హలో’.... థ్యాంక్స్ చెప్పిన అఖిల్
అక్కినేని అఖిల్‌ను రీలాంచ్ చేస్తూ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమా ’హలో’... ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతున్నదని సమాచారం. ‘హలో’ సినిమాకు మంచి టాక్ సొంతమై విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో చిత్ర హీరో అఖిల్ తాజాగా ట్విట్టర్లో స్పందించారు. ‘మా చిత్రం పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు మాకు ఎంతో విలువైనవి. ఇందుకు చిత్రయూనిట్ మొత్తం కృతజ్ఞతలు తెలుపుతుంది’ అని అఖిల్ ట్వీట్ చేశాడు. అమెరికా బాక్సాఫీస్ వద్ద రెండురోజుల్లోనే అరమిలియన్ డాలర్ల మార్క్‌ను ఈ చిత్రం దాటిందంటూ ఓ పోస్టర్‌ను పెట్టారు. నాగార్జున తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణీ ప్రియదర్శన్ నటించి.. తొలిసారి చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కల్యాణీ.. నటి లిజీ-దర్శకుడు ప్రియదర్శన్ కూతురు. Thank you for all the love and appreciation really means a lot to all of us and the whole team is greatfull pic.twitter.com/6DyoDFV2bj — Akhil Akkineni (@AkhilAkkineni8) 24 December 2017 -
హలో... నేను చాలా స్ట్రాంగ్
హలో.. నేను అక్కడ అమ్మాయిని అయినా మీరు ఇక్కడి అమ్మాయి అనే అనుకోవచ్చు. హలో.. నన్ను పరిచయం చేసిన తెలుగు తెర అంటే నాకు బాగా ఇష్టం. హలో.. ఫస్ట్ సినిమాతో నాకు మంచి మార్కులేసినందుకు థ్యాంక్స్. హలో.. ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.. అంటున్నారు కల్యాణీ ప్రియదర్శన్ డాటరాఫ్ నటి లిజీ–దర్శకుడు ప్రియదర్శన్. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ‘హలో’లో అఖిల్ సరసన మెరిసిన ఈ మలయాళ మందారంతో స్పెషల్ టాక్. ► తెలుగు ఆడియన్స్‌కి హలో చెప్పడం ఎలా ఉంది? (నవ్వుతూ). హలో యూనివర్శల్. ఫోన్ తీస్తే.. కామన్‌గా అందరూ అనేది అదే. అలాంటి ఓ యూనివర్శల్ వర్డ్ ఉన్న టైటిల్‌తో తెలుగువారిని పలకరించడం హ్యాపీగా ఉంది. ► ‘హలో’ లాంటి పెద్ద లాంచ్‌ను ఎక్స్పెక్ట్ చేశారా ? లేదు. అందులోనూ తెలుగు ఇండస్ట్రీలో. ‘హలో’ కోసం చాలారోజులు హీరోయిన్ని వెతికారని తెలుసు. పీయస్ వినోద్ (కెమెరామ్యాన్) వాళ్ళ వైఫ్‌కి, మా ఫ్యామిలీకి ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నాగ్‌సార్ వాళ్ళకి కూడా వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా నన్ను రికమండ్ చేశారు. నా ఫొటో ఫేస్బుక్లో చూసినట్టు ఉన్నారు. మా నాన్న దగ్గర డైరెక్టర్ విక్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. ఆయనకు నేను తెలుసు. కథకి సూట్ అవుతానని, ఆడిషన్స్‌కి పిలిచారు. అలా తెలుగు ఆడియన్స్‌కి హలో చెప్పే చాన్స్ వచ్చింది. ► ఫస్ట్ కెమెరా వెనక.. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్? వెరీ డిఫరెంట్. రెండు ప్రపంచాల్లో ఉన్నట్లు ఉంది. మొదట్లో కొంచెం నెర్వస్ అయ్యాను. కానీ, దర్శకుడు విక్రమ్‌గారితో పాటు సెట్ మెంబర్స్ అంతా హెల్ప్ చేశారు. దాంతో ఈజీ అనిపించింది. ► అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాగుందా? హీరోయిన్గా కంఫర్ట్‌గా ఉందా? దేని ప్రెజర్ దానికి ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా చేసేదాన్ని. ప్రొడక్షన్ డిజైనింగ్ చేసేవాళ్లం. సెట్లో ఉంటూ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. నాకు డస్ట్ అలర్జీ ఉండటం వల్ల తరచూ సిక్ అవుతూ ఉండేదాన్ని. ఇక, హీరోయిన్గా అంటే ఉదయం నాలుగు గంటలకే షూటింగ్ ఉంటుంది. రోజు మొత్తంలో జస్ట్ నాలుగు గంటలే నిద్రపోయినా పది గంటలు పడుకున్నంత ప్రెష్‌గా కనిపించాలి. ఫిజిక్ గురించి పట్టించుకోవాలి. అందంగా కనిపించాలి. ఇవన్నీ కెమెరా వెనక తీసుకునే జాగ్రత్తలు. కెమెరా ముందుకెళ్లాక యాక్టింగ్ విషయంలో పర్ఫెక్షన్ చూపించాలి. ఏ జాబ్ అయినా కొన్ని కష్టాలు ఉంటాయి. అయితే మనం ఎంజాయ్ చేయగలిగితే ఏదీ కష్టం అనిపించదు. ► హీరోయిన్ కావాలని ఎప్పుడు అనుకున్నారు? ఆ ఆలోచన చిన్నప్పటి నుంచీ ఉంది. కానీ యాక్టింగ్ ఫీల్డ్ అంత ఈజీ కాదని తెలుసు. కెమెరా ముందు ఎంత బాగా యాక్ట్ చేసినా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రాకుండా చూసుకోవడానికి చాలా హోమ్‌వర్క్ చేయాలి. బట్... పర్సనల్‌గా మొదట్లో నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా విమర్శిస్తే అంత ఈజీగా తీసుకోలేకపోయేదాన్ని. బాగా బాధపడేదాన్ని. ఏడ్చేదాన్ని. అంత సాఫ్ట్. ఇండస్ట్రీలో ఇలా ఉంటే కష్టం అని తెలుసు. అందుకే ఇక్కడికొచ్చాక నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. ► అంటే.. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారా? ఇప్పుడంటే ఇప్పుడు కాదు. లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పర్సనల్‌గా స్ట్రాంగ్ అవుతున్నాను. ► ఏదైనా ఇన్సిడెంట్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేశాయా? ప్రత్యేకమైన సంఘటనలు జరగలేదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాల్సిందే కదా. సింగపూర్‌లో చదువుకున్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. అవన్నీ నా సొంత నిర్ణయాలే. అంత దూరం వెళ్లి, ఒంటరిగా ఉన్న మనం స్ట్రాంగ్ కాకపోవడం ఏంటి? అంటే... మనంతట మనం సాఫ్ట్ అనుకుంటున్నామా? అనే ఆలోచన మొదలైంది. నా బలం తెలుసుకున్నాను. ► టీనేజ్‌లో హీరోయిన్ అయ్యారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇన్‌డైరెక్ట్‌గా ఏజ్ అడుగుతున్నట్లున్నారు. అది మాత్రం చెప్పను. ఇంట్లో అందరూ ఇండస్ట్రీకి చెందినవాళ్లే కావడం నాకు ప్రొఫెషన్‌ల్‌గా చాలా హెల్ప్ అయ్యింది. రమ్యకృష్ణగారు చిన్నప్పటి నుంచి తెలుసు. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, కెమెరామేన్ వినోద్‌గారు తెలుసు. వినోద్‌గారి మిసెస్, మా అమ్మ ఫ్రెండ్లీగా ఉంటారు. మా నాన్నగారు నాగ్‌సార్‌తో సినిమాలు తీసిన విషయం మీకు తెలుసు. అప్పుడు నేను షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. చిన్నప్పుడు నాగ్‌సార్‌తో దిగిన ఫొటో నా దగ్గర ఉంది. అందరూ తెలిసినవాళ్లు కావడంతో కొత్త హీరోయిన్ అనే ఫీలింగ్ కలగలేదు. ► మీ అమ్మానాన్న షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారా? అలా దగ్గరుండి గైడ్ చేయాలనుకోలేదు. నన్ను నమ్మారు. ఫైనల్ అవుట్‌ఫుట్ చూసి వాళ్లు హ్యాపీ. ► ఇంత సన్నగా, అందంగా ఉన్నారు కదా.. బోలెడన్ని లవ్‌లెటర్స్ వచ్చి ఉంటాయేమో? ఇప్పుడిలా ఉన్నాను. స్కూల్ డేస్‌లో 80కిలోలు ఉండేదాన్ని. సో.. ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడేమైనా వస్తాయేమో చూడాలి (నవ్వుతూ). ఇంత స్లిమ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. బేసిక్‌గా ఫుడ్ లవర్ని. ఇప్పుడు యాక్ట్రస్ అయ్యాను కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి షార్ట్ కట్స్‌ని ఫాలో అవ్వలేదు. సైక్లింగ్, బ్యాడ్మింటన్, డైట్.. వీటితోనే తగ్గా. ► ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. సినిమాలు లేకుండా నా లైఫ్‌ను ఊహించుకోలేను. ఎందుకంటే... నా చిన్నతనం అంతా సెట్స్‌లోనే గడిచింది. అమ్మానాన్నలతో లొకేషన్స్‌కి వెళ్లేదాన్ని. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సినిమా గురించే డిస్కస్ చేస్తారు. సో... ఆటోమేటిక్‌గా సినిమాల్లోకి రావాలనుకున్నాను. ► ‘హలో’లో స్క్రిప్ట్‌కి తగ్గట్టు ఎక్స్పోజింగ్ లేకుండా మామూలుగా కనిపించారు. మరి.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే? గ్లామరస్ రోల్స్ చేస్తాను. కానీ ఆ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేయాలి. ఆ కాస్ట్యూమ్స్ నాకు కంఫర్ట్‌గా అనిపించాలి. నా కంఫర్ట్ జోన్ దాటితే, మా అమ్మానాన్నలతో చర్చించి, నేను కూడా ఆలోచించి అప్పుడు నా నిర్ణయం చెబుతాను. అది యస్ అవ్వొచ్చు.. నో కూడా అవ్వొచ్చు. ► అఖిల్ గురించి? హ్యాండ్సమ్ హీరో. ఎంత బాగా యాక్ట్ చేశాడో చూసే ఉంటారు. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి అబ్బాయి కూడా. చాలా ఫ్రెండ్లీ టైప్. నాగ్‌సార్ కూడా అంతే. అమలగారు... అందరూ అమేజింగ్. ► మీ నాన్నగారిలా మీరూ డైరెక్టర్ అవుతారా? నాకు స్క్రిప్ట్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సినిమా తీస్తానేమో. కానీ ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదు. ప్రస్తుతం నేను చేస్తున్న పని చాలా బాగుంది. ► మీ అమ్మగారు, నాన్నగారు విడిపోవడం ఓ కూతురిగా ఎలా ఉంది? లేదండి. ఈ విషయం గురించి మాట్లాడలేను. ► నో ప్రాబ్లమ్.. మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు? అమ్మ, నాన్న ఇద్దరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరితోనూ కలిసి ఉంటాను. నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి, నా ప్లస్‌లు, మైనస్‌లు వాళ్లకు బాగా తెలుసు. అందుకని ఏ విషయం అయినా ఇద్దరితోనూ సంప్రదిస్తాను. ► బుక్స్ చదువుతారా? మా తాతగారు లైబ్రేరియన్. ఆయన మా నాన్నకి బుక్స్ చదవటం అలవాటు చేశారు. ఆ అలవాటు నాకు వచ్చింది. ► మీ ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకం ఏదైనా? ఒక్క పుస్తకం అని చెప్పటం చాలా కష్టం. ఒక్కో పుస్తకం ద్వారా జీవితాన్ని ఒక్కో కొత్త యాంగిల్లో చూస్తూ ఉంటాం. ► మీ నాన్నగారి దర్శకత్వంలో నటిస్తారా ? నాన్న నాకు నాన్నలానే ఉండాలనుకున్నారు. గురువుగా మారాలనుకోలేదు. ‘నీ డైరెక్టర్స్ నిన్ను గైడ్ చేయాలి. నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉన్నావంటే అది నీవల్లే అనుకోవాలి’ అన్నారు. కావాలంటే విక్రమ్ కె. కుమార్‌గారికి నాన్న ఫోన్ చేసి ఉండొచ్చు. కానీ, ఆయన చేయలేదు. అలా చాన్స్ తెచ్చుకుంటే నాకు మాత్రం ఏం శాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది. అందుకే నాన్న అన్నట్లు ముందు వేరే గురువుల దగ్గర సినిమాలు చేయాలనుకున్నా. భవిష్యత్తులో నాన్న డైరెక్షన్లో నటిస్తానేమో. ► ఫైనల్లీ.. కల్యాణిని చూసి ఏం నేర్చుకోవాలి ? నో షార్ట్ కట్.. ఓన్లీ హార్డ్ వర్క్. ► తెలుగు సినిమాలు చూస్తారా? నేను విపరీతమైన సినిమా అభిమానిని. అన్ని సినిమాలు చూస్తాను. ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్ ఇలా అన్నీ. ఐ లవ్ ఇండియన్ ఫిలింస్. ఐ లవ్ ఎవ్రీథింగ్ ఎబౌట్ ఇండియన్ సినిమా. ► మీ నాన్నగారు సౌత్ అలాగే నార్త్‌లో కూడా సినిమాలు చేశారు. మీరు కూడా బాలీవుడ్‌కి కూడా వెళ్తారా ? దేవుడు ఏది ఇస్తే అదే. ‘హలో’ లాంటి లాంచ్ వస్తుందనుకోలేదు. ► మీరు దేవుణ్ణి నమ్ముతారా ? చాలా రిలీజియస్ పర్సెన్ని. ఎనర్జీస్, ఖర్మ సిద్దాంతాన్ని నమ్ముతా. ► మీరు, లిజిగారు తల్లీకూతుళ్లలా ఏదైనా సినిమాలో కనిపించే అవకాశం ఉందా? తప్పకుండా. అమ్మకి కూతురిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకూ ఎగై్జటింగ్‌గా ఉంటుంది. – డి.జి. భవాని -
'హలో' మూవీ రివ్యూ
టైటిల్ : హలో జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్, జగపతిబాబు, రమ్యకృష్ణ, అజయ్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ నిర్మాత : నాగార్జున అక్కినేని తొలి సినిమా అఖిల్ తో నిరాశపరిచిన అక్కినేని యువ హీరో, రెండో ప్రయత్నంగా హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ సాధించాలని నాగార్జున అంతా తానే అయ్యి సినిమాను రూపొందించాడు. మనం, 24 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ వయసుకు, ఇమేజ్ కు తగ్గ కథా కథనాలతో హలో సినిమా తెరకెక్కించారు. అంతేకాదు ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో పాటు సెంటిమెంట్ ను కూడా పక్కాగా ఫాలో అయ్యారు. అందుకే అక్కినేని ఫ్యామిలీకి మంచి రికార్డ్ ఉన్న డిసెంబర్ నెలలో సినిమాను రిలీజ్ చేశారు. మరి నాగార్జున ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..? హలో అనుకున్నట్టుగా అఖిల్ కు తొలి విజయాన్ని అందించిందా..? విక్రమ్ కె కుమార్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? కథ : పదేళ్ల శీను (అఖిల్) ఓ అనాథ. సిగ్నల్ దగ్గర ఏక్తారా వాయిస్తూ అడుక్కుంటుంటాడు. శీను ప్లే చేసే మ్యూజిక్ విని జున్ను(కళ్యాణీ ప్రియదర్శన్) తనని ఇష్టపడుతుంది. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. కానీ జున్ను వాళ్ల నాన్నకి ట్రాన్స్ఫర్ కావటంతో వారు ఢిల్లీ వెళ్లిపోతారు. వెళ్లిపోయేటప్పుడు జున్ను వంద రూపాయల నోటు మీద తన ఫోన్ నంబర్ రాసి శీను కోసం కారులోంచి విసిరేస్తుంది. ఆ నోటు శీనుకి దొరికినట్టే దొరికి చేజారిపోతుంది. అదే సమయంలో ఓ ప్రమాదంలో కలిసిన ప్రకాష్( జగపతిబాబు) సరోజిని(రమ్యకృష్ణ)లు శీనుని దత్తత తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్)అవినాష్ గా పేరు మార్చి పెంచుకుంటారు. కానీ శీను మాత్రం జున్నుని మరిచిపోలేకపోతాడు. ఆమె ఏ రోజుకైనా కలుస్తుందన్న నమ్మకంతో ప్రతీ రోజు తనని కలిసిన సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. మరి శీను నిరీక్షణ ఫలించిందా..? జున్నుని తిరిగి కలిశాడా..? ఈ ప్రయత్నంలో శీను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అన్నదే కథ. నటీనటులు : తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి బోల్తా పడ్డ అఖిల్ రెండో సినిమాలో మాత్రం లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. రమ్యకృష్ణ, జగపతి బాబుల కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ నటన కంటతడిపెట్టిస్తుంది. యాక్షన్ సీన్స్ లో అఖిల్ మూమెంట్స్ హాలీవుడ్ హీరోలను గుర్తు చేస్తాయి. (సాక్షి రివ్యూస్)హీరోయిన్ గా నటించిన కళ్యాణీ ప్రియదర్శన్ కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేం. అంతలా ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. అమ్మా నాన్నలుగా జగపతిబాబు రమ్యకృష్ణలు సూపర్బ్. వాళ్ల పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు. విలన్ గా అజయ్ ది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. విశ్లేషణ : మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలికి మెమరబుల్ హిట్ అందించిన విక్రమ్ కె కుమార్ అఖిల్ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకొని మరోసారి విజయం సాధించాడు. తెలిసిన కథే అయినా.. తన కథనం, టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు అఖిల్ ను చేరువ చేశాడు. అదే సమయంలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా తన వంతు పాత్రతో పాటు ఓ అద్భుతమైన టీంతో సినిమాను మరింత రిచ్ గా తీర్చిదిద్దాడు. (సాక్షి రివ్యూస్)బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రఫి, అనూప్ మ్యూజిక్, వినోద్ సినిమాటోగ్రఫి ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవ్వటంతో హలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రంగా తరయారయ్యింది. అఖిల్ ను ఎలాగైన నిలబెట్టాలని నాగ్ ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ అఖిల్, కళ్యాణీల నటన యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం తెలిసిన కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మంజుల నిర్మాతగా నాని సినిమా
సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంజుల.. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దర్శకురాలిగా మారి సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా స్టార్ చేసే ఆలోచనలో ఉంది మంజుల. అయితే ఆ సినిమాకు మంజుల కేవలం నిర్మాతగానే వ్యవహరించనుందట. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న హలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
అదే బ్యానర్లో మరో సినిమా..!
మనం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అఖిల్ సరసన కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా పనులు పూర్తి కాకముందే నాగార్జున.. విక్రమ్‌తో మరో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కిస్తున్న విక్రమ్, తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రూపొందించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. విక్రమ్ డెడికేషన్, వర్కింగ్ స్టైల్ నచ్చిన కింగ్ వరుస సినిమాలకు అవకాశం ఇస్తున్నాడట. ప్రస్తుతానికి నాగార్జున టీం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. హలో ప్రచార కార్యక్రమాల్లోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. -
హలో.. అవినాష్!
‘ఎ’ ఫర్ అఖిల్. ఇది రియల్ లైఫ్‌లో. ‘ఎ’ ఫర్ అవినాష్.. ఇది రీల్ లైఫ్‌లో. యస్.. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తోన్న చిత్రం ‘హలో’. ఇందులో అఖిల్ పాత్ర పేరు అవినాష్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలనుకుంటు న్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. -
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో?
వరుస సూపర్ హిట్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరుమీద ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేసిన 'జైలవకుశ' ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లతో ఎన్టీఆర్ స్టామినాను చాటింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. ప్రస్తుతం 'జైలవకుశ' విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తు మొదలుపెట్టే అవకాశముంది. కాగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఎన్టీఆర్‌కు ఓ పాయింట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాయింట్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 'ఇష్క్', 'మనం' వంటి చిత్రాలను రూపొందించి విక్రమ్ ప్రస్తుతం అఖిల్‌తో 'హాలో' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తివ్రికమ్తో ప్రొసీడ్ అవుతాడా? లేక విక్రమ్ కే కుమార్ చాన్స్ ఇస్తాడా?.. లేదా మరో కొత్త డైరెక్టర్ తెరపైకి వస్తాడా చూడాలి. -
అఖిల్ తరువాత నానితో..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్సీఏ సినిమాతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. వీటిలో ఎమ్సీఏ ముందుగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న నాని, మరో సినిమాకు కమిట్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. 24, మనం చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను రూపొందిస్తున్న విక్రమ్, డిసెంబర్ లో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అఖిల్ సినిమా తరువాత నాని హీరోగా సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాడు విక్రమ్ కుమార్. -
అఖిల్ 2 టైటిల్ అదేనా..?
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కింగ్ నాగార్జున స్వయంగా దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు అఖిల్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ సోమవారం సినిమాకు సంబంధించిన బిగ్ ఎనౌన్స్మెంట్ ఉంటుందంటూ అక్కినేని టీం ఊరిస్తోంది. అంతేకాదు సినిమా టైటిల్ ఏం అయి ఉంటుందో గెస్ చేయాలని హింట్స్ కూడా ఇస్తోంది. ముందుగా నాగార్జున తన నిర్ణయం సినిమాలోని 'హలో గురు ప్రేమ కోసమేనా' ను పోస్ట్ చేసి సినిమా టైటిల్ ఈపాటలోనే ఉంటుంది అంటూ హింట్ ఇచ్చాడు. తాజాగా ఆదివారం నాగచైతన్య మరో హిట్ ఇచ్చాడు. తన సూపర్ హిట్ సినిమా ఏం మాయ చేసావే సినిమాలో 'హో సోన' పాటను ట్వీట్ చేసి అఖిల్ 2 టైటిల్ ఈ పాటలోనే ఉంది అంటూ మరో హింట్ ఇచ్చాడు. అయితే ఈ రెండు పాటల్లో కామన్ గా ఉన్న పదం 'హలో'. ఇదే అఖిల్ రెండో సినిమా టైటిల్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. guess @AkhilAkkineni8 's next movie name hidden in this iconic song? Watch out for the 2nd clue by @chay_akkineni & @Samanthaprabhu2 tom pic.twitter.com/LtyWf8H1ju — Nagarjuna Akkineni (@iamnagarjuna) 19 August 2017 Guess the title for @AkhilAkkineni8 film .. its in the song .. love the title bro ! Can't wait for everyone to find out pic.twitter.com/MeKWUl6DVq — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2017 -
అఖిల్ కొత్త సినిమా స్టిల్స్ లీక్
సాక్షి, హైదరాబాద్: అక్కినేని అఖిల్ తన తొలి చిత్రం నిరాశ పరచడంతో సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ తన ద్వితీయ చిత్రానికి గత ఏప్రిల్‌లో శ్రీకారం చుట్టారు అక్కినేని అఖిల్. 'మనం' ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం శర వేగంగా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శిని కధాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఫిల్మ్ ఛాంబర్లో 'ఎక్కడ ఎక్కడ ఎక్కడ వుందో తారక' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన స్టిల్స్ లీక్ అయింది. దీనిపై అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున స్పందించారు. లీక్ అయిన ఫొటో కంటే అందమైన, మెరుగైన ఫొటోలు చాలా ఉన్నాయని అన్నారు. ఈనెల 21న వీటికి సంబంధించిన స్టిల్స్‌ను విడుదల చేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. అవి ఎలా ఉండబోతున్నాయనే తెలపడానికి శనివారం ఓ క్లూ ఇస్తానని సోషల్ మీడియా ట్విట్టర్లో తెలిపారు. డిసెంబర్ 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. So what if it's already leaked? -
అఖిల్ కోసం స్వీట్ టైటిల్.?
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన అఖిల్, రెండో ప్రయత్నంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. అయితే ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా ఓ క్యూట్ లవ్ స్టోరి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన తాజా అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. అఖిల్‌ను లవర్ బాయ్‌గా చూపిస్తున్న ఈ సినిమాకు 'జున్ను' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
మార్చిలో మొదలవుతుందట..!
అరంగేట్రంలోనే నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే హడావిడిగా ఏదో ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లకుండా పక్కా కథా కథనాలతో గ్యారెంటీ హిట్ అనే స్థాయి సినిమాను రెడీ చేస్తున్నాడు. ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపిన అక్కినేని టీం ఫైనల్ గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రీ లాంచ్ కు సిద్ధమైంది. ఈ మేరకు చాలా కాలం క్రితమే ప్రకటన వచ్చినా.. ఇంత వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎప్పుడు వెళ్తుందన్న సమాచారం కూడా లేదు. అయితే ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున, అఖిల్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న నాగ్, మార్చిలో సినిమాను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు. -
విక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ముందుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాబీ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కూడా ఫైనల్ అయ్యింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు జూనియర్. ఇష్క్, మనం లాంటి సినిమాలతో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలనందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకె చెప్పాడు. బాబీ, త్రివిక్రమ్‌ల సినిమాలు పూర్తయిన తరువాత విక్రమ్ దర్శకత్వంలో సినిమాలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ లోగా విక్రమ్, అఖిల్ అక్కినేని హీరోగా సినిమాను పూర్తి చేయనున్నాడు. -
అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..?
అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాను ప్రారంభించబోతున్నాడు అఖిల్. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అఖిల్ అదే సమయంలో తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల ధృవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డితో సినిమా చేసే అఖిల్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అక్కినేని టీం. అందుకే రెండో సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే మూడో సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
విక్రమ్ దర్శకత్వంలో అఖిల్..?
అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమా ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో చాలా రోజులగా కథ ఎంపిక విషయంలోనే కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఇటీవల సినిమా ఫైనల్ అయినట్టుగా వార్తలు వినిపించినా అది కూడా పట్టాలెక్కేలా కనిపించటం లేదు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడితో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించాడు అఖిల్. అయితే నిర్మాణ పరమైన సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరో దర్శకుడి కోసం అఖిల్ ప్రయత్నాలు ప్రారంభించాడట. అదే సమయంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేసిన విక్రమ్ కుమార్‌తో అఖిల్ సినిమా ఉంటుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మనం, 24 లాంటి వరుస హిట్స్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తే అఖిల్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?
సరైనోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే బన్నీ సినిమాను డైరెక్ట్ చేయటం కోసం టాలీవుడ్ నుంచే కాదు, కోలీవుడ్ దర్శకులు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొన్ని కథలు విన్న బన్నీ, ఏ సినిమా చేయబోయేది క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ముగ్గురు దర్శకుల పేర్లు ముందు వరసలో వినిపిస్తున్నాయి. 24 సినిమాతో సౌత్‌లో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కె కుమార్, అల్లు అర్జున్ కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడు. ఇప్పటికే ఈ కథ విన్న బన్నీ ఫైనల్ డెసిషన్ మాత్రం చెప్పలేదు. తమిళ దర్శకుడు లింగుసామి కూడా బన్నీతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా విశాల్‌తో చేయాల్సిన పందెం కోడి సీక్వల్‌ను కూడా పక్కన పెట్టేశాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా బన్నీతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన రామయ్య వస్తావయ్యా సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది, కానీ అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరోసారి బన్నీకి కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. మరి ఈ ముగ్గురిలో బన్నీ సినిమా ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. -
ఇష్క్ కాంబినేషన్లో మరో సినిమా
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న నితిన్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, యూత్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దీంతో దశాబ్దకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఇష్క్ ఇచ్చిన కిక్‌తో నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం 24 సక్సెస్‌తో విక్రమ్, అ..ఆ.. సక్సెస్‌తో నితిన్ మంచి ఫాంలో ఉన్నారు. ఇదే సమయంలో తమ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ కె కుమార్, అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. అదే సమయంలో నితిన్ కూడా సంపత్ నంది, కిశోర్ తిరుమల లాంటి దర్శకులకు కమిట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి ఇష్క్ మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? లేక అనుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
పది రోజుల్లో వంద కోట్లు
సౌత్ ఇండియన్ స్టార్ సూర్య హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 24. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న 24 తాజాగా సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాది వందకోట్ల వసూళ్లు సాధించటం సామాన్యమైన విషయం కాదు. రజనీకాంత్, విజయ్ లాంటి తమిళ స్టార్లు, తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే ఈ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ హీరోల సరసన స్థానం సంపాదించాడు సూర్య. 24 సినిమాతో కేవలం 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. తొలిసారి గా నెగెటివ్ పాత్రలోనూ నటించి ఆకట్టుకున్నాడు. కాలంలో ప్రయణించటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 24, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తమిళ్‌తో పోలిస్తే తెలుగులోనే మంచి వసూళ్లను సాధించటం విశేషం. -
వంద కోట్ల క్లబ్లో సూర్య
సౌత్ ఇండియన్ స్టార్ సూర్య హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 24. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న 24 తాజాగా సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాది వందకోట్ల వసూళ్లు సాధించటం సామాన్యమైన విషయం కాదు. రజనీకాంత్, విజయ్ లాంటి తమిళ స్టార్లు, తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే ఈ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ హీరోల సరసన స్థానం సంపాదించాడు సూర్య. 24 సినిమాతో కేవలం 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. తొలిసారి గా నెగెటివ్ పాత్రలోనూ నటించి ఆకట్టుకున్నాడు. కాలంలో ప్రయణించటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 24, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తమిళ్‌తో పోలిస్తే తెలుగులోనే మంచి వసూళ్లను సాధించటం విశేషం. -
సూర్య 24కు ప్రీక్వల్
సూర్య హీరోగా, విలన్‌గానే కాక నిర్మాతగానూ మారి తెరకెక్కించిన భారీ చిత్రం 24. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచిటాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సత్తా చాటి భారీ వసూళ్లను రాబడుతోంది. సూర్య కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ప్రీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రీక్వల్లో.., అసలు కాలంలో ప్రయాణించే వాచ్ తయారు చేయాలన్న ఆలోచన సైంటిస్ట్‌కు ఎందుకు వచ్చింది. ఆ వాచ్ గురించి ఆత్రేయ ఎలా తెలుసుకున్నాడు. దాన్ని సొంతం చేసుకోవాడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించనున్నారట. ఇప్పటికే స్క్రీప్ట్ కూడా రెడీగా ఉన్న ఈ ప్రీక్వల్ను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం వెల్లడించలేదు. విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుండగా తరువాత మహేష్ బాబు హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి రెండు సినిమాల తరువాత 24 ప్రీక్వల్ సెట్స్ మీదకు వెళుతుందా..? లేక ముందే వెలుతుందా.? చూడాలి.