
వరుస సూపర్ హిట్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరుమీద ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేసిన 'జైలవకుశ' ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లతో ఎన్టీఆర్ స్టామినాను చాటింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు.
ప్రస్తుతం 'జైలవకుశ' విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తు మొదలుపెట్టే అవకాశముంది. కాగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఎన్టీఆర్‌కు ఓ పాయింట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాయింట్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 'ఇష్క్', 'మనం' వంటి చిత్రాలను రూపొందించి విక్రమ్ ప్రస్తుతం అఖిల్‌తో 'హాలో' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తివ్రికమ్‌తో ప్రొసీడ్ అవుతాడా? లేక విక్రమ్ కే కుమార్ చాన్స్ ఇస్తాడా?.. లేదా మరో కొత్త డైరెక్టర్ తెరపైకి వస్తాడా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment