హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.
ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
Comments
Please login to add a commentAdd a comment