Lakshmi Parvathi
-
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు..?
-
గుర్తుపెట్టుకో.. జగన్ ఎవడ్నివదలడు.. వడ్డీతో కలిపి ఇచ్చేస్తాం
-
కూటమి ప్రభుత్వంపై లక్ష్మీ పార్వతి మండిపడ్డారు.
-
నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది: లక్ష్మీపార్వతి
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ప్రజాసమస్యలను గాలికి వదిలేసింది. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారు. అర్థరాత్రి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. పాలన చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎల్లో మీడియా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంది. బాబు, రామోజీ ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు. ఈనాడు పేపర్ కాదు.. విష పత్రిక. మార్గదర్శి పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టారు. ఈనాడులో ఎన్టీఆర్‌పై ఎన్నో దారుణమైన కార్టూన్లు వేశారు. ఎన్టీఆర్‌ను పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారు. ఈ మేరకు.. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను అవమానిస్తూ.. కించపరుస్తూ వేసిన కార్టూన్లను ఆమె మీడియాకు ప్రదర్శించి చూపించారామె. అలాగే.. దోచుకోవడం, వ్యవస్థలను మేనేజ్ చేయడమే బాబుకు తెలుసు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. పారిపోయాడు. నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
తుమ్మితే జగన్... ఎక్కిళ్ళు వస్తే జగన్.. చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి ఫైర్
-
చంద్రబాబుకు నిలువెల్లా విషమే: లక్ష్మీపార్వతి ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.లక్ష్మీపార్వతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇవాళ దేవుడితో ఆటలాడుతున్నాడు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు. ఇది వందల ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైఎస్ జగన్‌పై నింద వేస్తున్నారు. చంద్రబాబు వల్ల తిరుమల గోవిందుడికి కళంకం వచ్చింది. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయిన వెనుకాడడు. చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది’ అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు -
చంద్రబాబు దేవుడితో కూడా ఆటలు అడుతున్నాడు: లక్ష్మీపార్వతి
-
KSR Live Show: రాష్ట్రాన్ని పాలిస్తున్నది చంద్రబాబు కాదు.. వెనక ఉన్నది ఎవరో చెప్పిన లక్ష్మీ పార్వతి
-
మంచి పరిపాలన వైఎస్ జగన్ కే సాధ్యం
-
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
-
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
-
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
-
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో నారా లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లక్ష్మీపార్వతి ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్ ఎంట్రీతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి ఉదాహారణే వెంకటరెడ్డి హత్య. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు. రాజధాని భూముల కేసుల్లో ఇప్పటకే మాజీ మంత్రి నారాయణ, పుల్లారావులు ఉన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కేంద్రం తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధాని మోదీ, బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అవినీతి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు. అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తి. భూములు లాక్కునే వ్యక్తి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్‌ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్‌నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్‌ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్‌ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్‌ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్‌ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్‌ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్‌ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్‌కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
బాబు నీచ రాజకీయాలపై లక్ష్మీపార్వతి ఫైర్
-
ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే..
-
తండ్రిని చంపినవాళ్లకు ఇది ఒక లెక్కనా: లక్ష్మీపార్వతి
-
‘వై నాట్ 175?’ నినాదం స్ఫూర్తితో...
ఎట్టకేలకు ఎన్నికల నగార మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 ‘సిద్ధం’ సభల ద్వారా తమ సత్తా ఏంటో చాటుకుంది. అభ్య ర్థులను అన్ని పార్టీల కన్నా ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సామాజిక న్యాయాన్ననుసరించి అభ్యర్థులను నిర్ణయించారు వైఎస్సార్సీపీ వారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి మొత్తం 59 టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరిలో చాలామంది అతిపేదలు. ఇది రాజకీయానికి ఒక కొత్త నిర్వచనంగా చెప్పవచ్చు. మరోపక్క అప్పటికప్పుడు సూట్‌కేసులతో విమానాలు దిగిన పెద్దలకు మాత్రమే చంద్రబాబు సీట్లు కేటాయిస్తున్నారు. అందులోనూ స్వజాతి పక్షులే ఎక్కువ. సీనియర్లు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. ఇదిలావుంటే ‘గండస్యోపరిపిటకవత్’ అనే సామెత (గోడదెబ్బ – చెంపదెబ్బ)గా ఇష్టంలేని పొత్తుల వల్ల టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీ యుద్ధానికి దిగుతున్నారు. ఇక అసలు నాయకుడు ఎన్డీయే పొత్తుకోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి రాయబారాలు పంపీ, పంపీ ఎట్టకేలకు వదినగారి దయతో చేరి పోయారు. తన జన్మధన్య మైందనుకుంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చి సీట్ల పంపిణీ ప్రారంభిస్తే... అది పూర్తిగా బెడిసికొట్టి సిగపట్ల వ్యవ హారం సీరియస్‌గా సాగుతున్నది. పోనీ సభల ద్వారా వాటిని కవర్ చేసుకుందామంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యానీ ఇచ్చినా తినేసి పోతున్నారు కానీ సభదాకా రావడంలేదు. ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదనట్లు’ మోసాలు, అడ్డ దారులు తప్ప నిఖార్సయిన రాజకీయం తెలియని ఈ అబద్ధాల కోరును భరించలేమని జనాలు 2019లోనే అధికారం నుండి తోసేస్తే, అదేమీ గుర్తించకుండా తనకుతానే గొప్పనాయకుడిని అనుకుంటూ మతిలేని ఉపన్యాసాలు ఇస్తున్న ఇతనికి తోడు దత్తపుత్రుడొకరు. రాసిచ్చిన డైలాగులు ఆవేశంలో వూగిపోతూ చదవటం తప్ప సొంత ఆలోచన లేదు పవన్ కల్యాణ్‌కు. ఇక అసలు పుత్రుడిని చూద్దామంటే అతని పేరెత్తితేనే పార్టీ పారిపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదేదారిలో ఉన్నాడు. అతడికి సర్టిఫికెట్స్ తప్ప ఏ భాషా రాదు. కొత్తగా వచ్చిన మరో తోడు వదినగారు. ప్రస్తుతం తన ఒక్కసీటు గెలిస్తే చాలు వచ్చే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాగయినా మంత్రిపదవి దక్కించుకోవాలని సొంత పార్టీనే తాకట్టు పెడుతున్నారు. ఈ నలుగురు ఇలా నడుస్తుంటే... వీళ్ళకేడరు మాత్రం నియోజక వర్గాల్లో తన్నుకోవడంలో యమ బిజీగా ఉన్నారు. సిద్ధాంత బలం లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కమాట మాట్లాడలేక పోతున్నారు. కానీ జగన్‌ను తిట్టడానికి మాత్రం ఒకేదారిలో నడుస్తున్నారు. వాళ్ళకున్న సిద్ధాంతమల్లా జగన్ ఓడిపోవాలి. ఎందుకంటే సమా ధానం లేదు. వీళ్ళ ఎజెండాలో కులగర్జనలు, మతాల పూత్కా రాలు, ముఖ్యమంత్రి మీద విష ప్రచారాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అదుపు తప్పిన కట్టుబాట్లతో, అబద్ధపు రాతలే తమ ధ్యేయ మన్నట్లు కులఅహంకారంతో పిచ్చిరాతలు రాస్తున్నాయి పచ్చ పత్రికలు. ఒక అవినీతిపరుడి కొమ్ముకాస్తూ అవి ఏనాడో విలువల్ని పోగొట్టు కున్నాయి. మరోవైపు మరో దత్తపుత్రిక వచ్చి చేరింది. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విద్యలో ఎన్నో డిగ్రీలు పొందిన చంద్రబాబు మరో కుటుంబ వినాశనానికి పూనుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి ఇంటి పెద్దను నాశనం చేసిన ఇతడు, పచ్చగా, సమష్టిగా కష్టాలను సమైక్యంగా ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను అధిగమించి అధికారాన్ని సాధించుకున్న వైఎస్సార్ కుటుంబం మీద తన వక్రదృష్టి సారించాడు. ఫలితంగా అదికూడా చీలిపోయింది. ఈ దురాశాపరులు అభివృద్ధిలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ భవిష్య త్తును నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. సామాజిక సహ జీవనంతో సౌభ్రాతృత్వంగా వర్ధిల్లుతున్న ఆంధ్రుల ప్రశాంతతను చెరపటానికి ఈ కూటమి ప్రయత్నిస్తున్నది. కానీ ఆంధ్రులు అమా యకులు కాదు. స్వాతంత్య్ర పోరాటం నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయాలను, ఎందరో నాయకులను చూసిన అనుభవం వారిది. అందుకే ఈ దుష్టగ్రహ కూటమి సభలకు వెళ్ళకుండా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వారి ఏ సభ చూసినా, ఖాళీ కుర్చీలే. వీరి పతనం చివరిదశకు చేరిందనటానికి ఇవన్నీ సంకేతాలే. రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు అయిన మోదీ ఈ పొత్తుకు సుముఖంగా లేరనే విషయం వారి ప్రవర్తన, ప్రసంగధోరణి చెప్పకనే చెప్పాయి. జగన్ గురించి ఏమీ విమర్శించక పోవటం, వైరి గుండెల్లో గునపాలు గుచ్చినట్లే వుంది. పక్క రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, చెన్నై సభల్లో అక్కడి ముఖ్యమంత్రులను ఏకిపారేశారు మోదీ. ఆ ప్రసంగాలతో పోల్చి చూస్తే ఏపీ ముఖ్యమంత్రిని, ఆయన పాలనను ప్రధాని మెచ్చినట్లే కనిపించింది. ఇంకో విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది జగన్ పట్ల వారికున్న అభిమానం. ప్రధానమంత్రి కంటే ఐదు నిమిషాల ముందు ప్రసంగించిన చంద్ర బాబు జగన్‌ను విమర్శిస్తూ ‘తల్లిని, చెల్లిని చూసుకోలేనివాడు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ కెలా మేలుచేస్తాడు...’ అంటూ తన లేకితనాన్ని ప్రదర్శించుకున్నాడు. కానీ మోదీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ‘అన్నా, చెల్లి ఒకటే. ఇది కాంగ్రెస్–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ’ అంటూ చంద్రబాబు గొప్పగా ప్రయోగించాలనుకున్న షర్మిల అస్త్రాన్ని ఉపసంహరించారు. ప్రైమ్ మినిస్టర్ ముందు జగన్‌ను పెద్ద విలన్‌గా చూపించాలనుకున్న వీళ్ళ ఎత్తుగడను ఆయన చిత్తుచేసి ప్రజల్ని ఒక అయోమయంలో ఉంచి వెళ్ళిపోయారు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు’ ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలనుకున్న చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌లకు అవమానాలే మిగిలాయి. లక్షల్లో వస్తారన్న జనం రాలేదు. వచ్చిన ప్రధానమంత్రి వీరి పేరయినా ఎత్తలేదు. మరో పక్క పొత్తుకు గండికొడుతున్నాడని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ పొత్తు చివరిదాకా వుంటుందో లేదో తెలియదు. జనసైన్యం అసలు సహకరించటం లేదు. ఇక ఓట్లు షేర్ చేసుకునే దెప్పుడు? ‘కత్తితో చంపేవాడు ఆ కత్తితోనే చస్తాడు’ అన్నట్లు అవగాహన, రాజకీయ సంస్కారం లేని ముఠాలను తయారుచేసుకున్న దత్తపుత్రుడి సైన్యం తమ నాయకుల మీదే తిరుగుబాటు చేస్తోంది. ఎటుచూసినా పంచకూళ్ళ కూటమికి గందరగోళంలా తయారయ్యింది పరిస్థితి. కలసినా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. మరోవైపు జగన్ ఒక్కడే తన సైన్యంతో ముందుకు దూసుకు పోతున్నాడు. అతని ఆయుధం ప్రజాబలం. అతని నినాదం పేదల సంక్షేమం. అతని సైన్యం ఐకమత్యంతో నాయకుడిని అనుసరించే పార్టీ. ఇప్పుడు చెప్పండి – ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగా ‘వైనాట్– 175?’ సాధించి చూపెడదాం – ఆదర్శ రాజ్యాన్ని నిలబెడదాం. - వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
రెండేళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు. డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్‌తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్ అందించామన్నారు. ఆంగ్లం, ఇతర భాషల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు. బాబు స్వార్థానికి అకాడమీ బలి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకాడమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలుగు, సంస్కృత అకాడమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవలందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సిటీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు.