సాక్షి, అమరావతి: దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానం అందించకపోవంపై ఇదివరకే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి సైతం లేఖ రాశారు. ఈ క్రమంలో ఇవాళ్టి కార్యక్రమంపై తాజాగా ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు.
‘‘ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయిల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నాకు ఆహ్వానం అందించకపోవడం, నన్ను పిలవకపోవడం బాధగా అనిపిస్తోంది. రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రి కి లేఖ రాశాను.ప్రభుత్వమే నిర్వహిస్తే భార్యగా నన్ను పిలవకపోడం తప్పు. ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్ కి రాష్ట్రపతి గెస్ట్ గా వెళ్తున్నట్టు ఉంది. ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపవడం అన్యాయం. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారు?’’ అని సూటిగా నిలదీశారామె.
పురంధేశ్వరిపై ధ్వజం
ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. ‘‘ఎన్టీఆర్ కి అర్ధాంగిగా నన్ను ఆహ్వానించకపోవడం దుర్మార్గం. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులా కుటుంబ సభ్యులగా చెలామణీ అవుతారా?. పురంధేశ్వరి ఎంతో దుర్మార్గురాలు. నా వల్ల మీకు జరిగిన నష్టం ఏమిటి. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులు. పురంధేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తోంది. పురంధేశ్వరి తిరిగిన ప్రతీనియోజకవర్గంలో తిరుగుతా. ఒక్క సీటు కూడా ప్రచారం చేస్తా. వీళ్ళ గురించి ntr ఏమన్నారో ప్రజలకు వివరిస్తా. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు పడుతూ ఉండాలి. పురంధరేశ్వరి కి నేను ఏమి అడ్డం వచ్చాను.. అయన కష్టాల్లో ఉంటే పురంధరేశ్వరి వచ్చిందా..?. నన్నెందుకు చులకన చేస్తున్నారు.. నన్ను చులకన చేస్తే NTR ను చేసినట్టే. NTR ను చంద్రబాబు బయటకి వెన్నుపోటు కు ఇంటర్నల్ గా పురంధరేశ్వరి ప్రధాన కారకురాలు. పురంధేశ్వరి రాజకీయాల్లోకి వద్దు అన్నారని NTR పై కుట్ర చేసింది. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి చేసింది పురంధరేశ్వరి. ‘‘నాకు జరిగిన అవమానం నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఈరోజు నుంచి నా పోరాటం నీమీదే’’ అని పురందేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారామె.
చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్రలు..
నాకు జరిగిన అవమానం నా భర్త ఎన్టీఆర్‌కు అవమానంగా భావిస్తాను. NTR నన్ను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలి. నన్ను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు. NTR భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా.?. NTR తో వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కధనాలు ఉన్నాయి. సాక్షాత్తు ntr అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. నన్ను పెళ్ళి చేసుకోలేదని అని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. NTR యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..?. ఇంతకాలం ntr కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నాను. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను.. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా.
పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్
ఎన్నికల సమయంలో ntr ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. పురంధేశ్వరి బిజెపి లో ఉంటూ టిడిపికి పనిచేయడమేంటి?. బిజెపికి చెబుతున్నా...పురందేశ్వరి టిడిపి ఏజెంట్ గా పనిచేస్తోంది...పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోవాలని బీజేపీని కోరుతున్నా.
జూనియర్‌ను బాబుతో కలపాలని..
జూ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఇచ్చారో లేదో నాకు తెలీదు. జూ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూ ఎన్టీఆర్ ను కలపాలని ప్రయత్నం చేసింది. ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూ ఎన్టీఆర్ హాజరు అయ్యేవారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే జూ ఎన్టీఆర్ హాజరుకాలేదు. పురంధరేశ్వరి కుట్రను బీజేపీ తెలుసుకోవాలని మరోసారి కోరుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురంధరేశ్వరి చదువుతుంది. సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారు. నేను రాసిన లేఖలను సమాధానం రాలేదు. అందుకే ఢిల్లీ వెళ్తాను.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్ లను కలుస్తా అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment