సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జాబితాలో సోషల్ ఇంజినీరింగ్ ఉండనుంది. సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్ సీట్ల కేటాయింపు చేశారు.
అభ్యర్థుల జాబితాలో బీసీలు, మహిళలు, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకు 50 శాతం సీట్లు కేటాయించారు. మొత్తం వంద సీట్లలో 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీ స్థానాలకు అవకాశం కల్పించారు.
►25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు.
►ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు.
►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్.
►2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు.
►2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో నాలుగు స్థానాలు పెంపు.
►2019లో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా.. 2024లో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు.
►2019లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే.. ఈసారి ఒకసీటు అదనంగా మూడు సీట్లకు పెంపు.
►2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు కాగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు.
►2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయింపు.
►2024 ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపు.
►2019లో మహిళలు, మైనార్టీలకు 18 సీట్లు ఇస్తే..
►2024లో ఆరు సీట్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 24 సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్.
►2019 ఎన్నికల్లో మహిళలకు 15 చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. ఈసారి ఆరు సీట్లు పెంచి 24 చోట్ల అవకాశం.
►2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 12 ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు.
Comments
Please login to add a commentAdd a comment